Jump to content

Congress Might Go With Option 6 Of S K C!


Recommended Posts

Posted

[color=#ff0000]అదే ప్రధాన ఎజెండాగా అఖిలపక్ష భేటీ?
ఆరో ప్రతిపాదనపై అధ్యయనం చేస్తున్న షిండే
తెలంగాణ అభివృద్ధిపై దృష్టి.. ‘ప్రత్యేకం’ పక్కకు
ప్రస్తుతానికి గట్టెక్కేందుకు యూపీఏ ఎత్తు[/color]

[img]http://sakshi.com/newsimages/contentimages/14122012/13-B-14-12-12-16794.jpg[/img]న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి డబ్ల్యూ చంద్రకాంత్: తన పాలిట పెను సమస్యగా పరిణమించిన ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం’ డిమాండ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తోందా? మరోసారి ‘సామాజిక, ఆర్థికాభివృద్ధి’ కార్డు సాయంతో తాత్కాలికంగానైనా గండం గట్టెక్కాలన్న అభిప్రాయానికి వచ్చిందా? అవుననే అంటున్నాయి కేంద్ర హోం శాఖలోని అత్యున్నత వర్గాలు! అందులో భాగంగా శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కేంద్రం మరోసారి దుమ్ము దులుపుతోందని సమాచారం. ముఖ్యంగా నివేదికలోని ఆరో ప్రతిపాదనపై బాగా దృష్టి సారించినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణకు రాజకీయ సాధికారత, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధతతో కూడిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని ఆరో ప్రతిపాదనలో శ్రీకృష్ణ కమిటీ సూచించడం తెలిసిందే.

డిసెంబర్ 28న రాష్ట్ర రాజకీయ పార్టీలతో తలపెట్టిన అఖిలపక్ష భేటీలో దీన్నే ప్రధానంగా చర్చకు పెట్టవచ్చని వివరిస్తున్నాయి. ఆ ప్రతిపాదనలో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యం కాగలవని భావిస్తున్న ‘సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి’ వంటి సూచనలను తొలుత అమలు చేయడం, తద్వారా తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం తమ అభిమతమని పార్టీలకు కేంద్రం వెల్లడిస్తుందని సమాచారం! ఇలాంటి అంశాలపై తొలుత దృష్టి సారించి, ఆ తర్వాత ‘ప్రత్యేక రాష్ట్రం’ వంటి కీలక రాజకీయాంశాల వైపు వెళ్లాలన్నది తమ అభిమతమని వివరించే ప్రయత్నం చేస్తుందంటున్నారు! కానీ పైకి ఏం చెప్పినా, ప్రత్యేక రాష్ట్రం వంటి కీలక డిమాండ్‌ను ప్రస్తుతానికైనా సరే పక్కన పెట్టే ప్రతిపాదనకు ఏ మేరకు మద్దతు లభిస్తుందో చూడాల్సిందేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

పైగా విపక్షాల కంటే ఎక్కువగా స్వపక్షంలోని తెలంగాణ నేతల నుంచే ప్రత్యేక సెగలు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా తాకుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పై నుంచి పక్కాగా ‘సూచనలు’!: తెలంగాణ డిమాండ్ పరిష్కారానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక చేసిన ఆరో ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రస్తుతం క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలన్నింటికీ ఆమోదనీయ రీతిలో వాటిని అఖిలపక్షంలో ప్రస్తావించాలన్నది ఆయన అభిమతమని సమాచారం. అయితే ఆ క్రమంలో మరెలాంటి కొత్త తలనొప్పులూ తలెత్తకుండా చూసుకోవాలని షిండేకు స్పష్టమైన ‘సూచనలు’ అందాయంటున్నారు. అందుకే శ్రీకృష్ణ నివేదికను, దానితో పాటు రాష్ట్రంలోని క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ‘‘తెలంగాణ అంశాన్ని, స్థానికంగా నెలకొన్న పరిస్థితుల్ని ప్రధానంగా రాజకీయ కోణంలోనే ఇప్పటిదాకా కేంద్రం చూస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రక్రియ మొత్తాన్నీ పునఃప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇకపై మేం చెప్పబోయే, చేయబోయే వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకోవాల్సిందిగా స్పష్టమైన సూచనలందాయి. అందుకే ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది. ఏదో ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు కాదు. నిర్ధారిత కాలావధిలో ఒక పరిష్కారాన్ని చూపేందుకు కూడా కాదు. కేవలం సమస్యకు ప్రస్తుతానికి మెరుగైన, అంటే అభివృద్ధిపరంగా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో చూడటమే అఖిలపక్షం లక్ష్యం. ఇప్పటిదాకా రాజకీయాంశానికే ప్రాధాన్యతనిచ్చి మిగతా వాటన్నింటినీ పక్కన పెడుతూ వచ్చాం. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ప్రతి ఒక్కరికీ అంగీకారయోగ్యమైన అంశాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధికి సంబంధించిన సూచనలు. కాబట్టి మిగతా వాటికంటే ముందుగా అలాంటి వాటిపై ఎందుకు దృష్టి సారించకూడదు? వాటిపై ఎందుకు చర్చించకూడదు? ఇదే విషయాన్ని అఖిలపక్షంలో పార్టీల ముందుంచడం జరుగుతుంది. అంతే’’ అని సదరు వర్గాలు చెప్పుకొచ్చాయి. మున్ముందు రాహుల్‌గాంధీ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర చేపట్టాక అంతిమ ‘రాజకీయ’ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయాలన్నది కేంద్రం తాజా వైఖరిలోని ఆంతర్యమని తెలుస్తోంది.

సంస్కరణల కోణం కూడా...

కేంద్రం తాజా వైఖరి వెనక ‘సంస్కరణ’ల ఎజెండా ప్రభావం కూడా ఉందంటున్నారు. సంక్షేమ పథకాలకు దీటుగా సంస్కరణలను కూడా పట్టాలకెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న యూపీఏ సర్కారు, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వంటివి తన వేగానికి కళ్లెం వేయకుండా చూసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘చిన్న రాష్ట్రాల వంటి అంశాలకు ఇప్పుడు ఉన్నపళంగా ప్రాధాన్యతనిస్తే.. సంస్కరణల దిశగా కేంద్రం చేపట్టిన తాజా చర్యలన్నీ ఒక్కసారిగా మందగించే ప్రమాదముంది’’ అన్నది హోం శాఖ వర్గాల వాదన తాలూకు సారాంశం!

[color=#ff0000]శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలేంటి?

1.ఏ చర్యలూ తీసుకోకుండా యథాతథ స్థితి కొనసాగించాలి
2.రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టాలి. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. రెండు రాష్ట్రాలూ వేర్వేరు రాజధానులను అభివృద్ధి చేసుకోవాలి.
3.రాష్ట్రాన్ని రాయల-తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించాలి. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఉంచాలి.
4.రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించాలి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విస్తరించాలి. తద్వారా కోస్తాంధ్రలోని గుంటూరు, రాయలసీమలోని కర్నూలు జిల్లాలతో దానికి భౌగోళిక సంబంధముండేలా చూడాలి.
5.ప్రస్తుత సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజించాలి. తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి. సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి.
6.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంతానికి రాజకీయ సాధికారత, సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. దానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలి.[/color]

Posted

[img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]

Posted

[quote name='Force' timestamp='1355439177' post='1302947644']
option 5 [img]http://gifsoup.com/view3/4271583/fsdagre-o.gif[/img]
[/quote]
%$#$

Posted

[quote name='BenzCircle' timestamp='1355440008' post='1302947691']
%$#$
[/quote]
[img]http://lh5.ggpht.com/-S3edE4AFWLE/Tnyt-VoHJ7I/AAAAAAAAEWE/4gda4yj5Umc/Brahmi-2.gif[/img]

Posted

[quote name='Little Star' timestamp='1355438944' post='1302947620']
Option 5
[/quote]
neku cheppa kada mama appude...see from a higher level..option 6 is the ideal solution

Posted

[quote name='shagun' timestamp='1355440276' post='1302947705']
neku cheppa kada mama appude...see from a higher level..option 6 is the ideal solution
[/quote]

Higher level nunchi chusinam ayina option 5 kavallee

Posted

[quote name='shagun' timestamp='1355440276' post='1302947705']
neku cheppa kada mama appude...see from a higher level..option 6 is the ideal solution
[/quote]nuvvu nenu eppudu matladukunnam [img]http://i83.photobucket.com/albums/j312/asampso2/leave-in-disgust.gif[/img]

×
×
  • Create New...