Jump to content

Recommended Posts

Posted

రాశ నిస్పృహలో  కూరుకొనిపొయిన  తెలుగుదేశం  పార్టీకి ప్రాణం పోసి  ఆ పార్టీలో తిరిగి ఆశలు చిగురింపాచేయడంలో నందమూరి వారసులు బాలకృష్ణ జూనియర్ ఎన్. టి. ఆర్. ల కృషి గురించి ప్రస్తావించక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తరువాతచిరు ప్రభంజన లో  కొట్టుకొని పోతుందని అందరు బావించారు.

కాంగ్రెస్ పార్టీ మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించింది.  నిరాశలో ఉన్న పార్టీలో జవ సత్వాలు  నింపి  ఎన్. టి. ఆర్. స్థాపించిన పార్టీకి పూర్వ వైభవం  సంత రింప చేయడం కోసం  ఎన్. టి. ఆర్. వరసలు రంగంలోకి దిగిపార్తీకి అండగా నిలిచారన్నది  నగ్న సత్యం.

జూ. ఎన్. టి. ఆర్. పార్టీ తరుపున ప్రచారంలోకి దిగిన తరువాత పార్టీలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.  జూనియర్ లో ఎన్. టి. ఆర్. ఆత్మ ప్రవేశించి తన మాటలను తన మనవడి నోట పలికించడా అని అనిపించింది.  అతని ప్రసంగంలో ఎంతో జోష్ ఉంది. ఉద్వేగం తో ప్రజలను ఆకట్టుకునే విధంగా అతను చేసిన ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేశాయి.

ప్రమాదానికి  గురై ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్న జూనియర్ సోమవారం బెడ్ పై పడుకొని చేసిన ప్రసంగం కూడా ఓటర్లపై బాగానే పని చేసినట్లు గురువారం జరిగిన పోలింగ్ సరళిని గమనిస్తే  అర్థం అవుతుంది.

Posted

Ippudu vellu pranam posaru next vella pranam thesthadu Chandu gadu " memalani vadulanu bommali vadulanu };_"

×
×
  • Create New...