Jump to content

Para Olympics Lo India Ku Medal


Recommended Posts

Posted

[b] లండన్ పారాలింపిక్స్ 2012: భారత్‌కు తొలి పతకం[/b]

Updated: మంగళవారం, సెప్టెంబర్ 4, 2012, 15:26 [IST]






[img]http://telugu.oneindia.in/img/2012/09/04-girish04-300.jpg[/img]





లండన్, సెప్టెంబర్ 4: లండన్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల హైజంప్‌ ఎఫ్ 42 ఈవెంట్లో కర్ణాటకకు చెందిన గిరీశ్ హోసనగర నాగరాజేగౌడ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

పురుషుల విభాగంలో హైజంప్ ఫైనల్స్‌లో కర్ణాటకు చెందిన 24 సంవత్సరాల వయసు కలిగిన గిరీశ్ హోసనగర నాగరాజేగౌడ తన ఎడమ కాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. కత్తెర లాంటి టెక్నిక్‌ని ఉపయోగించి 1.74మీటర్ల ఎత్తుని అధిగమించి రెండవ స్దానంలో నిలిచి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. మొత్తం 80,000 మంది ఉన్న స్టేడియంలో తన ఆత్మస్ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా రెండవ స్దానంలో నిలిచాడు.
మొదటి స్దానాన్ని ఫిజికి చెందిన లిల్లిసా డిలానా గెలుచుకోని బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా, మూడవ స్దానంలో పోలాండ్‌కు చెందిన లూకాజ్ మామ్‌క్రాజ్ నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బెంగుళూరు ఆధారిత ఎన్‌జీవో సంస్ద అయిన Samarthanam 2008 నుండి గిరీశ్ హోసనగర నాగరాజేగౌడకు మద్దతుగా నిలుస్తుంది. భారతదేశం ప్రభుత్వం స్పాన్సర్ చేయడం వల్ల లండన్ పారాలింపిక్స్ గేమ్స్‌కు మూడు వారాల ముందు బాసిడాన్ స్పోర్టింగ్ విలేజిలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.

Posted

[img]https://lh6.googleusercontent.com/-_FIYvtFUuSg/TwKNeZC2T7I/AAAAAAAAF5c/Xi3tidNMW2c/s150/Mahi-31.gif[/img]

×
×
  • Create New...