Jump to content

‎desa Bhasha Landu Telugu Lessa


Recommended Posts

Posted

[color=#000000][font=Ramabhadra][size=6][background=rgb(255, 255, 255)]తెలుగు తేనె జుర్రుకుందాం తల్లి భాషలో తన్మయిద్దాం[/background][/size][/font][/color]
[color=#666666][font=tahoma][size=2][background=rgb(255, 255, 255)][b]Updated:[/b] December 27, 2012[/background][/size][/font][/color]


[color=#333333][font=arial][size=4][background=rgb(255, 255, 255)][url="http://news.suryaa.com/state/article-115349#"]Share on favorites[/url]|[url="http://news.suryaa.com/state/article-115349#"]Share on facebook[/url] [url="http://www.addthis.com/bookmark.php?v=250&pub=xa-4a93bc8950d047e3"][img]http://s7.addthis.com/static/btn/v2/lg-share-en.gif[/img][/url]

[img]http://www.suryaa.com/Main/Images/fontsize.gif[/img] [img]http://www.suryaa.com/Main/Images/fontsize_plus.gif[/img][/background][/size][/font][/color]

[color=#333333][font=Mallanna][size=4][background=rgb(255, 255, 255)][img]http://suryaa.com/gallery/2012/Dec/27/telugu-tene.jpg[/img](తిరుపతి నుంచి వాచస్పతి, సూర్య ప్రత్యేక ప్రతినిధి): అందరి కళ్ళలో ఆనందం... అనేక సంవత్సరాల విరామం తర్వాత తెలుగు గడ్డపైన, అందులోనూ విశ్వ వ్యాప్తంగా కోట్లాది మంది హైందవ అభిమానులకు ఆరాధ్య దైవమైన ఏడు కొండల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి వేదికగా నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల చరిత్రాత్మక ఆవిష్కర ణకు సర్వం సిద్ధమైంది. అందుకే అందరి కళ్ళలోనూ ఆనందం....1975లో హైదరాబాద్‌లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహాసభల విజయానికి అప్పటి మంత్రులు మండలి వేంకట కృష్ణారావు, భాట్టం శ్రీరామమూర్తి ఏ స్థాయిలో కృషి చేశారో, మండలి కుమారుడు, ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌, మంత్రి వట్టి వసంతకుమార్‌తో పాటు యావత్తు అధికార గణం అనేక వారాలుగా ఈ సభలు అట్టహాసంగా ప్రారంభం కావటానికి అహోరాత్రా లు కృషి చేసింది.

వారి కృషి ఫలించి మహాసభలు గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జగజ్జేగీ యమానంగా జరగనున్నాయి. ప్రధా న వేదికతోపాటు అనేక ఉప వేదికలను ఏర్పాటు చేసి ఐదు ప్రధాన అంశా లపై విస్తృతంగా చర్చించనున్నారు. జానపదం, రంగస్థలం, నృత్యం, సాహిత్యం, సంగీత విభాగాల పేరిట ఈ ఉపవేదికలను ఏర్పాటు చేశారు.

[color=#DB3434]రాష్టప్రతి చేతుల మీదుగా....[/color]
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహా సభలను రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ఉదయం 12 గంటలకు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాంగణం లో ప్రారంభిస్తారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సహా మంత్రులు, శాసనసభ్యులు, వరిష్ఠ నేతలు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇదే సందర్భంగా 14 మంది వివిద రంగాల ప్రము ఖులకు ఘనంగా సత్కారం జరుగుతుంది. తొలి రోజున ప్రారంభోత్సవ కార్య క్రమం ముగిసిన తర్వాత రావు బాల సరస్వతీ దేవి, పి.సుశీల, ఎస్‌.జానకి తది తరుల ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.

[color=#DB3434]తొలిరోజే ఆధునికం[/color]
[img]http://suryaa.com/gallery/2012/Dec/27/telugu-tene0.jpg[/img]సమకాలీన సాహిత్య పోకడలకు ప్రాధాన్యం ఇస్తూ తొలి రోజునే ఆధునిక కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. సుప్రసిద్ధ కవి, విమర్శకుడు డాక్టర్‌ ఎన్‌. గోపి అధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనంలో పలువురు ఆధునిక కవులు పాల్గొన బోతున్నట్టు నిర్వాహకులు కొందరు ఈ ప్రతినిధికి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి తెలుగు ప్రముఖులకు సన్మానాలు జరిగిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించ నున్నాయి. శోభానాయుడు, రాజారెడ్డి, రాధారెడ్డి, స్వప్న సుందరి కూచిపూడి నృత్యాలు, త్రిభువన విజయం పేరిట సాహితీ రూపకం కార్యక్రమం ఉంటాయి. త్రిభువన విజయానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అద్వర్యం వహించనున్నారు.

[color=#DB3434]పగలూ రాత్రీ తేడా లేదు[/color]
తిరుపతి పట్టణం అంతా విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా అలరా రుతోంది. ఏ మూల చూసినా ఏ సందు మొదట్లో చూసినా ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సూచికగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయి. కొద్దిగా చీకటి పడితే చాలు...పట్టణం అంతా ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్నది. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి పట్టణం యావత్తూ ప్రపంచ తెలుగు సభల వైభవాన్ని పుణికి పుచ్చుకున్నదా అన్నట్టు కనిపించింది. ఎస్వీ వర్సిటీలో ఏ ప్రాం తంలో చూసినా విద్యార్థి, విద్యార్థినీ వలంటీర్లు వందల సంఖ్యలో కనిపిస్తూ ఏర్పాట్ల విషయంలో సూచనలు తీసుకొని అమలు చేయటం కనిపించింది.

[color=#DB3434]ఒకవైపు ఇలా జరుగుతున్నా[/color]
[img]http://suryaa.com/gallery/2012/Dec/27/telugu-tene3.jpg[/img]తెలుగు సభలను విజయవంతం చేయాలన్న పట్టుదల అందరిలోనూ కనిపి స్తుంటే, పనులు మాత్రం చాలా చోట్ల నత్తనడకన సాగుతూ కనిపించాయి. వివిధ అంశాలపై ఏర్పాటు చేయాల్సిన స్టాళ్ళు ఇంకా తుది మెరుగులు దిద్దుకోనే లేదు. తెలుగు తల్లి ప్రాభవాన్ని ప్రతిబింబించే సైకత శిల్పం పని అలా నడుస్తూనే కనిపించింది.

మహర్షి సిద్ధేంద్రయోగి విగ్రహం ఇంకా తయారీ దశలోనే ఉంది. ప్రముఖులు రావటానికి ఇక కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ చాలా చోట్ల రోడ్డు డివైడర్లకు రంగులు వేస్తూ ఉండటం కనిపించింది. పనులు మందకొడిగా జరుగుతున్నట్టు ఉన్నాయని ఈ సభల నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న తెలుగు వర్సిటీ ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డిని పలకరించి నప్పుడు ఆయన అర్థం ఊ్య కానీ నవ్వు నవ్వారు.

[color=#DB3434]తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట[/color]
తొలి రోజు నుంచి ముగిసే రోజు దాక జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తెలుగు సాహితీ సంప్రదాయ ప్రక్రియలో అన్ని అంగాలను స్పర్శించే విధంగా రూప కల్పన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే దాదాపు కనుమరుగవుతున్నదని అందరూ భావిస్తున్న రంగస్థలం, జానపదం, సంప్ర దాయ నృత్యశైలీ రీతులకు పెద్దపీట వేస్తూ విస్తారమైన చర్చా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఆయా ప్రక్రియలలో లబ్ధ ప్రతిష్ఠులైన వారు భావి తరా లకు మార్గదర్శనం చేయనున్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ తరిగిపోతున్న తెలుగు ఒరవడి, సంప్రదాయాల ప్రాశస్త్యాన్ని ఇప్పటి తరాలకు వివరించి తట్టి లేపుతాయని, కనీసం ఇప్పటికైనా తెలుగు భాష పట్ల, సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆధునిక యువత కనీస అవగాహన కలిగి ఉంటుందని భావిస్తున్నట్టు కొందరు అధికారులు వ్యాఖ్యానించారు.[/background][/size][/font][/color]

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kondeti

    28

  • TENALI_TELUGODU

    4

  • sandy437

    1

  • Were_Wolf

    1

Popular Days

Top Posters In This Topic

Posted

manchi prakatana............maa telugu thalli ki mallepuu dandha ...maa kanna thalliki mangalarathulu

Posted

[quote name='Were_Wolf' timestamp='1356578608' post='1303018625']
@3$% @3$%
[/quote]


navuu yenduku vastundi [img]http://www.desigifs.com/sites/default/files/gallery_24383_15_371807_0.gif?1354745320[/img][img]http://www.desigifs.com/sites/default/files/gallery_24383_15_371807_0.gif?1354745320[/img]
dobbey ikkadi nundi[img]http://www.desigifs.com/sites/default/files/Brahmi_0.gif?1350486327[/img]

Posted

[color=#5D8900][font=Georgia, sans-serif][size=6][center]మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఛాయాచిత్రాలు[/center][/size][/font][/color]

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad54.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad53.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad52.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad51.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad50.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad47.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad46.jpg[/img]

Posted

[img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad45.jpg[/img]

Posted

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=1]

[center]
[url="http://www.worldteluguconference.com/gallerysingle.php?gf_id=1&pic_id=44"][img]http://www.worldteluguconference.com/images/prev_btn.png[/img][/url][img]http://www.worldteluguconference.com/uploads/WTC/First%20WTC%20Photos/stwthyderabad42.jpg[/img]
[url="http://www.worldteluguconference.com/gallerysingle.php?gf_id=1&pic_id=42"][img]http://www.worldteluguconference.com/images/next_btn.png[/img][/url][/center][/size][/font][/color][color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=1]

[size=5][b][left]చిత్రంలో మాన్యశ్రీ జలగం వెంగళరావు, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీ వానమామలై వరదాచార్యులు, డా॥ వావిలాల గోపాల కృష్ణయ్య, డా॥ బెజవాడ గోపాల రెడ్డి, డా॥ రావూరి భరద్వాజ, శ్రీ ఎన్‌.వి.రావు తదితరులను చూడవచ్చు.[/left][/b][/size][/size][/font][/color]

×
×
  • Create New...