Jump to content

Bezawada Roudeelu-Real Serial Exclusive For Afdb


Recommended Posts

Posted

[size=5][color=#333333]బెజవాడ…. రాజకీయ రాజధాని[/color]
[color=#333333][color=#FF0000]బెజవాడ… రైల్వే జంక్షన్[/color][/color]
[color=#333333][color=#FF0000]బెజవాడ… నోరూరించే నూజివీడు మామిడి రసాలకు పెట్టింది పేరు…[/color][/color]
[color=#333333][color=#FF0000]బెజవాడ.. ఠారెత్తించే ఎండలు..[/color][/color]
[color=#333333][color=#FF0000]బెజవాడ…. రౌడీయిజం.[/color][/color][/size]


[color=#333333][font=Georgia,]బెజవాడ రౌడీయిజం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా బెజవాడలో రౌడీయిజం వేళ్లూనుకుపోయింది. వంగవీటి, దేవినేని కుటుంబాలు ఈ రౌడీయిజాన్ని పెంచి పోషించాయి. వంగవీటి రంగా సోదరుడు వంగవీటి రాధా, దేవినేని నెహ్రూలు రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా రౌడీయిజం చేశారు. పంచాయతీలు, సెటిలిమెంట్లు ఈ గ్యాంగ్ లే చేస్తాయి. ల్యాండ్ సెటిల్ మెంట్ల దగ్గర నుంచి ప్రేమ వివాహాల వరకూ వీరు కనుసన్నల్లోనే నడిచేవి. ఇక ఆర్థిక లావాదేవీలయితే వెంటనే పరిష్కారం చేసి కమీషన్లు భారీగా దండుకునేవారు. దేవినేని నెహ్రూ పంచాయతీ చేసేది దొడ్డి అంటారు. అంటే నెహ్రూ ఇల్లు. అలాగే వంగవీటి రంగా పంచాయతీ చేసే ఇంటిని సందు అంటారు. ఒకరి ఇలాకాలోకి ఒకరు వెళ్లరు. అలా జోక్యం చేసుకుంటే వెంటనే రెండు వర్గాలు బాహాబాహీకి తలపడేవి. అలా మొదలయిన ఈ గ్యాంగ్ వార్ చివరకు హత్యలకు దిగింది. ఒకరి వర్గంలో వారిని మరొక వర్గం వారు హతమార్చే వారు. 1970వ దశకంలో ప్రారంభమైన ఈ గ్యాంగ్ వార్ దాదాపు 1990వ దశకం దాకా నడిచింది. రంగా హత్యతో వరస హత్యలు కొంత తగ్గుముఖం పట్టాయి. విజయవాడ ను పోలీస్ కమిషనరేట్ స్థాయికి పెంచినా ఫలితం లేదు. పోలీస్ కమిషనర్లు ఈ గ్యాంగ్ ల కనుసన్నల్లోనే నడిచేవారు. స్థలం అమ్మాలన్నా… కొనాలన్నా… బ్రాందీ షాపు వేలం పాడాలన్నా[/font][/color]
[color=#333333][font=Georgia,]ఈ లీడర్ల అనుమతి తప్పనిసరి. చివరకు చౌకధరల దుకాణాలు కూడా వీరి మద్దతుదారులకే కేటాయించాలి. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా అధికారులు ఏమీ చేయని పరిస్థితి. ఈ పరిస్థితుల వల్లనే విజయవాడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. వీధి రౌడీల స్థాయి నుంచి ప్రారంభమైన రౌడీ నేతల జీవితాలు చివరకు రాజకీయం బాట పట్టాయి. రెండు వర్గాలు చెరో పార్టీని ఆశ్రయించాయి. కాంగ్రెస్, తెలుగుదేశం చివరకు సిద్ధాంతాలు కలిగిని కమ్యునిస్టు పార్టీల్లో కూడా రౌడీషీటర్లు చొరబడ్డారు. బెజవాడలో రౌడీయిజం ఎలా ప్రారంభమైంది?
ఎవరి నాయకత్వంలో హత్యలు జరిగాయి? గ్యాంగ్ వార్ ప్రారంభం కావడానికి అసలు కారణాలేంటి? ఎన్ని హత్యలు జరిగాయి?
ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి?[/font][/color]
[color=#333333][font=Georgia,]* * *[/font][/color]
[color=#333333][font=Georgia,][b]కమ్యునిజానికే కాదు.. రౌడీయిజానికి పురిటిగడ్డ బెజవాడ[/b]

బెజవాడ అనగానే వామపక్షవాదులకు పురిటిగడ్డ గాభావిస్తారు. అంతేకాదు రౌడీయిజానికి కూడా పుట్టినిల్లు ఇదే. పైగా కమ్యూనిష్టు పార్టీల నుంచే ఈరౌడీయిజం పుట్టుకురావటం… ఆతరువాత వ్యక్తిగత హీరోయిజం పెరిగి కులాల అండదండలతో రౌడీయిజం పెరిగి వటవ్రక్షంగా మారింది. ఒకర్ని నలుగురు
కలసి కొడితే అది రౌడీయిజం. హీరోయిజం. సినిమాల్లో చూపినట్లుగా వెంటాడి వెంటాడి కొడితే ఇక తిరుగులేనట్లే. దీనికితోడు ఏమాత్రం కష్టపడకుండా
నాలుగురాళ్లు వెనుకేసుకునే వీలుంది. మందు, పొందు, విలాసవంతమైన జీవితం లభిస్తుండటంతో చాలామంది యువకులు అప్పట్లో రౌడీయిజం వైపు
మొగ్గు చూపారు. చివరకు కళాశాలల్లోకి చొరబడి కూడా రౌడీలు తమ ప్రతాపాన్ని చూపేవారు.
మొదలయిందిలా…
అసలు రౌడీయిజానికి బీజం పడింది 1970 వ దశకంలో. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలక తరువాత పార్టీ కార్యాలయాలు… ఇతర స్థిరాస్తులపై ఆధిపత్యం కోసం సీపీఐ, సీపీఎం నడుమ వీధిపోరాటాలు జరిగాయి. అయితే విజయవాడలో సీపీఐ బలమైన నాయకత్వంతో కాస్త పైచేయిగా ఉండేది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండులో కార్మికుల మద్దతుతో సీపీఐ బలమైన శక్తిగా ఉండేది. ఇప్పటి ఆర్టీసీ బస్టాండు ఉన్న ప్రాంతంలో గల భాస్కరరావుపేట లో సీపీఐ,..ఆవలి వైపు ఉన్న కృష్ణలంక లోని భ్రమరాంభపురంలో సీపీఎం బలమైన నాయకత్వం కలిగి ఎప్పడూ కొట్లాటలకు కేంద్రంగా ఉండేది. భాస్కరరావుపేట, బస్టాండు సెంటర్లు అప్పట్లో చలసాని వెంకటరత్నం నాయకత్వంలో ఉండేవి. ఆవలి భ్రమరాంబపురంలో సీపీఎంకు చెందిన ఐతా రాములు నాయకత్వాన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
కార్మికులు తమ డిమాండ్ల కోసం పోరాడకుండా… రౌడీయిజం వైపే మొగ్గుచూపేవారు. చీకటి పడిందంటే చాలు… వీధుల్లో చేరి బహిరంగంగా మద్యం సేవించడం… దారిన పోయే వారిని భయభ్రాంతులకు గురిచేయడం బెజవాడలో సాధారణమై పోయాయి. పోలీసులూ పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న చిన్న
సమస్యలకు కూడా రౌడీలే పంచాయతీ చేసే పరిస్థితి వచ్చింది.
హీరోయిజం కోసం…
ఆధిపత్యం పోరాటాల్లో నాయకుల సామర్ద్యం క్రమంగా వ్యక్తిగత హీరోయిజంగా మారింది. అంగబలం గల నాయకుడి కింద శిష్యరికానికి ఆరాటపడే యువత ఆనాడు పెరిగింది. కమ్యూనిజం, సోషలిస్టు భావజాలంపై సరైన శిక్షణ, అధ్యయనం కొరవడిన ఫలితంగానే యువత ఆనాడు పెడత్రోవ పట్టిందని చెప్పక తప్పదు. ఈనేపథ్యంలోనే గురువును శిష్యుడు హతమార్చితే స్నేహితుల మధ్య ఆదిపత్య బీజం కక్ష, కార్పణ్యాలు భగ్గుమన్నాయి. హత్యల పరంపరకు దారితీశాయి. తాను
ఫలానా వ్యక్తి మనిషినని చెప్పుకుంటే అందరూ భయపడతారని యువత భావించేది. కాలేజీల్లో ఎన్నికల దగ్గర నుంచి చిల్లర తగాదాల్లో కూడా విద్యార్థులు
రౌడీలను ఆశ్రయించడం అలవాటుగా మారింది.
సిద్ధాంతాలు పక్కన బెట్టి….
ప్రధానంగా కమ్యునిస్టులు సిద్ధాంతాల కన్నా ఆదిపత్యంపైనే ఎక్కువ మక్కువ చూపేవారు. వివిధ కార్మిక సంఘాలకు నేతలుగా చెలామణి
అవుతూ రౌడీయిజం వైపు మొగ్గు చూపేవారు. రిక్షా కార్మిల దగ్గర నుంచి ప్రతి కార్మికులకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి నాయకత్వం
వహిస్తూ పంచాయతీల్లో కార్మికులను వాడుకునేవారు. బెజవాడలో రౌడీయిజానికి నాందిపలికింది కమ్యునిస్టులే ననడంలో సందేహం లేదు. పార్టీ కార్యక్రమాలకన్నా ప్రైవేటు కార్యక్రమాల వైపే మొగ్గు చూపేవారు.[/font][/color]
[center]* * *[/center]
[b]బెజవాడలో తొలిహత్య.. చలసాని పేరు వింటేనే హడల్[/b]
కత్తి పట్టుకుంటే హీరో. కర్రలతో దాడి చేస్తే వాడు నెంబర్ వన్ రౌడీ కింద లెక్క. ఇలా బెజవాడ రూపురేఖలే మారిపోయాయి. అయితే అప్పటి వరకూ
హత్యలు జరగలేదు. కొట్లాటలు, ఘర్షణలతో బెజవాడ అట్టుడికి పోయేది. ప్రతి సెంటర్ కు ఓ గ్యాంగ్ తయారైంది. ఆ సెంటర్లోకి మరొకరు ఎంటర్ అయ్యే
పరిస్థితి లేదు. ఎవరి అడ్డా వారిది. ఎవరి దందా వారిది. ప్రతి షాపు నుంచి నెలమామూళ్లు. వైన్ షాపులు, మాంసం దుకాణాల్లో ఉచిత ట్రీట్ మెంట్. ఇలా రౌడీల బతుకులు సాఫీగా సాగిపోయేవి. పోలీసులంటే భయంలేకుండా పోయింది. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలనుకున్నా రౌడీగారి పర్మిషన్ కావాల్సిందే. ప్రతి గల్లీ, మెయిన్ రోడ్డులో ఆక్రమణలన్నీ రౌడీల కనుసన్నల్లోనే జరిగేవి. ఇలా జరుగుతున్న సమయంలో బెజవాడలో జరిగిన తొలిహత్య సంచలనం రేపింది.
సంచలనం….
1969లో పూర్తికాలం కమ్యూనిస్టు కార్యకర్తగా ఉన్న చలసాని వెంకటరత్నం అంగబలం, అర్ధబలం గల నాయకుడుగా ఎదిగారు. సీపీఐ కూడా పార్టీ పరంగా అండదండలు అందిస్తుండేది. కాంగ్రెస్ పార్టీ లేదా సోదర సీపీఎం పార్టీ వారితో ఘర్షణ పడాల్సి వస్తే సిపిఐ వెంకటరత్నం సాయం తీసుకుంటూ ఉండేది. బెజవాడలో వెంకటరత్నం అంటే పేరు. ఆయన ప్లాన్ వేసారంటే తిరుగే ఉండేది కాదు. స్కెచ్ వేస్తే ఖతం అయినట్లే. మొదట్లో సీపీఐ భావజాలం గల వంగవీటి రాధాకృష్ణ( రంగా సోదరుడు) కూడా వెంకటరత్నం శిష్యుడుగా గుర్తింపు పొందారు. కార్మిక సంఘాల ఏర్పాటు, ఎన్నికలుతదితర కార్యక్రమాల్లో వెంకటరత్నం చురుగ్గా వ్యహరించేవారు.
గుప్పిట్లో ఆటోమొబైల్ రంగం…
అలానే బెజవాడ ప్రైవేటు రవాణా రంగానికి కేంద్రంగా మారుతూ వచ్చింది. టాక్సీ స్టాండులు, ప్రైవేటు బస్సులు వారి మధ్య గొ డవలు … ఇలా ఆటోమొబైల్ రంగంతో పాటు వారి మధ్య పంచాయితీలు పెరిగి వెంకటరత్నం వద్దకు పంచాయితీకి వచ్చేవి. లారీలు, ప్రయివేటు బస్సుల కార్మికులు
వీరిచేతుల్లోనే ఉండేవారు. బస్సు ఛార్జీలు అడ్డగోలుగా వసూలు చేసేవాళ్లు. బస్సు కదిలే సమయాన్ని కూడా వెంకటరత్నం బ్యాచ్ నిర్ణయించేది. ఇక ప్రయివేటు
పంచాయతీలు సరేసరి. రౌడీలు తొలిసారిగా డబ్బు రుచి మరిగింది చలసాని వద్దే. అడ్డగోలు సంపాదన మొదలుపెట్టిన బెజవాడ గ్యాంగ్ లు ఇక వెనుదిరిగి
చూసుకోలేదు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసేవాళ్లు. సత్యనారాయణపురంలో ఎక్కువగా బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది. అక్కడ రౌడీలు కాలుమోపారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిని ప్రారంభించారు. సొంత ఇంటిని వందలు… వేలు ఇచ్చి వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఎంతమందో
ఉన్నారు. రౌడీల అడ్డాగా మారిన బెజవాడలో పారిశ్రామిక అభివృద్దికి ఆటంకం ఏర్పడింది.
రాధా రంగప్రవేశం….
చలసాని వెంకటరత్నం బ్యాచ్ లో వంగవీటి రాధా చేరారు. రాధా క్రమంగా చలసాని ప్రధాన అనుచరుడిగా పెరుగుతూ వచ్చారు. చలసానికి రాధా అంటే అంత
నమ్మకం ఏర్పడింది. మొదట్లో రాధా కూడా చలసాని చెప్పిన ప్రతి పనినీ చేసేవారు. ప్రతి గొడవకూ రాధా ముందుండి నాయకత్వం వహించేవారు. రాధా వెళ్లాడంటే సమస్య సెటిలయినట్లేనని చలసాని అందరితో అంటుండే వారు. అయితే ఈ క్రమంలో రాధా మదిలో తానే మంచి నాయకుడినన్న భావన కలిగింది. తాను లేకుంటే చలసాని లేనట్లేనన్న భావనకు రాధా వచ్చాడు. అయితే తన ఎదుగుదలకు చలసాని అడ్డు అని రాధా భావించేవాడు.చలసాని వెంకటరత్నం అడ్డు తొలగించుకుంటే తప్ప తాను ఎదగలేననే నిర్ణయానికి రాధా వచ్చాడు.. చలసాని రాధాను పంచాయతీలకు, కొట్లాటలకు వాడుకునే వారు
కాని ఆర్థికంగా సాయం అందించేందుకు, నాయకుడిగా ఎదిగేందుకు చలసాని ఒప్పుకునేవారు కారు. ఎన్నాళ్లిలా ఒకరి కింద పనిచేస్తామని
భావించిన రాధాకృష్ణ తాను స్వయంగా ఎదగాలని భావించాడు.
పక్కా ప్లాన్…
ఎంతకాలం ఇలా ఒకరి వద్ద ఊడిగం చేస్తామని భావించిన రాధా క్రమంగా చలాసానిని అడ్డుతొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.
వెంకటరత్నం ఉన్నన్నాళ్లు తాను ఎదగలేనని భావించిన రాధా చలసానిని తొలగించేందుకు తొలిసారి ప్లాన్ తయారు చేసుకున్నాడు. అయితే భయపెడితే చలసాని భయపడడు. అంతం చేయాల్సిందే. కాని అప్పటి వరకూ హత్య లు వరకూ వెళ్లని రాధా తన ప్లాన్ ను పకడ్బందీగా తయారు చేసుకున్నాడు.
ప్లాన్ మిస్ అయితే తను ఉండడని రాధాకు తెలుసు. అందుకే పకడ్బందీగా హత్యకు స్కెచ్ రూపొందించుకున్నాడు. చలసానిని హతమార్చాలంటే మరికొందరి సాయం అవసరమని భావించిన రాధా సిపీఎం కు చెందిన ఐతారాములు, మరికొందరి మద్దతు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 1973లో చలసాని వెంకటరత్నం హత్య జరిగింది. రాధా సక్సెస్ అయ్యాడు. ఈ హత్య తొలి హత్య. బెజవాడలో సంచలనానికి దారితీసింది. ఈ కేసులో వంగవీటి రాథాక్రష్ణ, సీపీఎం కు చెందిన సుంకర బాస్కరరావు తదితరులు నిందితులు.

  • Replies 102
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • scotsman

    28

  • GOLIMAR

    20

  • cherlapalli_jailer

    18

  • idiBeZaWaDa

    13

Top Posters In This Topic

Posted

[color=#333333][font=Georgia,]చలసాని హత్యతో రాధా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఇక గ్యాంగ్ లీడర్ గా అవతారమెత్తాడు. రాధా చుట్టూ జనం చేరిపోయారు. రాధా ముఖ్యంగా యువకులను చేరదీశాడు. క్రమంగా తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక బెజవాడలో రాధా హల్ చల్ మొదలయ్యింది. అయితే బలమైన నాయకుడైన చలసాని వెంకటరత్నాన్ని హత్య చేయటంతో సీపీఐ వంగవీటి రాధాను పార్టీ నుంచి బయటకు నెట్టేసింది. అయితే ప్రత్యామ్నాయ నాయకుడుగా రామచంద్రరాజు ఎదిగేందుకు దోహదపడినా రాధాపై ప్రతీకారేచ్ఛ తీర్చుకునే యత్నం చేయలేదు. దీనికి కారణం అప్పట్లో పాతబస్తీలో సిటీ కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడిన తమ్మిన పోతురాజు తదితరులు సీపీఐలో 1974 ప్రాంతంలో విలీనం అయింది. పార్టీ పరంగా నిర్మాణం, కార్యకర్తల సమీకరణ వంటి ఈ గొడవల్లో పడిపోయారు. దీంతో కొద్దికాలం రౌడీయిజం సద్దుమణిగింది.[/font][/color]

[b]రాధా చెప్పిందే వేదం…[/b][color=#333333][font=Georgia,]
చలసాని హత్య తర్వాత వంగవీటి రాధా వ్యక్తిగతంగా పెరుగుతూ టాక్సీ స్టాండు ఏర్పాటు చేసి యూనియన్ నాయకుడుగా ఎదిగారు. దీంతో పాటు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు వారి గొడవలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతూ గుర్తింపు పొందారు. అలానే కాపు కులానికి చెందిన వారంతా ఆయన అనుచరులుగా చేరిపోయారు. రాధా హీరో అయ్యారు. రాధా గ్రూపులో దేవినేని వర్గం కూడా చేరిపోయింది. అప్పట్లో దేవినేని నెహ్రూసోదరులు, రాధా సోదరుడు వంగవీటి రంగా మిత్రులుగా వసూళ్లు దందా కార్యక్రమాలలో ఉండేవారు. క్రమంగా వంగవీటి రాధా ప్రభావం పెరిగింది. వర్తక, వాణిజ్య దుకాణాల నుంచి వసూళ్లు పెరిగాయి. ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినా… స్థలం అమ్మాలన్నా… కొనాలన్నా…. చివరకు దొంగతనం జరిగితే సొత్తు రికవరీ పంచాయతీలు కూడా వీరే చేసేవారు. క్రమంగా రాధా ఆర్థికంగా స్థిరపడే స్థాయికి చేరుకున్నారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]పోలీసులకూ మామూళ్లు…[/b]
రాధా రాజ్యం ప్రారంభమైన తర్వాత పోలీసులను తమ అదుపులో ఉంచుకోవడాన్ని రౌడీలు అలవాటు చేశారు. పోలీసులకు క్రమం తప్పకుండా మామూళ్లు ఇచ్చే అలవాటు రాధానే అలవాటు చేశారు. ఎక్కడ ఏది జరిగినా ముందు పోలీసులు రాధాకు సమాచారాన్ని అందచేసేలా రాధా తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా తన బ్యాచ్ పై ఫిర్యాదు చేసేందుకు వస్తే ముందుగా రాధాకు సమాచారం అందేది. దీంతో వారిని బెదిరించి తన పనిని తాను
చక్క పెట్టుకునేవాడు. ఇక రాధా బ్యాచ్ ఎంత దూరం వెళ్లిందంటే అవతలి వ్యక్తిని ప్రాణభయం పెట్టి ఊరు ఖాళీ చేయించే స్థితికి వచ్చింది. రాధా బ్యాచ్ లో దేవినేని సోదరులు కూడా ఉండటంతో దాదాపు బెజవాడ మొత్తం రాధా కనుసన్నల్లోనే నడిచేది. అతి తక్కువ సమయంలోనే రాధా ఊహించనంత స్థితికి వచ్చాడు. తొలినాళ్లలో బయటకు వెళ్లి పంచాయతీలు చేసే రాధా తనకంటూ ఓ అడ్డాను ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇంటికే ఇరు వర్గాలను పిలిపించి సెటిల్ చేసేవాడు. ఎవరైనా తను పిలిస్తే రాకుంటే వెంటనే తన బ్యాచ్ ను పంపి నానా హింస పెట్టేవాడు. రాధా గ్యాంగ్ లో కూడా క్రమంగా అసూయా ధ్వేషాలు పెరిగాయి. రాధా ఒంటెత్తు పోకడలను దేవినేని సోదరులు జీర్ణించుకోలేక పోయారు. రాధా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచన దేవినేని సోదరుల మదిలో మొదలయ్యంది. రాధా గ్యాంగ్ లో కొందరు దేవినేని సోదరులకు మద్దతుగా నిలిచారు.[/font][/color]

Posted

[color=#333333][font=Georgia,]రాధా వసూళ్ల దందా పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికీ కమీషన్. బెజవాడకు తలనొప్పిగా తయారయ్యాడు. కాని రౌడీయిజం చూసి అందరూ భయపడే వారు. అప్పట్లో సంపన్న కుటుంబానికి చెందిన నాగళ్ల శివరామప్రసాద్ వామపక్షభావజాలం కలిగి ఉన్నా వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉండేవారు. వంగవీటి రాధా, నాగళ్ల శివరామప్రసాద్ కూడా మంచి స్నేహితులే. అయినా దేనికదే అన్నట్లు వసూళ్లలో ఎవర్నీ వదిలేవారు కాదు. శివరాంప్రసాద్ కు సారా వ్యాపారాలు కూడా ఉండేవి. వసూళ్లలో భాగంగా వంగవీటి రాధా శివరాంను కూడా కొంత సొమ్ము డిమాండ్ చేశారు. అయితే ఓ సామాజిక వర్గానికి చెందిన వారు రాధా పోకడలకు మనస్థాపం చెందారు. ఎన్నాళ్లిలా కప్పం చెల్లించుకుంటూ పోతామన్న చర్చ ఆ వర్గంలో బయలు దేరింది. రాధా బతికుంటే తమ వ్యాపారాలు కూడా సజావుగా చేసుకోలేమన్న పరిస్థితికి ఆ సామాజిక వర్గం వారు వచ్చేశారు.[/font][/color]

[b]పక్కా ప్లాన్ తో…[/b]
[color=#333333][font=Georgia,]తన స్నేహితుడు, సారావ్యాపారి నాగళ్ల శివరామ్ ప్రసాద్ ను కూడా రాధా డబ్బు డిమాండ్ చేశాడు. ఇక రాధా ఆగడాలను సహించలేమని నిర్ణయానికి వచ్చిన శివరామ్ రాధా హత్యకు పక్కా ప్లాన్ చేశాడు. సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకున్నాడు. రాధా ఒకసారి మిస్ అయితే తాను బతకనని శివరామ్ కు తెలుసు. అందుకే పని పక్కాగా జరిగిపోవాలని శివరాం అనుచరులకు సూచించాడు. ఒకవేళ రాధా మిస్ అయితే తనకు ప్రమాదమని గ్రహించిన శివరాం ఆరోజు ఊళ్లో లేకుండా వెళ్లిపోదామనుకున్నాడు. అయితే రాధాను హత్య చేయాలంటే తను బెజవాడలోనే ఉండటం అవసరమని భావించిన శివరాం అందుకోసం ఓ వ్యూహాన్ని రచించుకున్నాడు. డబ్బులు డిమాండ్ చేస్తున్న రాధా స్వయంగా తన వద్దకు వస్తేనే ఇస్తానని చెప్పాలని, అది నమ్మి రాధా తన వద్దకు వస్తే హత మార్చ వచ్చని శివరాం నిర్ణయించుకున్నాడు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]సినీ ఫక్కీలో….[/b]
శివరాం నుంచి రాధా కు ఫోన్ వెళ్లింది. రాధా అడిగిన డబ్బులిస్తానని శివరాం ఒప్పుకున్నాడు. అయితే స్వయంగా మ్యూజియం రోడ్డులోని తన కార్యాలయానికి మర్నాడు ఉదయాన్నే వస్తే సొమ్ము ఇస్తానని శివరాం చెప్పారు. అప్పటికే ఓ స్థాయికి ఎదిగిన రాధా తనను ఎవరూ ఏమి చేయలేరన్న ధీమాతో ఉన్నారు. ఆఫ్ర్టాల్ శివరాం తనను ఏం చేస్తాడు అనుకున్నాడేమో నేరుగా రాధా శివరాం కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే శివరాం అనుచరులు ఒకరు రోడ్డు ఊడ్చే మున్సిపల్ వర్కర్ గా మరొకరు మురుగు కాల్వలో చెత్త తొలగించే కార్మికుడుగా.. ఇంకొకరు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిగా ఇలా అరడజను మంది వివిధ వేషాలలో శివరాం కార్యాలయం వద్ద కాపుకాశారు. రాధా షట్టరు తీసుకుని నాగళ్ల శివరాం కార్యాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక్క ఉదుటున మాటు వేసిన వారంతా చొరబడ్డారు. షట్టరు మూసివేసి హతమార్చారు. రాధా హత్య కేసులో ఆతరువాత ఎమ్మెల్యే అయిన అడుసుమిల్లి జయప్రకాష్ కూడా నిందితుడే. ఈహత్య జరిగిన తీరు అప్పట్లో సంచలనం అయింది.. సినిమా రచయితలకు కూడా రాని ఐడియా 1974లోనే బెజవాడ రౌడీలు ఆచరణలో పెట్టి సంచలనం రేకెత్తించారు. తమ ప్రమేయం లేకుండానే రాధా హతమవ్వడంతో దేవినేని సోదరులు లోలోన సంతోషించారు.[/font][/color][color=#333333][font=Georgia,]
రాధా తర్వాత ఎవరు?
రాధా గ్యాంగ్ కు ఇక లీడర్ ఎవ్వరనే ప్రశ్న ఉత్పన్నమైంది....[/font][/color]

Posted

[b] రంగా [/b]
[color=#333333][font=Georgia,]
రాధా మృతి తర్వాత గ్యాంగ్ లీడర్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. రాధా సోదరుడు వంగవీటి రంగా అప్పటికే రాధాకు వెన్నుదన్నుగా ఉండేవారు. అనేక పంచాయతీల్లో రంగా నేరుగా పాల్గొనేవాడు. ఆ క్రమంలోనే బ్యాచ్ బాధ్యతలు రంగా చేపట్టారు. రాధా వారసుడుగా ఆయన తమ్ముడు వంగవీటి రంగా తెరపైకి వచ్చారు. ఈ పరిణామాలు దేవినేని సోదరులకు రుచించలేదు. రంగా ఆధిపత్యాన్ని నెహ్రూ వర్గం ఒప్పుకోలేదు. పైగా తమ సామాజిక వర్గాన్ని రాధా అణిచివేస్తున్నారనే ఆవేదిన దేవినేని వర్గంలో ప్రారంభమైంది. రంగా యువకుడు కావడంతో క్రమంగా కాపువర్గం నుంచి అధిక సంఖ్యలో యువకులు రంగా పంచన చేరడం ప్రారంభించారు. ఒకే గ్రూపులో ఉన్నా వంగవీటి, దేవినేని వర్గాల మధ్య క్రమంగా విభేదాలు పొడచూపాయి.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]ప్రేమే విడదీసింది…..[/b]
స్నేహితులుగా ఉన్న వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ సోదరుల మధ్య వసూళ్లు, సరిహద్దు వివాదాలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఓ ప్రేమ వివాహం వీరిద్దరి మధ్య మరింత అగాధాన్ని పెంచింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి, కాపు కులానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమికులిద్దరూ రంగా ను ఆశ్రయించారు. తాను దగ్గరుండి పెళ్లి చేస్తానని రంగా ప్రేమికులకు హామీ ఇచ్చాడు. మరోవైపు అమ్మాయి తల్లిదండ్రులు నెహ్రూ వర్గాన్ని ఆశ్రయించారు. తమ కూతురిని అన్యాయంగా ఎత్తుకెళ్లారని, తన కూతురు అమాయకురాలిని, తనకు న్యాయం చేయాలని కోరడంతో నెహ్రూ వర్గం వారికి అండగా నిలవాల్సి వచ్చింది. ఆ వివాహం చేయవద్దని నెహ్రూ రంగాకు వర్తమానం పంపారు. అయితే రంగా పట్టించుకోకుండా వారివివాహాన్ని దగ్గరుండి మరీ చేయించారు. దీంతో నెహ్రూ వర్గం ఆగ్రహం చెందింది. తన వర్గానికి అన్యాయం జరుగుతుందని భావించిన దేవినేని వర్గం వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే ఒకప్పటి స్నేహితులు కావడంతో ఇద్దరూ బెజవాడలో సరిహద్దులు నిర్ణయించుకున్నారు. తాను నెహ్రూ ఏలూరు రోడ్డును కేంద్రంగా చేసుకుంటే రంగా బందరు రోడ్డును తన సామ్రాజ్యంగా మార్చుకున్నారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]రెండు గ్యాంగ్ ల హల్ చల్[/b]
అప్పటి వరకూ బెజవాడలో ఒకే గ్యాంగ్ ఆధిపత్యాన్ని చెలాయించేది. కాని రంగా, నెహ్రూలు వేరు కుంపట్లు పెట్టుకోవడంతో బెజవాడకు రెండు గ్యాంగ్ ల తలనొప్పి తయారైంది. ఏలూరు రోడ్డు నుంచి గుణదల వరకూ ఏ పంచాయతీ అయినా నెహ్రూ చేయాల్సిందే. బందరు రోడ్డు నుంచి కృష్ణలంక వరకూ రంగా అడ్డాగా మారిపోయింది. ఒకరి ఇలాకాలోకి మరొకరు అడుగుపెట్టకూడదన్న నిబంధన ఎవరూ అతిక్రమించలేదు. ఎవరి పంచాయతీలు వారివే. ఎవరి గొడవలు వారివే. ఒకరి పంచాయతీలోకి మరొకరు తలదూర్చే వారు కారు. దీంతో కొన్ని నెలలు గొడవలు బెజవాడలో సద్దుమణిగాయి. రంగా, నెహ్రూలు ఇద్దరూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]యూత్ టార్గెట్ …[/b][/font][/color][color=#333333][font=Georgia,]
ఏ శిబిరమైనా బలపడాలంటే యువకులను ఆకర్షించాలి. దానిలో భాగంగా రంగా యునైటెడ్ ఇండిపెండెంట్స్ (యు.ఐ) స్థాపించారు. అలానే నెహ్రూ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నెలకొల్పారు. విద్యార్థి సంఘాలతో రంగా, నెహ్రూలు రౌడీయిజాన్ని నడుపుతుండేవారు. విద్యార్థులను ప్రతి పనికీ వినియోగించేవారు. ఇద్దరూ వేరే వేరు సామాజిక వర్గాలు కావడంతో బెజవాడలో మళ్లీ రౌడీయిజం చెలరేగింది. ఇలా వ్యక్తిగత రౌడీయిజం పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ఆసరాగా సీపీఐకి చెందిన కాట్రగడ్డ వెంకటనారాయణ రౌడీయిజాన్ని ఎదిరించి నిలచే మొండిమనిషిగా ఎదుగుతూ వచ్చారు. అశ్లీలసాహిత్యం, అమ్మాయిలను ఏడిపించటం ఇలాంటి చేష్ఠలను నిరశిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు పొందారు. జై ఆంధ్రా ఉద్యమం సమయంలో మంచి గుర్తింపులోకి వచ్చారు. సీపీఐ కూడా ఇతన్ని వెంకటరత్నం తరహాలో బలమైన నాయకుడిగా ఎదగటానికి కావాల్సిన మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే చలసాని వెంకటరత్నం హత్య కేసులో నిందితులైన రాధా ముఖ్య అనుచరుడు మునుస్వామి మర్డరయ్యారు. ఇలా ఇంకా మరికొందరు హతమయ్యారు. ఈనేపథ్యంలోనే కాట్రగడ్డ వె ంకట నారాయణ స్థానికంగా ఉంటే ఇబ్బంది అని భావించి సీపీఐ కొన్నాళ్లు నారాయణను పార్టీ పనిమీద రష్యా పంపింది.[/font][/color]

Posted

[color=#333333][font=Georgia,]
బెజవాడలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకవర్గానికి వంగవీటి రంగా నేతృత్వం వహిస్తుండగా, మరొక వర్గానికి నెహ్రూ నాయకత్వాన్నివహించేవాడు. ఇద్దరూ బౌండరీలు గీసుకుని ఒకరి ఇలాకాలోకి మరొకరు ఎంటర్ కావొద్దని నిబంధన కూడా పెట్టుకున్నారు. ఎవరి సామ్రాజ్యంలో వాళ్లే పంచాయతీలు నిర్వహించుకోవాలి. ఒకరి ప్రాంతంలోకి మరొకరు అడుగుపెట్టకూడదు. అయితే అప్పుడప్పుడు ఇరు వర్గాలు ఒకరి సామ్రాజ్యంలో మరొకరు జోక్యం చేసుకోవడంతో కక్ష్య పెరిగింది. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కుల సమస్యలు కూడా తలెత్తాయి. భూములు, ఆస్తిపాస్తులన్న కమ్మ వర్గం సహజంగా నెహ్రూకు మద్దతుగా నిలిచింది. రంగా వెనక కాపు వర్గం నిలబడింది.[/font][/color][color=#333333][font=Georgia,]
కక్ష్యలు.. కార్పణ్యాలు…
రాధా సోదరుడు వంగవీటి రంగా ఒక వైపు దేవినేని నెహ్రూ సోదరులు మరో వైపు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా వివిధ కళాశాలలలో తాము స్థాపించిన ఆర్గనైజేషన్ తరఫు ప్రతినిధులు విద్యార్ధి సంఘ ఎన్నికల్లో గెలుపొందేలా చూసుకునేవారు. రెండు వర్గాలు విద్యార్థి సంఘ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. విద్యార్థులను రెండు వర్గాలు టార్గెట్ గా చేసుకున్నాయి. రంగా, నెహ్రూలు రౌడీయిజం నుంచి రాజకీయం వైపు వెళ్లాలనే ఆలోచనే విద్యార్థి ఎన్నికల్లో గెలుపొంది తీరాలన్నది పట్టుదలగా మారింది. విద్యార్థి సంఘాలకు పెద్దయెత్తున నిధులు కూడా సమకూర్చేవారు. ప్రతి ఆందోళనలో విద్యార్థులు ముందుండే వారు. ఘర్షణల్లో విద్యార్థులపైనే కేసులు నమోదయ్యేవి.[/font][/color][color=#333333][font=Georgia,]
గాంధీ హత్య….
1979లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కళాశాల అంతా హడావుడి. ఏ వర్గం గెలుస్తుందో నన్న టెన్షన్. చాలా మంది కళాశాలకు గైర్హాజరయ్యారు. ఇప్పట్లా ఆ ప్రాంతమంతా జనావాసం కాదు. తుమ్మలతో చిట్టడవి మాదిరి ఉండేది. అక్కడకు గుణదల నుంచి గాంధీ, నెహ్రూ, మురళీ.. ఇటు నుంచి రంగా అనుచరగణం అక్కడకు చేరుకుంది. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. టెన్షన్… తమ వర్గానికి చెందిన వారే ఎన్నికల్లో గెలవాలని ప్రధాన నేతలందరూ అక్కడికి చేరిపోయారు. అయితే వాస్తవానికి రంగా అప్పట్లో సబ్ జైలులో ఉన్నారు. కాని గుణదలలో ఉన్న కాపువర్గం స్థానికంగా నెహ్రూ నాయకత్వం అంటే ఇష్టం లేక మౌనంగా సమయం కోసం వేచి చూస్తున్నారు.[/font][/color][color=#333333][font=Georgia,]
వెంటాడి… వేటాడి….
పాలిటెక్నిక్ ఎన్నికల నేపధ్యంలో రంగా వర్గం అక్కడకు చేరుకుంది. సమయం కోసం వేచి ఉన్న రంగా వర్గీయులు నెహ్రూ గ్రూపులో ఒకరిని వేసేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థి ఎన్నికల ఉద్రిక్తతను ఆసరా చేసుకుని నెహ్రూ సోదరులపైకి రంగా వర్గం కత్తులు దూసింది. అయితే తమ ప్రాంతంలోకి రంగా గ్రూపు వస్తుందని నెహ్రూ వర్గీయులు ఊహించలేదు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకోకముందే ఊహించని విధంగా రంగా వర్గం విరుచుకు పడింది. నెహ్రూ అనుచరుల సంఖ్య తక్కువగా ఉండటం, చేతిలో ఆయుధాలు లేకపోవడంతో నెహ్రూ సోదరులైన గాంధీ, మురళి పరుగులు తీశారు. వారిని రంగా వర్గం వెంటాడింది. మురళి మరికొంత మంది తప్పించుకున్నారు. అయితే దేవినేని గాంధీ పాలిటెక్నిక్ కళాశాల గోడ దూకాడు. తొట్రుపాటుకు గురై గోడను అందుకోలేక పోయారు. దీంతో పక్కనే ఉన్న నీళ్ల తొట్టిలో పడిపోయారు. నీళ్ల తొట్టిలో పడిపోయిన దేవినేని గాంధీపై రంగా అనుచరులు కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా పొడిచేశారు. తమ కళ్లెదుటే సోదరుడు హతమవ్వడంతో దేవినేని సోదరుల్లో ప్రతీకారేచ్ఛ పెరిగిపోయింది. ఇక రంగాను ఉపేక్షించ కూడదన్న నిర్ణయానికి అప్పడే నెహ్రూ వర్గం వచ్చేసింది.[/font][/color]

Posted

దేవినేని గాంధీ హత్య అనంతరం ఆయన సోదరుడు మురళి చెలరేగిపోయాడు. తన అన్నను చంపిన వారిని వదిలేది లేదని భీహ్మించాడు. మురళిది అగ్రెసివ్ నేచర్. తను పట్టుకుంటే వదలడు. పట్టువదలని మొండితనం నిలువెల్లా నిండిన వాడు. ఎవరెన్ని అనుకున్నా… ఎవరు అడ్డుచెప్పినా వినేవాడు కాడు. మురళి అంటే నెహ్రూ వర్గంలో ఉండే వారికే భయం. మురళి నోటి నుంచి మాట వచ్చిందంటే వెంటనే అమలు జరగాల్సిందే. మొండితనంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి కావడంతో క్రమంగా మురళికి క్రేజి్ పెరిగింది. తెగేసి చెప్పే రెబల్ మనస్తత్వం వల్ల యూత్ ఫాలోయింగ్ అధికంగా ఉండేది. తన సోదరుడు గాంధీ హత్యతో రగిలిపోతున్న దేవినేని మురళీ సారధ్యంలో గుణదలకు చెందిన కాపువర్గీయులు సిటీబస్సులో వస్తుండగా దాడి చేశారు. బస్సు లోనే గాంధీహత్యతో సంబంధం ఉన్న ఒకర్ని నరికివేశారు. మరో ఇద్దరికి కాళ్లు నరికారు.
మురళిదే పైచేయి…
క్రమంగా మురళి పట్టు పెరుగుతోంది. ప్రతి పంచాయతీలో తలదూర్చే వాడు. సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకునే వాడు. రెండు వర్గాలు గీచుకున్న పరిధులను మురళి యధేచ్ఛగా అతిక్రమించేవాడు. దీంతో రంగావర్గంలో ఆందోళన బయలుదేరింది. మురళి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని రంగా వర్గం భావించింది. అయితే ఆగ్రెసివ్ నేచర్ ఉన్న మురళిని అంత సులువుగా కట్టడి చేయడం సాధ్యం కాదని భావించిన రంగా వర్గం అదను కోసం వేచి చూస్తూ ఉంది.
రంగాయే టార్గెట్…

మురళి నెక్స్ట్ టార్గెట్ రంగా. రంగాను మట్టుబెడితేనే తన మనుగడ అనిభావించిన మురళి అందుకు అనుగుణంగా ఎప్పటికప్పడు వ్యూహాలు రచిస్తుండేవాడు. ఇటు రంగా వర్గం కూడా మురళి పై ఒక కన్నేసి ఉంచింది. రెండు వర్గాలు తీవ్రస్థాయిలో ఘర్షణ పడుతుండటంతో బెజవాడలో టెన్షన్ ప్రారంభమైంది. ఎప్పడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రెండు వర్గాలు ఎదురుపడితే షోడా బాటిళ్లు గాల్లోకి నాట్యమాడేవి. అనేక మంది అమాయకులు వీరి ఘర్షణల్లో గాయాలపాలయ్యారు. పోలీసులు కూడా వీరికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోయింది. తరువాత టార్గెట్ వంగవీటి రంగాపై పెట్టాడు మురళీ.. రంగా నివాసం ఉండే ప్రాంతానికి అతిసమీపంలో వారం రోజులు మాటువేశాడు. వీలు దొరకలేదు. ఇది తెలుసుకున్న రంగా ఇక లాభం లేదని భావించాడు. మురళిని మట్టు బెడితే తప్ప తనకు మనుగడ లేదని భావించిన రంగా సమయం కోసం వేచిచూస్తున్నాడు.

Posted

[color=#333333][font=Georgia,]దేవినేని మురళి ఒంటెత్తు పోకడను రంగా వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రంగాపైనే మురళి టార్గెట్ పెట్టడంతో మురళిని అంతమొందించేందుకు రంగా వర్గం పావులు కదిపింది. అయితే సమయం కోసం వేచి చూడటం మొదలుపెట్టింది. రంగా, దేవినేని వర్గాలు బెజవాడలో హల్ చల్ మొదలు పెట్టాయి. ప్రతి పంచాయతీని క్యాష్ చేసుకోవడం ప్రారంభించాయి. ఆర్థికంగా బలపడేందుకు రెండు వర్గాలు అడ్డదారులు దొక్కడం ప్రారంభించాయి.[/font][/color]
[b]రౌడీయిజానికి కులం కలర్….[/b][color=#333333][font=Georgia,]
ఇక రౌడీయిజానికి వర్గాల(కులాల) కలర్ వచ్చేసింది. కమ్మ కులానికి చెందిన వారంతా నెహ్రూ వద్దకు, కాపు వర్గీయులంతా రంగా వద్దకు రావటం మొదలయ్యారు. కమ్మ కులంలో ఆర్థికంగా స్థిరపడిన వారు ఎక్కు వ కావడంతో నెహ్రూకు ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. తన అనుచరుల పోషణకు నెహ్రూ ఇబ్బంది పడేవారు కారు. అయితే రంగా పరిస్థితి వేరు. ఆర్థికంగా అంత ఎదగని రంగా తనుబలపడటం కోసం పంచాయితీలు చేసేవాడు. కోస్తా జిల్లాలన్నింటి నుంచి ముఖ్యంగా కాపు వర్గీయుల నుంచి రంగాకు బలం పెరిగింది. అయినా మరో పక్క నెహ్రూ వర్గం నుంచి భౌతిక భీతి వీడలేదు. మురళి తననే టార్గెట్ చేయడందో మురళీ అడ్డు తొలగించుకోవటానికి వ్యూహం పన్నాల్సి వచ్చింది. లేకుంటే తనమనుగడే ప్రశ్నార్ధకం అయ్యేలా ఉంది.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]పక్కా ప్లాన్ తో…[/b]
మురళి అప్టట్లో లా చదివేడు. నెల్లూరు లా కళాశాలలో పార్ట్ టైం లా చేశేవాడు. కేవలం పరీక్షలు రాసేందుకు మాత్రమే నెల్లూరు వెళ్లి వచ్చేవాడు. అయితే తనకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న మురళి దాదాపు 20 నుంచి 30 మంది అనుచరులతో ఒకసారి ట్రైన్ లోనూ, మరోసారి రోడ్డు మార్గంలోనూ నెల్లూరు వెళ్లి వచ్చేవాడు. 1987లో లా పరీక్షలు రాసేందుకు మురళి నెల్లూరు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే రంగా మురళి అనుచరుల్లో ఒకరిని కోవర్టుగా నియమించుకున్నాడు. కోవర్టు ద్వారా మురళి నెల్లూరు వెళుతున్నాడన్న సమాచారం అందుకున్న రంగా ఇదే మంచి సమయమని భావించాడు. మురళి కదలికలను ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు నెల్లూరుకు తన అనుచరులను రంగా పంపాడు. మురళి బస చేసిన లాడ్జి వద్దే మాటు వేసిన రంగా అనుచరులు ఎప్పటికప్పడు మురళి కదలికలను రంగా కు అందించేవారు. అప్పట్లో సెల్ ఫోన్ల సౌకర్యం లేకపోవడంతో ల్యాండ్ ఫోన్ల లోనే సమాచారం అందేది. లా పరీక్షలు పూర్తయి మురళి విజయవాడ బయలుదేరుతాడని తెలుసుకున్న రంగా పక్కా ప్లాన్ ను రూపొందించాడు. మురళి ఈ సారి మిస్ కాకూడదని తన అనుచరులను హెచ్చరించాడు. మురళి ప్రయాణిస్తున్న వాహనాల నెంబర్లు కూడా రంగాకు ముందుగానే చేరిపోయాయి.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]లారీతోఢీకొట్టి…కత్తులతో నరికి…[/b]
దాదాపు వంద మంది రంగా మనుషులు విజయవాడ నుంచి లారీలో బయలుదేరి గుంటూరు జిల్లా యడ్లపాడు గుట్ట వద్ద మాటువేశారు. లారీని హైవే మీదే నెల్లూరు వైపునకు తిప్పి నిలిపి ఉంచారు. ఆ ప్రాంతానికి ఏ సమయానికి మురళి వాహనాలు చేరుకుంటాయో పక్కా సమాచారం ఉండటంతో అక్కడే మాటు వేసి ఉన్నారు. రంగా ఎప్పటికప్పుడు తన అనుచరులకు సూచలను అందించేవాడు. మురళి వాహనం ఆ ప్రాంతానికి చేరుకోగానే ముందుగా లారీతో ఆ వాహనాన్ని ఢీకొట్టించారు. దీంతో తనపై అటాక్ జరిగిందని తెలుసుకున్న మురళి గుట్ట వైపు పరుగులు తీశాడు. గుట్ట వద్దే మాటు వేసి ఉన్న రంగా అనుచరులు దాదాపు 30 మంది మూకుమ్మడిగా మురళిపై దాడికి దిగారు. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో న రికి చంపారు. 1987లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. బెజవాడలో మళ్లీ వర్గ కక్ష్యలు భగ్గుమన్నాయి.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]మళ్లీ భగ్గుమన్న బెజవాడ [/b][/font][/color][color=#333333][font=Georgia,]
మురళి హత్యతో బెజవాడ మళ్లీ రగిలింది. తనకు కుడిభుజం గా ఉండే మురళి హత్య చేయబడటంతో నెహ్రూ రగిలిపోయాడు. రంగాపై కక్ష్య మరింత పెరిగింది. అదను కోసం వేచి చూడటం మినహీ మరేమీ చేయలేమని భావించిన నెహ్రూ వర్గం సమయం కోసం వేచి చూస్తూ ఉంది. అయితే రెండు వర్గాలు ఎప్పటికప్పడు వ్యూహాలు రచించుకుంటూనే ఉన్నాయి. మళ్లీ బెజవాడలో టెన్షన్ ప్రారంభమైంది. ఒకరి వర్గంపై మరొకరు దాడులు చేసుకోవడం ప్రారంభించారు.
[b]నెహ్రూపై అటాక్…[/b]
ఒకరోజు నెహ్రూ, బాజీప్రసాద్, అనుచరులపై కోర్టుకు వస్తున్న సమయంలో రంగా వర్గీయులు దాడిచేయటానికి యత్నించారు. కోర్టు బయటే వేచి ఉన్న రంగా అనుచరులు నెహ్రూ, అతని సోదరుడు బాజీ ప్రసాద్ పై దాడి చేశారు. వెంటనే పరుగులు తీసిన నెహ్రూ ఒక ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు రావడంతో రంగా అనుచరులు పరారయ్యారు. దీంతో నెహ్రూ, అతని వర్గీయులు బతికి బయటపడ్డారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]ప్రేక్షక పాత్రలో పోలీసులు….[/b]
బెజవాడలో నెహ్రూ, రంగా వర్గీయులు వీరంగం చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించేవారు. రెండు వర్గాల నుంచి సొమ్ములు అందుకుని మౌనంగా సంఘటనలను వీక్షించేవారు. పోలీసుల్లోనూ రెండు వర్గాల నేతలు ఏజెంట్లను నియమించుకున్నారు. ఒకరి సమాచారం ఒకరికి వెంటనే తెలిసిపోయేది. అయితే రెండు వర్గాలు ఒకరిని అంతమొందిచేందుకు మరొకరు వేచి చూస్తున్నారు. చివరకు రౌడీలు ఖాకీ డ్రస్సులోని పోలీసులనే నాకొడకా.. ఇటు రా.. అని పిిలిచే రోజులవి. కాని వారిచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి పోలీసులు ఏమీ చేయలేక పోయారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]వ్యాస్ ది గ్రేట్….[/b]
అదే సమయంలో విజయవాడ పోలీసు కమిషనర్ గా ఐపిఎస్ అధికారి వ్యాస్ వచ్చారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. రౌడీషీటర్లకు సహకరిస్తున్న పోలీసులను కఠినంగా శిక్షించారు. దీంతో రౌడీషీటర్లకు, పోలీసుల మైత్రీబంధానికి తెరపడింది. మరోవైపు ప్రయివేటు పంచాయతీలు, సెటిల్ మెంట్లు చేస్తే ఊరుకోనని వ్యాస్ ఇరువర్గాలకూ హెచ్చరికలు పంపారు. దీంతో నెహ్రూ, రంగా వర్గాలు ఒకడుగు వెనక్కు వేశాయి. బెజవాడలో మళ్లీ ప్రశాంతతనెలకొనడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయినా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు వర్గాలు ఒకరిని నొకరు అంతమొందిచుకునేందుకు వ్యూహాలు రచించడం మానలేదు.[/font][/color]

Posted

[color=#333333][font=Georgia,]
POLITICAL OUTFIT...[/font][/color][color=#333333][font=Georgia,]
వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వర్గాలు అప్పటి వరకూ రాజకీయం వైపు చూడలేదు. రంగా సోదరుడు రాధా మాత్రం గతంలో సిపిఐ నేతగా ఉండేవాడు. కాని రాధా వారసత్వాన్ని అందుకున్న రంగా మాత్రం రాజకీయం జోలికి పోలేదు. నెహ్రూ కూడా కేవలం ముఠా నాయకుడుగానే ఉండేవాడు కాని, పాలిటిక్స్ వైపు దృష్టి మరలించలేదు. కాని వ్యాస్ వచ్చిన తర్వాత పోలీసుల నుంచి వత్తిడి రెండు వర్గాలకు ఎదురవ్వడం ప్రారంభించింది. రెండు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రంగా చూపు రాజకీయం వైపు పడింది. తనకు ఏదో ఒక పదవి ఉంటే తప్ప పోలీసు వేధింపుల నుంచి బయటపడలేనని భావించిన రంగా అందుకు అనుగుణంగా పాలిటిక్స్ లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]తొలిసారి కార్పొరేటర్ గా…[/b][/font][/color][color=#333333][font=Georgia,]
1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో రంగా పోటీ చేయాలని భావించాడు. కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం ప్రయత్నించాడు. అప్పట్లో జలగం వెంగళరావు పిసిసి అధ్యక్షునిగా ఉండేవారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కృష్ణలంక కార్పొరేటర్ గా పోటీ చే్యాలని భావించాడు. అయితే రంగాకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. కాపు వర్గానికి చెందిన పిళ్లా వెంకటటేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. రంగా వెనకాడకుండా అదే డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రంగా విజయం సాధించి తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. [/font][/color][color=#333333][font=Georgia,]
కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత రంగా ఇక వెనుదిరిగి చూడలేదు. పంచాయతీలు, సెటిల్ మెంట్లు ఎక్కువయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందినా రంగా కాంగ్రెస్ మద్దతిచ్చేవాడు. దీంతో పోలీసులు కూడా రంగా వర్గం పట్ల ఒకింత మెతక వైఖరి అవలంబించాడు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]నెహ్రూ నేరుగా ఎమ్మెల్యే….[/b][/font][/color][color=#333333][font=Georgia,]
అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు. తన శత్రువైన రంగా కాంగ్రెస్ లో ఉండటంతో నెహ్రూ ఇక ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ నెహ్రూను దగ్గరకు తీశారు. వెంటనే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. దీంతో నెహ్రూ తొలి రాజకీయ అరగ్రేటం లోనే శాసనసభలోకి అడుగుపెట్టారు. రంగా మాత్రం కార్పొరేటర్ గానే మిగిలిపోయారు. సహజంగానే ఆర్థికబలంతోడు పొలిటికల్ పవర్ అందడంతో నెహ్రూ చెలరేగిపోయాడు. మళ్లీ రంగా వర్గానికి పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం… నెహ్రూ ఎమ్మెల్యే కావడంతో రంగాకు ఊపిరి సలపనివ్వలేదు. బెజవాడలో నెహ్రూ ఆధిపత్యం పెరిగింది. [/font][/color]
[color=#333333][font=Georgia,]
[b]రంగాకు లక్కీ ఛాన్స్[/b][/font][/color][color=#333333][font=Georgia,]
రాష్ట్రంలో అనుకోకుండా మధ్యంతర ఎన్నికలు రావడం రంగాకు లాభించింది. లక్కీ ఛాన్స్ దొరికింది. ఈ ఎన్నికల్లో రంగాకు తూర్పు నియోజకవర్గం టికెట్ ను కాంగ్రెస్ కేటాయించింది. కార్పొరేటర్ గా ఉన్న రంగా ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో ఇక రంగా వర్గం కూడా రెచ్చిపోయింది. ఇద్దరు రౌడీషీటర్లు శాసనసభలోకి అడుగుపెట్టారు. రౌడీయిజానికి రాజకీయం తోడు కావడంతో మళ్లీ బెజవాడలో వర్గ వైషమ్యాలు పెరిగిపోయాయి. రెండు వర్గాలు ఆధిపత్య పోరు కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇద్దరు వర్గాలకు చెందిన అనుచరులు నేలకొరుగుతున్నారు.[/font][/color]

Posted

[color=#333333][font=Georgia,]
వంగవీటి రంగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత కోస్తా జిల్లాల్లో కాపు వర్గానికి బలమైన నాయకుడిగా ఎదిగాడు. రంగాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. చిటికెలో సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజల్లో కుదిరింది. రాష్ట్రంలో కాపుకులానికి రంగా నాయకుడిగా ఎదిగాడు. అలాగే కమ్మకులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని రంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గంలో కొందరు రంగాకు అండగా నిలిచారు. అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు కూడా రంగా కంటగింపుగా తయారయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రంగా వెంటనే స్పందించేవాడు. నేరుగా ఆందోళనకు దిగేవాడు. దీంతో కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం రంగాయేనని అప్పటి కాంగ్రెస్ పాలకులు కూడా గ్రహించి రంగాను ప్రోత్సహించేవారు. రంగా పిలుపినిస్తే చాలు కోస్తా ప్రాంతమంతా స్పందించేది. ఇది తెలుగుదేశం పార్టీకి ఆగ్రహం తెప్పించింది.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]సమయం కోసం నెహ్రూ….[/b][/font][/color][color=#333333][font=Georgia,]
మరోవైపు నెహ్రూ మాత్రం రంగాను అంతమొందిచేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. సమయం కోసం వేచిచూస్తున్నాడు. తన పగకు తోడుగా అప్పటి తెలుగుదేశం అగ్ర నేతలు కూడా నెహ్రూ అండగా నిలిచారు. పార్టీ పవర్ లో ఉన్నప్పుడే రంగాను అంతమొందించాలని నెహ్రూ నిర్ణయించుకున్నాడు. అందుకు టిడిపి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. కాని రంగాను మట్టు బెట్టాలంటే అంత సులువు కాదు. ఎమ్మెల్యేగా ఉండటంతో పాటుగా రంగాకు ఫుల్ గా ప్రయివేటు సెక్యూరిటీ ఉండేది. రంగాను అంతమొందించడం అంత సులువు కాదని గ్రహించిన నెహ్రూ ఎటువంటి పొరపాట్లు చేయకుండా టైమ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. [/font][/color]
[color=#333333][font=Georgia,]
[b]ఆందోళనలే కొంపముంచాయి….[/b][/font][/color][color=#333333][font=Georgia,]
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగా ఉద్యమించేవాడు. వందలాది మంది కార్యకర్తలతో ధర్నాకు, ఆందోళనలకు దిగేవాడు. కిక్కిరిసిన జనం, అనుచరుల మధ్య ఉండటం రంగాను కాపాడేది. రంగా కూడా తనను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాలో ఉండేవారు. అందుకే వీధి ఆందోళనల్లో కూడా ముందుండేవారు. గన్ మెన్లను సైతం పక్కకు నెట్టి రాస్తారోకోల్లో పాల్గొనేవారు. గన్ మెన్లు, రంగా సన్నిహితులు పలుమార్లు హెచ్చరించారు. నెహ్రూ నుంచి ప్రమాదం పొంచి ఉందని రంగాకు తెలుసు. అయినా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను ఏమి చేయలేరనే ధీమాలో ఉండి రంగా వీధుల్లోకి వచ్చేందుకు వెనుకాడేవారు. కారు. నెహ్రూ మాత్రం ఈ అవకాశాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన అనుచరులను అప్రమత్తం చేశారు.[/font][/color]
[color=#333333][font=Georgia,]
[b]డిసెంబరు విషాదం….[/b][/font][/color][color=#333333][font=Georgia,]
అది డిసెంబరు నెల. 1988వ సంవత్సరం. పౌరసమస్యలను పరిష్కారించాలని కోరుతూ రంగా ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రంగా నిరాహారదీక్షకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన ఇంటికి సమీపంలోని బందరు రోడ్డుపై నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ఆమేరకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో రంగా బందరు రోడ్డులో దీక్ష ప్రారంభించారు. చుట్టూ అనుచరగణంతో రంగా దీక్షను కొనగాస్తున్నాడు. డిసెంబరు నెల కావడంతో మంచు ఎక్కువగా కురవడం… రాత్రి వేళలు ఎక్కువగా ఉండటం… రంగా హత్యకు సులువైన సమయమని నెహ్రూ భావించాడు. హత్యకు పథక రచన ప్రారంభించాడు. రంగా డిమాండ్లకు తలవంచొద్దని ప్రభుత్వానికి కూడా నెహ్రూ సమాచారం పంపాడు.[/font][/color]
[color=#333333][font=Georgia,]
[b]అయ్యప్ప వేషధారణలో…..[/b][/font][/color][color=#333333][font=Georgia,]
పౌర సమస్యలపై నిరాహారదీక్షలో ఉ న్న వంగవీటి రంగాను మట్టు పెట్టేందుకు నెహ్రూ పక్కా ప్రణాళికను రచించాడు. రంగా ఎట్టిపరిస్థితుల్లో మిస్ కాకూడదని అనుచరులను హెచ్చరించాడు. ఈ దఫా మిస్ అయితే మనకే ముప్పు అని గ్రహించిన నెహ్రూ ప్రభుత్వ సాయం కూడా పరోక్షంగా తీసుకున్నాడు. రంగా నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్ద పోలీసుల పహారాను కొద్దికొద్దిగా తొలగించడం ప్రభుత్వం ప్రారంభించింది. మొండి ధైర్యంతో ఉన్న రంగా ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోలేదు. తన అనుచరులు ఉన్నారనే ధైర్యంతో మొండిగా శిబిరంలోనే కూర్చున్నారు. 1988 డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్.[/font][/color][color=#333333][font=Georgia,]
రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. విజయవాడ నిద్రమత్తులో ఉంది. తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ఓ ప్రయివేటు టూరిస్ట్ బస్సులో నెహ్రూ అనుచరులు అయ్యప్ప వేషధారణ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప నామస్మరణ చేస్తూ రంగా శిబిరం వైపునకు బస్సు దూసుకువచ్చింది. బస్సులోనే అయ్యప్ప మాలలు వేసి ఉన్న నెహ్రూ అనుచరులు ముందు రంగా శిబిరంపై బాంబులు వేశారు. తనపై దాడి జరుగుతుందని గ్రహించిన రంగా శిబిరం అటువైపు ఉన్న గోడ దూకేందుకు ప్రయత్నించారు. అయితే బస్సులో ఉన్న దాదాపు వంద మంది నెహ్రూ అనుచరులు ఒక్క ఉదుటున కిందకు దూకి రంగా, అతని అనుచరులపై విరుచుకుపడ్డారు. గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న రంగాను కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. దాదాపు 30కి పైగా కత్తిపోట్లు రంగా శరీరంపై దిగాయి. ఆ విధంగా రంగా శకం అంతమయ్యింది. నెహ్రూ అనుకున్నది సాధించారు.[/font][/color][color=#333333][font=Georgia,]
[b]బెజవాడలో విధ్వంసం….[/b][/font][/color][color=#333333][font=Georgia,]


[left]రంగా హత్య జరిగిన తీరుతో కోస్తా తల్లడిల్లింది. కోస్తా జిల్లాలు కల్లోలానికి గురయ్యాయి. విజయవాడ కకావికలమే అయ్యింది. కమ్మ వర్గానికి చెందిన ఆస్తులపై కాపు వర్గీయులు దాడికి దిగారు. ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు. లూటీకి దిగారు. షోరూంలలో దొరికిన సామాన్లను దొరికినట్లు తీసుకెళ్లారు. పోలీసులు ఈ విధ్వంసాన్ని అరికట్టలేక పోయారు. టివీలు, ఫ్రిజ్ లు, ఏది దొరికితే అది… షోరూంలను పగులకొట్టి మరీ తీసుకెళ్లారు. మోయలేని సామాన్లను కృష్ణానది లో పడేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆస్తులన్నింటినీ తగులబెట్టారు. చివరకు ఈనాడు కార్యాలయంపైకి కూడా దాడులకు దిగారు.[/left]
[left]వందలాది కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారులు ఆగలేదు. దీందో బెజవాడలో తొలిసారి కర్ఫ్యూ విధించారు. [/left]

[b]కోస్తాలో కల్లోలం…..[/b]
[left]రంగా హత్యతో కోస్తా జిల్లాలు అట్టుడికి పోయాయి. ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా, కాపు సామాజిక వర్గం వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలియజేసింది. బెజవాడలో దాదాపు నాలుగు రోజుల పాటు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కోస్తా జిల్లాలకు దాదాపు 14 రోజుల పాటు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు ఆగిపోయాయి. రాష్ట్ర చరిత్రలో ఇన్నాళ్లు ఆందోళనలు కొనసాగిన సంఘటన ఇదే. బెజవాడలో దాదాపు నెల రోజుల పాటు సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. జనం నిత్యావసరాల కోసం బాధలు పడ్డారు. కోస్తా జిల్లాల్లో పెల్లుబికిన నిరసనతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రంగా హత్య కేసులో నిందితులను సత్వరమే అరెస్ట్ చేస్తామని చెప్పి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినా దాదాపు నెల రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఆందోళనలు ఆగలేదు.[/left]


[b]కాంగ్రెస్ కు ఊపిరినిచ్చిన రంగా హత్య….[/b]
[left]రంగాహత్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చింది. రంగా హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెల్లుబికింది. దీంతో అప్పటి ఎన్టీఆర్ సారధ్యంలోని తెలుగుదేశంపై వ్యతిరేకత ప్రారంభమైంది. కోస్తా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ రంగా విగ్రహాలు వెలిశాయి. కాపు వర్గానికి రంగా ఆరాధ్య దైవమయ్యాడు. 1989లో శాసనసభకు సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. రంగా హత్య కేసును సిబిఐకి అప్పగించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రంగా మృతి చెంది కూడా దోహదపడ్డాడని ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటుంటారు. రంగా స్థానంలో ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారికి టిక్కెట్ ఇచ్చింది. రంగా హత్యానంతరం బెజవాడ కొద్దిగా చల్లబడింది.[/left][/font][/color]

Posted

[color=#333333][font=Georgia,]
[b]రంగా వారసత్వం కోసం పోరు…[/b][/font][/color][color=#333333][font=Georgia,]
రంగా హత్యతో ఆయన వర్గం అనాథగా మారింది. తరువాత రంగా వారసత్వం కోసం రత్నకుమారి, రంగా సోదరుడు చలపతిరావు, ఆయన కుమారుడు శంతన్ తదితరులు అందుకునే యత్నం చేశారు. అయినా నెహ్రూ వర్గాన్ని ఢీకొట్టే పరిస్థితి లేకపోయింది. వారసులుగా ఎదిగే సమయంలోనే క్రష్ణలంకలో పట్టున్న కాట్రగడ్డ వెంకట నారాయణను శంతన్ కుమార్, యనమదల పూర్ణతో కలిసి కాట్రగడ్డను 1991లో హత్య చేశారు. ఆరోజుల్లో ఎవరో ఒకర్ని బలమైన నాయకుడ్ని హతమార్చితేనే హీరో కింద లెక్క. జనం గుర్తిస్తారనే భావన. శంతన్ సహచరుడైన పూర్ణను, ఆదినారాయణలను వెంకటనారాయణ సోదరుడు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు (బాబు) హతమార్చారు. అక్కడ నుంచి కాస్త విద్వేషాలు చల్లారి నగరంలో కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంకో పక్క 1980 ప్రాంతం నుంచి పూనూరి గౌతంరెడ్డి సీపీఐ నీడను రౌడీయిజం చెలాయిస్తూ వచ్చారు. ఆయనా కొన్ని హత్య కేసుల్లో ఉన్నారు. [/font][/color][color=#333333][font=Georgia,]
[/font][/color][color=#333333][font=Georgia,]
[b]అనాథగా మారిన రంగా వర్గం[/b][/font][/color][color=#333333][font=Georgia,]
రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన సతీమణి రత్నకుమారి ఎమ్మెల్యేగా ఉన్నా రంగా వర్గానికి పెద్దగా అండగా నిలవలేక పోయారు. 1989లో ఎమ్మెల్యేగా గెలిచిన రత్నకుమారి తర్వాత మరోసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. దీంతో రంగా వర్గం డీలా పడిపోయింది. నాయకత్వం వహించే నాధుడే కరవయ్యారు. ముఖ్యంగా 1970 నుంచి 2000 సంవత్సరాల వరకు కొనసాగిన రౌడీయిజం హత్యల పరంపరలో పాతికమందికి పైగానే నేలకొరిగారు. [/font][/color]
[color=#333333][font=Georgia,]
[size=5][b]కొనసాగుతోన్న నెహ్రూ ఆదిఫత్యం [/b][/size][/font][/color][color=#333333][font=Georgia,]
[size=5]మరో వైపు రంగా హత్యానంతరం దేవినేని నెహ్రూ తిరుగులేని నాయకుడిగా మారారు.రంగా వర్గానికి సరైన నాయకత్వం లేక పోవడంతో ఇక నెహ్రూ వెనుదిరిగి చూడలేదు.రంగా హత్య కేసులో దివంగత నాయకులు దేవినేని రమణ, చలసాని పండు (వెంకటేశ్వరరావు), కీలకపాత్రధారులు. తరువాత నెహ్రూ రంగా ముఖ్య అనుచరులైన ఇబ్రహీం తదితరులను హతమార్చి శత్రుశేషం లేకుండా చూసుకుంది. దీంతో నెహ్రూ ఆదిపత్యానికి తిరుగులేకుండా పోయింది. తన మార్గానికి ఎదురువస్తారనుకున్న కంచర్ల రామారావు, గొట్టం వెంకటేశ్వరరెడ్డి తదితరులు కూడా తర్వాతి కాలంలో నెహ్రూ వర్గం హతమార్చుతూ వవచ్చింది. దీంతో నెహ్రూకు ఎదురొడ్డే నాయకుడే బెజవాడలో లేకుండా పోయాడు. [/size][/font][/color]

Posted

endi ro last para highlight chesinav... last elections lo krishna lanka lo poti chesi hadavidi dobbudam anukunadu... janalu ongo pettaru ga ... idena tiruguledu ante.. @3$%

Posted

[quote name='GOLIMAR' timestamp='1346856384' post='1302431246']
endi ro last para highlight chesinav... last elections lo krishna lanka lo poti chesi hadavidi dobbudam anukunadu... janalu ongo pettaru ga ... idena tiruguledu ante.. @3$%
[/quote]

neeku ekkadoo..guchukunnatlundi..... @3$%

Posted

it's all old times.. ippudu bezawada lo anta scene ledu.. some of the efficient police commissioners suppressed all these rowdys..

×
×
  • Create New...