Jump to content

Finally C B N Accepted Y S R Arogyasri


Recommended Posts

Posted

ర్నూలు, అక్టోబర్ 19,ఆంధ్రజ్యోతి: "ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని రకాల జబ్బులకే వైద్యం అందుతోంది. కానీ, టీడీపీ అధికారంలోకి వస్తే, దానికంటే మెరుగైన పథకాన్ని అమలు చేస్తాం. సమగ్ర ఆరోగ్య వైద్య పథకాన్ని ప్రవేశపెడతాం. దానిని ఎక్కువ వ్యాధులకు వర్తించేలా చేస్తాం. డెంగ్యూ వంటి విష జ్వరాలకు కూడా ఆ పథకం వర్తిస్తుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన జనం.. అప్పట్లో ఎన్‌టీఆర్ స్థాపించిన టీడీపీకి నీరాజనం పలికారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు.

పాదయాత్ర 18వ రోజైన శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాలినడక సాగించారు. శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచీ చంద్రబాబు తారు రోడ్డు పక్కనే ఉన్న మట్టి రోడ్డుపైనే నడక సాగించారు. కాళ్ల నొప్పుల నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు మొత్తంగా 17 కిలోమీటర్లూ ఆయన మట్టి రోడ్డుపైనే పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వికలాంగులు తమ కష్టసుఖాలను ఆయనతో పంచుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వికలాంగులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వస్తే వారికి రూ.వెయ్యి కోట్లతో బడ్జెట్ అమలు చేస్తామని, ఆ కార్పొరేషన్‌కు చైర్మన్, కార్యదర్శులు ఆ వర్గం నుంచే ఉంటారని, వికలాంగులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమాను అమలు చేస్తామన్నారు. వికలాంగులను ఏ రకంగా అవమానించినా ప్రత్యేక చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. వికలాంగులకు సంబంధించిన లక్షా 60 వేల పింఛన్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితంలో అంధకారం నింపిందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ విధానాలతో చాలా మంది వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు మరింత మేలు చేసి పెద్ద మాదిగను అనిపించుకుంటానన్నారు. "మీ వద్దకు వస్తున్నా. మీ కష్టాలు తెలుసుకుంటున్నా. ఈ సమయంలో నేను మీ కోసం ఏమి చేయాలో చెప్పండి. మీరు నాకు సలహాలు ఇవ్వండి. నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆదరిస్తే మీకు అండగా ఉంటా'' అంటూ చంద్రబాబు ప్రజలతో మాట్లాడుతున్న ప్రతిసారి అభ్యర్థిస్తున్నారు.

[b]కాంగ్రెస్ దోమలతో జబ్బులు..[/b]
రాష్ట్రంలో అవినీతికి మారుపేరు అయిన కాంగ్రెస్ నేతల మాదిరే కాంగ్రెస్ దోమలు కుట్టి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరెంట్ కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయన్నారు. జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనేనని, పొదుపు సంఘాల ఏర్పాటు, వెలుగు, దీపం, రివాల్వింగ్ ఫండ్, మధ్యాహ్న భోజన పథకం వంటివి తామే ప్రారంభించామని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు ఉపాధి పేరుతో నిధులు కాజేస్తూ పంట నష్టపరిహారం కూడా తినేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా కాళ్ల నొప్పితో బాధ పడుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబును పరామర్శించేందుకు పలువురు టీడీపీ రాష్ట్ర నాయకులు వచ్చారు. చంద్రబాబు పాదయాత్రకు చిత్తూరు, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 10 బస్సుల్లో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Posted

[img]http://i1354.photobucket.com/albums/q681/mutamesthri/raghavendra13_zpsf6217e8a.gif[/img]

×
×
  • Create New...