Jump to content

Aadu "magaadu" Raa..goli.....


Recommended Posts

Posted

[color=#333333][font=Georgia,]‘‘నిజాయితీగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేవారిని వేధించొద్దు. బ్రిటన్ నన్ను వేధిస్తున్నట్లు కనిపిస్తున్నా[img]http://i.telegraph.co.uk/multimedia/archive/02315/assange_2315000b.jpg[/img] వెనక నడిపిస్తున్నది అమెరికానే. వికీలీక్స్, న్యూయార్క్ టైమ్స్ మీద విచారణ సిగ్గుచేటు. ఒబామా నీవు మంచి పనులు చేసేందుకు ప్రయత్నించు. నేను మాట్లాడుతున్న దౌత్యకార్యాలయం చుట్టూ బలగాలు తుపాకులతో ఉన్నాయి. ఆ బూట్ల చప్పుడు నాకు వినిపిస్తోంది. మీడియా చూస్తుందని ఆగుతున్నారు తప్పితే బ్రిటన్ ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని కాలరాసేందుకు వెనకడుగు[img]http://si.wsj.net/public/resources/images/OB-UF859_posner_D_20120820141214.jpg[/img] వేయదు’’ అని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే అమెరికా, బ్రిటన్ లపై విరుచుకు పడ్డారు.[/font][/color]
[color=#333333][font=Georgia,]నన్నూ, వికీలీక్స్ ను అణచివేసేందుకు అగ్రరాజ్యాల మధ్య ఐక్యత కనిపిస్తోందని, ఐతే ప్రతిఘటన కూడా అలాగే ఉంటుందని అన్నారు. రెండునెలల తరువాత తొలిసారి బయటకు వచ్చిన అసాంజే లండన్‌లోని ఈక్విడార్ దౌత్య కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్యాలయం లండన్ లో ఉన్నా సాంకేతికంగా అది ఈక్వెడార్ లో ఉన్నట్లు లెక్క. దీంతో లండన్ నడిబొడ్డున అసాంజే మీడియా సమావేశం పెట్టినా బ్రిటన్[img]http://i.dailymail.co.uk/i/pix/2012/08/19/article-2190550-149C9294000005DC-268_634x424.jpg[/img]ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది.[/font][/color]
[color=#333333][font=Georgia,]అసాంజే అరెస్టుకు ఉవ్విళ్లూరిన అమెరికా, బ్రిటన్ లకు లాటెన్ అమెరికాలోని ఓ చిన్నదేశం ఈక్వెడార్ ఆశ్రయమిచ్చింది. వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు నాగురించి, ఈక్వెడార్ గురించి ఏం అనుకుంటున్నారు ? మేం వారికి భయపడుతామని అనుకున్నారు? అని ఈక్వెడార్ అధ్యక్షుడు రఫైల్ కొరియా బ్రిటన్ కు కళ్లు తిరిగే[img]http://i.dailymail.co.uk/i/pix/2012/08/19/article-2190550-149CAFEB000005DC-574_634x421.jpg[/img]సమాధానం ఇచ్చారు.[/font][/color]
[color=#333333][font=Georgia,]నేను గత నెల 19వ తేదీ నుంచి రాయబార కార్యాలయంలోనే తల దాచుకుంటున్నానని, నేను ఎవరితోనూ కలవలేని పరిస్థితి. అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ నాకూ వికీలీక్స్‌కు మీరిచ్చిన సహకారానికి ధన్యవాదాలు” అని వికీలీక్స్ అభిమానులు, మీడియాకు భావోద్వేగంతో అసాంజే కృతజ్ఞతలు తెలిపారు.[/font][/color]
digg

Posted

[url="http://www.youtube.com/watch?v=VvrLTBvWpd8"]http://www.youtube.com/watch?v=VvrLTBvWpd8[/url]

×
×
  • Create New...