Jump to content

Ys Jagan - A Narcissist ?


Recommended Posts

Posted

[color=#b22222][size=4][font=Verdana,Arial,Helvetica][font=Verdana,Arial,Helvetica][b]ఇడుపులపాయ ఎస్టేట్ మేనేజర్‌తో....తండ్రి వైఎస్ ‘ వాట్ బ్రదర్ ఎస్టేట్ ఎలా వుంది. టేకు మొక్కలు ఎలావున్నాయి. నీరు సరిపోతుందా. ఆవులు పాలు బాగానే ఇస్తున్నాయా. గుర్రాలు ఎలా వున్నాయి. ఖర్చులకు ఇస్తున్న డబ్బు సరిపోతోందా. ఇంకేమైనా అదనంగా కావాలా’, అని మార్నింగ్ వాక్‌లో ఎస్టేట్ కలియతిరుగుతూ మేనేజర్ భుజంమీద చేయివేసి మరీ సాధక బాధకాలు అడిగి తెలుసుకునే వారు. వైఎస్ అంతటి గొప్ప లీడరే తనపై చేయివేసి, మాట్లాడుతున్నారంటే అదే గొప్ప గౌరవంగా అక్కడి మేనేజర్ సంబరపడి ఉత్తేజంగా పనిచేసుకు పోయేవారు తనయుడు జగన్. ఏమయ్యా ఎస్టేట్‌లో నిర్వహణకు నెలవారీ అవుతున్న ఖర్చు ఎంత? సుమారు రూ. లక్షలు అవుతుందిసార్ అని మేనేజర్ బదులిచ్చారు. అంతెందుకు అవుతుంది. అలా కుదరదు. ఈనెల నుంచి అందులో సగానికి సగం ఖర్చు తగ్గించాలని అన్నారు జగన్. కష్టమవుతుంది సార్ అన్నాడు మేనేజర్. అయితే ఆలోచించుకో అన్నారు జగన్. ఇంకేముంది ఆ కొద్ది రోజులేక అక్కడి మేనేజర్ పదవికి ఆయన గుడ్‌బై చెప్పి, ఇంటిముఖం పట్టారు. ఇది సొంత ఎస్టేట్‌లో వైఎస్, తనయుడు జగన్ అక్కడి మేనేజర్‌తో వ్యవహరించిన శైలి. వైఎస్‌లో వున్న మానవీయ కోణాన్ని, జగన్‌లో వున్న వ్యాపార ధోరణిని తెలియజెప్పే ఒక ఉదంతమిది. ‘2009 ఎన్నికల సమయం. ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్‌ఆర్‌ను ఆ సమయంలో కలిశారు. తాను ఆ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అశక్తతతను వ్యక్తం చేశారు. అందుకు వైఎస్ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. భలేవాడివి స్వామి నువ్వు. నీకు డబ్బుల దగ్గరే కదా ఇబ్బంది. అవన్నీ నేను చూసుకుంటాలే. నువ్వు పోటీ చేస్తున్నావు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. [/b][/font][/font][/size][/color]

Posted

[color=#b22222][size=4][font="Verdana,Arial,Helvetica"][font="Verdana,Arial,Helvetica"][b]ఆయన ప్రోత్సాహంతోనే ఉండవల్లి రెండోమారు ఎంపి కాగలిగారు’. కొండా సురేఖ, మూలింటి మారెప్ప, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, కూన శ్రీశైలం గౌడ్‌లే కాదు. మరెందరో ఈరోజు వైకాపాలో కొనసాగుతున్నారంటే అది వైఎస్‌ఆర్ పట్ల వారికి గల అభిమానమే. వైఎస్‌ఆర్ నుంచి రాజకీయంగా, ఇతరత్రా పొందిన మేళ్ళే వారిని జగన్‌వైపు నడి పిస్తున్నాయి. ఈరోజువందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు వైకాపాలో వున్నారంటే అది వైఎస్‌ఆర్‌ను చూసి తప్ప మరొకటి కాదు. అది జగన్‌ను చూసి అనుకుంటే పొరపాటే. నమ్ముకున్న వారిని వారి ఆర్థిక స్తోమత , అంగబలంతో నిమిత్తం లేకుండా, ఎంత కష్టమైనా సరే, ప్రత్యర్థుల నుంచి ఎన్ని విమర్శలైనా సరే బెదరక, రాజకీయంగా అవకాశాలు కల్పించిన తీరే వైఎస్ పట్ల విశ్వసనీయతను ప్రబలంగా పెంచిందనడంలో సందేహం లేదు. వైఎస్‌ను నమ్ముకుంటే ఆయన ఎప్పటికైనా ఏదోఒక మంచి స్థితికి చేరుస్తాడు అనే ఆత్మవిశ్వాసమే ఆయన్ను జన నాయకుడిగా చేసింది. కూన శ్రీశైలంగౌడ్ వైఎస్‌కు గట్టి మద్దతుదారుడిగా వుండేవారు. ఆయనకు 2009లో టికెట్ రాలేదు. అయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. సాయం కోరిన మీదట వైఎస్ ఆయన గెలుపునకు దోహదపడ్డారు. ఆ విశ్సాసంతోనే శ్రీశైలం గౌడ్ ఇటీవల వైకాపాలో చేరాడు. కష్టకాలంలో తన కుటుంబానికి రాజకీయంగా అండనిచ్చినం దుకు విశ్వాసంగానే కొండా సురేఖ కుటుంబం వైఎస్ మరణానం తరం వైఎస్‌లేని కేబినెట్‌లో వుండలేనని బాహటంగా ప్రకటించి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి ఆయన తనయుడు స్థాపించిన వైసీపీలో చేరారు. ఇలా ఎందరో వైఎస్ పట్ల అభిమానంతోనో, ఆయన చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకునో, తండ్రిలాగే తనయుడు కూడా ఆడినమాటను నిలబెట్టుకుంటారనే నమ్మకంతో వైసీపీలో చేరారు.[/b][/font][/font][/size][/color]

Posted

[color=#b22222][size=4][font=Verdana,Arial,Helvetica][font=Verdana,Arial,Helvetica][b]అయితే రెండేళ్ళ వైసీపీ ప్రస్తానంలో అధ్యక్షుడ జగన్ వ్యవహార శైలి కార్పొరేట్ శైలిని తలపిస్తుండటంతో వైఎస్‌పట్ల అభిమానంతో చేరిన వారిలో ఎక్కువ మంది అభద్రతభావానికి లోనౌతున్నారు. అనంత పురం నుంచి ఆదిలాబాద్ దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అందరిలోనూ ఇంచుమించు ఇదే అభిప్రాయాలు, అనుమానాలు. భవిష్యత్తుపై ఆందోళనలు. ఎవరిని ఎప్పుడు అందలమెక్కిస్తారో, ఎవరిని ఎప్పుడు ఏదో వంకపెట్టి పక్కనపెడతారో అన్న అనుమానాలు, ఆందోళనలు తొంగి చూస్తున్నాయి. వైఎస్‌కు వీర విధేయురాలిగా ముద్రపడిన కొండా సురేఖ కుటుంబం కొన్ని నెలల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండటం, ఆ జిల్లాలో వారి ప్రమేయం లేకుండా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించడం వంటివి వారిని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. తెలంగాణలో అసలే పార్టీ పరిస్థితి బాగోలేదు, మరి సురేఖ లాంటి వారిని దూరం చేసుకుంటే పార్టీ నష్ట పోతుందని వారిని బతిమలాడి జగన్‌తో భేటీ చేయించి, వారు చెప్పిన షరతులకు ఒకే చేయించి, అతికష్టం మీద వారిని నిలుపుకోవాల్సి వచ్చిందంటే వైఎస్‌కు భిన్నమైన శైలిలో పార్టీని నడపడమే కారణం. వైఎస్ జనంతో, కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు నిర్వహించే వారు కనుక ఆయన తనకంటూ సొంత సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వారు. జగన్ పరిస్థితి అలా కాదు. యువనేత కార్పొరేట్ సామ్రాజ్యం నుంచి రాజకీయ రంగంలోకి అడుగడిగిన నేత కావడంతో ఈయనకు రాజకీయ అనుభవం తక్కువగా వుండటంతో ప్రత్యక్షంగా కార్యకర్తలను కలుసుకునే అవకాశాలు తక్కువ. చుట్టూ వున్న నలుగురైదుగురు వ్యక్తుల మీదనే, వారి ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి, నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీని ముందు నుంచి నమ్ముకున్నవారు, వైఎస్ మీద అభిమానంతో పార్టీలో పనిచేస్తున్న వారు నిరాదరణకు, భవిష్యత్తుపై అభద్రతా భావానికి లోనౌతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కొందరు నేతల ప్రభావం వల్ల ఆయా నియోజక వర్గాలలో వైఎస్ విధేయులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. పార్టీ ఫండ్ ఎంత ఇవ్వగలవు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోగలవు అనే ధోరణిలో ఆశావహుల నుంచి మరీ ఇంటర్యూలు చేసి, ఎక్కువ ఎర చూపిన వారికి టికెట్లు ఆశచూపి, దానికి అనుగుణంగా అసెంబీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జీల నియామకాలు, మార్పులు జరగుతుండటం వల్లే అసమ్మతి, పాత, కొత్తల మధ్య ఆధిపత్యపోరు వంటి గందరగోళానికి కారణమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో మారెప్ప విషయాన్ని తీసుకుంటే వైఎస్‌కు ఆయన వీర విధేయుడు. కర్నూలు జిల్లాలో ఒక సామాజిక వర్గం హవా ఎక్కువ. అలాంటి జిల్లా పరిస్థితులకు సరితూగడని తెలిసినా తనను నమ్ముకున్నారనే ఏకైక కారణంపై ప్రతికూల అంశాలను పక్కన పెట్టి, మారెప్పను మంత్రిని చేశారు వైఎస్. ఆ విశ్వాసంతోనే మారెప్ప వైఎస్ తనయుడు ఏర్పాటు చేసిన వైకాపాలో చేరిపోయారు. మరి వైకాపాలో ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటి.[/b][/font][/font][/size][/color]

Posted

[color=#b22222][size=4][font="Verdana,Arial,Helvetica"][font="Verdana,Arial,Helvetica"][b]మంత్రిగా పనిచేసిన మారెప్పకు సొంత జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలు వుండగా ఏ ఒక్కదానికి ఆయన్ను ఇన్‌ఛార్జిగా వేయలేదు. నిజంగా ఈ పరిణామం ఆయనకు మింగుడు పడటం లేదు. అంతర్గత సమావేశాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్వేదంతో మాట్లాడారు. అయినా పార్టీ నాయకులు ఆయన్ను పట్టించుకోలేదు. వైఎస్ మీద అభిమానంతో ఆయన ఇంకా ఆశావహ ధక్పతంతోనే ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో తాను ఆశించిన ప్రాధాన్యత లేకపోతే ఆయన పార్టీలో కొనసాగేది కష్టమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ది ఇదే పరిస్థితి. ఆ జిల్లా మొత్తంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరినా పార్టీ పట్టించుకోలేదు. ఆయనకూడా అసంతృప్తితోనే వుంటున్నారు. వైఎస్ వుంటే ఇలా వుండేదా అన్నదే ఆయన ఆవేదన. వైఎస్‌కు సీయం కాకమునుపు నుంచి కష్టకాలంలోనూ అండగా వున్న అనంతపురం ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కుటుంబానికి కూడా పార్టీలో ప్రాధాన్యత ఆశించిన స్థాయిలో లేదు. వైకాపాలో చేరినందుకు తనపై కసితో కోట్ల రూపాయల ఆస్థిని కాంగ్రెస్ సర్కార్ దూరం చేసిందని స్వయంగా ఆయన ఇటీవల జగన్‌కు చెప్పినా, నాదే కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి నేనెవరికి చెప్పుకోవాలి అన్నారే తప్ప, అక్కడ అనంతపురం ఎంపీకి ప్రాధాన్యత ఇవ్వరాదని, అవకాశవాదులను ప్రోత్సహించడం సరికాదని చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించని జగన్ వైఖరి ఆ ఎమ్మెల్యేలో తీవ్ర మనస్థాపాన్ని కల్పించింది. 2009లో వైఎస్ మరణానంతరం కొన్ని నెలల పాటు వున్న వైఎస్ సెంటిమెంట్ ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోవడానికి జగన్ పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడం, అసెంబ్లీ నియోజక వర్గాల కో ఆర్డినేటర్ల విషయంలో, టికెట్ల హామీలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోక పోవడమే కారణమని చెబుతోంది. ఈ పరిణామాలే వైఎస్ పట్ల అభిమానమున్న కాంగ్రెస్ వారిని వైకాపాలోకి వెళ్ళకుండా వెనుకడుగు వేయించిందనే అభిప్రాయం వినవస్తోంది. మొత్తం మీద జగన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు, గ్రాఫ్ తగ్గిపోవడానికి ఆయన తీసుకుంటున్న కార్పొరేట్ స్టైల్ నిర్ణయాలే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. [/b][/font][/font][/size][/color]

Posted

antey election time ki PRP la ayipothundhi antaava [img]http://2.bp.blogspot.com/-IxPz2Xu9LPU/UYMxu8SU09I/AAAAAAAAECs/SkFVqow04qk/s1600/bandla.gif[/img]

Posted

[quote name='Alexander' timestamp='1369703681' post='1303797997']
antey election time ki PRP la ayipothundhi antaava [img]http://2.bp.blogspot.com/-IxPz2Xu9LPU/UYMxu8SU09I/AAAAAAAAECs/SkFVqow04qk/s1600/bandla.gif[/img]
[/quote]

PRP kante better ga fare cheyochu Jagan jail lo unna kooda...money undi and also Reddy + christian + Muslim + Mala vote bank undi...PRP ki em ledu a time la utti ga hadavidi cheyatam tappa...

Posted

Juttu poyi maremma edustha vunte...mogudu vacchhi shampoo tho patu conditionar konukocchanu neekosam annattundi......

&*B@

Posted

[quote name='mukunda' timestamp='1369704139' post='1303798011']
Juttu poyi maremma edustha vunte...mogudu vacchhi shampoo tho patu conditionar konukocchanu neekosam annattundi......

&*B@
[/quote]
sametha baaney undhi kaani context ey synch aitha ledhu bhayya [img]http://2.bp.blogspot.com/-IxPz2Xu9LPU/UYMxu8SU09I/AAAAAAAAECs/SkFVqow04qk/s1600/bandla.gif[/img]

Posted

dudes vellu andharu jagan ni ekkisthe ne party pettadu leka pothe.....vadu mellaga vadi bussiness vadu chusukonu avsarama....vadiki intha gola.....vellandharu bayataku rakapothe vadu congress party lone undevadu.....chiru prp lone undevadu....kani andharam manushulam dudes everyone needs change.....let him go 2014 lo INDIA vs PAKISTAN MATCH laga extrordinary ga untadhi elections v will enjoy...

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/pokkr5i.gif?1290229214[/img]

Posted

If this euation is [b][[color=#282828][font=helvetica, arial, sans-serif]Reddy + christian + Muslim + Mala vote bank] [/font][/color][/b]solid,,,,,,,, Nobody can defeat him,,,,,,:-)

Posted

On an average state voting percentage is around 60 To 70,,,Easily [color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color][b][Reddy + christian + Muslim + Mala vote bank] = 25 to 30%,,,,,That is more than enough to win atleast 50-100 seats. If everything works out well may be more than that,,,,,,[/b]

Posted

[quote name='OngoleGitta' timestamp='1369712797' post='1303798424']
On an average state voting percentage is around 60 To 70,,,Easily [color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color][b][Reddy + christian + Muslim + Mala vote bank] = 25 to 30%,,,,,That is more than enough to win atleast 50-100 seats. If everything works out well may be more than that,,,,,,[/b]
[/quote]

idantha jarigedi Jagan jail lo nundi bayataki vasthe ani nenu anukuntunna...jail nundi rakunda unte 30-40 is the optimistic figure..

Posted

[quote name='mukunda' timestamp='1369704139' post='1303798011']
Juttu poyi maremma edustha vunte...mogudu vacchhi shampoo tho patu conditionar konukocchanu neekosam annattundi......

&*B@
[/quote]
deeni ardam enti mukunda [img]http://i55.tinypic.com/2lliki1.gif[/img]

Posted

[quote name='BobbyFischer' timestamp='1369703773' post='1303798000']

PRP kante better ga fare cheyochu Jagan jail lo unna kooda...money undi and also Reddy + christian + Muslim + Mala vote bank undi...PRP ki em ledu a time la utti ga hadavidi cheyatam tappa...
[/quote]
christian votes go to congress... muslim lo kuda casts untai.. few suport ysr nd few tdp.. inka reddys lo kuda ante both sides supporting bt very few suport tdp.. PRP petinapudu aviniti leni kotta party samajika seva anna words chala mandini attract chesai kani situations change aipoyay nd last elections lo rigging played a major part i think u knw dat

×
×
  • Create New...