Jump to content

Maro Rakshasuduuu Thappu Ekada Undi Asaluu


Recommended Posts

Posted

[b] ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోసి చంపేశాడు[/b]

[color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4]అదిలాబాద్/హైదరాబాద్: తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసిన సంఘటన అదిలాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని తిర్యానీ మండలం గుండాలలో ఓ యువకుడు తనను ప్రేమించట్లేదని అదే గ్రామానికి చెందిన యువతిని కత్తితో పొడిచి పారిపోయాడు.
స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. పక్క గ్రామంలో ఓ ఉత్సవానికి హాజరై వస్తున్న మృతురాలు ప్రమీలను ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అడ్డగించిన ప్రేమోన్మాది శ్రీను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని అత్తమూరు సత్యభాస్కర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎనిమిదో తరగతి చదువుతున్న దుర్గా భవాని, పదో తరగతి చదువుతున్న సందీప్‌లు మరికొంతమంది క్రీడాకారులతో కలిసి కాకినాడలో జరిగిన క్రీడల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కరప దగ్గర ఓ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ వెనుక ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతనిని బండరాళ్లతో మోది చంపినట్లుగా అనుమానిస్తున్నారు.[/size][/font][/color]

×
×
  • Create New...