Jump to content

Thoodella Lolli


Recommended Posts

Posted

[img]http://www.sakshi.com/newsimages/contentimages/11122012/Babu-Daggubati11-12-12-1129.jpg[/img]





పార్లమెంట్‌లో దివంగత ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిపాదన తోడల్లుళ్ల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఎన్టీఆర్ అల్లుళ్లు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు విగ్రహం పేరుతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మామగారు బతికుండగా పదవి లాగేసుకుని ఆయనను మానసిక క్షోభకు గురిచేసిన అల్లుల్లిద్దరూ నేడు పెద్దాయన ప్రతిమ కోసం పోట్లాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విగ్రహ ఘనత తనదంటే తమదని డబ్బా కొట్టుకుంటున్నారు.

దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో నారా, దగ్గుబాటి మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు కేంద్రమంత్రి పురందేశ్వరి అడ్డుపడ్డారని ఆరోపించి చంద్రబాబు రాజకీయానికి తెరతీశారు. తమ మామగారి ప్రతిమను పెట్టించేందుకు తానేంతగానో పాటుపడితే ‘చిన్నమ్మ’ తన అధికార పలుకుబడితో పుల్ల వేశారని ఆరోపించారు. బాబుగారి మాటలను ఆయన భజనపరులు అతి సహజంగానే సమర్థించారు.

తన భార్యపై నిందలు మోపిన బాబు బండారం బయటపెట్టేందుకు డాక్టర్ దగ్గుబాటి గొంతు విప్పారు. చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు జరగలేదో వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ‘‘అధికారం చేతిలో ఉన్నప్పుడు నీకు ఎన్టీఆర్ గుర్తు లేడా? ఆ తొమ్మిదేళ్లలో గుడ్డిగుర్రం పళ్లు తోముతున్నావా? కుంభ కర్ణుడిలా నిద్రపోయావా? కుంభకర్ణుడైనా ఆర్నెల్లకోసారి నిద్రలేచేవాడు. నీవు తొమ్మిదేళ్లూ నిద్ర పోయావే’’ అంటూ కడిగిపారేశాడు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు గురించి దివంగత స్పీకర్ బాలయోగిని తాను రెండుసార్లు కలిశానని, ఆ పని చేస్తే బాబు కోప్పడతారని ఆయన చెప్పారని దగ్గుబాటి అన్నారు. బాబు నైచ్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు.

పురందేశ్వరి 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎన్నోసార్లు ప్రయత్నించగా చంద్రబాబు రాజకీయ కుట్రలతో అడ్డుకున్నారని దగ్గుబాటి వివరించారు. టీడీపీలో ఎన్టీఆర్ బొమ్మలేకుండా చేసేందుకు బాబు ఎంతో ప్రయత్నించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటున్న బాబు, తాను అధికారంలో ఉండగా అందుకు ప్రయత్నించలేదేమని సూటిగా ప్రశ్నించారు. కనీసం శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంపై జీఎమ్మార్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు షరతు విధించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు గురించి ముఖ్యమంత్రిగా బాబు ఒక్క లేఖైనా రాసుంటే బయట పెట్టాలంటూ సవాలు చేశారు. తోడల్లుడి సవాల్‌కు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి!

×
×
  • Create New...