Jump to content

Recommended Posts

Posted

జల్సా, కిక్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ పొజిషన్ నిలుపుకున్న ఇలియానా రెచ్చిపో, సలీం సినిమాలతో ఫ్లాప్స్ చవి చూసింది. ఈ రెండు ఫలితాలతో ఇలియానా స్థానానికి వచ్చిన సమస్య ఏమీ లేకపోయినా, కాజల్, హన్సిక వంటి యువ హీరోయిన్ ల నుంచి పోటీకి తోడు త్రిష, అనుష్క ఇంకా ఫాంలో ఉండడంతో ఇలియానా కొంచెం ఆలోచనలో పడింది. ఇకపై ఎంచుకునే కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని అనుకుంటోంది. కిక్, జల్సా లాంటి వినోదాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది.

×
×
  • Create New...