Jump to content

Recommended Posts

Posted

[img]http://thatstelugu.oneindia.in/img/2010/03/07-balakrishna.jpg[/img][size=15pt]"ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" గా నటించాలని చిరంజీవి ఎన్నో కలలు కన్నారు. ఆయన కోసం పరుచూరి బ్రదర్స్ నరసింహారెడ్డి కథను రాసి సిద్ధం చేశారు. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇప్పుడు బాలకృష్ణ  ఆ పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి రంగం సిద్ధమవుతోంది. జయంత్ దర్శకుడు. కథ పరుచూరి బ్రదర్శే. రెడ్డి పేరుతో ఉన్న సినిమాలు బాలకృష్ణకు బాగా కలిసివస్తున్నాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన రాష్ట్రంలో బ్రిటీష్ వారిని ఎదిరించి, వారి చేతిలో ఉరితీయబడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. కర్నూలు జిల్లాకు చెందినవారు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే బ్రిటీషు వారితో పోరాడిన యోధుడు. ఆయన చారిత్రక గాధను కర్నూలుకే చెందిన ఎస్ డివి అజీజ్ అనే ప్రముఖ రచయిత రెండు దశాబ్దాల క్రితమే "పాలెగాడు" పేరుతో నవలగా పాఠకుల ముందుకు తెచ్చారు.

ఆ నవలను అప్పటి ప్రతిపక్ష నాయకుడు నందమూరి తారకరామారావు ఆవిష్కరించారు. ఆ నవల త్వరలో రెండో ప్రింట్ రాబోతోంది. తన నవలను పరుచూరి బ్రదర్శ్ కాపీ కొట్టారని, తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అజీజ్ afdb bharateyudu కు చెప్పారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్రకు తాను ఎంతో ఫిక్షన్ ను జోడించానని ఆయన చెబుతున్నారు. ఆ నవల తన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఆయన వెల్లడించారు.[/size]

Posted

ee  అజీజ్ anevadi nake eppudo ekkado vinatuu gurthu naaku  LoL.1q LoL.1q LoL.1q LoL.1q

×
×
  • Create New...