Jump to content

Midhunam Cinema Ela Undho Cheptha Randi


Recommended Posts

Posted

[center][img]http://4.bp.blogspot.com/-s-_eKQ0HJEo/UNPAU4tZk5I/AAAAAAAACNk/Wzjn7CNurpc/s400/midhunam.jpg[/img][/center]

[size=5][color=#333333]ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇంత అద్భుతమైన సినిమా.. బాగుందనో.. లేక బాగోలేదనో.. చెప్పడానికి నేను ఈ రివ్యూ రాయడం లేదు. ఓ మంచి సినిమాను ఆదరిస్తే.. మరో నలుగురు.. ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతారా అనేది నా ఆలోచన. ఎప్పుడూ కమర్షియల్ గోలలో పడి.. బాక్సాఫీసు రికార్డుల కోసం కక్కుర్తి పడే జనాలకు దూరంగా.. వారి ఆలోచనలకు కూడా అందకుండా తీసిన సినిమా ఇది.[/color]

[color=#333333]సినిమా నచ్చితే.. పది మందికి చెప్పండి.. నచ్చకపోతే.. వెయ్యి మందికి చెప్పండని.. తనికెళ్ల భరణి పదే పదే టీవీ ఛానళ్లలో చెప్పారు. దీన్ని బట్టే అర్థమైపోతోంది..ఆయనకు ఈ సినిమాపైనా, తన దర్శకత్వంపైనా, జనాల సున్నితత్వం, వాళ్లలోని మానవత్వం, తల్లిదండ్రులంటే ఉన్న గౌరవంపై ఎంత నమ్మకమో.[/color]

[color=#333333]మిధునం... ఇది నిజంగా వెండితెరపై మిధునం. శ్రీరమణ గారు రాసిన ఓ చిన్న కథ ఆధారంగా రెండు గంటల సినిమా తీయడమంటే నిజంగా ఓ దుస్సాహసమే. ఎంతో మంది ఆలోచించినా చివరకు తనికెళ్ల గారు.. దాన్ని తీసి.. చూపించారు. కేవలం రెండంటే రెండే పాత్రలు.. మూడో మనిషే ఈ సినిమాలో కనిపించడంటే మీకు ఆశ్చర్యం కలుగకమానదు. అంతే కాదు.. సినిమా అంతా ఒకే ఒక్క ఇంట్లోనే సాగుతుంది.[/color]

[color=#333333]ఇక సినిమా విషయానికి వస్తే.. భార్యాభర్తలైన అప్పదాసు.. బుచ్చిలక్ష్మి మధ్య ప్రేమానురాగాలను.. ఒకరంటే.. ఒకరికి.. ఉన్న ఆప్యాయతను అద్భుతంగా చూపించారు. ఐదుగురు పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత.. తమ జీవిత చరమాంకంలో ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఒకరంటే.. ఒకరు.. ఎంత ప్రాణప్రదంగా ఉంటారో.. తనికెళ్ల కళ్లకు కట్టినట్టు చూపించారు. ఊరు అవతల.. ఓ విశాలమైన ఇంటిని నిర్మించుకుని, అందులో వాళ్లకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా పండించుకుంటూ.. ఏ చీకూ చింతా లేకుండా.. ఎలా ఉండొచ్చో కూడా చూపించారు. ఈ రణగొణ ధ్వనులు, కృతకమైన నవ్వులు, కాలుష్యం, ట్రాఫిక్ వంటి వాటన్నింటికీ దూరంగా.. మలిసంధ్యను ఎంత ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చో మిధునం చూపించింది. సినిమా ఆద్యంతం మన అమ్మానాన్నలు.. ఏదో ఒక సందర్భంలో మనకు తప్పక కనిపించి తీరాల్సిందే. అందులో సందేహమే లేదు.[/color]

[color=#333333]తిండిపై అమితమైన ప్రేమను కనబర్చడమే కాదు.. తిండి ప్రియుడిగా కూడా.. బాలసుబ్రమణ్యం గారు.. అద్భుతంగా నటించారు. బొద్దుగా ఉన్న ఆయన రూపం కూడా.. పాత్రకు అతికినట్టు సరిపోయింది. నిత్య సంధ్యలు చేయడంతో పాటు... వాళ్ల ఇంటి పెరట్లో మొక్కలు పండించడం, ఆవు పాలు పితకడం.. వంటి పనులన్నీ చేస్తూ.. బాలు గారు రోజంతా కాలక్షేపం చేస్తారు. అంతేకాదు చెప్పులు కుడతారు, దూది ఏకుతారు, బంగారం పని చేస్తారు.. అబ్బో.. ఆయన సకల కళా వల్లభుడిగా ఇందులో కనిపిస్తారు. ఆయన చేసే ప్రతీ చేష్టా నవ్వు తెప్పిస్తుంది.[/color]

[color=#333333]ఇక లక్ష్మి గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుచ్చిలక్ష్మిగా.. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు. అనువైన భార్య అంటే ఎలా ఉండాలో.. జనాలకు చూపించారు. భర్తపై కోప్పడ్తూనే.. ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ... ఆనందం పొందుతూ ఉంటారు లక్ష్మి. పూజలు, పునస్కారాలు, మౌనవ్రతాలే కాదు.. ఆమె చేతి వంటంటే.. బాలు గారు.. వేళ్లు కొరుక్కుంటారు. ఆమె చేసిన ప్రతీ వంటను ఆద్భుతః అంటూ.. లొట్టలు వేస్తూ తింటారు. అంతే కాదండోయ్.. ఈ సినిమాలో తెలుగు వంటకాలన్నీ చూస్తుంటే.. నోరు ఊరక మానదు. (మేమైతే.. ఈ సినిమా అయిన తర్వాత.. ఓ తెలుగు రెస్టారెంట్ కు వెళ్లి.. తెలుగు ఘుగఘుమలు లాగించాలని నిర్ణయించుకున్నాం.. కానీ.. అంతటి భాగ్యం మనకెక్కడ ఉంటుంది చెప్పండి.. ? )[/color]

[color=#333333]రేడియోలోని వందేమాతరంతో రోజు మొదలుపెట్టడం చూస్తే.. మనకు మన పాత రోజులు కొన్నైనా గుర్తువస్తాయి. అందులోనే మన్ చాహే గీత్, సంస్కృత వార్తలు.. కూడా మనలో ఉన్న పాత వాసనలను తట్టిలేపుతాయి. అదృష్టం కొద్దీ.. అప్పదాసు ఇంట్లో టీవీ లేదు... ![/color]

[color=#333333]జొన్నవిత్తుల గారు.. కాఫీపై రాసిన... ఓ పాట నవ్వుతెప్పించాల్సిందే. పొద్దున్నే కాఫీ పడకపోతే జనాలు పడే తాపత్రయం మొదలు.. జీవితంలో కాఫీకి ఉన్న ప్రాధాన్యతను చక్కగా వర్ణించారు.[/color]

[color=#333333]అంతేకాదు.. ఆవకాయ, గోంగూర ఉండగా.. ఈ పిచ్చి పిజ్జాలు, బర్గర్లూ.. మనకెందుకు అంటూ.. బాలూ గారు.. ఓ చిన్న పాట మాత్రమే పాడారు... (సినిమా అంతటికీ...ఒకే ఒకటి.. అది కూడా చిన్నదే ) ఓపెనింగ్ పాటతో జేసుదాసు గారు.. మిధునానికి మరింత సొబగులు అద్దారు.[/color]

[color=#333333]ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా సరుకే ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరంటే.. ఒకరికి ఉండే అభిమానం.. చిన్న చిన్న సరదాలు, రొమాంటిక్ సన్నివేశాలు... మిధునంలో చాలానే చూపించారు.[/color]

[color=#333333]సినిమా ఆఖరి సన్నివేశం.. కాస్త హృద్యంగా ఉంటుంది. నేను సుమంగళిగా పోవాలని.. బుచ్చి లక్ష్మి, కాదు.. నేను ముందు పోతానంటూ.. బాలూ.. చెప్పడాన్ని చూస్తే.. బాధేస్తుంది. ఒకరు లేకపోతే.. మరొకరు.. ఎలా ఉంటారు.. ? ఎలా ఉండగలుగుతారు ? అనే సున్నితాంశాలు ఖచ్చితంగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కానీ లాస్ట్ సీన్ చూసి.. అవాక్కవుతాం.. కళ్లనీళ్లు పెట్టుకుంటాం.. ![/color]
[color=#333333]చివర్లో ఓ మంచి సినిమా చూశామన్న తృప్తితో బయటకు వస్తాం.[/color]

[color=#333333](ఖర్మేంటంటే.. ఇన్ని వందల థియేటర్లు ఉన్న హైదరాబాద్ లో కేవలం ఒకే ఒక్క థియేటర్ లో ఈ సినిమా ఆడుతోంది. అది కూడా.. రామోజీరావు గారి ఉషామయూరి థియేటర్ లో మాత్రమే. కొన్ని మల్టీప్లెక్సుల్లో ఒకటి రెండు షోలు ఆడుతున్నాయి)[/color]

[color=#333333]ఇది నిజంగా మన అమ్మానాన్నల కథే.. అంతే చివర్లో నేను చెప్పగలిగింది. మీకు కూడా సినిమా నచ్చితే.. ఓ పది మందికి చెప్పండి. ఇటువంటి సినిమాలను బతికించండి. :)[/color][/size]

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kiran karthik

    14

  • mrudhula99

    8

  • gundubabu

    7

  • biscuitRAJA000

    7

Popular Days

Top Posters In This Topic

Posted

source eyatam marichipoyinava [img]http://www.bewarsetalk.net/discus/movieanimated1/bemmi.sarle.gif[/img]

Posted

Midunam grahanam cinemalu chusentha sahanam opika inka raledhu va .

Posted

[quote name='gundubabu' timestamp='1356275671' post='1303004785']
Midunam grahanam cinemalu chusentha sahanam opika inka raledhu va .
[/quote]
prasa adirindi gundu [img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]

Posted

[quote name='mrudhula99' timestamp='1356275776' post='1303004788']
@gr33d @gr33d
[/quote]
[img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]

Posted

[quote name='kiran karthik' timestamp='1356275508' post='1303004778']
source eyatam marichipoyinava [img]http://www.bewarsetalk.net/discus/movieanimated1/bemmi.sarle.gif[/img]
[/quote]
kick ass torrents sSc_hidingsofa sSc_hidingsofa

Posted

[quote name='kiran karthik' timestamp='1356275834' post='1303004790']
[img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]
[/quote]
*(*(*

Posted

[quote name='mrudhula99' timestamp='1356276154' post='1303004795']
[img] br=[/img] [/quote]
[img]http://www.bewarsetalk.net/discus/movieanimated1/bemmi.sarle.gif[/img]

Posted

[quote name='biscuitRAJA' timestamp='1356275881' post='1303004791']
kick ass torrents sSc_hidingsofa sSc_hidingsofa
[/quote]
avuna mari mana bokubabu own review laga esadu [img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]

Posted

[quote name='mrudhula99' timestamp='1356276154' post='1303004795']
[img]%20br=[/img] [/quote]
cinema nachinda review nachinda confirm sey [img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]

Posted

[quote name='mrudhula99' timestamp='1356275776' post='1303004788']
@gr33d @gr33d
[/quote]endi movie chusesinattu agreed antunav

Posted

[quote name='kiran karthik' timestamp='1356276565' post='1303004803']
cinema nachinda review nachinda confirm sey [img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]
[/quote]
[quote name='gundubabu' timestamp='1356276581' post='1303004805']
endi movie chusesinattu agreed antunav
[/quote]

movie baguntundhiii sure ga.... naku alanti movies istam..

Posted

[quote name='kiran karthik' timestamp='1356276545' post='1303004802']
avuna mari mana bokubabu own review laga esadu [img]http://i43.tinypic.com/2cwvjup.gif[/img]
[/quote]
prati vodu cinema review raseyadame[img]http://www.bewarsetalk.net/discus/movieanimated1/bemmi.sarle.gif[/img]

×
×
  • Create New...