Jump to content

Kaaloji At His Best


Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-frc3/970234_126498624224219_106326435_n.jpg[/img]

Posted

[color=#333333]కవి కాళోజీ జీవితాన్ని కాచి వడబోసిన పెద్దాయన! సకల సాహిత్య సారాన్నిసూక్ష్మంగా విప్పి చెప్పారాయన! 'నా' నుంచి 'మా' కే రాలేదు మనం; 'మనం' అనుకోనిదే ముందడుగు పడేదెప్పుడు? అని ప్రశ్నిస్తున్నారాయన. నిజమే కదా 'మనం' అనుకుంటేనే తెలుగు జాతి ముందడుగు వేస్తుంది! ఇది మనందరికీ తెలిసిన సత్యమే. కానీ అదెప్పటికి సాధ్యం?[/color]

[color=#333333]అది సాధించడానికి ముంద[/color][color=#333333]ు 'నా' నుంచి 'మా' కు చేరండయ్యా! అని హెచ్చరిస్తున్నారు పెద్దాయన. ప్రతి వ్యక్తీ తన సొంతం కోసమే కాక 'మా' అనుకునే వారందరి అభివృద్ధి కోసం పని చెయ్యమంటున్నారు. ఈ 'మా' లో బంధు మిత్ర సపరివారం అంతా ఉంటుంది. వాళ్ళందరి కోసం శ్రమించే స్వభావాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాళోజీ హితవు పలుకుతున్నారు! కానీ అదేమీ ఆషామాషీ కాదు! దానికి ఎంతో చేవ, చొరవ, సహృదయం కావాలి. అదే ఇంకా మనవాళ్ళకు సరిగ్గా ఒంటబట్టలేదని ఆవేదన చెందుతున్నారాయన!

సరి సరి, 'మా' గురించి ఆలోచించే గొప్ప అట్లా ఉంచుదాం; కనీసం 'నా' గురించి అయినా ఒద్దికగా, పద్దతిగా, చిత్తశుద్ధితో పని చేస్తున్నామా? 'నేను', 'నా' అని ఆలోచించడం స్వార్థం అంటారు. నిజంగా మనం స్వార్థపరులమేనా?! తరచి చూస్తే ... స్వార్థపరులుగా ఉండటానికి కూడా కొన్ని లక్షణాలు కావాలి: కోరిక ఉండాలి; ఆ కోరిక నేరవేర్చుకునే గట్టి సంకల్పం ఉండాలి; దాన్ని సాధించే నేర్పు ఉండాలి; ఓర్పు ఉండాలి; పట్టుదల ఉండాలి; కష్టించే స్వభావం ఉండాలి. నిజానికి సోమరితనం, బద్ధకం, నిష్క్రియాపరత్వం, నిర్వీర్యత మన జాతికి శాపాలై పీడిస్తున్నాయి. మనం 'స్వార్థపరులు' అని తిట్టడానికి కూడా అలవిమాలిన జాతిగా మారిపోయాం!

అందుకే అన్నారు పెద్దాయన: నా నుంచి మాకే చేరలేదని! ఈ 'నామా'లకెప్పుడు చేరతాం; మా నుంచి 'మనం' ఎప్పుడవుతాం; ముందడుగు ఎప్పుడు వేస్తాం? ఒక జాతిగా ఎప్పటికి రాణిస్తాం?! తెలుగు వాడిలో వాడీ, వేడీ అడుగంటాయా? అంతరించిపొయ్యాయా? కాళోజీ మాటలకు అసలైన అర్థం ఏమిటి?

'మనం' అనే భావనే 'మా' 'నా' లకు కూడా ఉద్దీపన కల్గిస్తుంది; ఉత్తేజం రేకెత్తిస్తుంది; 'మనం' అనుకున్నప్పుడే మనలో నిజమైన స్వాభిమానం రగుల్కొంటుంది; అందులోనే చేవ ఉంటుంది; జీవముంటుంది. అందులోనే వ్యక్తి, కుటుంబం, సమాజం, యావత్తూ జాతి హితం ఇమిడి ఉంటుంది. జాతిని మరచిన నీతి మనిషిని కుంగదీస్తుంది; కుదేలు చేస్తుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం.

ఉమ్మడితనం బలంగా ఉన్ననాడే పౌరుషం పొంగుతుంది. ప్రపంచమంతా గుర్తించే ప్రతిభా పాటవాలు మనలో విప్పారతాయి; మనం, మన ఊళ్లు, మన సమాజం సమృద్ధితో కళకళలాడతాయి! తెలుగు జాతి తేజరిల్లగ కదం కదం కలుపు సోదరా! నీ భుజం కలుపు సోదరా!![/color]

Posted

great kavi ni addam petukoni politics chese kcr supporter vi nikenduku ii post [img]http://www.andhrafriends.com/uploads/gallery/album_15/gallery_731_15_89370.gif[/img]

Posted

[quote name='tyke' timestamp='1372384436' post='1303898228']
()>> ()>> ()>> ()>> ()>>
[/quote]
[img]http://bconverter.com/download/1372371889-1627328/temp-320-95541221.gif[/img]

Posted
()>>[size=4] [/size][size=4] ()>> JAI TELANGANA [/size][img]http://i.imgflip.com/z31m.gif[/img]
×
×
  • Create New...