dalapathi Posted October 15, 2012 Report Posted October 15, 2012 [img]http://missiontelangana.com/wp-content/uploads/2012/10/black-balloons.jpg[/img] తెలంగాణ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తున్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు విన్నూత్న తరహాలో నిరసన తెలపాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక నిర్ణయించాయి. ప్రధాని పర్యటన ఆకాశమార్గాన హెలికాప్టర్ ద్వారా జరుగుతుండటంతో తెలంగాణవాదుల నిరసన ఆయనకు చేరాలని ఆకాశంలోకి వేలాది నల్ల బెలూన్లను విడుదల చేసే కార్యక్రమం జరుపుతున్నాం. 16 అక్టోబర్ 2012 నాడు మధ్యాహ్నం 1:00 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణవాదులు ఈ నల్ల బెలూన్లను విడుదల చేస్తారు. [b]ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యులు:[/b] - ప్రొఫెసర్ కోదండరాం (తెలంగాణ జేయేసి చైర్మన్ ) - దేవీప్రసాద్ (తెలంగాణ ఎన్.జి.ఓ ల సంఘం అధ్యక్షుడు) - అల్లం నారాయణ (సంపాదకులు నమస్తే తెలంగాణ) - రమణ (తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్) - ఘంటా చక్రపాణి (సామాజిక విశ్లేషకులు) - డిపి రెడ్డి (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం – ఇండియా అధ్యక్షుడు) - బాల్ రెడ్డి (తెలంగాణ ఆత్మగౌరవ వేదిక)
Recommended Posts