Jump to content

Rasa Hurdayuluku Aasabangam


Recommended Posts

Posted

BrahminismMovie Banned ....rasa hurdayuluku Aasabangam

ఎ వుమెన్ ఇన్ బ్రామ్మణిజం' సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవదన శుక్రవారం రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టం కింద ఈ చిత్ర ప్రదర్శన ను నిలిపివేయాలని కోరారు. ఈ సినిమా బ్రాహ్మణ స్త్రీల ను కించపరచేలా, తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాల నుంచి, ఇతరత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కాకుండా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ తదితరులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణకు శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు.

వీరి ఆందోళనలతోపాటు.. ఈ సినిమాను చూసిన అధికారులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణం గా మంత్రి అరుణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా పై ఒక కమిటీని వేసి అవసరమైన, వారు సూచించిన కట్‌ల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

×
×
  • Create New...