Jump to content

Social Media Impact On Lok Sabha Elections


Recommended Posts

Posted

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమమైనా, నిర్భయ మానభంగం ఉదంతమైనా... సర్కారుకు వ్యతిరేకంగా యువత ఒక్కతాటిపైకి వచ్చి పోరాడటంలో సోషల్ మీడియా పాత్ర బలమైంది. వ్యక్తుల జీవితాల్లోనూ, సమాజంపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అదే సోషల్ మీడియా వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపనున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

దేశంలోని 160 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చడంలో సామాజిక సంబంధాల మీడియా కీలకం కానుందని ఓ సర్వే వెల్లడించింది. ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, భారత ఇంటర్నెట్, మొబైల్ సంఘం 'సోషల్ మీడియా' లోక్‌సభ ఎన్నికలు' పేరిట అధ్యయనం జరిపారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 160 స్థానాలపై సోషల్ మీడియా అత్యంత ప్రభావం గల లోక్‌సభ నియోజకవర్గాలుగా సర్వే గుర్తించింది.

మొత్తం ఓటర్లలో 10 శాతానికి పైగా లేదా గత లోక్‌సభ ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీ సంఖ్య కన్నా ఎక్కువ మంది ‘ఫేస్‌బుక్’ ఖాతాదారులున్న నియోజకవర్గాన్ని అత్యంత ప్రభావం గల నియోజకవర్గంగా వర్గీకరించింది. ఈ స్థానాల్లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఫేస్‌బుక్ ఖాతాదారుల తీర్పే కీలకం కానుందని సర్వే అభిప్రాయపడింది.

67 స్థానాలను మధ్యస్థాయి ప్రభావం గల లోక్‌సభ నియోజకవర్గాలుగా, స్వల్ప ప్రభావం గల నియోజకవర్గాలు 60, అసలు ప్రభావమే చూపని నియోజకవర్గాలు 256 ఉన్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ నియోజకవర్గాలపై అత్యంత ప్రభావం గల స్థానాలను సర్వే వెల్లడించింది. హైదరాబాద్-అసదుద్దీన్ ఒవైసీ, విశాఖపట్నం-పురందేశ్వరి. విజయవాడ-లగడపాటి రాజగోపాల్, గుంటూరు-రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి-ఉండవల్లి అరుణ్‌కుమార్, కాకినాడ-ఎంఎం పల్లంరాజు, తిరుపతి-చింతామోహన్, నెల్లూరు-మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, నరసారావుపేట-మోదుగుల వేణుగోపాలరెడ్డి, చిత్తూరు-ఎన్.శివప్రసాద్ నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్రభావం ఉంటుందని సర్వేలో వెల్లడైంది.

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/pawan_style24_0.gif?1290371590[/img]
Posted

[img]http://www.desigifs.com/sites/default/files/pawan_style24_0.gif?1290371590[/img]

Posted

FB lo vallu votesthara ani badhapadakkarledu...vote eyyakapoina influence cheyochu... paina constituencies lo undevallu , tama influence ni use chesi KA Paul ki vote eyinchamani na vinnapam...

Posted

[quote name='BobbyFischer' timestamp='1366179230' post='1303617107']
FB lo vallu votesthara ani badhapadakkarledu...vote eyyakapoina influence cheyochu... paina constituencies lo undevallu , tama influence ni use chesi KA Paul ki vote eyinchamani na vinnapam...
[/quote]
@gr33d

Kani last ki mana Tuesday babu ee sari KA Paul vallane odipoyam ani cheptadu

[img]http://www.desigifs.com/sites/default/files/pawan_style24_0.gif?1290371590[/img]

×
×
  • Create New...