Jump to content

Recommended Posts

Posted

రామ్ అనే సినిమాతో కన్నడ చిత్ర సీమకి ప్రియమణి పరిచయమయింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయి ఇటీవలే 50 రోజుల ప్రదర్సన పూర్తి చేసుకుంది. తెలుగులో సంచలన విజయం సాధించిన రెడీ చిత్రానికి కన్నడ రీమేక్ అయిన రామ్ లో ప్రియమణి తెలుగులో జెనీలియా చేసిన పాత్ర పోషించింది. కన్నడలో తొలి సినిమా బంపర్ హిట్ అవడంతో ప్రియమణి ఆనందం మిన్నంటింది. ఇకపై కన్నడ సినిమాలను కూడా సీరియస్ గా తీసుకుంటానని అంటోంది. అయితే ఆమెకు తెలుగులో మాత్రం ఆశించిన విజయాలు రావట్లేదు. ఇటీవల ప్రవరాఖ్యుడు, ద్రోణ, శంభో శివ శంభో వంటి పరాజయాలను ఆమె చవి చూసింది. త్వరలో విడుదల కానున్న సాధ్యం చిత్రంతో తెలుగులో కూడా తనకు విజయం తధ్యం అని ప్రియమణి నమ్మకం పెట్టుకుంది.

×
×
  • Create New...