kingmakers Posted March 11, 2010 Report Posted March 11, 2010 ప్రియమణి చాలా ధైర్యమున్న హీరోయిన్ గా అందరూ అనుకుంటారు. తను తెలుగులో నటించిన తొలి చిత్రం కె.యస్.రామారావు కుమారుడు హీరోగా నటించిన “ఎవరే అతగాడు” చిత్రం ఫ్లాపయినా, “పెళ్ళైన కొత్తలో” చిత్రంతో మళ్ళీ రీ-ఎంట్రీ అయి తానేంటో నిరూపించుకుంది. ఒక తమిళ చిత్రంతో జాతీయ అవార్డుని కూడా సాధించుకుంది. అలాంటి ప్రియమణి ఏడవటం ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ ఇది నిజం. మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్, విక్రం లతో పాటు ప్రియమణి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తూంది. ఆ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెపుతూ ప్రియ మణి ఒక్క సారిగా ఏడ్చేసిందట. అంతగా ఆ పాత్రలో తాను ఇన్ వాల్వ్ అయిందని మీడియాతో చెప్పిందట ప్రియమణి.
Recommended Posts