Jump to content

Papakosam Olympic Pathakam Velam


Recommended Posts

Posted

ఓ క్రీడాకారుడికి ఒలింపిక్ లో పతకం వస్తే ఏం చేస్తాడు. దాన్ని దర్పంగా మెడలో వేసుకుని గర్వంగా చచ్చేదాకా[img]http://telugu.oneindia.in/img/2012/08/15-zaopddash15-300.jpg[/img] దాచుకుంటాడు. మరి ఒలింపిక్ పతకం అంటే మాటలా ! క్రీడాకారుడు తన జీవితంలో అందుకునే అత్యంత పురస్కారం. ఒక్క ఒలింపిక్ పతకమయినా గెలిస్తే ఈ జన్మకు చాలు అనుకుంటారు. కానీ అలాంటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న నాలుగురోజులకే ఓ పసిపాప ప్రాణం నిలిపేందుకు వేలం పెడుతోంది ఓ క్రీడాకారిణి.
అవును. లండన్ ఒలింపిక్స్‌లో మహిళల ఆర్ ఎస్-ఎక్స్ సెయిలింగ్ విభాగంలో పోలెండ్‌కు చెందిన క్రీడాకారిణి నోసెటి క్లెపాకా కాంస్య పతకం గెలుచుకుంది. అయితే ఆమె పక్కింట్లో నివసించే ఐదేళ్ల జుజియా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ప్రమాదకర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. ఈ పాపకు నిరంతర వైద్యం లేకపోతే ప్రాణానికే ప్రమాదం. ఆ పాప తల్లిదండ్రులది వైద్యం చేయించలేని దుస్థితి.
దీంతో తన అభిమాని అయిన జుజియా కు లండన్ ఒలింపిక్స్ లో తాను పతకం సాధిస్తే అది వేలం వేసి వైద్యం చేయిస్తానని మాట ఇచ్చి ఒలింపిక్స్ కు వచ్చింది. ఇందులో ఆమె కాంస్యం గెలుచుకుంది. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం తాను తన పతకాన్ని వేలానికి పెట్టింది. నిజంగా ఇది అందరూ ఆమెను అభినందించదగ్గ విషయం. అందుకే ఆమెకు అందరం అభినందనలు చెబుదాం.

Posted

well done like ur thinking keep it up

india lo vundi vunte eepatiki celebrity ayyipoyadanivi

Posted

ప్రపంచంలో చాలామంది క్రీడాకారులు ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. చైనా gymnastics క్రీడాకారుడు Zou Kai తన పతాకాన్ని earthquake రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేసాడు.ఇప్పుడు పోలాండ్ క్రీడాకారిణి. ఇండియా లో గుండె సంబధిత వ్యాధి సోకినా పిల్లలు చాలా మంది ఉన్నారు. మన ఒలీమ్పిక్ క్రీడాకారులు ఇలాంటి మంచి పనులు చేస్తే బాగుండు. అసలు మనవాళ్ళు పతాకాన్ని దాచుకోవడం వల్ల వాళ్ళు సాధించేదేంటి. గవర్నమెంట్ వాళ్ళకిచ్చే గౌరవం ఏమి తగ్గదు,నెక్స్ట్ టైం కూడా వాళ్ళని olympics లో allow చేస్తారు, పారితోషకాలు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, సో definite గ అవి కూడా వస్తాయి. ఇంకేంటి ప్రాబ్లం.

×
×
  • Create New...