Jump to content

Florida Beauty Parlor Lo Shooting Anta


Recommended Posts

Posted

Edi emi paythyam raa baabu

కాసెల్‌బెరీ, అక్టోబర్ 20: ఫ్లోరిడాలోని కాసెల్‌బెరీలో గల ఒక బ్యూటీ పార్లర్‌లోకి ఒక వ్యక్తి దూసుకుపోయి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి ఆ సమీపంలోని ఒక స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడ అదే తుపాకితో తనను తాను కాల్చుకుని మరణించాడు.

ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి పేరు బ్రాడ్‌ఫోర్డ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పులలో ఆ బ్యూటీ పార్లర్ మేనేజర్ మార్షియా సాంటియాగో గాయపడ్డారు. బ్రాడ్‌ఫోర్డ్, మార్షియా ఒక కేసులో పరస్పరం కక్షీదారులుగా ఉన్నట్టు తెలుస్తున్నది. మొన్నీమధ్యే బ్రాడ్‌ఫోర్డ్‌ను కట్టడి చేయవలసిందిగా మార్షియా కోరినట్టు తెలుస్తున్నది. చూస్తుంటే ఇదేదో ఇంటి గొడవలాగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం నాడు బ్రాడ్‌ఫోర్డ్ ఈ కేసులో కోర్టుకు హాజరు కావలసి ఉంది. అందుకు రెండు గంటల ముందు అతడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

సంఘటన జరిగిన వెంటనే లాస్ డొమినికానాస్ ఎం అండ్ ఎం సెలూన్ అనే ఈ బ్యూటీ పార్లర్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హంతకుడు తుపాకి పట్టుకుని ఆవేశంగా అరుచుకుంటూ పార్లర్‌లోకి వచ్చాడని, అంతటితో ఇద్దరు మహిళలు రెస్ట్ రూమ్‌లోకి, మరొకరు బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తున్నది. బ్రాడ్‌ఫోర్డ్‌పై గతంలో రోడ్ ఐలాండ్‌లో అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఘటనలో మృతి చెందినవారిలో ఇద్దరు మహిళలు కస్టమర్లు అని, ఒకరు పార్లర్ ఉద్యోగి అని తెలుస్తున్నది. పార్లర్ మేనేజర్‌ను హత మార్చడానికే హంతకుడు వచ్చాడని, అయితే ఆమెకు ఐదు చోట్ల తూటాలు తగిలాయని, ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారని తెలుస్తున్నది.

Posted

Anoos kuda Miami daggare kada....oka 60 miles dooram lo :3D_Smiles: :3D_Smiles:

Posted

evaro amayi baaga makeup vesukuni veeni mosam chesinatundi, baaga feel ayipoyaadu

×
×
  • Create New...