kingmakers Posted April 17, 2009 Report Posted April 17, 2009 అబ్బో రాజు గారు బలే ఎత్తు వేసారు ఎన్నికలు అవుతూనే అని పొగిడారు కొందరు. అది ఎత్తో తనకు తానె తీసుకొన్న గోతో ఒక నెలలో తెలుస్తుంది. పోయిన ఎలక్సన్లప్పుడు ఇలాగే ఓ కూటమి ఇంతకన్నా భీకరంగా తెలంగాణా కంకణం కట్టుకొని తిరిగారు. ఈయన ఎత్తే నిజమైతే అప్పుడు కోస్తా రాయలసీమలో సమైక్య వాదులకు గుత్తంగా సీట్లు వచ్చి ఉండాలి. మరి ఎందుకు రాలేదు? కోస్తా మరియు తిరుపతి రియల్ ఎస్టేటు వ్యాపురుల ఒత్తిడితో తెలంగాణాకు నిలువంటారు. మరో సారి భాగ్యనగర రియల్ ఎస్టేటు వ్యాపురుల ఒత్తిడితో అడ్డం అంటారు అనే విషయం సీమ కోస్తా జనాలకు బాగా తెలుసు. ఇక తెలంగాణా వాళ్ళు ముందు ముందు, నగదు బదిలీ పధకం పక్కాగా జరిగితే ఆ తెలంగాణా జపం జేసే వారిని పట్టించుకోక పోవచ్చు. మొదటి ధపా పోలింగు పూర్తీ గాక మునుపే ఈ విధంగా మాట్లాడి గాంధీ భవన్ లో సంబరాలు జరిపినా సీమ కోస్తా వాళ్లకి బాగా అర్థం అయ్యిన్దేమంటే తెలంగాణలో ‘చెయ్యి; బాగా కాలింది నగదు బదిలీ పధకంతో, ఆ మంట తోనే ఆ పధకానికి మసిబూయడానికి ఈ విధంగా మాట్లాడు తున్నారు అని.
Recommended Posts