Jump to content

It Seems Obama Have Some Good News For H1B Visa


Recommended Posts

Posted

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా... అయితే వీసాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా... అయితే వారం రోజులు అగండి... ప్రస్తుతం ఉన్న వీసా నిబంధనలను మార్చే పనిలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఇమ్మిగ్రేషన్‌లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించి కొత్త ప్రణాళికను వచ్చే వారంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విడుదల చేసే అవకాశం ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరి జయ్ కర్నీ తెలిపారు. ఈ కొత్త నిబంధనలతో అంతర్జాతీయంగా నైపుణ్యం కలినిన వ్యక్తులకు లాభం చేకూరడంతో పాటు భారత్‌కు చెందిన యువకులకు లాభం చేకూరనున్నట్లు ఆయన చెప్పారు. సిద్ధాంతిక పోరాటలను అధిగమించడానికి ఈ కొత్త నిబంధనలను రూపొందించినట్లు, దీనికి అధ్యక్షుడు కూడా సమ్మతించినట్లు కర్ని పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా హెచ్-1 వీసాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికే నిబంధనలను సవరించడం లేదని... అంతర్జాతీయ దేశాల్లో ఉన్న నైపుణ్యం గలవారిని ఆకట్టుకోవడానికి వీసా నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం నేవడ వద్ద జరగనున్న సమావేశంలో బరాక్ ఒబామా ఈ కొత్త నిబంధనలను విడుదల చేసే అవకాశం ఉందని కర్నీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మార్పు విషయంపై ఒబామా అధ్యక్షన జరిగిన సమావేశానికి సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారాలు పాల్గొన్నారు. మధ్య స్థాయి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వీసా నిబంధనలను సవరించాలని ఈ సందర్భంగా ఒబామాకు విశ్లేషకులు విజ్ఞప్తి చేశారు. వచ్చే వారంలో కొత్త ప్రణాళికను ప్రకటించి వెంటనే అమలు పరుచాలని ఒబామా చూస్తున్నారు.

×
×
  • Create New...