Jump to content

Good Morning.... Friday Flashback :)


Recommended Posts

Posted

[size=5]మొన్నే మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ని కలిసాను..చాలా రోజుల తరువాత.. మేము CSE బ్రాంచ్ లో పాండవీనిలం అని మేము ఫీల్ అయ్యేవాళ్ళం.. అంటే అయిదుగురం.. అప్పట్లో కలిసి వేసిన కోతి వేషాలన్నీ గుర్తు తెచుకుంటూ బలే ఎంజాయ్ చేసాం..
కొన్ని మచ్చుతునకలు... [/size]

[size=5] మా కాలేజీ చాలా బాగుండేది.. చుట్టూ పక్కల కొండలు, చెట్లు .. వర్షా కాలం లో అయితే చిన్న సైజు అడవి లా ఉండేది మొత్తం.. మధ్యలో కాలేజీ ఉండేది.. చాల అందంగా ఉండేది.. కానీ నాకు నచ్చనిది ఏంటయ్యా అంటే.. మా కాలేజీ మెయిన్ గేటు.. గడియారం 11 కొడితే చాలు మూసుకు పోయేది. మేము లంచ్ తరువాత పారిపోదాం అనుకుంటే మా ప్రిన్సిపాల్ గేటు లు మూయిన్చేసే వారు. ఐతే మేము ఊరుకుంటామా.. కాలేజీ ఫెన్సింగ్ బంధాలని ఒక చోట విడగొట్టి మరీ పారిపోయేవాళ్ళం... ఒకసారి ఇలాగే దూకుతుంటే ఆ ఫెన్సింగ్ వైర్ కి తట్టుకుని మా క్లాసు మేట్ చొక్కా చిరిగిపోయింది. అయ్యయ్యో అనేసి, ఒక సానుభూతి చూపు పడేసి, ఆ ఫెన్సింగ్ దూకడానికి రెడీ అయిపోయాం.. ఆ ఫెన్సింగ్ దూకినా కానీ.. మళ్ళీ మా కాలేజీ మెయిన్ గేటు ముందు నుండే వెళ్ళాలి.. అది ఇంతకి దారి తీసిందంటే.. ఆటో వాళ్ళు కూడా అక్కడే( ఆ బంధం విడిపోయిన ఆ ఫెన్సింగ్ దగ్గర) మా కోసం ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసేలా.. క్రమ క్రమంగా ఆ దారే మాకు రహదారి గా పరిణితి చెందుతున్న తరుణం లో.. [/size]


[size=5] ఒక రోజు మా కాలేజీ గ్రౌండ్ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసారు. అది యోగ గురించి లేక ఇంకా దేని గురించో అనుకుంటా.. నాకు సరిగ్గా గుర్తు లేదు. ఐతే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం పదండే అంటే నేను వద్దు కొంచెం టైం పాస్ చేసి వెళ్దాం(వాళ్ళ స్పీచ్ వింటూ అక్కడున్న వారిని కామెంట్ చేస్తూ పొందే రాక్షసానందం అంతా ఇంతా మరి... [/size]

[size=5]అంటే నన్ను లాక్కుని మరీ వెళ్ళిపోయారు.అక్కడేమో మా ప్రిన్సిపాల్ ఆల్రెడీ గేటు లు మూయిన్చేసి ఒక HOD ని కూడా కాపలా పెట్టాడు.. నేనేమో లోపల్లోపల సంతోష పడిపోతూ గ్రౌండ్ లోకి వేల్లిపోదామే అన్నాను కానీ మా వాళ్ళు ఊరుకుంటే కదా.. మన దొడ్డి దారి ఉంది కదా అని.. మేమింకా వేరే దిక్కు లేక మా రహదారి గుండా బయలుదేరాం.. చుట్టూ చూస్తున్నాం మమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని.. ( మరి detective సినిమా లలో హీరో , హీరోయిన్ లు అలాగే చేస్తారుగా.. కానీ అంత సీన్ లేదని అర్ధం ఐంది లెండి కానీ.... మమ్మల్నే ఫాలో అవుతున్న కొందరు శిష్యులు మాత్రం కనిపించారు.. ఓరి వీళ్ళ దుంప తెగ అనుకున్నాను( మనసులోనే.. బయటికి అంటే రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ కారణం గా మొదలయినట్టు మూడో ప్రపంచ యుద్ధానికి కారకురాలు నేనే అయ్యి ఉండేదాన్ని.. అనవసరంగా తరువాతి తరం పిల్లల చేతిలో తిట్లు తినేదాన్ని.. మరి నేను తిట్టుకున్నా కదా యుద్ధాలు చేసిన వాళ్ళని .. వాళ్ళ వల్లే కదా సోషల్ స్టడీస్ సిలబస్ అంతగా పెరిగిపోయింది. సో.. ఇంకా ఆ తరువాతి తరం పిల్లల మీద జాలి తో నేనెవరిని ఏమి అనలేదన్నమాట బయటికి మాత్రం.. ) ఇంకా తప్పేది లేదు కదా అని ఆ ఫెన్సింగ్ ని దాటి,, వడి వడి గా అడుగులు వేస్తూ.... మెయిన్ గేటు ముందు కి వచ్చేసరికి... ట్విస్ట్.... మా కాలేజీ డైరెక్టర్ కార్ లో ఎదురుగా వచ్చి మేము వచ్చిన స్పీడ్ కి రెట్టింపు స్పీడ్ తో లోపలి లాక్కెళ్ళారు.. నేనైతే పండగ చేసుకున్న.. కానీ బయటకి మాత్రం నో expressions .. [/size]


[size=5] కానీ మా దోస్తు లు నా కంటే ముదుర్లు.. తీసుకెళ్ళి ఒక ఖాళీ క్లాసు లో కూర్చోబెట్టారు.. వెళ్దాం అంటే గ్రౌండ్ కి రారు.. ఎంత సేపు బ్రతిమి లాడిన వేస్ట్ అని నాకు అర్ధం అయ్యి , ఇంకా మరి కనీసం ఇంటికైనా వెల్లిపోదాం పదండి అన్నాను. వాళ్ళు మరి ఆ డైరెక్టర్ ఉన్నారు కదా అంటే.. నేను వీర లెవెల్లో.. నన్ను నమ్ముకున్న వాళ్ళు నష్టాల పాలవ్వరు అని ఒక డైలాగ్ కొట్టి వాళ్ళతో పాటు ఆ రహదారి గుండా బయలుదేరాం.. కానీ ఈ సారి మాకెవరు ఎదురు కాలేదు.. వెనకాల చూస్తే మాత్రం మా యొక్క మరో శిష్య సంఘం మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అర్ధం ఐంది. నేను చేసేది కోతి పనైనా సరే అన్ని పక్కాగా చుస్కునేదాన్ని అప్పట్లో.. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు లెండి.. పనికొచ్చే పని కే ప్లానింగ్ లేదు ..ఇంకా పనికి రాని పనికి కూడానూ.. సో........ మొత్తానికి బయట పడ్డాం
మరోటి, [/size]

[size=5] స్టూడెంట్స్ తక్కువగా ఉన్న క్లాసు లు వినడం నాకిష్టం. కానీ మా క్లాసు లో 60 మంది. సో, కుదరదు కదా.. కానీ అలా వినడానికి ఇంకో దారి ఉంది. మా కాలేజీ లో బేసిక్ గా CSE స్టూడెంట్స్ లంచ్ తరువాత క్లాసు లు వినరు. బంక్ కొట్టి వెళ్ళడం మా ఆనవాయితీ, సంప్రదాయం కూడానూ.. రెండూ ఒకటే అంటారా.. ఏమో లే మరి నేను ఈ ఆనవాయీతీ ని నా కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించాను.. అసలే మనది సోషల్ స్టడీస్ లో బోర్ మోడల్ గురించి రాసే బ్రెయిన్ కదా మరిఅందరితో వెళ్ళిపోతాం అని చెప్పి నేను మా గ్యాంగ్ తో సహా లంచ్ ఐపోయాక వచ్చి క్లాసు లో కూర్చునేదాన్ని.. దీని వాళ్ళ రెండు ఉపయోగాలు ఉండేవి.. ఒకటేమో తక్కువ స్టూడెంట్స్ ఉన్న క్లాసు వినడం.. రెండోదేమో , లెక్చరర్స్ కి మన మీద మంచి impression రావడం.. దీని ఫలితం ఇంటర్నల్ మార్క్స్ లో, ల్యాబ్ external లో కనిపిచేదన్నమాట హిహిహి.. [/size]
[size=5] ఆ రోజులూ అలా అలా గడుస్తూ ఉండగా.. ఒకానొక శుభ దినాన మా క్లాసు మేట్, రమ్య ( ఫ్రెండ్ ఎ కానీ నాకు మరీ అంత జిగ్గు కాదు. కానీ ఈ సంఘటన తరువాత జిగ్గు ఐంది.. మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడుతుండగా.... నా చిన్న మెదడు చితికినట్టనిపించి... మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాను.. షాక్.......మా ఇంకో క్లాసు మేట్ అనిల్ దగ్గర నుండి మెసేజ్ ఉంది. లవ్ అని .. అది నేను ఊహించలేదు.. అప్పటికే మేము 3rd ఇయర్ లో ఉన్నాం.. ఏవైనా స్టోరీస్ ఉంటె ఆ పాటికే తెలిసేవి.. కానీ మా చెవి దాకా రాకుండా ఇన్నాళ్ళనుండి బయట పడలేదు ఈ స్టొరీ. వెంటనే కను సైగలతో మా రెండో పాండవీని పిలిచి, చూపించాను మెసేజ్.. ఆ రమ్య కి , వాళ్ళ గ్యాంగ్ కి అనుమానం రాకుండా.. అప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏంటయ్యా అంటే.. ఆ సమాచారాన్ని మిగతా పాండవీని లకి చేరవేయడం.. తరువాత కామెంట్స్ చేయడం.. వెంటనే ఈ అడ్డంకి మా కర్తవ్యానికి అడ్డు పడక ముందే.. మిగతా పాండవీని లా చెవిలో ఊదేసాం.. [/size]


[size=5] ఇంకా తరువాతి రోజు నుండి మా పని.. ఆ అమ్మాయి మొబైల్ గేమ్స్ ఆడుతా అని తీస్కోవడం, మెసేజెస్ చూడటం, ఆ ఇద్దరినీ గమనించడం..
ఆ అబ్బాయి తో నేను మాట్లాడేదాన్ని.. సో, ఒకరోజు మాటల మాట అడిగేసాను.. నువ్వు రమ్య కి ట్రై చేస్తున్నావంట కదా అని.. ఆ అబ్బాయి అదేమీ లేదు.. నీకెలా తెలుసు.. ఎవరు చెప్పారు.. ఎప్పుడు చెప్పారు.. అలాంటిదేమీ లేదు.. అసలు నీకెవరు చెప్పారు చెప్పు అని నా చితికిన మెదడు ని రోట్లో వేసి ఇంకా చితక్కోట్టేసాడు.. కొసరు కోసం అసలు పారబోసిన చంటి బిడ్డ లా ఐంది నా పరిస్థితి.. తప్పించుకోవడానికి గంట పట్టింది.. మా ఫ్రెండ్స్ కి వెళ్లి చెప్తే ఒదారుస్తారేమో అనుకుంటే నన్నే తిట్టేసారు.. నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే, పొగడ్తలు నాకు గిట్టవని చెప్పినా వినకుండా మహా పొగిడేశారు.. ఏంటో.. ఈ పిచ్చి అభిమానం.. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపొయింది. she is happy now.. ఇప్పుడు ఆ అబ్బాయి facebook లో కనిపించినా హాయ్ అంటే హాయ్ చెప్పి ఊరుకుంట.. మరి పాత experience ని మళ్ళీ repeat చేయడానికి మనసొప్పడం లేదు.. ఆరోగ్యానికి అంత మచిది కాదు అని నా మైండ్ హెచ్చరించింది.. అప్పుడప్పుడు వినాలి కదా మరి..[/size]




[size=5]Source : Oka engineering friend rasina oka gnyapakam.. [/size]

Posted

Nenu ninnu edanoo susna vayy... Neeku ade feeling vasthundaa

Posted

[quote name='Seenu_Bhai' timestamp='1368218144' post='1303735980']
Nenu ninnu edanoo susna vayy... Neeku ade feeling vasthundaa
[/quote]

:3D_Smiles: :3D_Smiles: :3D_Smiles:

Posted

[quote name='ChoclateBoy' timestamp='1368219170' post='1303736097']


:3D_Smiles: :3D_Smiles: :3D_Smiles:
[/quote]

Aa supendi chusnattu unda leda adi seppu

×
×
  • Create New...