Jump to content

Recommended Posts

Posted

[img]http://telugu.oneindia.in/img/2013/07/13-rajinikanth.jpg[/img]

సూపర్ స్టార్ రజనీకాంత్ సాధారణంగా ఏ చిత్రం గురించీ విడుదలకు ముందే తన అభిప్రాయాన్ని వెల్లడించరు. కానీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘ఓం'3డి చిత్రాన్ని చూసి చాలా బాగుందని కితాబిచ్చారు. మరి ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతున్న ఈచిత్రం నిజంగానే రజనీకాంత్ మాట నెలబెట్టే విధంగా ఉంటుందో? లేదో? చూడాలి. రజనీ కాంత్ మాట్లాడుతూ ‘రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన నైస్ కమర్షియల్ ఫిలిం ‘ఓం' 3డి. ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. 25 కోట్ల రూపాయల బడ్జెట్‌లోనే క్వాలిటీ పరంగా తీసిన ‘ఓం'3డి యూనిట్ ను అభినందిస్తున్నాను. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉంది' అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...‘రజనీకాంత్ లాంటి గ్రేట్ స్టార్ నా ‘ఓం' చూసి ప్రశంసించడం చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. రజనీకాంత్ ఆశీర్వదిస్తుంటే మా తాతగారు నందమూరి తారక రామారావుగారు ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది' అన్నారు. కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు.

×
×
  • Create New...