Jump to content

Yentha Mandi Yela Untharu


Recommended Posts

Posted

తెలుగు ఆడపచులకు అమెరికాలోనూ ఆరళ్లు తప్పడం లేదు. భూలోక స్వర్గంగా మనోళ్లు భావించే అగ్రరాజ్యంలోనూ ఆడవాళ్లు వేధింపులకు గురవుతున్నారు. కోటి ఆశలతో కట్టుకున్నోడి వెంట యూఎస్ లో అడుగుపెడుతున్న పడుతులకు కొంతమంది ప్రవాస సతులు నరకం చూపిస్తున్నారు. పెళ్లవకముందు అమాయకుల్లా ఫోజులు పెట్టి అమెరికాకు రాగానే అసలు రూపం బయట పెడుతున్నారు. దేశంకాని దేశంలో తమను ఎవడు అడిగేవాడు ఉండడన్న దీమాతో జులాయి భర్తలు రెచ్చిపోతున్నారు. విపరీత పోకడలతో పెట్రేగిపోతున్నారు.

పాశ్చాత్య వెల్లువలో కొట్టుకుపోతున్న కొంతమంది ఎన్నారై భర్తలు మాంగల్య బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నారు. చెడు అలవాట్లు, సావాసాలతో పెడదోవ పట్టడమే కాకుండా కట్టుకున్న భార్యను 'కాని పని' చేయమని వేధిస్తున్నారు. తాము చెడిపోవడమే కాకుండా సహధర్మచారిణిని చెర బట్టేందుకు వెనుకాడడం లేదు. ఆధునికత పేరుతో అటవికంగా ప్రవర్తిస్తున్నారు. విదేశాల్లో ఇలాంటివన్నీ సాధారంగా జరిగేవేనంటూ సమర్థించుకుంటున్నారు. తాజాగా ఓ ఎన్నారై భర్త శాడిజం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని వికాస్‌పురి కాలనీ యువతి(26)తో, గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన పల్లెర్ల సత్యనారాయణరెడ్డి, అన్నపూర్ణ దంపతుల కుమారుడు శ్రీకర్‌రెడ్డికి గతేడాది జూలై 28న వివాహమైంది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు తీసుకున్నాడు. తనకు ఎలాంటి దురలవాట్లూ లేవని, ఎమ్మెస్ చదివిన తనకు 80 వేల డాలర్ల జీతం వస్తుందని మ్యాట్రిమోనీలోని తన ప్రొఫైల్లో పేర్కొన్నాడు. ఇవి నిజమని నమ్మిన యువతి తల్లిదండ్రులు అతడికి తమ కుమార్తెనిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి చేసుకొని శ్రీకర్ తో కలిసి షికాగోలో అడుగుపెట్టిన యువతికి వారం తిరక్క ముందే అతడి నిజస్వరూపం తెలిసిపోయింది.

తాగుడే కాకుండా ఇంట్లో తన ముందే వేరే అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అంతడితో ఆగకుండా, తన స్నేహితులతో గడపాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. భర్త ఆగడాలను భరించలేని ఆమె.. అత్తామామలకు తెలుపగా, వారూ తమ కుమారుడినే వెనకేసుకొచ్చారు. పైగా అమెరికాలో ఇలాంటివి సహజమేనని, ఆ జీవితానికి అలవాటు పడాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇక చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించారు. అత్తను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమాజిగూడలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్న మామ సత్యనారాయణరెడ్డి పత్తా లేకుండా పోయాడు. తమ బిడ్డలా ఏ ఆడపిల్లా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని బాధితురాలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సంబంధమనగానే చంకలు గుద్దేసుకుని ముందువెనుక ఆలోచించకుండా హడావుడిగా పెళ్లిళ్లు చేసే ఆడపిల్లల తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త!

×
×
  • Create New...