Jump to content

Ramudi Ga Marina Ravanasurudu..


Recommended Posts

Posted

[img]http://epaper.sakshi.com/epaperimages/2512013/2512013-sh-hyd-7/D26059646.JPG[/img]

Posted

[quote name='fake_Bezawada' timestamp='1359111715' post='1303173029']
eeda image kanipiyatla once more plzzz
[/quote]

http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=56484&Categoryid=11&subcatid=23

[color="balu"]పద్నాలుగేళ్ల క్రితం వరకు అతడొక దొంగ.
రకరకాల దొంగతనాలు చేశాడు.
పట్టుబడినప్పుడు జనం కొట్టారు.
‘తప్పురా’ అని తల్లిదండ్రులు కొట్టారు.
‘చెప్పరా’ అని పోలీసులు కొట్టారు.
‘రేయ్ ఇట్రా’ అని తోటి ఖైదీలు కొట్టారు.
చుక్కలు కనిపించాయతడికి.
చుక్కల మధ్య దేవుడు కూడా!!
‘భగవంతుడా ఈ కూపం నుంచి కాపాడు’
అని మొర పెట్టుకున్నాడు.
‘మారిపోతాను... కాపాడు’ అనిముడుపు కట్టుకున్నాడు.
దేవుడి రూపంలో వచ్చిన తల్లిదండ్రులు అతడిని విడిపించుకున్నారు.
తర్వాత ఏమైంది?
పద్నాలుగేళ్లుగా అతడు దేవుడికి ముడుపు చెల్లించుకుంటూనే ఉన్నాడు!
ఏమిటా ముడుపు? ఏమిటా చెల్లింపు? [/color]

[color=#000000][center][img]http://sakshi.com/newsimages/contentimages/25012013/20bng0924-1-13-7455.jpg[/img][/color][/center]

[color=#000000]బెంగళూరు మహానగరంలోని రోడ్లపై అనాథలుగా బతుకీడుస్తూ చావు కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి అక్కడి ‘హోమ్ ఆఫ్ హోప్’ కొండంత ఆసరాగా నిలుస్తోంది. జీవితంలోని చివరిక్షణాల్లో ఆత్మీయస్పర్శను అందించి, వారి ఆఖరి కోరికలను తీర్చడంతోపాటు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను కూడా జరిపిస్తోంది. ఈ హోమ్‌ని నిర్వహిస్తోంది ఎవరో తెలుసా? మంచి మనిషిగా మారిన ఒకప్పటి దొంగ... రాజా ఉరఫ్, ఆటోరాజా![/color]

[color=#000000]జీవితపు చరమాంకంలో ఎవరూ తాము అనాథలమని బాధపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఇదంతా చేస్తున్నానని, తన దగ్గరకు చేరిన ప్రతి ఒక్కరినీ వారి ఆఖరి క్షణాల్లో సైతం నవ్వుతూ చూడాలన్నదే తన ఆశయమని, అంతకు మించి మరే కోరికలు తనకు లేవని చెబుతున్నాడు రాజా.[/color]

[color="deeppink"]ఒకప్పటి దొంగ ఈ రాజా![/color]

[color=#000000]ఆటో రాజా మూడో తరగతిలోనే బడి ముఖం చూడ్డం మానేశాడు. అటు పై చెడు సావాసాలతో చదువు అటకెక్కగా రోడ్లపైన బలాదూరుగా తిరగడం మొదలుపెట్టాడు. ఇరవై ఏళ్లు నిండకముందే అన్ని వ్యసనాలను అలవరచుకున్నాడు. ఈ క్రమంలోనే తాగుడుకు బానిసైనరాజా అందుక్కావలసిన డబ్బు కోసం రాత్రిపూట ఒంటరిగా వెళ్లే వారిని బెదిరించి, దాడి చేసి డబ్బు, నగలు లాక్కునేవాడు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తన ప్రవర్తనను మార్చుకోలేదు. పైగా ఒకరోజు వాళ్ల అమ్మ మెడలోనుంచి తీసి పెట్టిన తాళిని దొంగిలించాడు. దానిని అమ్మి చిత్తుగా తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రాజాని తల్లిదండ్రులు తన్ని తరిమేశారు. దాంతో రైల్వేస్టేషన్‌కెళ్లి కనిపించినరెలైక్కి చెన్నై చేరుకున్నాడు రాజా. అక్కడ కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడినప్పుడల్లా ‘మామూళ్లు’ ఇస్తూ కొద్దిరోజులు బాగానే తప్పించుకు తిరిగాడు. అయితే ఒకసారి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుపాలయ్యాడు. సరిగ్గా అప్పుడే రాజాకు జీవితం విలువ తెలిసింది. [/color]

[color=#000000]చెన్నై సెంట్రల్ జైలులోని సాటి ఖైదీలు రాజాను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. అతడికి జైలు నరకకూపంలా అనిపించింది. ‘జీవితం అంటే ఇంతేనా’ అని మధన పడుతూ ఒక రోజు మూడు గంటలపాటు ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఆ మూడుగంటలు అతని దృక్పథాన్ని, జీవిత పథాన్ని మార్చేశాయి. తాను అనుసరిస్తున్న మార్గం సరికాదని తెలిసొచ్చింది. అదే సమయంలో దేవుడిని ఓ కోరిక బలంగా కోరుకున్నాడు. తానింకెప్పుడూ చెడు దారిలో నడవకుండా కాపుకాయమని వేడుకున్నాడు. కాకతాళీయమో, దేవుడి దయో... అప్పటి వరకూ కొడుకు గురించి ఆలోచించని తల్లిదండ్రులు ఆరోజే జైలుకు వచ్చి ఫైన్ కట్టి అతన్ని విడిపించారు. బెంగళూరు తీసుకువెళ్లి, కొంత డబ్బు అతని చేతిలో పెట్టి ‘‘నీకు ఇచ్చే చివరి సొమ్ము ఇదే. దీంతో నువ్వు బతుకుతావో చస్తావో నీ ఇష్టం’’ అని చెప్పారు. ఆ డబ్బుతో ఓ ఆటోను అద్దెకు తీసుకుని తన రెండోజీవితాన్ని ప్రారంభించాడు రాజా.[/color]

[color="deeppink"]అనాథలను చేరదీయాలన్న ఆకాంక్ష[/color]

[color=#000000]బెంగళూరులో వీధుల వెంటే తిరిగే బిచ్చగాళ్లతో, వివిధ రోగాలతో బాధపడుతున్న వారితో మాట్లాడాలని, వారిని చేరదీయాలన్న కోరిక రాజాలో రోజురోజుకు బలంగా పెరుగుతూ పోయింది. దీంతో ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత సొమ్ము వెచ్చించి వారికి భోజనం పెట్టేవాడు. చనిపోతే సొంత ఖర్చులతో దహన సంస్కారాలు చేసేవాడు. ఒక రోజు అంతుపట్టని జబ్బుతో ఎముకల గూడుగా మారిన ఓ వృద్ధ్దుడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేయసాగాడు. ఈ విషయమై ఇంట్లో పెద్ద గొడవే అయింది. ఆ రెండు రోజులపాటు రాజా ఆ వృద్ధుడికి అన్నీ తానై చూసుకున్నాడు. చనిపోయే ముందు రాజాను దగ్గరకు తీసుకుని తనకు జామూన్ తినాలని ఉందని అడిగాడతడు. దీంతో పరుగున వెళ్లి ఒక జామూన్ తీసుకువచ్చి తినిపించాడు రాజా. జామూన్ తిన్న మరుసటి రోజే చనిపోయాడు ఆ అనాథ. అంత్యఘడియల్లో రాజా రెండు చేతులు పట్టుకుని కన్నీరు కారుస్తూ చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించి ఆ వృద్ధుడిని గౌరవంగా సాగనంపాడు రాజా. ఈ సంఘటన తర్వాత ఆరంభమైనదే ‘హోమ్ ఆఫ్ హోప్’. [/color]

[color="deeppink"]గౌరవంగా సాగనంపుతూ...[/color]

[color=#000000]ఇంటిదగ్గర ఆటోరాజా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఓ స్నేహితుడి సాయంతో బెంగళూరులోని కావల బై సంద్ర ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకుని అనాథలకు ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టాడు. రోడ్డు పక్కన దిక్కూమొక్కూలేకుండా పడి ఉన్నవారిని చేరదీసి వారికి స్నానం చేయించి మంచి బట్టలు కట్టి భోజనం పెడుతున్నాడు. వైద్య సహాయం అందిస్తున్నాడు. మసాలాదోసె, చికెన్ కబాబ్, పెప్సీ, ద్రాక్ష, జామకాయ... ఇలా వారు కోరిన వాటిని తినిపించి వారిని తృప్తిపరుస్తుంటాడు. చనిపోయిన తర్వాత కొత్తబట్టలు కట్టి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఎవరూ లేమని బాధపడే వారికి నేనున్నాననే భరోసానిస్తూ గౌరవంగా సాగనంపుతాడు. హోమ్ ఆఫ్ హోప్‌లో ఆశ్రయం పొందేవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. దీంతో నాలుగేళ్ల ముందు బెంగళూరు శివారులోని దొడ్డగుబ్బి గ్రామంలో ఒకటిన్నర ఎకరాల భూమిని కొని అక్కడికి హోమ్ ఆఫ్ హోప్ సెంటర్‌ను మార్చారు. [/color]

[color="deeppink"]20 మంది పిల్లలకు తండ్రి....[/color]

[color=#000000]బెంగళూరు వంటి మహానగరంలో మతిస్థిమితం లేని అమ్మాయిలు కొంతమంది కామాంధుల చేతికి చిక్కి గర్భవతులవుతుంటారు. కనీసం తాము గర్భవతులమని కూడా తెలియని పరిస్థితిలో వారు భిక్షాటన చేస్తూ బతుకీడుస్తుంటారు. ఇలాంటి వారికి కూడా ‘హోమ్ ఆఫ్ హోప్’ ఆశ్రయం కల్పిస్తోంది. ఇలాంటి పిచ్చి‘తల్లులను’ తీసుకు వచ్చి వారికి పురుడు పోసి ఆ పిల్లలను సొంతబిడ్డల్లా సాకుతున్నాడు. ఆ పిల్లలను దగ్గర్లోని ప్రైవేటు స్కూల్‌కు పంపిస్తున్నాడు. ఇలాంటి పిల్లలు ‘హోమ్ ఆఫ్ హోప్’లో ప్రస్తుతం 20 మంది వరకూ ఉన్నారు. వీరంతా ఆటోరాజాను ‘డాడీ’ అని పిలుస్తూ ఉంటారు. [/color]

[color="deeppink"]రోజుకు 450 మంది ఆకలి తీరుస్తూ...[/color]

[color=#000000]ఆటోరాజా చేస్తున్న సేవలు తెలుసుకుని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది తమ ఆస్పత్రుల్లో జీవిత చరమాంకంలో ఇబ్బందులు పడుతున్న రోగులను హోమ్ ఆఫ్ హోప్‌[/color][color=#000000]చేరుస్తుంటారు. వారితోబాటు బెంగళూరులోని బెగ్గర్స్ కాలనీలో ఉంటూ జీవిత చరమాంకానికి చేరిన వారిని అక్కడి స్వచ్ఛంద సంస్థ వారు ఆటోరాజా నిర్వహిస్తున్న సెంటర్‌కు పంపిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి వారు 450 మందికి పైగా ఈ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరు బతికేది కొద్దికాలమైనా సంతోషంగా బతుకుతూ, సంతృప్తిగా కన్నుమూస్తున్నారు. సగౌరవంగా సాగిపోతున్నారు. [/color]

[color=#000000]ఆటోరాజా చేస్తున్న సేవాకార్యక్రమాలకు మెచ్చిన సీఎన్‌ఎన్-ఐబీఎన్ కొద్దికాలం క్రితం అతనికి ‘రియల్ హీరో’ అవార్డును ఇచ్చి సత్కరించింది. పరివర్తన చెందడం, దేవుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే రాజాను మనసున్న మారాజుగా మార్చేశాయి. అనాథలకు ఆత్మీయుడిని చేశాయి.[/color]

[color="green"]- బేల్దార్ సజ్జేంద్ర కిషోర్, బెంగళూరు, సాక్షి[/color]

Posted

good post... sHa_clap4 sHa_clap4

manchi ni chadavandi..manchi ki publicity ivvandi..manchi gaa marandi...

×
×
  • Create New...