Jump to content

Kastallo Sakshi...jeethallev..


Recommended Posts

Posted

[font="Verdana,Arial,Helvetica"][size="2"][font="Verdana,Arial,Helvetica"][size="2"][b]సాక్షి దినపత్రికలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా సిబ్బందికి జీతాలు పెంచడం లేదు. కార్మిక సంక్షేమం, ప్రజల శ్రేయస్సు గురించి కుప్పలుతెప్పలుగా ఉపన్యాసాలు చెబుతున్న వైకాపా అగ్ర నాయకులు సాక్షి దినపత్రిక సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు ‘ఎన్‌డిటీవీ’కి చెల్లిస్తున్న యాజమాన్యానికి ఆ పత్రిక, ఛానెల్ సిబ్బందికి జీతాలు పెంచడానికి నిధుల కొరతను సాకుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా సీబీఐ దర్యాప్తు పేరిట గత మూడు సంవత్సరాల కాలంగా ఆరు వేల రూపాయలకు పని చేస్తున్న సిబ్బందికి ఒక్కరూపాయి కూడా జీతం పెంచలేదని ఆ పత్రికను వీడిన పలువురు మాజీ ఉద్యోగస్తులు ‘కృష్ణాపత్రిక’తో చెప్పారు. అదే సమయంలో సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళ ఉద్యోగి అరాచకాలు భరించలేక వందలాదిగా సంస్థను విడిచిపోయినట్లు కొందరు మాజీ ఉద్యోగస్తులు వాపోయారు. ఆ సదరు ఉన్నత స్థాయి మహిళ ఉద్యోగి సాక్షి చైర్మన్‌తో నేరుగా సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ఆమె పేరు చెబితేనే సిబ్బంది హడలిపోతున్నారు. అదే సమయంలో ఆమె నియంతృత్వ పోకడలకు విసిగివేసారిన అనేక మంది సిబ్బంది సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల సాక్షి లోగోకు సంబంధించి మార్పుచేర్పులను చేపట్టారు. ఓబీ వ్యానులు, మినీ వ్యాన్లపై ఉన్న సాక్షి లోగోను మార్చి 23 లక్షల రూపాయల ఖర్చుతో కొత్త లోగోను రూపొందించారు. అది అయిన నెల రోజుల వ్యవధిలో సాక్షి సొంత ఓబీ వ్యాన్లను నిర్వహణ వ్యయం అధిక కావడంతో వాటిని పక్కన పెట్టి ప్రైవేటు ఓబీ వ్యాన్లను అదెకు తీసుకొని ప్రస్తుతం నడిపిస్తున్నారు. అదే సమయంలో 23 లక్షల రూపాయల సంస్థ డబ్బును ఆ మహిళ ఉన్నత స్థాయి ఉద్యోగి ఎందుకు ఖర్చుపెట్టారం టూ ఆ సంస్థ నుంచి వెళ్ళిపోయిన ఉద్యోగస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఉన్నతస్థాయి ఉద్యోగులకు సంబంధించి 5 నక్షత్రాల హోటల్లో ఒక గంట పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇప్పించారు. ఇందుకు పది లక్షల రూపాయలు ఖర్చు చేయగా లేంది.. గొడ్డు చాకిరి చేస్తున్న సిబ్బంది జీతాలు ఎందుకు పెంచడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సమాచార కమిషనర్‌గా ఉన్నత పదవిని నిర్వహించి సాక్షి దినపత్రికలో చేరిన ఒక సీనియర్ పాత్రికేయుడు సైతం ఆ మహిళ ఉన్నతస్థాయి ఉద్యోగిని ముందు చేతులు కట్టుకొని నిలబడడం పాత్రికేయ లోకానికి మాయని మచ్చంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించిన యాజమాన్యానికి సిబ్బంది జీత భత్యాలు పెంచడం కష్టమైన పనా అంటూ పలువురు మాజీ ఉద్యోగస్తులు మొరపెట్టుకుంటున్నారు. ఒక్కో నెలలో అయితే 30కి పైగా ఉద్యోగస్తులు సంస్థను విడిచిపెట్టిన ఉదంతాలు ఉన్నాయని.. ఇది ఒక చరిత్రని, ఆ మాజీ ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల కోసం పని చేస్తున్న కొందరికి సాక్షి సంస్థ పేరిట జీతాలు చెల్లిస్తున్నారని అది ఎంత వరకు సమంజసమని మాజీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాఫీలు, టీలు తాగినా కూడా నోటీసులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాక్షి దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన పలువురు షేరు హోల్డర్స్‌కు కూడా సాక్షి సిబ్బంది పేరిట వైసీపీ కోసం పనిచేసే కొందరు నేతలకు జీతాలు చెల్లిస్తున్న విషయం తెలిసి ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఎంతో గోప్యంగా జరుగుతున్న ఈ వ్యవహారం బయటికి ఎలా పొక్కిందో అర్థం కాక అదే సమయంలో సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ విషయంలో ఎలా సమాధాన పరచాలో తెలియక ఉన్నతస్థాయి యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. గతంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో పత్రిక నిర్వహణపై దృష్టి సారించేవారని.. అప్పట్లో దినపత్రిక, సాక్షి ఛానెల్ అభివృద్ధి పథంలో నడిచేవని కానీ, ప్రస్తుతం రాజకీ యంగా బిజీ అవడం వల్ల ఎడిటర్ బాధ్యతలు నిర్వహి స్తున్న మురళి ఆధ్వర్యంలో పత్రిక ఆశించిన స్థాయిలో వైకాపాకు ప్రచారం అందించలేకపోతోందని సాక్షి యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచా రం. ఒక వైపు ఉద్యోగుల నిష్ర్కమణ మరోవైపు పత్రిక సర్క్యూలేషన్ తగ్గిపోవడం, ఛానెల్ రేటింగ్‌లు పడిపో వడంతో యాజమాన్యానికి ఏం చేయాలో అర్థం కావ డం లేదని అంటున్నారు. అదే సమయంలో ఎడిటర్ మురళి పని తీరుపై కూడా వైకాపాకు చెందిన కొందరు అగ్ర నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆ విషయం తెలుసుకున్న మురళి పత్రిక నిర్వహణలో రాజకీయ జోక్యం తగదని తద్వారా సంస్థ నిర్వహణ చాలా కష్టం అవుతుందని వాపోతున్నట్లు చెబుతున్నారు. [/b][/size][/font][/size][/font]

Posted

[img]http://stream1.gifsoup.com/view6/4730847/brahmi-cry-2-o.gif[/img]

×
×
  • Create New...