Jump to content

Recommended Posts

Posted

[b][color=#000000]మన రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం[/color]
[color=#000000]కాంగ్రెసునైనా, తెలుగుదేశాన్ని అయినా, ఇతరులనైనా...[/color]
[color=#000000]ఫిరాయింపులనైనా.. ఫిక్సింగులనైనా..[/color]
[color=#000000]పరిణామాలను అయినా, పర్యవసానాలను అయినా..[/color]
[color=#000000]నడిపించేదీ.. బులిపించేదీ.. [/color]
[color=#000000]మెరిపించేదీ.. తలపించేదీ..[/color]
[color=#000000]కదిలేదీ.. కదిలించేదీ.. [/color]
[color=#000000]పెనునిద్దుర వదిలించేదీ ఒకే ఒక్కటి[/color]
[color=#000000]అదే ‘జగన్మాయ.’[/color][/b]



[color=#FF0000][size=6]జగన్మాయ[/size][/color][color=#000000]

[color=#783939][left]Published Date : 01-Feb-2013 22:00:00 GMT[/color][/left][/color][color=#000000]

[img]http://www.greatandhrapaper.com/newphotos/jagan_new41359799683.jpg[/img]
[size=4][left]
ఆయన ఎక్కడ ఉన్నాడనేది కాదు. ఆయన ప్రభావం ఎంత ఉన్నదనేది ముఖ్యం. ఆయన పేరు మీద ఏయే పరిణామాలు జరుగుతున్నాయనేది ముఖ్యం.
‘28వ తేదీ’ అనే డెడ్‌లైన్‌కు కొన్ని రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నాయకులు దాదాపుగా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవడం వంటి సీనును జనం చూశారు. ‘సమైక్యంగా ఉంచితే 2014లో మీరు ఎన్ని సీట్లు గెలవగలరు?’ అని హస్తిన పెద్దలు నిలదీసినప్పుడు వీరు నీళ్లు నమలడం గురించి జనం చదివారు. ఇక తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ పడిపోయిందని.. ముహూర్తం రాగానే విడుదల అయిపోతుందని అనుకున్నారు.
ఏం జరిగిందో ఎవ్వరికీ బోధపడలేదు? ఏం జరగబోతోందో కూడా క్లారిటీ లేదు. మొత్తానికి బ్రేకులు పడ్డాయి. ‘28వ తేదీ’ కూడా వచ్చింది. ‘ఆగండి బాబూ. తొందరేంటి’ అనే మాట మాత్రం వచ్చింది. వచ్చేసింది వచ్చేసింది అనుకున్న తెలంగాణ ఎందుకు ఆగిందో ఎవ్వరికీ తెలియదు. రాజకీయాల్లో అదొక బ్రహ్మపదార్థంగానే ఉండిపోయింది. ‘ఏకం సత్ విప్రా బహుధా వదన్తి’ అన్నట్లుగా తెలంగాణ ఆగిపోవడానికి సంబంధించి.. ఎవరికి తోచిన భాష్యం వాళ్లు చెప్పుకున్నారు.
కానీ ఒక్క సంగతి మాత్రం నిగ్గుతేలింది.
మన రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం
కాంగ్రెసునైనా, తెలుగుదేశాన్ని అయినా, ఇతరులనైనా...
ఫిరాయింపులనైనా.. ఫిక్సింగులనైనా..
పరిణామాలను అయినా, పర్యవసానాలను అయినా..
నడిపించేదీ.. బులిపించేదీ..
మెరిపించేదీ.. తలపించేదీ..
కదిలేదీ.. కదిలించేదీ..
పెనునిద్దుర వదిలించేదీ ఒకే ఒక్కటి
అదే ‘జగన్మాయ.’
తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీ. వారి నేతృత్వంలో నడుస్తున్న యూపీఏ సర్కారు. కేవలం తెలంగాణ ప్రాంతంలో కొందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయం ప్రకటిస్తారనుకోవడం అవివేకం. దానికి ముందు వెనుకగా కచ్చితంగా తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుంటారు. తమ భవిష్యత్తు స్థిరంగా ఉండడానికి... భవిష్యత్తులో కూడా తాము మళ్లీ అధికార పీఠం అధిష్ఠించడానికి వాతావరణం అనుకూలించే విధంగానే తాము ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుకుంటారు. ఆ విధానాన్నే అమలు చేస్తున్నారు.
మొన్న శ్రీకృష్ణ కమిషన్ అనే పేరిట నెలల తరబడి కాలయాపన చేసినా.. నిన్న మరియు అటుమొన్న అఖిలపక్షం పేరిట రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తామటూ ఓ డ్రామా నడిపించినా అంతా కాలహరణం చేయడానికి మాత్రమేనన్నది నిజం. తాజాగా డిసెంబరులో జరిగిన అఖిలపక్షం కూడా.. తమ పార్టీలోని ఎంపీలు.. కీలకబిల్లులపై ఓటింగుకు గైర్హాజరయ్యే ప్రమాదం పొడసూపిన తర్వాత తీసుకున్న నిర్ణయమే కావడం ఇందుకు రుజువు.
అప్పటిదాకా ఎంత కాలయాపన చేసినప్పటికీ.. తాజా అఖిలపక్షం తర్వాత మాత్రమే ఏదో ఒకటి తేల్చేయాలనే నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ వచ్చింది. తమ యూపీఏ సర్కారులో భాగస్వాములైన పక్షాల వారెవ్వరూ ఈ రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న వారు కాకపోవడం వారికి ఉన్న ఒక అదనపు ఎడ్వాంటేజీ. అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో వారికి తమ భాగస్వాముల నుంచి సీరియస్ ఒత్తిళ్లు ఉండవు. నిర్ణయం తాము ఒక్కరే తీసుకోవచ్చు. తమ ఒక్క పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు వారికి ఉండడం పెద్ద అదృష్టం. అందుకే ఇక తేల్చేద్దామని అనుకున్న తర్వాత వారు తమ పార్టీ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి వారికి గట్టి భరోసానే లభించింది. ఉన్న 17 స్థానాల్లో 16 ఎంపీ స్థానాలను గెలిపించగలమని తెలంగాణ ఎంపీలు అధిష్ఠానం వద్ద గట్టిగానే వాదించారు. అయితే వారంతట బయటకు ప్రకటించలేదు గానీ.. తెలంగాణ ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితిని తమలో విలీనం చేసుకుంటే మాత్రమే ఈ సంఖ్యలో స్థానాలను గెలవడం సాధ్యం అవుతుందని వారు పేర్కొన్నారు. అధిష్ఠానం కూడా తెరాసను విలీనం చేసుకునే ఉద్దేశానికి సుముఖంగానే ఉన్నది గనుక.. దానికి సంబంధించిన మౌలికమైన చర్చాది కార్యక్రమాలను పూర్తిచేసి ఉన్నది గనుక.. పాజిటివ్‌గానే ఎంపీల ప్రపోజల్‌కు స్పందించింది. సర్లే ఇచ్చేద్దాం అనుకుంది.
సీమాంధ్రకు చెందిన.. సమైక్యాంధ్రను డిమాండు చేసే టీజీ వెంకటేష్ ప్రభృత నాయకులు అధిష్ఠానం పెద్దలను కలిసినప్పుడు వారికి ఎదురైన చేదు అనుభవాలు అన్నీ వీటి పర్యవసానమే. వారు వెళ్లి కలిసినప్పుడు ఢిల్లీ పెద్దలు చాలా అవమానకరంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొడితూ 16 స్థానాలు ఇస్తామని తెలంగాణ ఎంపీలు చెబుతున్నారు. సమైక్యంగా ఉంచితే మీరెన్నింటికి హామీ ఇవ్వగలరు? అంటూ సూటిగా ప్రశ్నించారు. దానికి నీళ్లు నమలడం తప్ప వీరివద్ద జవాబు లేదు. సీట్లు గెలిచే చేవ లేదుగానీ.. సమైక్యం గురించి పైరవీలకు వచ్చారంటూ ఎద్దేవా చేసి పంపారు. దాంతో నాయకుల పరిస్థితి దాదాపు కన్నీళ్ల పర్యంతం అయినట్లయింది. ఇక అంతా అయిపోయింది.. మన చేతుల్లో ఏమీ లేదు అన్నట్లుగానే మీడియాలో తమకు కావాల్సిన వారితో ఆక్రోశం వెళ్లగక్కుకున్నారు. తెలంగాణ వచ్చేస్తోందంటూ.. రాష్ట్రమంతా అట్టుడికి పోయింది.
సూత్రధారి రంగ ప్రవేశం
సరిగ్గా అప్పుడే సూత్రధారి రంగప్రవేశం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పావులు కదపడానికి కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగారు. హస్తిన పెద్దలను కలిశారు. ‘తమకు ఎన్ని సీట్లు’ అనే కోరిక తప్ప మరో ప్రాతిపదిక తప్ప మరో కొలబద్ధ లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టేయడానికి ఎగబడుతున్న, థర్డ్‌రేటెడ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని కేవీపీ సరైన రీతిలో మెడలు వంచారు. కుక్కకు ఎముకను వేసినట్లుగా.. ‘సీట్లు... సీట్లు...’ అంటూ ఆవురావురంటున్న కాంగ్రెస్‌కు సరిగ్గా అదే తాయిలం చూపెట్టారు. ‘16 కోసం కక్కుర్తి పడతారేమిటి.. నేను 32 అందిస్తున్నా’ అన్నట్లుగా ఆఫర్ చూపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుంచి ఈ ఆఫర్‌ను డబుల్ బొనాంజాగా కాంగ్రెస్ భావించింది. కేవీపీ మాటకు తలొగ్గడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదనుకుంది. ఆ రీతిగా అధిష్ఠానం మెడలు వంచడానికి కేవీపీ ‘జగన్మాయ’ను ప్రెూగించారు.
అసలేమిటీ ‘జగన్మాయ’?
కేవీపీ ప్రెూగించిన అం ఒక్కటే .. అది జగన్. ఆయన అధిష్ఠానం వద్ద ఏం చెప్పారంటే.. ‘రాష్ట్రాన్ని విడగొడితే 16 సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు. అది కూడా తెరాసను విలీనం చేసుకుంటే మాత్రమే. విలీనం అనేది అదనంగా డబ్బుతో ముడిపడకుండా కేవలం రాష్ట్ర విభజన ప్రకటనతో మాత్రమే జరుగుతుందనుకోవడం భ్రమ. అదే రాష్ట్రాన్ని విడగొట్టకుండా ఉంటే.. జగన్ పార్టీ వైకాపా మొత్తం 32 నుంచి 35 సీట్ల వరకు వస్తాయనే అంచనా సాగుతోంది. ఆయన పార్టీతో మీకు పొత్తు ఏర్పాటు చేసి.. మీ ప్రభుత్వానికి మద్దతు ఇప్పిస్తా. ఇందులో కేసులనుంచి విముక్తి తప్ప.. డబ్బు ప్రమేయం కూడా ఉండదు’ అనే ఆఫర్‌ను కేవీపీ అధిష్ఠానం ముందుంచినట్లు సమాచారం. ఈ ఆఫర్‌ను పూర్తిగా పార్టీ విశ్వాసంలోకి తీసుకోవడానికి అనేక అవకాశాలున్నాయి.
1) ‘కాంగ్రెసులో విలీనం’ అనే ప్రతిపాదనకు తప్ప మరే మద్దతు ఒప్పందానికైనా సిద్ధమేనని వైకాపా నేతలు ఇదివరలోనే కాంగ్రెస్‌కు వివిధ మార్గాలనుంచి సంకేతాలు పంపారు. 2) కేసుల విముక్తి అనేది వారి ప్రయారిటీ.. రాష్ట్రంలో అధికారం అనేది రెండో ప్రాధాన్యం. ఇందుకోసం కాంగ్రెస్‌తో మిలాఖత్ అవుతారు. 3) జగన్ సీట్లు 3235 గెలవడం గురించి కేంద్రానికి కూడా క్లారిటీ ఉంది. రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు కేంద్రానికి అందుతున్న ఇంటెలిజెన్స్ నివేదికలన్నీ ఈ వాస్తవాన్న చెబుతున్నాయి. ఒక్కసీటుకు కూడా మీరు గ్యారంటీ ఇవ్వలేరు అంటూ సీమాంధ్ర వారిని నిలనదీసిన హస్తిన పెద్దలు అన్నీ జగన్ ఖాతాలోకి వెళ్తాయనే భయంతోనే ఉన్నారు. అలాంటిది జగన్ ఇప్పుడు తమకు అండగా నిలుస్తాడంటే ఆ అవకాశాన్ని ఉపెూగించుకోకుండా ఎందుకుంటారు? కేవీపీ పాచిక పారింది. అధిష్ఠానం పునరాలోచనలో పడింది.
జగన్‌కు కూడా గత్యంతరం లేదు
జగన్ వైకాపా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 30 పైచిలుకు స్థానాలలో ఎంపీలను గెలుపొందడం గ్యారంటీనే (ఇప్పటి వాతావరణాన్ని బట్టి). అయితే ఆ సీట్లను ఆయన ఏం చేసుకోవాలి. కేంద్రంలో కాంగ్రెస్ భాజపాలో మాత్రమే అధికారం కోసం తలపడే పరిస్థితి ఉన్నప్పుడు, మూడో ప్రత్యామ్నాయం అనేది బలంగా లేనప్పుడు.. జగన్‌కు ఎంత బలం ఉన్నా అది వృథానే అవుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో రెడ్డి, మాల, ముస్లిం ఓటు బ్యాంకులను చాలా బలంగా కలిగి ఉన్న వైకాపా ముస్లింలను దూరం చేసుకునే నిర్ణయం వైపు పొరబాట్న కూడా మొగ్గు చూపదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాజపాకు, వారు భాగస్వామిగా ఉండే ఏ కూటమికీ మద్దతిచ్చే అవకాశం లేదు. ఇక ఉన్న ఏకైక గత్యంతరం కాంగ్రెసే. అందువలన ఒప్పందం ఏదో ఇప్పుడే చేసుకుని.. దశలవారీగా కేసుల విముక్తి.. ఇతర చికాకుల్ని తొలగించుకుంటే వచ్చే ఎన్నికల సమయానికి పూర్తిస్థాయిలో విజృంభించడం సాధ్యం అవుతుంది. ఆ లెక్కలతో వారు కదులుతున్నారు.
పవార్ మంత్రాంగమూ అందుకే
ఎన్నడూ లేనిది తెలంగాణ విషయంలో హఠాత్తుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో రాజ్యమేలుతున్న యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉంటూ తాను తలచిన రీతిలో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌చేయగలుగుతూ... తన పనులు చక్కబెట్టుకోదగిన స్థాయిలో ఉన్న నాయకుడు శరద్‌పవార్. ఆయన మొండికేసిన ఒకటి రెండు బిల్లుల విషయంలో ములాయం, మాయావతి దయంతో సర్కారు గట్టెక్కింది గానీ.. అంతమాత్రాన పవార్ హవా తగ్గినట్లు కాదు. యూపీఏ లో చక్రం తిప్పగల కాంగ్రెసేతర భాగస్వామ్య పక్ష ెదా ఆయనకు ఒక్కరకు మాత్రమే ఉంది. మమత కూడా దూరం అయ్యాక... ఆయనొక్కడే హవా నడిపిస్తున్నారు.
ఇప్పుడు ‘జగన్మాయ’ ప్రభావంతో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో ప్రతికూల నిర్ణయం తీసుకునే అవకాశం సూచనగా కనిపిస్తుండడంతో పవార్ నేరుగా రంగంలోకి దిగారు. ఆయన నేరుగా ప్రధాని మన్మోహన్‌ను కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేయాల్సిందిగా ఓ సలహా ఇచ్చారు. జగన్ 30+ సీట్లు గెలవడం గ్యారంటీ అయినప్పుడు.. తెలంగాణ ఇవ్వకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వచ్చే ఎన్నికల తర్వాత జగన్ మీద కూడా ఆధారపడాల్సి వస్తే.. యూపీఏలో తనకు ప్రస్తుతం ఉన్న హవా అప్పుడు తగ్గుతుందనేది ఆయన ప్రధాన భయంగా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పసిగుడ్డు జగన్ చక్రం తిప్పే స్థాయికి ఎదగాలని అనుకోవడం ఏంటని ఆయనకు కాస్త కంటగింపు కూడా ఉంది. అయితే కాంగ్రెస్ మౌలికంగా తమ పార్టీ భవిష్యత్తు బలంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప.. పవార్ మాటకు విలువిస్తుందని అనుకోవడం భ్రమ.
నిర్ణయం ‘అదిగో అల్లదిగో..’ అన్నట్టే
కేవీపీ ‘జగన్మాయ’ ప్రతిపాదన తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని అడ్డుకున్నంత వరకు సాధించింది. అంతమాత్రాన ఇంకా ఫైనలైజ్ అయిపోలేదు. కేవీపీ తన ప్రతిపాదనను సాధికారికంగా.. అధిష్ఠానానికి నిరూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మిత్రుడైన కాంగ్రెసు ఎంపీ సబ్బం హరి.. జైలులో తమ నేతను కలిశారు. బహుశా మరి కొద్ది రోజుల్లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, రాష్ట్రపతి ప్రణబ్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. మొత్తానికి కేవీపీ చెప్పిన సూత్రం నిజమేనని కాంగ్రెస్ కు పూర్తి విశ్వాసం కుదిరిందంటే మాత్రం.. తెలంగాణపై నిర్ణయం అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత ఇక ఎప్పటికీ రాదు. ‘తెలంగాణ’కు పాే్యకజీల రూపంలో ప్రత్యామ్నాయాలు మాత్రం వెల్లువెత్తుతాయి.
ప్రత్యేక రాష్ట్రం అనేది ‘అదిగో అల్లదిగో’ అనుకుంటూ ఉండాల్సిందే.
కపిలముని[/left][/size][/color]

×
×
  • Create New...