Jump to content

Ys Viveka...church Lu Gutakaya Swaaha


Recommended Posts

Posted

[color=#000080][size=4][font="Verdana,Arial,Helvetica"][font="Verdana,Arial,Helvetica"][b][size=5]చర్చినీ వదల్లేదు[/size]

హెబ్రోన్ ఆస్తులపై కన్ను..
రంగంలోకి దిగిన వైఎస్ బంధువు
సొసైటీలో సభ్యత్వం లేకపోయినా చర్చిలోకి
సొసైటీని నిర్వీర్యం చేసేందుకు ట్రస్ట్ ఏర్పాటు
2000 కోట్ల ఆస్తులు చేజిక్కించుకునే ప్లాన్
అడ్డు పడిన వారిపై అక్రమ కేసులు.. దాడులు
స్పందించని ప్రభుత్వం.. పోలీసులు
న్యాయపోరాటానికి దిగిన క్రైస్తవులు చేతిలో నిత్యం బైబిల్ పట్టుకుంటారు! బైబిల్ చెప్పిన సూక్తులకే నిలువునా పాతరేస్తారు! తాము క్రైస్తవులమని అంటారు! చర్చి ఆస్తులనే భోంచేయడానికి రెడీ అయ్యారు! ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఓ మహానుభావుడు నెలకొల్పిన చర్చిల ఆస్తులను కాజేసేందుకు ప్లాన్ వేశారు. ర్రాష్టానికి ఏన్నో 'మేళ్లు' చేశారంటున్న వ్యక్తి తాలూకు మనుషులే ఈ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుపడ్డ దైవ సేవకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రమాదంలో పడటంతో బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవుల మధ్య చిచ్చుపెడుతున్న హెబ్రోన్ చర్చి ఆస్తుల వ్యవహారంపై ప్రత్యేక కథనం! హైదరాబాద్, మే 15: భక్త్ సింగ్.. పంజాబ్‌లో పుట్టిన సిక్కు మతస్తుడు. ఇంజినీరింగ్ చదివారు. ఉన్నత చదువుల కోసం పశ్చిమ దేశాలకు వెళ్లినప్పుడు క్రైస్తవ మతం వైపు ఆకర్షితుడయ్యారు. నాటినుంచి క్రీస్తు బోధనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా హెబ్రోన్ సొసైటీని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల చర్చిల్ని నిర్మించారు. మత ప్రచారంలో భాగంగా 1950లో హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రంలో 2200 హెబ్రోన్ చర్చిల్ని నెలకొల్పారు. ప్రపంచంలోనే వేగంగా, నాణ్యతతో నిర్మించిన చర్చిలుగా హెబ్రోన్ క్రైస్తవ కేంద్రాలకు విశిష్ఠ స్థానముంది. అందుకే, భక్త్ సింగ్‌ను క్రైస్తవ ప్రపంచం దైవ పుత్రుడిగా కీర్తించింది. 2000లో 97 ఏళ్ల భక్త్ సింగ్ మరణించారు. తాను స్థాపించిన చర్చిలకు ప్రజలనే వారసులుగా ప్రకటించారు. దీంతో, హెబ్రోన్ సొసైటీ సభ్యులే చర్చిల బాధ్యతను నిర్వహించేవారు. నగరానికి నడిబొడ్డున, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పురాతన హెబ్రోన్ చర్చి ఉంది. ఇక్కడ గజం విలువ లక్ష రూపాయలకుపైనే. ఈ చర్చికి కోట్లాది ఆస్తులు కూడా ఉన్నాయి. వీటిని కబళించడానికే గద్దలు వాలిపోయాయి. వైఎస్ సీఎం అయ్యాక!
తొలి నుంచీ ప్రశాంతంగా ఉండే హెబ్రోన్ చర్చిలో 2004 నుంచి కలహాలు మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హెబ్రోన్ సొసైటీకి కష్టాలు మొదలయ్యాయి. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన నాటి ప్రభుత్వ పెద్దల తీరుతో హెబ్రోన్‌లోకి కూడా అక్రమార్కులు ప్రవేశించారు. వైఎస్ అండ చూసుకుని, స్వయానా ఆయన మేనత్త కొడుకు ఈఅఖి పీటర్ - హెబ్రోన్ ఆస్తులపై కన్నేశారు. వైఎస్ హయాంలో ఈ పీటర్ అనేక కీలక పదవులు వెలగబెట్టిన సంగతి తెలిసిందే. సొసైటీలో సభ్యుడు కాకపోయినా.. కొందరు సభ్యులను తనవైపునకు తిప్పుకొని హెబ్రోన్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. దీనికి ఐఏఎస్ అధికారిగా ఉన్న డి.థామస్ మద్దతు పలికారు. పీటర్, థామస్ ఇద్దరూ కలిసి అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న హెబ్రోన్ చర్చిలను సొంత జాగీరు చేసుకోవడంపై పాత సొసైటీ సభ్యులు.. చర్చిల పాస్టర్లు గళమెత్తారు. సొసైటీని రద్దు చేసే హక్కు గానీ, ట్రస్ట్ ఏర్పాటు చేసే హక్కుగానీ ఎవరిచ్చారని నిలదీశారు. ఎదిరించిన వారిని అంగ బలాన్ని ఉపయోగించి పీటర్.. అధికార బలంతో థామస్ అణచివేయడం ప్రారంభించారు. అక్రమ కేసులు బనాయించి, సొసైటీ సభ్యులపై ట్రస్ట్ పెద్దలు దాడులు చేయించారు. హెబ్రోన్‌లో పీటర్, థామస్ సాగిస్తున్న అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మొర పెట్టుకున్నా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కాగా, హెబ్రోన్ చర్చిలకు మన రాష్ట్రంలో సుమారు రూ.2వేల కోట్ల ఆస్తులున్నాయి. వాటిపై ఆధిపత్యం కోసమే సొసైటీని.. [/b][/font][/font][/size][/color]

Posted

[color=#000080][size=4][font="Verdana,Arial,Helvetica"][font="Verdana,Arial,Helvetica"][b][b]ట్రస్ట్‌గా మార్చి సొసైటీతో ఎలాంటి సంబంధం లేని పీటర్ ట్రస్ట్‌లో అధికారం చెలాయిస్తున్నారు. హెబ్రోన్ ఆస్తులన్నింటినీ హస్తగతం చేసుకునేందుకు పీటర్, థామస్ పక్కాగా ప్లాన్ గీశారన్నది ఆ చర్చిలతో సంబంధం ఉన్న ప్రతి క్రైస్తవుడికీ తెలిసిన విషయమే. సమాజ హితం కోరి భక్త్ సింగ్ స్థాపించిన హెబ్రోన్ సొసైటీ ఆస్తులు దుర్వినియోగమవుతోంటే సొసైటీలోని కొందరు సభ్యులు న్యాయ పోరాటానికి దిగారు. భక్త్ సింగ్ చనిపోయాక సొసైటీతో సంబంధం లేని వ్యక్తి ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ట్రస్ట్ పెద్దల్ని చర్చలకు ఆహ్వానిస్తే వారు సహకరించడం లేదని చెబుతున్నారు. హెబ్రోన్ ఆస్తుల్ని కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపాలని... ట్రస్ట్ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించాలని సొసైటీ సభ్యులు డిమాండు చేస్తున్నారు. లేకపోతే వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తులు గుంటనక్కలకు ఆహారంగా మారిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీటర్, థామస్ అనుచరుల దాడి
హెబ్రోన్ ట్రస్ట్ అక్రమాలపై సొసైటీ సభ్యులు 'ఆంధ్రజ్యోతి - ఏబీఎన్'ను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని హెబ్రోన్ ప్రధాన కార్యాలయానికి ఏబీఎన్ ప్రతినిధులు వెళ్లగా ట్రస్ట్ సభ్యులు అక్కడి దృశ్యాలు చిత్రీకరించవద్దని అడ్డుకున్నారు. ట్రస్ట్ సభ్యులు చర్చి నుంచి వెళ్లిపోవాలని సొసైటీ సభ్యులు అనడంతో జీర్ణించుకోలేకపోయిన థామస్, పీటర్ అనుచరులు దాడులకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. సుమారు రెండు గంటలపాటు ఇరు వర్గాలు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినా పోలీసులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అక్రమ కేసులు బనాయించారు: రూబెన్ ఫ్రాన్సిస్, ్ణసొసైటీ సభ్యుడు
మాపై అక్రమంగా కేసులు బనాయించారు. సొసైటీ సభ్యులపై దాడులూ జరిగాయి. పీటర్, థామస్ అరాచకాలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేదు.
రూ.2 వేల కోట్ల ఆస్తులున్నాయి: పీటర్ ఫ్రాన్సిస్
హెబ్రోన్ చర్చికి రాష్ట్రవ్యాప్తంగా రూ.2వేల కోట్ల ఆస్తులున్నాయి. వాటిపై ఆధిపత్యం కోసమే సొసైటీని ట్రస్ట్‌గా మార్చారు. సొసైటీకి ఎటువంటి సంబంధం లేని పీటర్ ట్రస్ట్ ముసుగులో పెత్తనం చెలాయిస్తున్నాడు. ఈ ఆస్తుల్ని హస్తగతం చేసుకునేందుకు పీటర్, థామస్ ప్లాన్ వేశారు. ఊరు విడిచి వెళ్లిపో
వేంపల్లి పాస్టర్‌కు వైఎస్ వివేకా హుకుం
హెబ్రోన్ సొసైటీ సభ్యులపై మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి బెదిరింపులకు దిగారు. కడప జిల్లా వేంపల్లిలోని హెబ్రోన్ చర్చి పాస్టర్‌ను ఆయన ఫోన్లో బెదిరించారు. ఆదివారంలోపు చర్చిని, ఊరిని విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లాలని బతిమాలగా.. ఎక్కడికైనా వెళ్లండి.. హెబ్రోన్‌కే వెళ్లండని మండిపడ్డారు. 'ఉంటానంటే ఉండు! మేమేందో.. నువ్వేందో తేల్చుకుందాం' అని బెదిరించారు. దీంతో, అంత మాటెందుకు సార్ అని పాస్టర్ అనగా.. నేను చెప్పేది తెలుగు కాదా.. నీకు అర్థం కాదా. నాకు సంబంధం లేదు. నువ్వు మీ హెడ్ క్వార్టర్స్‌కి పో. నీ ఆర్డర్ నువ్వు తెచ్చుకో. నువ్వు మాత్రం ఇక్కడుండేందుకు వీల్లేదు. ఆదివారం తర్వాత నువ్వు వేంపల్లిలో ఉండేందుకు వీల్లేదు'' అని బెదిరించారు[/b][/b][/font][/font][/size][/color]

Posted

[font="Verdana,Arial,Helvetica"][size="2"][font="Verdana,Arial,Helvetica"][size="2"][img]http://www.chalanachithram.com/discus/clipart2/paul1.gif[/img][/size][/font][/size][/font]

Posted

[img]http://www.brahmanandamgifs.com/Images/GIFs/Bhayam/23.gif[/img]

Posted

[quote name='chandrabhai7' timestamp='1368681426' post='1303757877']
Samajika nyayam
[/quote]

ma vadu chesadu...me vadu chesthunnada ippudu..

Posted

[quote name='BobbyFischer' timestamp='1368681611' post='1303757889']


ma vadu chesadu...me vadu chesthunnada ippudu..
[/quote]

[img]http://lh3.ggpht.com/-M4mKT3KdUKk/URhfavgADtI/AAAAAAAAJ_M/zec5AGA0Sis/s149/Prabhas-2.gif[/img]

Posted

[quote name='chandrabhai7' timestamp='1368681653' post='1303757894']
[img]http://lh3.ggpht.com/-M4mKT3KdUKk/URhfavgADtI/AAAAAAAAJ_M/zec5AGA0Sis/s149/Prabhas-2.gif[/img]
[/quote]

[font="Verdana,Arial,Helvetica"][size="2"][font="Verdana,Arial,Helvetica"][size="2"][img]http://www.chalanachithram.com/discus/clipart2/paul2.gif[/img][/size][/font][/size][/font]

×
×
  • Create New...