Jump to content

Minapa Sunnundalu


Recommended Posts

Posted

[color=#0312B7]వగ'తనం[/color]
[color=#000000]

[b] అంగస్తంభన వైఫల్యంతో పురుషుల్లో కుంగుబాటు
విచ్చలవిడిగా లైంగిక ఉత్ప్రేరకాల వినియోగం..
ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్య నిపుణులు[/b]
[/color]
[color=#000000]
[size=5]
ఊహలు గుసగుసలాడవు. హృదయం ఆందోళనతో ఊగిసలాడుతుంటుంది. 'ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?' అనే బాధ.. ఒత్తిడి.. కుంగుబాటు! పడగ్గదిలోకి అడుగుపెట్టాలంటేనే భయమేస్తుంటుంది. పూలచెండు పామై తోస్తుంది. గ్లాసులోని పాలు చేదనిపిస్తుంటాయి. జీవిత భాగస్వామివైపు సూటిగా చూడాలంటేనే సిగ్గనిపిస్తుంటుంది. చాలామంది పురుషుల జీవితంలో ఏదో ఒకరోజు ఎదురయ్యే సమస్య ఇది.. అంగస్తంభన వైఫల్యం... ఈ సమస్యకు విరుగుడుగా వయాగ్రా, సియాలిస్‌వంటి ఔషధాలు అందుబాటులోకి వచ్చా యి. ఆయుర్వేదంలోనూ వాజీకరణాల పేరిట కుంగిపోయిన శృంగార సామర్థ్యం పెంచే మందులు కొన్ని ఉన్నా, వాటి ప్రభావమెంత? దుష్ప్రభావమెంత? వైద్యుల సిఫారసు లేకుండా ఆన్‌లైన్‌లో, ఓవర్ ది కౌంటర్ విచ్చలవిడిగా కొని వాడితే కలిగే నష్టాలేంటో చూద్దాం...

1998కి ముందు..
ఊర పిచుక లేహ్యం, ఖడ్గమృగం కొమ్ము, సొరచేప మొప్పలు, పాము రక్తం, పులి వృషణాల పులుసు!
1998 తర్వాత...
వయాగ్రా, లెవిట్రా, సియాలిస్, సిలాగ్రా, పెనెగ్రా, కామగ్రా!
మగవారి శృంగార పటిమను పెంచే ఉత్ప్రేరకాలుగా పేరొందిన ఉత్పత్తులివి! పురుషుల ఆధిక్యభావనను చావుదెబ్బ కొట్టి, వారు తమలోతాము ముడుచుకుపోయేలా చేసే అంగస్తంభన వైఫల్యానికి వాడే మందులు. 1998కి ముందు వాడినవి నిజంగా పని చేస్తాయో లేదో తెలియని ఊహాజనిత ఔషధాలైతే.. వయాగ్రా ఆ చరిత్రనే మార్చేసింది. ఒక్క వయాగ్రా అనే కాదు.. మన దేశంలో సైతం ఆయుర్వేద మందులుగా విస్తృత ప్రచారంలో ఉన్న కొన్ని లైంగిక ఉత్ప్రేరక ఔషధాలను వాడేవారి సంఖ్యా ఎక్కువే. అయితే, ఇదంతా వైద్యుల సిఫారసుతో జరగట్లేదు. శృంగారంలో తన బలహీనత గురించి చర్చించడమంటే.. అది వైద్యుడితో అయినా సరే, చాలామంది పురుషులకు అహం అడ్డొస్తుంది.

తమకు అంగస్తంభన వైఫల్యం ఉందని చెప్పడమంటే పరువు పోయినట్టుభావిస్తారు. అందుకే.. వైద్యుల సిఫారసుతో వాడాల్సిన ఈ మందుల్ని విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో, ఓటీసీ (ఓవర్ ది కౌంటర్- అంటే మం దుల షాపులో తమంతట తామే కొనుక్కోవడం) తరహాలో వాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఇది ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. అందునా ఇటీవలి కాలంలో నకిలీ లైంగిక ఉత్ప్రేరక ఔషధాలూ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ధర తక్కువని అలాంటివాటిని కొనుగోలు చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

శారీరకమా? మానసికమా?
అంగస్తంభన వైఫల్యానికి అనేక కారణాలుంటాయి. కొన్నిరకాల మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావం కారణంగా తాత్కాలికంగా ఈ సమస్య తలెత్తవచ్చని వైద్యులు అంటున్నారు. మధుమేహ బాధితులు కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. ఈతరహావన్నీ వైద్యపరమైన కారణాలు. కానీ, ఇటీవలికాలంలో చిన్నవయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం మానసిక సమస్యలేనని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

"అసలు అంగస్తంభన అనేది చాలామంది విషయంలో మానసిక సమస్య మాత్రమే. వృత్తిపరమైన, కుటుంబ సమస్యలవల్ల కలిగే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి స్త్రీ, పురుషులిద్దరి లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతాయి. ఆ మానసిక సమస్యలు తొలగిపోగానే మునుపటి సామర్థ్యం మళ్లీ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలకు మందులు వాడటం అనవసరం'' అని యూనివర్సిటీ ఆఫ్ లండన్ సోషల్ సైకాలజిస్టు డాక్టర్ పెట్రా బాయ్‌న్‌టన్ అంటారు.

మానసిక సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిపైనా ప్రభావం చూపినప్పటికీ స్త్రీలతో పోలిస్తే మగవారే ఎక్కువగా కుంగిపోతారట. సమస్య మూలం తెలియకుండా అనవసరంగా మందులు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని సెక్సాలజిస్టు ప్రకాష్ కొఠారీ చెబుతున్నారు. "సమస్య రాగానే ఇలాంటి మందులు ఎవరి ఇష్ట ప్రకారం వారు వాడకూడదు. అసలు ఆ ఇబ్బంది ఎందుకు తలెత్తిందో ముందుగా అంచనా వేయాలి. మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందే మార్గం చూడాలి. రెండు నెలల తర్వాత కూడా సమస్య అలాగే ఉంటే అప్పుడు వైద్యులను తప్పకుండా సంప్రదించాలి'' అని కొఠారీ సూచించారు.

తస్మాత్ జాగ్రత్త
వయాగ్రా వాడకంతో తలనొప్పి, దృష్టి మందగించడం, కండరాల నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంది. మరికొందరిలో.. ప్రతి వస్తువూ నీలిరంగులో కనిపిస్తుంది. వయాగ్రా వాడకంతో కొందరిలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే చాలా దేశాల్లో వయాగ్రాను వైద్యుల మందు చీటీ లేకుండా విక్రయించరు. మన దగ్గరా నిబంధనలున్నాయిగానీ.. పాటించేవారు తక్కువ. జూ ప్రియాపిజం.. అంటే బాధాకరమైన దీర్ఘకాల అంగస్తంభన. లైంగిక ఉత్ప్రేరకాలు వాడిన తర్వాత 4 గంటలకు మించి అంగం స్తంభించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే. జూ గుండె జబ్బులకు నైట్రోగ్లిజరిన్ ఉన్న మందులు వాడేవారు వయాగ్రా వంటి ఉత్ప్రేరకాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. లైంగిక ఉత్ప్రేరకాలు వాడుతున్న సంగతి వైద్యులకు ముందుగానే చెప్పడం మంచిది.

ఇలా చేయొద్దు!
క్రీములు, మందుబిళ్లలు, శస్త్రచికిత్సలు, పంపులు.. ఇలా ఎన్నో చికిత్సలు! అన్నీ ఫలితాన్నిచ్చేవే. కానీ, కొన్ని చాలా ప్రమాదకరం. మరికొన్ని దీర్ఘకాలంలో దుష్ప్రభావం చూపేవే. మాదకద్రవ్యాల వాడకం: మాదకద్రవ్యాల వాడకం వల్ల తక్షణ దుష్ప్రభావాల సంగతెలా ఉన్నా అవి క్రమేణా మగతనాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. మారిజువానా వాడేవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి పెరిగిపోతుంది.

ధూమపానం: సిగరెట్ తాగడం, పొగాకు నమలడం మగతనానికి పొగబెట్టేవే. నపుంసకత్వానికి కారణమైన కాడ్మియం స్థాయి పొగాకు ఉత్పత్తుల్లో అత్యధికం. వీటి వాడకంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో గుండె, పురుషాంగం వంటి కీలక అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది.

మద్యపానం: మద్యం తాగితే సెక్స్ సామర్థ్యం పెరిగినట్టు అనిపించొచ్చుగాక... కానీ, అది నిజం కాదు. మద్యం తాగినప్పుడు మానసికంగా కొంత హుషారు ఉంటుంది. అదే శృంగారంలోనూ ప్రతిఫలిస్తుంది. కానీ, కాలం గడిచేకొద్దీ మద్యం శరీరంలోని అనేక కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఆ ఒత్తిడి మగతనంపైనా పడుతుంది.

సహజ ఉత్ప్రేరకాలు
వయాగ్రా, సియాలిస్, లెవిట్రా వంటి మందులు లైంగిక 'శక్తి'ని పెంచొచ్చుగానీ, వాటి వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, శృంగార జీవితాన్ని రసమయం చేసుకోవడానికి మనం ఆహారంలోనే మార్పులు చేసుకుంటే ఫలితం కనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఉదాహరణకు.. వాతం ప్రకోపిస్తే అంగస్తంభన వైఫల్యానికి దారితీస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. అలాగే కుంకుమపువ్వు, లవంగాలు, అల్లం వంటివి లైంగి క జీవితాన్ని ఉత్తేజితం చేస్తాయని పరిశోధనల్లో తేలింది. డార్క్ చాక్లెట్ కూడా లైంగిక ఉత్తేజాన్ని పెంచుతుంది. [b]మినప్పప్పులో.. పురుషుల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయులను పెంచే గుణాలున్నాయని, మినుములతో వీర్యవృద్ధి తథ్య మని ఆయుర్వేదం పేర్కొంటుంది. అత్తారింట్లో అల్లుళ్లకు బహుశా మినప సున్నుండలు ఇందుకే పెడతారేమో!![/b][/size][/color]

Posted

man send me login details man................... ur not king man.........

Posted

[quote name='loser' timestamp='1366561762' post='1303641470']
man send me login details man................... ur not king man.........
[/quote]

will send it wait [img]http://lh3.ggpht.com/-5YfGALcYGLk/UPjvZSyR8nI/AAAAAAAAJTc/VbuDTMd944o/s120/Brahmi-10.gif[/img]

×
×
  • Create New...