Jump to content

What He Has Done Is Absolutely Correct--


Recommended Posts

Posted

[color=#333333][font=Georgia,]

భారత వెండితెరపై తొలి సూపర్ స్టార్ గా మన్ననలు అందుకొన్న రాజేశ్ ఖన్నా మరణాంతరం ఆయన ఆస్తులపై మీడియా చూపు పడింది. రొమాంటిక్ హీరో గా మూడు దశాబ్దాల కిందటే భారీ పారితోషకాలు అందుకొన్న ఈ హీరో ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా రాజేశ్ ఖన్నా వీలునామా పేరుతో కొత్త వివరాలను తెరపైకి తెచ్చింది. రాజేశ్ ఖన్నా తన ఆస్తులన్నింటినీ తన కూతుర్లిద్దరిపేరిట రాశాడని ఆ వీలునామా సారాంశం. ఏ మేరకు విశ్వసనీయత ఉందో తెలియని ఈ వీలు ప్రకారం తన భార్య డింపుల్ కపాడియా పేరిట రాజేశ్ ఒక్క రూపాయి కూడా రాయలేదు. అఫిషియల్ గా విడాకులు పొందనప్పటికీ రాజేశ్ డింపుల్ లు చాలా కాలం నుంచి విడిగా ఉంటున్నారు. దీంతో ఆమెకు రాజేశ్ ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకపోయింది. రాజేశ్ ఆసుపత్రి పాలైన ప్పటి నుంచి డింపుల్ కపాడియా దగ్గరుండి సేవలు చేసింది. కూతుర్లు ట్వింకిల్, రింకీలను అమితంగా ప్రేమించే రాజేశ్ తన ఆస్తులన్నింటినీ వారికే చెందేలాచూశాడు. మరోవైపు రాజేశ్ తో సహజీవనం చేసిందంటూ ‘అనితా అద్వానీ’ అనే మహిళను మీడియా తెరపైకి తెచ్చింది. అయితే ఆమె కు ఆస్తిలో ఎలాంటి వాటా లభించలేదని తెలుస్తోంది. తదనుగుణంగా అనితా అద్వానీ కూడా తనకు రాజేశ్ ఆస్తుల్లో ఎటువంటి వాటా అవసరం లేదని స్పష్ట పరిచిందని తెలుస్తోంది. ఎవరిగ్రీన్ స్టార్ ఆస్తుల విషయంలో లీగల్ ప్రొసిడింగ్స్ మొదలయితే కానీ పూర్తి వివరాలు తెలియవు.[url=""]digg[/url]
life lo ladies chethi lo ela mosapokoodado chupinchaadu...women only crave for popularity & money....[/font][/color]

×
×
  • Create New...