Jump to content

Opikunnollu...viralaalu Ivvandi


Recommended Posts

Posted

కేంద్ర మంత్రి చిరంజీవి పిలుపు
ఎంపీ ల్యాండ్ నుంచి కోటి కేటాయింపు
దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విరాళాలు న్యూఢిల్లీ, హైదరాబాద్, జూన్ 24 : ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకునేందుకు వీలుగా.. 'చిరంజీవి చారిటబుల్ ట్రస్టు'కు విరాళాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి చిరంజీవి తన అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి.. బాధితుల సహాయార్థం తన ఎంపీ కోటా నిధుల నుంచి రూ. కోటి రూపాయలు, ఒక నెల వేతనాన్ని కూడా ఇచ్చారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు.


- ఢిల్లీ పోలీసులు రూ.కోటి విరాళం ప్రకటించారు.
- తీహార్ జైలు ఖైదీలు రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
- చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలు.. ఒకరోజు మాంసాహారం మానేయడం ద్వారా వచ్చే లక్ష రూపాయలను బాధితులకు అందించేందుకు సిద్ధమయ్యారు.
సాయం చేద్దాం రండి: నారా లోకేశ్
ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు.. వైద్యులను, మందులను పంపిస్తోందని, తాము మరింతగా సేవలు అందించడానికి వీలుగా వ్యక్తులు, సంస్థలు, దాతలు విరాళాలు ఇవ్వాలని ట్రస్టు సభ్యుడు నారా లోకేశ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ టస్టు పేరుతో హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు విరాళాలు పంపాలని కోరారు. ఖాతా నెంబర్ 18090 200000382. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఆఅఖఆ0ఒ్ఖఆఐఔఉ. డీడీలు, చెక్కులను పోస్టులో పంపాలనుకొన్నవారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్టు మెమోరియల్ ట్రస్టు కార్యాలయానికి పంపాలని, సమాచారం కోసం 040- 30145800ను సంప్రదించాలని తెలిపారు.

చేతులు కలపండి: సేవాభారతి
బాధితులను ఆదుకోడానికి అందరూ చేతులు కలపాలని సేవాభారతి సంస్థ కోరింది. విరాళాలు పంపడానికి కాచిగూడ, బర్కత్‌పుర ప్రాంతాల్లోని తమ కార్యాలయాల్లో సంప్రదించాలని లేదా ఐసీఐసీఐ హిమాయత్‌నగర్ శాఖలోని తమ ఖాతా 630501065297కు పంపాలని పేర్కొంది. 'ప్రాజెక్ట్ హోప్' కింద 25 బస్సుల్లో దుప్పట్లు, ఆహారం, మందులను స్వామి చిదానంద సరస్వతి పంపారు.
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హిందూ హెల్ప్‌లైన్
వరద బాధితుల సహాయార్థం సోమవారం హైదరాబాద్‌లో హిందూ హెల్ప్‌లైన్‌ను వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ప్రారంభించారు. సహాయం చేయడానికి తమ అకౌంట్ నెంబర్ 0199000109065862, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అప్పర్ రోడ్ హరిద్వార్, ఆర్టీజీఎస్ కోడ్ 0019900 ద్వారా విరాళాలు పంపాలన్నారు

×
×
  • Create New...