Jump to content

Some Good Quotes By Gollapudi..


Recommended Posts

Posted

[color=#000000]సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.[/color]
[color=#000000]మనిషి ఈ ప్రాధమిక దశకి పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండా అతి సుళువుగా, అతి త్వరగా దిగజారిపోగలడు - అది అతని స్వభావ దశ కనుక.[/color]
[color=#000000]కృతయుగంలో సెక్స్ కేవలం సంకల్పం. త్రేతాయుగంలో ఆలోచన. ద్వాపర యుగంలో అనుషంగం. కలియుగంలో సంఘర్షణ. ఈ యుగంలో మనిషి సమగ్రతను సాధించిన పూర్తి జంతువు. విచక్షణ, పదవి, సంపద, సంస్కారం, పరువు - వీటన్నిటినీ మరిపింపజేసే ప్రవృత్తి, క్రీడ - సెక్స్.[/color]

Posted

good one.

Posted

అందరిమాటా ఏమోగానీ- నేను మాత్రం ఈ సంవత్సరం లలిత మోడీకి భారతరత్న గౌరవం లభిస్తుందని ఆశించాను. లభించనందుకు నిరుత్సాహ పడ్డాను.అడ్డమయిన వాళ్ళకీ అన్నీ పంచుతూండగా లలిత మోడీకి కనీసం పద్మవిభూషణ్ యివ్వవలసింది.

ప్రపంచమంతటా యిన్ని కోట్లమంది చూసే, ప్రపంచంలో వున్న అని దేశాల గొప్ప ఆటగాళ్ళను కేంద్రీకృతం చేసి 1700 కోట్ల ఆదాయంతో- డప్పులు వాయించేవాళ్ళ దగ్గర్నుంచి, క్షవరం చేసే వాళ్ళ దగ్గర్నుంచి (ఉదా:సిమ్మండ్స్ ప్రతీ ఆటకీ నున్నటి గుండుతో కనిపిస్తాడు), వొళ్ళు అమ్ముకునేవాళ్ళదాకా (చీర్ లేడర్స్ కి నా అనువాదం తప్పయితే పాఠకులు క్షమించమనవి) అందరికీ అందులో వాటా కల్పించడం సామాన్యమయిన విషయం కాదు. ఇందులో క్రికెట్ ఉంది, వ్యాపారం వుంది, ఉపాధి ఉంది, సినీమా గ్లామర్ వుంది, సెక్స్ వుంది, కీర్తి వుంది, వినోదం వుంది, రాబడివుంది. అన్నిరకాల ఆనందానికీ ఆస్కారం వుంది. పిచ్చివాళ్ళ ఆటని నాలిక చప్పరించిన బెర్నార్డ్ షా ఇప్పుడు బతికి వస్తే ఇంతమందిని ఆకర్షించే ఈ వింత సర్కస్సుని చూసి ముక్కుమీద వేలువేసుకుంటాడు. ఇలా అందరికీ వ్యాపారవాటాల్ని పంచిన లలిత్ మోడీకి –మరొక్కసారి అంటాను- పద్మవిభూషణ్ అయినా ఇవ్వకపోవడం అన్యాయమని. నిజానికి ఇలాంటి గౌరవాలు పొందినవారు మోడీకన్న “పీకింది” ఏమీ లేదంటాను. అందరిమాటా ఏమోగానీ- నేను మాత్రం ఈ సంవత్సరం లలిత మోడీకి భారతరత్న గౌరవం లభిస్తుందని ఆశించాను. లభించనందుకు నిరుత్సాహ పడ్డాను.అడ్డమయిన వాళ్ళకీ అన్నీ పంచుతూండగా లలిత మోడీకి కనీసం పద్మవిభూషణ్ యివ్వవలసింది.

Posted

baaga raasthadu aayanaku naa dannaalu

[img]http://img837.imageshack.us/img837/4775/brahmibow.gif[/img]

Posted

[left] ఈ కామన్వెల్తు ప్రతినిధులుండే చోట 150 కండోముల మిషన్లు పెడతారట. ఈ కండోములు రోజుకి మూడువేలనుంచి 3300 వరకు వినియోగిస్తారట. ఒక్కొక్క పాకెట్లో రెండు కండోముల లెక్కన చూసుకున్నా ఈ క్రీడలయేసరికి ఒక లక్ష ఖర్చవుతాయని అంచనా. అసలు మొదట్లో రెండొందలు కండోం మిషన్లనిపెడదామనుకున్నారట. కాని ప్రస్తుతం వాటిని వందకి తగ్గించారు.[/left]

[left]వీటిని ఎవరు వాడుతారు? ఆయా దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వారి సిబ్బంది, వారి పాలక యంత్రాంగం. వీళ్ళల్లో ఎవరూ భార్యాభర్తలు కారు. మరి కండోంల దాకా పోయే - రోజుకి 6600 కండోంలు ఖర్చయ్యే శృంగార క్రీడ ఎలాసాగుతోంది? ఈ విషయాన్ని కర్ణాటక ఉద్యమ కారులు ప్రమోద్ ముతాలిక్ గారు గమనించడం లేదా? ఈ ' ధర్మ ' సంస్థల లక్ష్యం ప్రకారం వాళ్ళని అక్కడికక్కడే పట్టుకుని పెళ్ళిళ్ళు చేసెయ్యాలి కదా? పోనీ ఈ కండోముల ఖరీదు కలిసి వచ్చేలాగ ప్రపంచ శాంతి సంస్థ, ప్రపంచ పునరావస సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల వంటివి స్పాన్సర్ చేస్తే మరింత సరసమైన ధరలు పలుకుతాయి కదా? ఈ వ్యభిచారానికి అంతర్జాతీయమైన మద్దతు లభిస్తుంది కదా?. ఇంతకీ నాకు బొత్తిగా తేలని సంశయం ఒకటుంది. పార్కుల్లో, బీచిల్లో చెయ్యి చెయ్యీ పట్టుకుంటేనే బ్రోతల్ కేసులు బనాయించే పోలీసు శాఖవారి అనుమతి ఈ ఘరానా కండోం వితరణకి లభించిందా అని. రంజాన్ నెలలో ఇస్లాం దేశాలలో మందు పేరెత్తితేనే జైల్లో పెడతారు. ప్రపంచంలో ఏ దేశమలో నయినా మాదక ద్రవ్యాల ఊసెత్తితే అరెస్టు చేస్తారు. మరి నీతి, సౌశీల్యం వంటి విలువలకు ఆటపట్టయిన భారతదేశంలో గర్వంగా సామూహిక శృంగార వైభవానికి ఇంత సాధికారమైన ఏర్పాట్లు చేస్తున్నందుకు భారతీయుడిగా ఈ ఒక్క కారణానికే కల్మాడీగారికి భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను[/left]

Posted

[quote name='summer27' timestamp='1357642219' post='1303070522']
[color=#000000]సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.[/color]
[color=#000000]మనిషి ఈ ప్రాధమిక దశకి పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండా అతి సుళువుగా, అతి త్వరగా దిగజారిపోగలడు - అది అతని స్వభావ దశ కనుక.[/color]
[color=#000000]కృతయుగంలో సెక్స్ కేవలం సంకల్పం. త్రేతాయుగంలో ఆలోచన. ద్వాపర యుగంలో అనుషంగం. కలియుగంలో సంఘర్షణ. ఈ యుగంలో మనిషి సమగ్రతను సాధించిన పూర్తి జంతువు. విచక్షణ, పదవి, సంపద, సంస్కారం, పరువు - వీటన్నిటినీ మరిపింపజేసే ప్రవృత్తి, క్రీడ - సెక్స్.[/color]
[/quote]

aayana blog address vunda subscribe chesukundam

×
×
  • Create New...