Jump to content

Recommended Posts

Posted

[quote name='Speed2' timestamp='1370453469' post='1303825601']
then what about this man



[color=#282828][size=4]వైఎస్‌ఆర్‌సీపీకి మోడీ గాలం!
June 4, 2013
మూడు రోజుల క్రితం భేటీ?
ేకంద్రంలో మద్దతివ్వాలని అభ్యర్ధన
జగన్‌ను రక్షిస్తామని అభయం?
కోరిన మంత్రి పదవులిస్తామని హామీ?
కాంగ్రెస్‌ మోసం చేసిందని విజయమ్మ ఆవేదన?
రాష్టప్రతి ఎన్నికల్లో పొరపాటు చేశామని వ్యాఖ్య?
జగన్‌తో మాట్లాడి చెబుతానని హామీ?
ఉత్తిదేనన్న గట్టు రామచంద్రరావు
ఆ అవసరం తమకు లేదని స్పష్టీకరణ
కాంగ్రెస్‌, బీజేపీలతో కలవబోమని వివరణ

విజయమ్మ వద్దకు దూతలు
[img]http://www.suryaa.com/gallery/2013/Jun/04/modi.jpg[/img](సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌)వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తులో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏకి మద్దతునిచ్చేందుకు మానసికంగా సిద్దమవుతోందా? ఆమేరకు బీజేపీ అగ్ర నేత, ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న నరేంద్రమోడీ విజయమ్మ వద్దకు రాయబారం పంపారా? కాంగ్రెస్‌ నాయకత్వం తమను మోసం చేసిందని వైకాపా నాయకత్వం భావిస్తోందా?.. గత మూడు రోజుల ్ర తం నరేంద్రమోడీ రాయబారి విజయమ్మ బందాన్ని కలిశారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తెరపైకి వస్తున్న సందేహాలివి. జగన్‌ జైలుపాలయి విజయవంతంగా ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, కొవ్వుత్తుల ప్రదర్శనలు నిర్వహించి, సీబీఐ-కోర్టుల తీరును, కాంగ్రెస్‌-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టిన విషయం తెలిసిందే.

అయితే, ఇప్పట్లో జగన్‌కు బెయిల్‌ రాదని, ఒకవేళ వచ్చినా మళ్లీ ఈడీ కేసు సిద్ధంగా ఉన్నందున ఆయనను తీహార్‌కు తరలిస్తారన్న ప్రచారం అటు పార్టీ, ఇటు బయట వర్గాల్లో ఉధృతంగా జరుగుతున్న విషయం కూడా బహిరంగమే.ఈ నేపథ్యంలో నిరాశా, నిస్పృహలో ఉన్న విజయమ్మను గత మూడు రోజుల క్రితం లోటస్‌పాండ్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ భావి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ ప్రతినిధులు కొందరు రాయబార నిమిత్తం వచ్చి కలసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయమ్మతోపాటు మరో ముగ్గురు పార్టీ అగ్రనేతలు కూడా ఆ భేటీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య జగన్‌ బెయిల్‌, కాంగ్రెస్‌ కక్షసాధింపు రాజకీయాలు, సీబీఐ-ఈడీ కేసులు, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

[img]http://www.suryaa.com/gallery/2013/Jun/04/modia.jpg[/img]జగన్‌కు బెయిల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ నమ్మించి మోసం చేసిందని విజయమ్మ వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాష్టప్రతి ఎన్నికల సమయంలో తాము కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి పొరపాటు చేశామని కూడా వాపోయినట్లు చెబుతున్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీకి రాష్ట్రంలో పదికి పైగా పార్లమెంటు స్థానాలు వస్తాయన్న అంచనా తమకు ఉందని, 2014 ఎన్నికల తర్వాత చోటుచేసుకోబోయే రాజకీయ పరిణామాల్లో, వైఎస్సార్‌ సీపీ ఎంపీల మద్దతు బీజేపీకి అవసరమని మోడీ ప్రతినిధులు అభ్యర్ధించినట్లు ప్రచారం జరుగుతోంది. గెలిచిన తర్వాత మైనారిటీలకు నచ్చ చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు.

వైసీపీ కేంద్రంలో చేరితే కావలసినన్న మంత్రి పదవులు ఇచ్చేందకు బీజేపీ సిద్ధంగా ఉందనగా, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్‌బాబు కూడా గతంలో చెప్పారని విజయమ్మ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తమకు కేంద్రంలో మద్దతునిస్తే జగన్‌ కేసుల సంగతి తాము చూసుకుంటామని, ఆ విషయం తమకు వదిలేయాలని భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో విజయమ్మ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. మోడీ పరిపాలన బాగుందని కితాబు నివ్వడంతో పాటు, ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, జగన్‌బాబుకు సమాచారం అందిస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అభూతకల్పన: గట్టు
విజయమ్మను నరేంద్రమోడీ ప్రతినిధులు కలసి, రానున్న ఎన్నికల తర్వాత కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు కోరినట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధం, కట్టుకథలేనని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ కన్వీనర్‌ గట్టు రామచంద్రరావు ఖండించారు. నియంతృత్వ కాంగ్రెస్‌, మతతత్వ బీజేపీతో కలిసేది లేదని తాము ఏనాడో ప్రకటించామని గుర్తు చేశారు. అసలు తాము ఒకరితో జత కట్టవలసిన పనిలేదన్నారు. గతంలో విజయమ్మ, తాజాగా షర్మిల యుపీఏకు మద్దతునిస్తామన్న విషయాన్ని గుర్తు చేయగా ‘రేపు కాంగ్రె స్‌ లేని యుపీఏ ఉండవచ్చు. ఎవరు చెప్పగలరు? అలాగే నాలుగో ఫ్రంట్‌ రావచ్చు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమే. కానీ కాంగ్రెస్‌-బీజేపీతో జతకట్టే ప్రసక్తే లేద’ని గట్టు స్పష్టం చేశారు. [/size][/color]



[/quote]

i highly doubt this but okavela jarigithe (I pray that this wont happen) satruvu satruvu mitrudu idi raja neethi man :police:

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • factorial

    8

  • Speed2

    6

  • George_Brahmi_III

    6

  • cherlapallifailure

    5

Popular Days

Top Posters In This Topic

×
×
  • Create New...