Jump to content

Recommended Posts

Posted

[color=#000000]న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం బీజేపీ ప్రవేశపెట్టిన తెలంగాణ తీర్మానం వీగిపోయింది. డిసెంబర్ 9 ప్రకటనను కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌ ఆరోపించారు. మెడికల్‌ సీట్లలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగునీటి హక్కులను కోర్టుద్వారా సాధించుకునే పరిస్థితి తెలంగాణాదని ఆయన అన్నారు. [/color]

[color=#000000]అంతేకాక శ్రీకృష్ణ కమిటీ ఓ బోగస్‌ కమిటీ అని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చేందుకు ప్రధాని, సోనియాకు ఇంట్రస్ట్‌ లేదని ఆయన ఆరోపించారు. సభకు రాకపోవడంతో తెలంగాణపై వారి వైఖరేంటో స్పష్టమైందని జవదేకర్‌ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్‌ 17కల్లా తెలంగాణ ప్రక్రియ పూర్తిచేయండని, బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామన్న బీజేపీ సభ్యుడు జవదేకర్‌ ప్రభుత్వానికి సూచించారు. [/color]

×
×
  • Create New...