Jump to content

Telugu Jathi Gourava Chihnam Is Missing


Recommended Posts

Posted

[color=#333333][img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1166_120522354821846_537314774_n.jpg[/img]తెలుగు జాతి గౌరవ చిహ్నం "కలమళ్ళ శాసనం" కనిపించడం లేదు![/color]

[color=#333333]తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించడానికి ప్రాతిపదిక ఇప్పటికి 2500 సం.ల క్రితం నాటి కలమళ్ళ శాసనం. ఇప్పుడా శిలాశాసనం కనిపించడం లేదు! పోయింది అట్లాటి ఇట్లాటి వస్తువు కాదు. తెలుగు భాషకు వెలుగు పూలు పూయించిన తొలి తెలుగు శాసనం. తెలుగు భాషకు రాజ భాష హోదాను, శాసన భాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, తెలుగు భాషకు అక్షర రూపం యిచ్చి చారిత్రకంగా, సాహిత్యపరం[/color][color=#333333]గా ఘన వారసత్వ కీర్తిని అందించిన 'కలమళ్ళ శాసనం' -తొలి తెలుగు శాసనం ఎక్కడుందో యిప్పుడెవరికీ తెలియడం లేదు. అందరూ నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు.

(శాసనంపై ఉన్న మాటలు) "కల్ముతురా - జు ధనంజ య - ఱు రేనా ణ్డు ఏళన్ - చిఱుంబూరి - రేవణకాలు (పం) - పు చెనూరు కాజు - ఆఱికాశా ఊరి - ణ్డవారు ఊరి - న వారు ఊరిస".

కడప జిల్లా కమలాపురం మండలంలోని కలమళ్ళ గ్రామంలో లభించిన ఈ శిలాశాసనం ఒకప్పుడు చెన్నై లోని ఎగ్మూరు సంగ్రహశాలలో భద్రపరచబడింది. ఇప్పుడది అక్కడ లేదు. ఏమయ్యిందీ ఎవ్వరికీ తెలీదట! ఎగ్మూర్ సంగ్రహశాల నిర్వాహకులు కానీ భారత ప్రభుత్వానికి చెందిన పురాతత్వ విభాగంగానీ దాని జాడ గురించి తమవద్ద సమాచారం లేదంటున్నాయి.

చోళ రాజు ధనుంజయ వర్మ విరచిత శాసనం కడప జిల్లా కలమళ్ళ గ్రామం లోని చేన్నకేశవ స్వామి ఆలయంలో లభించింది. 1904లో నాటి మద్రాస్ ప్రభుత్వ అధికారులు దాన్ని ఎగ్మూరు సంగ్రహశాలకు తరలించారు. వేములపల్లి గంగాధర్ సమాచార చట్టం ద్వారా విచారణ చేసినప్పుడు ఎగ్మూరు సంగ్రహశాల నిర్వాహకులు ఆ శిలాశాసనం తమవద్ద లేదని స్పష్టం చేసారు. హైదరాబాదులోని పురాతత్వ శాఖ కూడా ఆ శాసనం ఎక్కడ ఉన్నదో తెలియదని తేల్చిచెప్పింది.
రేనాటి చోళులు 'చెప్పలియా' గ్రామం రాజధానిగా రేనాటి ప్రాంతాన్ని పాలించారు. రేనాడు ప్రాంతం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మల మడుగు, తాలూకాలు; కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని కొన్ని ప్రాంతాలతో వున్న ఏడు వేల గ్రామాలున్న ప్రాంతంగా ఆధారాలున్నాయి. రేనాటి చోళులు తమ రాజధానిగా చేసుకున్న 'చెప్పలియా' ప్రాంతం నేడు కమలాపురం మండలంలోని 'పెద్ద చెప్పలి'గా గుర్తించారు.

ఇప్పుడీ "కలమళ్ళ శాసనం" ఎక్కడున్నాడో అన్వేషించాలి. ఇది మన ఆత్మ గౌరవ చిహ్నం. ఇది మన ప్రతిష్తకు సంబంధించిన విషయం[/color]

Posted

nikkavalsindi ade kada [img]http://www.andhrafriends.com/uploads/gallery/album_15/gallery_731_15_89370.gif[/img]

Posted

Bhayya I also feel sorry but vurake gurthuku vachindi raastunaa

Abbé meeru marandi vela kotlu dobbesaru ani paper lo ne vestunaaru
Vaati gurinchi pattinchukovala , silalu , sasanaalu poyayani pattinchukovala (svsc)

Posted

[quote name='Doola' timestamp='1372347921' post='1303895982']
Bhayya I also feel sorry but vurake gurthuku vachindi raastunaa

Abbé meeru marandi vela kotlu dobbesaru ani paper lo ne vestunaaru
Vaati gurinchi pattinchukovala , silalu , sasanaalu poyayani pattinchukovala (svsc)
[/quote]
[img]http://www.desigifs.com/sites/default/files/2013/GSB3.gif?1370457845[/img]

Posted
CITI_c$y[size=4] [/size][size=4] CITI_c$y[/size]
×
×
  • Create New...