Jump to content

Ulfa's Mind Game


Recommended Posts

Posted

[b]2004 ఎన్నికలలో టి.ఆర్.ఎస్.తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వనప్పుడు గానీ, 2009లో టి.ఆర్.ఎస్.ను కాదని సొంతంగా పోటీ చేసినప్పుడు గానీ తెలంగాణ గుర్తుకురాని కాంగ్రెస్ నాయకులలో కొందరికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువస్తున్నది అన్నదే ప్రశ్న! తమ రాజకీయ ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను రాజశేఖరరెడ్డి తీర్చినంత కాలం వారికి తెలంగాణ వాదంతో అవసరం ఏర్పడలేదు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది వాస్తవం. భవిష్యత్‌లో రాజకీయ సమీకరణాలు మారితే మరో వాదాన్ని ఎత్తుకోవడానికి ఇలాంటి వారు ముందు వరుసలో ఉంటారు. [/b]

"ఉదర పోషణార్థం బహుకృత వేషం' అంటారు. రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే 'పదవుల రక్షణార్థం పార్టీ ఫిరాయింపులు' అని చెప్పుకోవాలి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నందున మన రాజకీయ నాయకులు బహుకృత వేషాలు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల మనోభావాలను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నామని కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయారాం- గయారాం సంస్కృతి ఈనాటిది కాకపోయినా, ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాలు, మన నాయకుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే రోత పుడుతోంది.

[b]ఏం ముక్తాయింపు?[/b]

కడచిన నాలుగేళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ ఎందుకు పుడుతుందో తెలీదు. ఎవరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరతారో తెలీదు. సొంత పార్టీ వాళ్లైనా ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు. అంతెందుకు! ఆయా పార్టీల అధినేతలే తమ పార్టీ నాయకుల వద్ద మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి. గత వారం రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఆయా నాయకుల ప్రకటనలు చూసిన తర్వాత ఈ ర్రాష్టాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ దేవుడే కాపాడాలన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారిని ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. దీంతో పార్టీ మారాలంటే జంకేవారు. ఇప్పుడు ప్రజలు కూడా నైతికత అన్న అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న నిర్ణయానికి నాయకులు వచ్చారు. తదనుగుణంగా ప్రకటనలు కూడా చేస్తూ, "ప్రజాభిప్రాయానికి అనుగుణంగా..'' అని ముక్తాయింపు ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే, 'ఔరా ఎంతటి వంచన!' అని ముక్కున వేలేసుకోవలసిన పరిస్థితి. ముందుగా కాంగ్రెస్ ఎం.పి. మంద జగన్నాథం వ్యవహారం తీసుకుందాం. 2009 ఎన్నికలకు ముందువరకు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.పి.గా ఉన్నారు.

పార్లమెంట్‌లో అణు ఒప్పందం విషయమై వామపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ యు.పి.ఎ. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఫలితంగా 2009 ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించడం, ప్రజలు మళ్లీ ఆయనను ఎం.పి.గా గెలిపించడం జరిగిపోయింది. దీంతో పార్టీ ఫిరాయించినా ఫరవాలేదన్న అభిప్రాయం జగన్నాథం వంటి వారిలో సహజంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నందున గెలిపించే పార్టీ కోసం ఆయన చూడటం మొదలెట్టారు. తెలంగాణలో సొంత రాష్ట్రం కావాలన్న సెంటిమెంట్ బలంగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఆయన చూపు పడింది. టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావుకు కూడా అభ్యర్థులు కావాలి కనుక పరస్పర ప్రయోజనాలు కాపాడుకోవచ్చునన్న నిర్ణయానికి వచ్చారు. అయితే పార్టీ మారడానికి ఒక సాకు కావాలి కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ మారడానికి సిద్ధమంటూ జగన్నాథం ఒక ప్రకటన చేసిపారేశారు. విచిత్రం ఏమిటంటే రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతవరకు మంద జగన్నాథం వంటివాళ్లు తెలంగాణ ఊసెత్తకపోవడం! రాజశేఖరరెడ్డి లేకపోవడంతోపాటు గత మూడున్నరేళ్లలో తెలంగాణవాదం బలపడటంతో ఇప్పుడు మంద వంటివారు ఆ వాదాన్ని ఎత్తుకుంటున్నారు.

ఇంకో మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో గెలవడం కోసమే మంద వంటి వారికి తెలంగాణవాదం కావాలి గానీ, తెలంగాణ రాష్ట్రం కాదు. రేపు తెలంగాణవాదం బలహీనపడితే మరో పార్టీని వెదుక్కుంటారు. అయినా వేరే పార్టీని వంచించి వచ్చినవాళ్లు అవకాశం చిక్కితే తమను కూడా వంచిస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించకపోవడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనం. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతగా చలామణి అవుతున్న కె.కేశవరావు విషయానికి వద్దాం. అన్నట్టు- కాంగ్రెస్‌లో ఎవరైనా ప్రజాబలం లేకపోయినా సీనియర్ నాయకుడిగా చలామణి కావచ్చు. తెలంగాణ కోసం ఏమి చేయడానికైనా సిద్ధం అని ఆయన ఇప్పుడు కళ్లు పెద్దవిగా చేసి, ముఖాన్ని అటూ ఇటూ వేగంగా కదిలిస్తూ, అవసరానికి మించి ఆవేశాన్ని ప్రదర్శిస్తూ, తనదైన హావభావాలను వ్యక్తంచేస్తూ ప్రకటనలు చేస్తున్నారు.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ తెలంగాణ గురించి మాట్లాడటానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోయేది కాదు. హఠాత్తుగా ఇప్పుడు వీర తెలంగాణవాదిగా మారారు. కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్లకు నామాలు ఎక్కువ అన్నట్టుగా కేశవరావులాంటి వాళ్లు తెలంగాణ కోసమే పుట్టినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీడియాలో ప్రచారం పొందుతున్నట్టుగా కేశవరావు నిజంగా జనాదరణ ఉన్న నాయకుడేనా? సీనియర్ నాయకుడు అంటే ఏమిటి? వంటి ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా ఉత్పన్నం అవుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం కేశవరావు శాసనమండలి సభ్యుడిగా ఉండేవారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని రాజ్యసభ సభ్యత్వం, పి.సి.సి. అధ్యక్ష పదవి ఇప్పించే వరకు ఆయన ఖాళీగానే ఉన్నారు.

ఈ మధ్యకాలంలో రెండు పర్యాయాలు అసెంబ్లీకి, ఒక పర్యాయం లోక్‌సభకు పోటీ చేసినా ఓడిపోయారు. ఇదీ కె.కేశవరావు చరిత్ర. రాజశేఖరరెడ్డి మాత్రమే పూనుకుని ఆయనకు పదవులు ఎందుకు ఇచ్చారా? అన్న అనుమానం కలగడం సహజం. తనను ఎదిరించగల సత్తా ఉన్న వ్యక్తి పి.సి.సి. అధ్యక్ష పదవిలో ఉంటే ఇబ్బంది కనుక పునాదిబలం లేని కె.కేశవరావు వంటి వారిని రాజశేఖరరెడ్డి అందలం ఎక్కించారు. ఇక తెలంగాణవాదానికి వద్దాం. పి.సి.సి. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గానీ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గానీ ఆయన తెలంగాణ కోసం ఏమైనా చేస్తాను అని ప్రకటించలేదు. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటనలను కూడా ఖండించలేదు. రాజశేఖరరెడ్డి మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం కె.కె.ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా నియమించింది.

ఈ పదవుల గడువు ముగియడం, మళ్లీ రాజ్యసభ పదవి లభించే అవకాశం లేకపోవడంతో ఆయన తెలంగాణవాదాన్ని ఎత్తుకున్నారు. ప్రజల నుంచి ఎదిగిన నాయకుడు కాకపోయినా, రాజకీయాల్లో తాను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండాలని కేశవరావు కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆయన ఎం.పి. కాకపోయినా "మా కాంగ్రెస్ ఎంపీలంతా సమావేశమై నిర్ణయం తీసుకుంటాం..'' అని చెబుతూ ఉంటారు. అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులో కూడా ఏక కాలంలో అర్థం కాకుండా మాట్లాడగల చాతుర్యం కేశవరావు సొంతం కనుక, ఆయన ఇంట్లో సమావేశం కావడానికి కాంగ్రెస్ ఎం.పి.లు కూడా సిద్ధపడతారు. మీడియాను తికమకపెట్టగల నేర్పరితనం కె.కె. సొంతం. అదేమంటే నేను కూడా పాత్రికేయుడినే అని దబాయిస్తుంటారు. ఈ విషయం అలా ఉంచితే, రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు తెలంగాణ కోసం కె.కె. లాంటివాళ్లు ఎందుకు గొంతెత్త లేదు అన్న ప్రశ్నకు సమాధానం ప్రజలే గ్రహించాలి. తెలంగాణ ఉద్యమం ఈ మూడు నాలుగేళ్లలో పుట్టింది కాదే! పదేళ్లకు పైగా కె.సి.ఆర్. తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

2004 ఎన్నికలలో టి.ఆర్.ఎస్.తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వనప్పుడు గానీ, 2009లో టి.ఆర్.ఎస్.ను కాదని సొంతంగా పోటీ చేసినప్పుడు గానీ తెలంగాణ గుర్తుకురాని కాంగ్రెస్ నాయకులలో కొందరికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువస్తున్నది అన్నదే ప్రశ్న! తమ రాజకీయ ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను రాజశేఖరరెడ్డి తీర్చినంత కాలం వారికి తెలంగాణవాదంతో అవసరం ఏర్పడలేదు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది వాస్తవం. భవిష్యత్‌లో రాజకీయ సమీకరణాలు మారితే మరో వాదాన్ని ఎత్తుకోవడానికి ఇలాంటి వారు ముందు వరుసలో ఉంటారు. అయినా కె.కేశవరావు వంటివాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ తన పార్టీలోకి రావలసిందిగా కె.సి.ఆర్. ఎందుకు ఆహ్వానిస్తున్నట్టు? ఇలాంటి వాళ్లు రేపు తనను కూడా వదిలిపెట్టిపోతారని ఆయనకు తెలియదా? తెలియదనుకుంటే పొరపాటు. అందరికీ అన్నీ తెలుసు.

ఏమీ తెలియంది ప్రజలకే! ప్రస్తుతానికి పబ్బం గడవాలి. 2014 ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి. ఇదీ కె.సి.ఆర్. లక్ష్యం. 2014 తర్వాత కూడా తెలంగాణ వస్తుందన్న భరోసా ఎవ్వరూ ఇవ్వరు..! ఎందుకంటే గెలిచిన వాళ్లు ఎంతమంది తమతో ఉంటారో కె.సి.ఆర్. వంటివాళ్లు చెప్పలేరు. 2009 ఎన్నికల తర్వాత టి.ఆర్.ఎస్. తరఫున ఎన్నికైన ఎం.ఎల్.ఎ.లలో పలువురు కాంగ్రెస్‌లోకి దూకడానికి సిద్ధపడిన విషయం బహిరంగ రహస్యం. రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే 'ఆపరేషన్ ఆకర్ష్' విజయవంతంగా పూర్తి అయ్యేది. 2014 తర్వాత కేంద్రంలో మళ్లీ యు.పి.ఎ. ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ నుంచి వలస వచ్చి టి.ఆర్.ఎస్. తరఫున పోటీచేసి ఎన్నికల్లో గెలిచిన వారు మళ్లీ కాంగ్రెస్‌లో చేరరన్న గ్యారంటీ ఏమీ లేదు. టి.ఆర్.ఎస్.లో చేరతారని ప్రచారం జరుగుతున్న మిగతా కాంగ్రెస్ ఎం.పి.లు రాజయ్య, వివేక్, పొన్నం ప్రభాకర్ వంటివాళ్ల విషయం తీసుకుందాం. పిన్న వయస్కుడైనా పొన్నంను కాంగ్రెస్ ఎం.పి.ల కన్వీనర్‌గా రాజశేఖరరెడ్డి నియమించారు. దీంతో అప్పట్లో ఆయన తెలంగాణవాదం కోసం పోరాడలేదు. ఇప్పుడు తెలంగాణవాదాన్ని భుజానికెత్తుకోకపోతే గెలవలేమన్న అభిప్రాయంతో టి.ఆర్.ఎస్. నాయకులను మించి తెలంగాణ ర్రాష్టాన్ని కలవరిస్తున్నారు.

మరో ఎం.పి. వివేక్ వ్యవహారం కూడా ఇంతే! రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతవరకు తెలంగాణ కావాలన్న కోరికను పెదవి దాటనివ్వలేదు. వరంగల్ ఎం.పి. రాజయ్య విషయానికి వద్దాం. ఈయన వరంగల్ జిల్లా పరిషత్ సి.ఇ.ఒ.గా పనిచేసి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడ్డారు. ఉద్యోగం ఎలాగూ పోతుందని తెలిసి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి రాజశేఖరరెడ్డి పుణ్యమా అని పార్టీ టిక్కెట్ పొంది ఎం.పి. అయ్యారు. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయనా చెబుతున్నారు. ఇలా చూస్తే టి.ఆర్.ఎస్.లో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ ఎం.పి.లది ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర! తెలంగాణలో జగన్మోహన్‌రెడ్డి పార్టీ బలపడలేదు గానీ, ఆ పార్టీ బలపడి ఉండి ఉంటే అందులోకి పోవడానికి కూడా వీరు సిద్ధపడేవారే! దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేది ఒకటే! ఎన్నికలలో గెలవడానికే తెలంగాణవాదాన్ని వాడుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. గెలిచిన తర్వాత తెలంగాణ రాకపోయినా ఎవరికీ పట్టదు. "మా పార్టీ వాళ్లతో కూడా మనస్సు విప్పి అన్ని విషయాలూ మాట్లాడలేని దుస్థితి ఏర్పడింది. ఉదయం పూట నన్ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించిన వారు, సాయంత్రానికి పార్టీ మారిన సంఘటనలు చూస్తూ ఉంటే నా మీద నాకే నమ్మకం పోతోంది. పార్టీ ఫిరాయింపులను గతంలో కూడా చూశాను గానీ... ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు..'' అని ఒక పార్టీ అధినేత ఇటీవలే తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతగా కలుషితమైన రాష్ట్ర రాజకీయాలను ఎవరు బాగు చేయాలి..?


[b]వచ్చేది ఆషాడభూతుల కాలం[/b]

వచ్చే ఎన్నికలలో ఇలాంటి ఆషాడభూతులు ఎందరో మనకు కనిపిస్తారు. అయినా విధేయతకు కట్టుబడని, తమకు అవకాశం ఇచ్చిన పార్టీలను చొక్కాలు మార్చినంత తేలికగా మార్చడానికి సిద్ధపడుతున్న వారి కోసం అటు జగన్మోహన్‌రెడ్డి గానీ, ఇటు కె.చంద్రశేఖరరావు గానీ ఎందుకు ఆరాటపడుతున్నారని సామాన్య ప్రజలకు సందేహం రావచ్చు. ఇదంతా రాజకీయాలలో భాగమే! రేపటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు పబ్బం గడుపు కోవడమే ముఖ్యం కనుక ప్రత్యర్థి రాజకీయ పక్షాలతో మైండ్ గేమ్ ఆడటం వర్తమాన రాజకీయం. కరీంనగర్‌కు చెందిన తెలుగుదేశం ఎం.ఎల్.ఎ. గంగుల కమలాకర్ టి.ఆర్.ఎస్.లో చేరకపోయినా కె.సి.ఆర్.కు పొద్దు గడవకపోదు. అయితే సంస్థాగతంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బతీయడం కోసమే ఈ ఫిరాయింపుల నాటకం. గంగుల కమలాకర్ కూడా కె.సి.ఆర్. మీద ప్రేమతో ఆయన పార్టీలో చేరలేదు. వచ్చే ఎన్నికలలో గెలిస్తే ఆ తర్వాత సంగతి అప్పుడు చూసుకుంటారు. కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలకు చెందిన వారిని చేర్చుకోవడం ఎందుకు? ఇప్పుడు మీ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది కదా? కొత్త వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా? అని జైలులో ఉన్న జగన్మోహన్‌రెడ్డిని సాటి వి.ఐ.పి. ఖైదీ ఒకరు ప్రశ్నించగా, "ప్రస్తుతానికి జనంలో బాగానే ఉన్నా... కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలను, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఏ మాత్రం అవకాశం చిక్కినా చంద్రబాబు నన్ను ఫినిష్ చేస్తారు. అందుకే ముందుగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికి ఆ పార్టీ వాళ్లను మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను'' అని జగన్మోహన్‌రెడ్డి బదులిచ్చారు.

చిరంజీవి కూడా ఇలాగే ఇతర పార్టీ వాళ్లతో తన పార్టీని నింపేసి దెబ్బతిన్నారు కదా? అని మళ్లీ ప్రశ్నించగా, "చిరంజీవికి, నాకూ పోలిక ఏమిటి? కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒకటి లేచిపోతుంది. అప్పుడు రాష్ట్రంలో మా పార్టీ మాత్రమే బలపడుతుంది. ఒక్కసారి అధికారంలోకి వస్తే అంతో ఇంతో బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీని మరింత బలహీనపరుస్తాను. ఇవ్వాళ రేపు అధికారం- డబ్బు లేకుండా రాజకీయాలలో నిలదొక్కుకోలేని పరిస్థితి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒక పార్టీని నామరూపాలు లేకుండా దెబ్బతీయవచ్చు...'' అని జగన్మోహన్‌రెడ్డి తన మనస్సులో మాట బయటపెట్టారట. ఇంచుమించుగా తెలంగాణలో కె.సి.ఆర్. ఆలోచనలు కూడా ఇలాగే సాగుతున్నాయి. కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి ఆ పార్టీలను మానసికంగా దెబ్బతీసి, 2014 ఎన్నికలలో గరిష్ఠంగా సీట్లు సంపాదించుకుంటే... రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తన సహకారం అవసరమవుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒకటి నామమాత్రమవుతుందనీ, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఢోకా ఉండదన్నది కె.సి.ఆర్. వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ వ్యూహ ప్రతివ్యూహాలలో అటు తెలంగాణవాదం గానీ, ఇటు రాష్ట్ర విశాల ప్రయోజనాలు గానీ ఎవరికీ అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాలు నెరవేరితే చాలు!

Posted

Political parties became Red Light areas especially YSRCP and TRS...

  • Upvote 1
Posted

[quote name='BobbyFischer' timestamp='1366618010' post='1303644101']
Political parties became Red Light areas especially YSRCP and TRS...
[/quote]

Aa red light area modalettidi PRP thone kada mayya

[img]http://i.imgflip.com/pe3n.gif[/img]

Posted

[quote name='chandrabhai7' timestamp='1366618101' post='1303644105']
Aa red light area modalettidi PRP thone kada mayya

[img]http://i.imgflip.com/pe3n.gif[/img]
[/quote]

PRP vallu prostitutes...Congress red light area...

Posted

[quote name='BobbyFischer' timestamp='1366618348' post='1303644112']


PRP vallu prostitutes...Congress red light area...
[/quote]

CBN vaatiki head....

×
×
  • Create New...