Jump to content

Recommended Posts

Posted

[color=#666666][font=Georgia,]
[size=4][url="http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/"][img]http://cdn.navatarangam.com/publish/feature/uploads/2010/08/803-300x156.jpg[/img][/url][/size]


[b] [size=4][url="http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/"]జోకర్ గాడి ఫ్యాన్…![/url][/size][/b]

[color=#999999][size=2]
[/size][/color]
[size=4]కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది. అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి పట్టించుకోని నాకు, ఒక ధర్మసంకటం వచ్చి పడిందని చెప్పుకోవచ్చు.[/size]
[size=4]కత్తియుద్దం కాంతారావు, చిన్నబొజ్జ రామారావు,రొమాంటిక్ నాగేశ్వర్రావు,అందగాడు శోభన్ బాబు లతోపాటు కుటిలుడు సీయస్సార్, రాచవిలనుడు రాజనాల,కంచుకంఠం జగ్గయ్య,భారీవిగ్రహం ఎస్వీ రంగారావుల్ని కూడా సమానంగా ప్రేమించి,అభిమానించిన తెలియనితనం నాది. సూపస్టార్ కట్టెఫైటింగ్ ని చూసి కళ్ళప్పగించిన బాపతునాది. రెబల్స్టార్ రౌద్రాన్ని, నాకు కోపమోచ్చినపుడు నెమరువేసుకున్న అమాయకుడిని. మెగాస్టార్ డ్యాంసులు,యువరత్న డయలాగులు,యువసామ్రాట్ స్తైలు,విక్టరీ ఈజ్ ను సమపాళ్ళలో ఆరాధించే మూర్ఖశిఖామణినైన నాకు,సమాధానం అంత సులువుగా రాలేదు. కానీ, నానోట అప్రయత్నంగా వెలువడ్డ పేరు విని నాకునేను ఆశర్యపోతే, నా స్నెహితులు నవ్వుకున్నారు.ఆ పేరు “రాజేంద్రప్రసాద్”. “వీడూ, ఆ జోకర్ గాడి ఫ్యాన్ అటరా !” అన్న నా మిత్రుడి మాటకు కోపం కన్నా, ఒక వీశమంత గర్వమేసింది నాకు. అలా నాకు ఆ క్షణంలో ఎందుకనిపించిందో, జీవితంలో కొంత మెచ్యూరిటి, సినిమాపై ఒక అవగాహన వచ్చేవరకు అర్థంకాలెదు.[/size]
[size=4]తెలుగు చిత్రరంగంలో ఒక “పరిపూర్ణ నటుడు” ఎవరైనా ఉన్నాడు, అంటే అది రాజేంద్రుడే (with due respect to all other actors) అని నాభావన. బహుశా తను చేసిన వైవిధ్యమైన సినిమాల వలనైతే కావచ్చు, ’కామెడీ చేయటం నటనలో అన్నిటికన్నా కష్టం’ అనే నా నమ్మకం వల్ల కావచ్చు, లేక చిన్నతనంలో తన సినిమాలు చూసి నేను అనుభవించిన ఆనందానికి కృతఙత గా కావచ్చు, ఈ భావన నాలో క్రమేపీ బలపడింది. అందుకే ఈ వ్యాసం objective గా కాకుండా, నా వీరాభిమానానికి నేనే పట్టం కట్టేసుకునే విధంగా ఉంటే క్షమార్హుణ్ణి. మీ సహృదయత నాపై మెండుగా చూపించగలరని మనవి.[/size]
[size=4]నా హీరో, క్యారెక్టరు నటుడిగా అంతకుమునుపు చాలాచిత్రాలలో(దాదాపు 50 పైచిలుకు తమిళ,తెలుగు భాషలలో) నటించాడు. ఇందులో మహా సీరియస్ సినిమాలు చేసే టి.కృష్ణ (వందేమాతరం,దేశంలో దొంగలు పడ్డారు, ఘర్జన) , వేజళ్ళ (ఈ చరిత్ర ఏసిరాతో,ఇదికాదు ముగింపు,ఈపిల్లకు పెళ్ళవుతుందా) మరియు ధవళ సత్యం (గుడిగంటలు మ్రోగాయి, ముద్దుల చెల్లెలు) యొక్క దర్సకత్వంలో కూడా ఉండటం గమనించదగిన విషయం. మొదటి సినిమాకూడా “బాపు” గారిదని విన్నాను. ఇకపోతే, వంశీ దర్శకత్వం లో నలుగురు హీరోలలో ఒకరుగా చేసిన “మంచు పల్లకి” తరువాత మూడు సంవత్సరాలకు “ప్రేమించు, పెళ్ళాడు!”(1985) తో హీరోగా తెరంగేట్రం చేసాడు. ఇక్కడినుండి మొదలైందండి, నా అభిమాన తరంగం.[/size]
[size=4]నా వయసు అప్పుడు ఏ తొమ్మిదో,పదో ఉంటాయనుకుంటా. మా అన్నయ్య నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళాడు. తను అప్పటికే ఇళయరాజా సంగీతమంటే చెవికోసుకునే రకం కాబట్టి, అంతగా పేరు కూడా తెలియని ఈ హీరో సినిమాకి వెళ్ళే సాహసం చేసాడని నా ప్రఘాడ విశ్వాసం. ఇప్పుడు నాకు ఆ సినిమా కథగానీ, కథనంగానీ గుర్తులేవు. కానీ, ఒక బక్కపలచని,రివటలా ఉన్న వ్యక్తి, అదీ పెద్దపెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని “వయ్యారి గోదారమ్మ…వొళ్ళంతా ఎందుకమ్మ కలవరం?” అని భానుప్రియ కు సర్దిచెప్పిన మొహం లోని ’అమ్మయకపు ధీమా’ నన్ను ఆకట్టుకుంది. “గోపెమ్మ చేతిలో గోరుముద్ద…” అంటూ నాయిక పెట్టే అల్లరికి ఉక్కిరిబిక్కిరై, ప్రేమావేశాన్ని ఒకవేపు, ఉక్రోశాన్ని మరోవైపు, గమ్మత్తుగా మిక్స్ చేసి నటించీ నటించనట్టు నటించిన సిన్సియరు పాత్రధారి మాత్రం నా కళ్ళకు కట్టినట్టు ఇంకా కనిపిస్తూనేఉన్నాడు. “హీరో్” అంటే ఇలా ఉండాలి…అలా ఉండాలని, తాము గీసిన గీతల మధ్య తామే బంధీలైన సినిమా పరిశ్రమను,తెలుగు ప్రేక్షకులను ఒక “మామూలు ముఖం” సై! అంటూ సైలెంటుగా విముక్తుల్ని చేసేసింది. ఆ హీరో కాని హీరో పేరు “రాజేంద్రప్రసాద్”, నేను తన అభిమానిని…ఒక జోకర్ గాడి ఫ్యాన్ ని![/size]
[size=4]ఈ సినిమా వ్యాపారపరమైన విజయాన్ని అందిపుచ్చుకున్నా, స్థాయిత్వాన్ని విపరీతంగా ప్రేమించి, మార్పుని మెల్లకంటితో మాత్రమే చూసే తెలుగు సినీపరిశ్రమ లో రాజేంద్రుడి నటనావైదుశ్యానికి, నీరాజనాలైతే దక్కలేదుగానీ పగలు,ప్రతీకారాలు, కాస్త విప్లవం మార్కు సినిమాలమధ్య కొట్టుమిట్టాడుతున్న తెలుగు ప్రేక్షకుడు మాత్రం “హమ్మయ్య కాస్త హాయిగా నవ్వుకున్నాం, ” అనుకున్నాడు. ఆతరువాత అడపాదడపా తను చిన్న వేషాలు మళ్ళీవేసినా, ప్రేక్షకుడిలో గుర్తింపునిమాత్రం మెండుగా అప్పటికే దక్కించుకున్నాడని చెప్పవచ్చు.[/size]
[size=4]1985 రాజేంద్రప్రసాద్ ని హీరో ని చేస్తె , 1986 వ సంవత్సరం తనలోని విలక్షణతని పరిచయం చెసింది. ఒకవైపు జంధ్యాల “రెండురెళ్ళ ఆరు” వంశీ “లేడీస్ టైలర్” లో హాస్యపు జల్లుని కురిపిస్తే, మరోవైపు “కాష్మోరా” గా కళ్ళ తో నిప్పులు (నిజంగా ఈ సినిమాలో కంటి లోంచి నిప్పు పుట్టే సీన్ ఉందండోయ్!) కురిపించాడు. ఈ మూడు సినిమాలూ హిట్టే, తెలుగు సినిమా నాయకుడిగా రాజేంద్రుడు రాజమార్గం పట్టే ! అనచ్చు .[/size]
[size=4]ఇక్కడ ఈ సినిమాల గురించి కొంత మాట్లాడుకుందాం.మొదటగా కామెడీలు; మల్లాది వెంకటక్రృష్ణమూర్తి నవల “రెండురెళ్ళ ఆరు” ను, చేయితిరిగిన హాస్యబ్రహ్మ జంధ్యాల అదేపేరుతో తెరకెక్కించారు. జంధ్యాల గారి “బాబాయ్-అబ్బాయ్” లో రాజేంద్రప్రసాద్ ఒక చిన్నవేషం వేసినా,హీరో గా ఈ కాంబినేషన్ కి ఇది మొట్టమొదటి సినిమా. ఆతరువాత కాలంలో ఈ జంట తెలుగు సినిమాలో కామేడీకి తెచ్చిన విలువ నభూతోనభవిష్యతి. బహుశా ఈ సినిమాతో ఇంకో జంట రాజేంద్రప్రసాద్ – చంద్రమోహన్ కూడా ప్రజల మష్తిష్కాలలో నిక్షిప్తమైపోయారు. అక్కడి వాడు ఇక్కడ,ఇక్కడివాడు అక్కడ గా జరిగే ఈ ప్రేమ (హాస్య) ప్రహసనంతో, రాజేంద్రుడు నవలానాయకుడుకూడా అయిపోయాడు.[/size]
[size=4]ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది, “లేడీస్ టైలర్”. అసలే కొత్త అర్థాలు నేర్చుకుంటున్నతెలుగు కామెడీ కి “సెక్స్ కామెడీ” అనే కొత్త విధానాన్ని’వంశీ’ పరిచయం చేస్తే, దాన్నిజుగుప్స కలగకుండా పండించిన ఘనత మనవాడిదే. “జమ జచ్చ,జతో జడ” అనిఉన్న పోస్టర్ ని చదివే ప్రయత్నం చేసిన నన్ను అక్కడినుండి లాక్కెళ్ళిన మా అన్నయ్య చెయ్యి ఇంకాగుర్తే. ఆ సినిమా ప్రభావంతో సమస్తాంధ్రా ’క’ భాష, ’గ’ భాష ల హొరెత్తింది. మనలోఎంతమంది ఈ ప్రయోగాలు చేసామో ఒక్కసారి జ్ఙాపకం చేసుకుందాం. ఈ సినిమాని కొంత వయసు వచ్చేవరకు చూసేభాగ్యం నాకు కలగలేదు. కానీ, దీన్ని చూసినవెంఠనే నాకు “అబ్బా…ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా” అన్పించింది. ఇక మన హీరో అంటారా, తనుకాక ఈ పాత్రలో ఇంకెవరినైనా ఊహించగలరేమో చెప్పగలరా? చేతిలో కళ ఉండీ, పని చెయ్యటానికి బద్దకించే సోమరితనం. జాతకం పిచ్చితో, ఏంచెప్పినా నమ్మే భోళాతనం. తెలివిగా మాటలు చెప్పి అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యగల, మాటకారితనం. అప్పుడప్పుడు ప్రాణభయం తో గిజగిజ లాడే పిరికితనం, ఇలా ఎన్నెన్ని చాయలు,ఎన్నెన్ని భావాలు. వీటన్నింటినీ అవలీలగా చేసిన నటుడు ఎవరు? ముఖ్యంగా, సినిమాలొ అమ్మాయిల తోడలు (మచ్చ కోసం) తను తడుముతుంటే, ఆ ముఖం చూసి నవ్వుకున్నవాళ్ళే ఎక్కువగానీ, తొడల్ని చూసి ఉద్రేకపడిన వారు తక్కువే. ఈ చమక్కు,ఈ తరం లోని ఏ నటుడికి చేతనౌనో?[/size]
[size=4]“వీడెవడో కామెడీ బాగా చేశాడ్రా!” అనుకుంటుండగానే వచ్చింది, “కాష్మోరా”. యండమూరి వీరేంద్రనాధ్ క్షుద్రనవలకు సినిమా రూపమైన దీంట్లో ’కాద్రా’ అనే ఒక ఒరియా మాంత్రికుడి వేషం అది. ప్రధమార్ధం లో మానవ సంపర్కంలేని,దాదాపు ఒకజంతువులాంటి పాత్ర. ఈ భాగం లో , ఆ పాత్ర నడక,భాష,చూపు లో(అదీ ఏ స్పెషలు మేకప్పు, గ్రాఫిక్సూ లేకుండా) రాజేంద్రప్రసాద్ చూపిన వైవిధ్యం ఒకఎత్తైతే, ద్వితీయార్థం లో ’తులసి’ ని అభిమానించి,తనని కాపాడే ప్రయత్నం లో ప్రాణాల్నే అర్పించే త్యాగశీలిగా తను ఒలికించిన కరుణరసం ఒకఎత్తు.[/size]
[size=4]ఇలా “నటకిరీటి” నటించిన దాదాపు 200 లకుపై సినిమాల గురించి ఒక్కొక్క పేరా రాసినా, ఈ వ్యాసం కొండవీటి చాంతాడవుతుంది కాబట్టి, కేవలం నన్ను అభిమానిగా మలచిన ముఖ్యమైన మరియు వైవిధ్యమైన సినిమాల గురించి ఉటంకిస్తాను.[/size]
[size=4]“గాంధీనగర్ రెండవ వీధి”(1987) , ఈ సినిమాకు మూలం మళయాళం, అందులో ఇండియాలోనే గొప్ప నటుడని చెప్పుకునే “మోహన్ లాల్” హీరో. దీంట్లో ’హిందీ రాని గూర్ఖా’ వేషం లో, “మై జాతా హై! హు!” అని ఇబ్బందిగా పెట్టిన ఫేసుకి ఆస్కారు ప్రదానం చేసెయ్యొచ్చని నా మనవి. ఈ మధ్యనే ఈ సినిమా మాత్రుక చూడటం సంభవించింది, నావరకు “లాల్” కన్నా “ప్రసాద్” నటనలొ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉందనిపించింది. “దొంగకోళ్ళు”(1988) కూడా ఈ కోవకే చెందుతుంది. ఇల్లు ఖాళీ చెయ్యించలేని అసహాయత. తన ఇంట్లో తననే “అన్ వాంటెడ్ గేస్ట్” గా ట్రీట్ చేస్తున్న సుమలత పై కోపం,ఉక్రోశం. కావాలన్నా కఠినుడు కాలేని అతిమంచితనం. ఇలాంటి భావాల్ని,సునాయాసంగా పలికిస్తూకూడా, హాస్యాన్ని పండించడముంది చూశారూ! శహభాష్!! ఏ ఒక్క మహానటునికీ తీసిపోని నటన. ఈ సినిమా మళయాల మాత్రుక లోని ఒక పాట మాత్రం చూశాను, హిందీ (సునీల్ శెట్టి ఈ పాత్రచేశాడు)లో సినిమా పూర్తిగా చూసి, మళ్ళీ మనోడే “ఝకాస్” అనుకున్నా.[/size]
[size=4]1987-88 సంవత్సరాల్లో ’రెలంగి నరసింహారావు’ తో చాలా సినిమాలు చేసినా అవి హాస్యాన్ని పంచాయేగాని, రాజేంద్రప్రసాద్ నటనకు అంతగా మెరుగులు దిద్దలేదని అనుకోవచ్చు. కాని, 1987 వేసవిలో వచ్చిన “సురేష్ ప్రోడక్షన్స్” వారి “అహనా పెళ్ళంట”, జంధ్యాల మార్కు హాస్యానికి పెద్దపీట వెస్తే, రాజేంద్రప్రసాద్ ని ఒక గొప్ప కమర్షియల్ హీరోని చేసింది. దాంతోపాటు తన హాస్యపు అంబుదిలో మరిన్ని బాణాలు, జంధ్యాలగారి శిష్యరికం లో పోందుపరచుకో గలిగాడు. నటనా పరంగా ఈ సినిమా హాస్య నటులందరికీ ఒక “బెంచ్ మార్క్” అయి కూర్చుంది. నటుడిగా తనకు మరోదశాబ్దం వరకూ ఢోకాలేదని తెలియజెప్పింది. చిన్న సినిమాలకు కూడా, పెద్ద మార్కెట్ ఉంటుందని నిరూపించింది.[/size]
[size=4]“హి..హి..హి..ఎక్స్పెక్ట్ చేసా” అని రజని(ఇప్పుడీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపొయిందో?) “ఉత్తిత్తి వెక్కిళ్లకు,ఉత్తుత్తి నీళ్ళు” ఇచ్చినపుడు చెబుతూ, తన ఎంబరాస్మేంటుని ఒకవైపు, నాయిక పట్ల తనకు ఎర్పడిన ప్రేమ మరోవైపు ఉన్న భావనని సింగిల్ షాట్లో చూపిన ఘనత జంధ్యాలదైతే, ప్రతిభ మాత్రం మా ప్రసాద్ దే. నూతన్ ప్రసాద్- రాజేంద్రప్రసాద్ ల మధ్య ఉన్న తండ్రీకోడుకుల దెప్పిపొడుపుల, వస్తువు విరుపుల సీనూ, నటనా ఇంతవరకూ ఏ ఇతర భాషలొనూ చూడలేదు. పిసినారి మామని తన జిత్తులతో బుట్టలో వేసుకునే నటన కానిస్తూనే, తనకు ఆశ్రయమిచ్చినవారి కుటుంబం లో ఒకడిగా మారే దృశ్యం లో చూపిన నటనకు కళ్ళు చమర్చని వాళ్ళు ఉండరు. కోట శ్రీనివాసరావు తనతండ్రి ముందే అవమానిస్తే, చెప్పుకోలేని నిస్సహాయత, తన ప్రేమను ఏమైనా చేసి గెలిపించాలనే పట్టుదల ఒక్క చూపులో చూపించిన నటుడ్ని, “జోకర్” అన్న నా స్నేహితుడి అజ్ఞానానికి నవ్వాలో,లేక ఏడవాలో ఇప్పటికీ సందిగ్ధమే.[/size]
[size=4]అమాయకపు ప్రేమికుడిగా, ప్రేమలో మోసపొయానన్న దుగ్ధతో “స్త్రీ ద్వేషి” గా మారి తన శిష్యుల్ని,కుటుంబాన్నీ నానా తిప్పలుపెట్టి, తనూ అపహాస్యం పాలయ్యే పాత్ర ఒకటైతే, అమ్మాయిలను పెళ్ళిచేసుకుని మోసంచేసి కట్నం డబ్బుతొ పారిపొయి, ప్రాణాల్ని సైతం తియ్యడానికి సిద్దపడే “మిస్టర్ వి” మరోటి. అవే జంధ్యాల “వివాహ భోజనంబు”, సత్యానంద్ “ఝాన్సీరాణి”, ఈ రెండూ1988 లోవచ్చినవే. పాత్రల వైరుధ్యాలు చూడండి! ఇప్పుడేదో “మెథడ్ యాక్టింగ్” గట్రా అని అంటూ ఉంటారు, ఇంతకన్నా ఉదాహరణలు కావాలా?. ఝాన్సీరాణి సినిమాచూసి నేను, పక్క తడుపుకున్నాను, అంతకంటే మించి తన నటన గూర్చి సాక్ష్యం ఎమివ్వగలను? ఇక వివాహ భోజనంబు గురించి చెప్పాలంటే నాకు కనీసం పది రీముల పేపరో, లేక ఒక పూర్తి ‘వెబ్ సైటు’ కావలసి రావచ్చుగాక. అందరికీ తెలిసిన విషయాలేకాబట్టి దీన్ని దాటవేస్తున్నా.[/size]
[size=4]ఒక “కామెడీ థ్రిల్లరు” , ఒక “మాజిక్ రియలిజం థ్రిల్లరు”,ఒక “మర్డర్ మిస్టరీ” వెరసి 1989 వ సంవత్సరం. వంశీ “చెట్టుకింద ప్లీడరు” ,యండమూరి “ధ్రిల్లర్” నవలకి రవిరాజాపినిశెట్టి తెరరూపం “ముత్యమంత ముద్దు” మరియు రామచంద్రరవు “సాక్షి”. ఈసమయం లోనే నేను, నా అభిమాన నటుడిని నేరుగా కలవడం జరిగింది. ముత్యమంత ముద్దు షూటింగ్ లో కొంతభాగం ‘హార్స్లీహిల్స్’ లో తీసారు, ఆ సమయం లో నెను అక్కడి స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నా. తను తపస్సు చేసే దృశ్యాలు, “ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ” అనే యుగళగీతాల్ని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. క్లాసుకి డుమ్మా కోట్టిమరీ షూటింగ్ చూసినరోజుల్ని ఇప్పుడు తలుచుకొంటుంటే ఎంత ‘థ్రిల్’ గా ఉందో. ఆటొగ్రాఫ్ పుస్తకాలు అప్పట్లో నాలాంటి అర్భకులకి అందుబాటులో లేనికారణంగా, నోటు పుస్తకం లో తీసుకోవడానికి నామోషీగా ఫీలై, నా అభిమాన నటుడి ఆటోగ్రాఫ్ మిస్సయ్యాను. ఆలొటు జీవితం లో ఖచ్చితంగా తీర్చుకుంటానని “బ్లాగు సాక్షిగా” ప్రమాణం చేస్తున్నాను.[/size]
[size=4]నటనాపరంగా, చెట్టుకింద ప్లీడరు నల్లెరుపై బండినడకైతే, సాక్షి, ముత్యమంత ముద్దు, రాజేంద్రప్రసాద్ లోని కొత్త పార్శ్వాలను పరిచయంచేసింది. ‘సాక్షి’ తరహా నటనని “ఏప్రిల్ 1 విడుదల” సినిమాలో క్లైమాక్సు సమయానికి పర్ఫెక్షన్ నుకు తీసుకువస్తే, తను నవ్వకుండా ప్రేక్షకులని నవ్వించి, ఏడ్పించి,పేమింపజేసిన ‘ముత్యమంత ముద్దు’ నటన మళ్ళీ తెలుగుతెరమీద ఆవిష్కరించబడలేదు. ఈ విషయం కావాలంటే, అందుబాటులో ఉన్న బల్లలనన్నింటిని గుద్ది మరీ చెప్పగలను.[/size]
[size=4]1990-91 లో తను చేసిన కామెడీ సినిమాలు చాలానే ఉన్నా, ‘ఈ తరం’ వారి “నవయుగం” “ఎర్రమందారం”, రామచంద్రరావు తీసిన “మాస్టారి కాపురం” మరియు డాక్టర్. శివప్రసాద్ తీసిన “ప్రేమతపస్సు” వంటి సినిమాలు విషయవైవిధ్యం తోపాటు, రాజేంద్రుడి నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించి బంగారు నందిని సొంతం చేసాయి(ఎర్ర మందారం చిత్రానికిగాను, ఉత్తమనటుడుగా బంగారునంది లభించింది). ఆదర్శానికి ప్రాణమిచ్చే ‘లాయర్’. తనని నమ్మి ఓటు వేసిన ప్రజలకు మేలుచెయ్యాలని, దొరతనానికి ఎదురుతిరిగి ప్రాణాలు కోల్పోయే ‘నిమ్నజాతి ప్రతినిధి’. మతాంతర వివాహం చేసుకుని,సమాజం లో ఇమడడానికి పడేపాటులో ,అదే సంసారాన్ని దాదాపు పోగొట్టుకునే ‘మాస్టర్”. పేమ కోసం కళ్ళని త్యాగంచేసే ఒక ‘బిక్షగాడు’. ఎన్నిపాత్రలూ?, ఏమినటన? ఇంతటి “ఇంప్రెసివ్ రెస్యుమే” తెలుగు లో ఎవరికుంది?[/size]
[size=4]1991 లో నందిఅర్హమైన ‘ఎర్రమందారం’ తో పాటు వచ్చిన మరో “డిఫైనింగ్” చిత్రం, బాపు గారి “పెళ్ళి పుస్తకం” దాంతోపాటు, రాబోయే కాలంలో ఎస్.వి.కిష్ణారెడ్ది(ఈ సినిమాకి దర్శకత్వం వహించలెదుకానీ,మిగతావన్నీ తనే) -రాజెంద్రప్రసాద్ కాంబినేషన్ కి పునాది వేసిన “కొబ్బరిబోండాం” . దాదాపు 14 సంపత్సరాల మునుపటి ‘స్నేహం’(1977) తరువాత మళ్లీ బాపు-రాజేంద్రప్రసాద్ కలిసి పనిచేసి సినిమా ఇది. ‘బాపు’ నాయకుడు “కె.కె.” గా ‘పెళ్లిపుస్తకం’ లో రాజేంద్రప్రసాద్ నటనను చూసి యావదాంధ్రదేశం బ్రహ్మరధం పట్టింది,అప్పుడు నేను ‘ఇంటరు’ చదువుతున్నా. ఆ సందర్భంలో ఒక ఫ్యాన్ గా నన్నుకూడా అభినందించిన నా మిత్రమండలికి ఈ సందర్భంగా కృతఙత తెలుపకుండా ఉండలేను. అందుకే, ఈ జోకర్ గాడి ఫ్యాన్ కి ఒక విశిష్టమైన “విలువని” అందించిన సంవత్సరం గా 1991 నాకు బాగా గుర్తు. ఈ సినిమా లోని “పెళ్ళి(డీల్)చూపుల” సీన్ మధ్యతరగతి మనసుల్లోని భావాలకి అద్దంపడితే, రాజేంద్రుడి నటన దానికి జీవం పోసింది. అఫ్కోర్స్, ‘దివ్యవాణి’ కూడా చాలా బాగా “కాంప్లిమెంట్” చెసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. ఇక టైటిళ్ల మధ్య జరిగే ‘పెళ్లి’ ,దాంట్లో నాయిక నాయకుల మధ్య జరిగే “రొమాన్స్” తెరపై కవిత్వమేకానీ “స్క్రీన్ ప్లే” మాత్రంకాదని వేరేచెప్పాలా? పాత “మిస్సమ్మ” సినిమాకి ప్రేరణగా తీసిన ఈ సినిమాలో, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు,ప్రేమలు,ఆప్యాయతలు,ఉక్రోషాలు ఇలా అన్ని రసాలనూ అవలీలగా పోషించడం “డాక్టర్” రాజేంద్రప్రసాద్ కే చెల్లు. ఒక్కోసారి దాదాపు చిన్నపిల్లల్లా హీరోహీరోయిన్లు “గిల్లికజ్జాలు” పెట్టుకుంటుంటే చూసి చిన్నపిల్లలవని ప్రేక్షకుడు లేడు. ఇక్కడ సినిమా గొప్పదో, దాన్ని పండించిన నటులు గొప్పవాళ్ళొ చెప్పడం మహాకష్టం.[/size]
[size=4]‘చందమామ’ వారి రీఎంట్రీ సినిమా “బృందావనం” (1992) కి రాజేంద్రున్ని ఎంచుకోవడం ఒకవిధంగా తనకి గౌరవాన్ని కల్పిస్తే, సినిమాని తన నటబలంతో నడిపించి సంస్థను నిలబెట్టి తన ఘనతని చాటుకున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శక ప్రతిభ, వివిధ గెటప్పులలో మన హీరో చూపిన కొత్తదనం కలిపి ఈ సినిమాను ఒక “క్లాసిక్” గా నిలిపాయి. సినిమా ప్రధమభాగం లో శుభలెఖ సుధాకర్ తండ్రి గెటప్పులో, “ఆ..నా పేరు పోతరాజు” అని రమ్యకృష్ణ కు చెప్పిన తీరుకు మొత్తం ధియేటర్ నవ్విందిగానీ, అసలు వాచకం,మాడ్యులేషన్ నేర్పటానికి నటనా విధ్యార్థులకు చెప్పవలసిన పాఠమది అని నా విశ్వాసం. తరువాత సత్యనారాయణ ను ‘నమ్మకమైన నటన’ తో ఇంట్లోనే తిష్టవేసి భయపెట్టడం ఒక ఎత్తైతే, పెద్ద వ్యాపారవేత్తగా వేషం వేసి తనది కాని ఇల్లుని సత్యనారాయణకు అంటగట్టే గెటప్ లో తను చేసిన ఆ “ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్” ఏ కమల్ హాసన్ లాంటి నటుడికో తప్ప వేరొకరి తరంకాదు.[/size]
[size=4]జంధ్యాల స్కూల్ నుండి వచ్చిన ‘ఇ.వి.వి.సత్యనారాయణ’ దర్శకత్వం లో అంతకుమునుపు “చెవిలోపువ్వు” చేసినా, అది అంతగా ఆర్థికం గానూ ప్రేక్షకులకు అందటంలోనూ విజయవంతం కాలేదు. ”వీడెవడో జంధ్యాల లా తీసాడుకానీ సబ్జెక్ట్ లోఅంత బలం లేదు, రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ లో అంతపదును రాలేదు” అని తేల్చేసారు. ఈ ఓటమి తరువాత వచ్చిన చిత్రాలు, “ఆ…ఒక్కటీ అడక్కు!”, ”అప్పుల అప్పారావు” (1992). కొంత పెడర్థాలు, కొంత ద్వంద్వర్థాలు, కొంత లేకితనం వెరసి ‘నామార్కు హాస్యం’ అని ఇ.వి.వి. నిర్ణయిస్తే, దాన్నికూడా తన సమర్ధతతో సంసారపక్షం చేసిన నటుడు రాజేంద్రప్రసాద్. స్వర్గీయ రావుగోపాలరావు కాంబినేషన్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ లో వచ్చే ప్రతి సీనులోనూ ‘నటకిరీటి’ నటన ఏ నటుడికి అనుకరణ సాధ్యం? ” ‘అప్పు’ ‘డే’ తెల్లారిందా!” అని ‘అప్పుల అప్పారావు’లో తనుఅన్న ఒక్క డైలాగుచాలు,సినిమాలో తను పండించిన నటనని చెప్పడానికి.[/size]
[size=4]రాజేంద్రప్రసాద్ హాస్యం అపహాస్యమైపోతోందా ? అన్న తరుణం లో మరో దర్శకుడు తెరమీదికి వచ్చి, రాజేద్రుడి ఆరోగ్యకరమైన హాస్యనటనని తన నూతన ఒరవడితో మరో మలుపు తిప్పాడు. ఆ దర్శకుడే ఎస్.వి.కిష్ణారెడ్డి. “రాజేంద్రుడు-గజేంద్రుడు”,” మాయలోడు” (1993) సినిమాలతో అప్పటివరకూ కొంత ‘ఓవర్ యాక్టింగ్’ వైపు మోగ్గుచూపిన రాజేంద్రుడు మళ్ళీ సహజ నటనను ”అండర్ ప్లే” గా మలచి కామెడీని పుట్టించి, హిట్టిమీదహిట్టు తో ప్రజల మనసు దోచేసాడూ. నాలాంటి అభిమానుల ఆశల్ని నిలిపాడు. గజేంద్రుడి (జంతువు) మీద ప్రేమ ఒకదాంట్లో ఐతే, చిన్నపాప మీద ప్రేమ మరోకసినిమాలో. ఇలా తను “నేను గాని ఒక వీల గానీ వేశానంటే” అంటూ నటమాయ చెస్తే మంత్రముగ్ధులుకాని వారెవ్వరు?[/size]
[size=4]ఇక ఇదే సంవత్సరం లో వచ్చిన మరో ఆణిముత్యం “మిస్టర్ పెళ్ళాం”. బాపు-రమణల “సోషియో ఫాంటసీ సోషియల్ సెటైర్” (ఇలాంటి కేటగిరీ అంటూ ఏదీ లెదు, కానీ ఈ సినిమా అదేమరి) ఇది. ఇందులో పితృస్వామ్య భావజాలాన్ని అణువణువూ నింపుకున్న, ప్రేమించే(ఇదే ఇక్కడి కాంట్రడిక్షను) భర్త,తండ్రి గా “ప్రసాద్” పాత్రలో రాజేంద్రుడు చేసిన నటనకి, జోహార్లర్పించడం తప్ప ఏంచేయగలను. “ఫ్యాను…!” అంటూ, పేపరు చదువుతూ, తను సిగరెట్టు వెలిగించుకోవడానికి ఫ్యాన్ ఆపడం అవసరమై, వంటగది లో చాలా ముఖ్యమైన పనిలోఉన్న పెళ్ళానికి అరుస్తూ పురమాయించే ఈ సీను ఇంకేనటుడైనా చేసుంటే, ఆడవాళ్ళ చీవాట్లు పడేవే తప్ప ఈ “సెటైరు” కామెడీగా పండేదేకాదు. ఇలాంటి స్క్రిప్టు కి అలాంటి నటుడెంత అవసరమో చూసారా ! తను మొగాడినన్న అహం, మోసపోయి ఉద్యొగం పోగొట్టుకునే అమాయకత్వం,భార్య ఉన్నతికి ఉడుక్కునే ఉడుకుమోతుతనం, తనమాటే చెల్లాలననే ఉక్రోషం ఒకవైపు పండిస్తే. పిల్లలతో పిల్లాడై తనుచేసే అల్లరి, “సొగసుచూడ తరమా” అని ఆఫీసునుండి వచ్చేభార్య కోసం వంట తయారుచేసి ప్రేమతో ఎదురుచూసే పార్శ్వాన్ని సమంగా మరోవైపు పండించాడు. అదీ నటుడిగా తన “క్యాలిబర్”.[/size]
[size=4]తన సోంత సినిమాలైన “మేడమ్”, “రాంబంటు” రెండూ వ్యాపారపరంగా నష్టాలు కలిగించినా, ఆడవేషంలో ‘మేడం’ గా తనుచేసిన అల్లరి,అభ్యుదయం రెంఢూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయ్. ‘రాంబంటు’ లో సమయానికి అనువైన కొత్తదనం లేకపోయినా తన గెటప్పుని తప్ప నటనని ఖచ్చితంగా తప్పుపట్టలేము.[/size]
[size=4]1995 వ సంవత్సరం నుండి ఈ విలక్షన నటుడికి హీరో గా అవకాశాలు తగ్గాయి, అడపాదడపా సినిమాలు వచ్చినా అవి మంచి హాస్యఅభిరుచి కలిగిలేకుండా ఉండటంతో అటకెక్కాయి. తరువాత, మళ్ళీ సహాయ నటుడిగా, నలుగురు హీరోల్లో ఒకరిగా 2006 వరకూ నటించినా, అవేవీ (అభిమానిగా) చర్చించదగిన సినిమాలు కావని నా అభిప్రాయం. 2007 వ సంవత్సరం ఈ నటుడి సత్తా మరోసారి తెరపై ఆవిష్కరించింది. “ఆ నలుగురు” మరియు “మీ శ్రేయోభిలాషి” చిత్రాలు ఈ వయసులో రాజేంద్రప్రసాద్ చేయవలసిన పాత్రల స్వభావాలను, విషయాల స్వరూపాలను మచ్చుకకి రుచిచూపాయి. నటుడిగా, తన పూర్తి సత్తాని ఇంకా తెలుగు సినిమా ఉపయోగించుకోలేదని డి.టి.యస్ లో నిరూపించాడు.[/size]
[size=4]నేను ‘జోకర్ గాడి ఫ్యాన్ ని’ అని అప్పుడు, ఇప్పుడూ,ఎప్పుడూ గర్వంగానే చెబుతాను. ఇప్పుడు నా గొంతు లో గొంతు కలపడానికి కనీసం కోటి గొంతులున్నయ్ అంతే తేడా.[/size]
[size=4]P.S. రాజేంద్రప్రసాద్ తొ దాదాపు చెరో పది సినిమాలు చెసిన “రేలంగి నరసింహారావు”, “విజయబాపినీడు” గురించి పై వ్యాసంలో ఎక్కడా చెప్పలేదు.కారణం, అభిమానిగా నా స్పందనకు తోడ్పడిన సినిమాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం.[/size] [/font][/color]

  • Upvote 1
Posted

late 1980's nunchi 1995 varaki rajendra parasad movies are the ever green classics....plus daantlo konni vamshi,ilayaraja combination.........the best ones.....we still have a dvd collection of old rajendra prasad movies in our home....

Posted

[quote name='Nissan' timestamp='1371065191' post='1303850479']
late 1980's nunchi 1995 varaki rajendra parasad movies are the ever green classics....plus daantlo konni vamshi,ilayaraja combination.........the best ones.....we still have a dvd collection of old rajendra prasad movies in our home....
[/quote]
_-_

Posted

Agreed... from entertainment point of view his movies are better than other top heros.. Malli malli chudacchu.

Posted

same veedi laagane ee roju date lo allari naresh gaadi movies malli malli choodachu...comedy heros anytime ()>>

Posted

my fav's


1)ladies tailor----may be watched it more than 15-20 times
2)aa okkati addaku
3)april 1 vidudhala
4)appula appa rao
5)chettu kinda pleader

Posted

[quote name='Were_Wolf' timestamp='1371066026' post='1303850531']
@3$% @3$%
[/quote]
veedu malli vachadu

Posted

Heard that PV Narsimha Rao PM ga unna time lo....special ga Rajendra prasad movies thepichkoni chusthunde anta kaali time lo

Posted

[quote name='BikerBoy' timestamp='1371071429' post='1303850802']
Heard that PV Narsimha Rao PM ga unna time lo....special ga Rajendra prasad movies thepichkoni chusthunde anta kaali time lo
[/quote]

Sonia Gandhi Italy Vacation ki poinapuda ?

×
×
  • Create New...