Jump to content

controversy on Varma's new film


Recommended Posts

Posted

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "రణ్ " సినిమాలో భారత జాతీయ గీతాన్ని నేపధ్య గీతంగా వాడుకోవడం, మధ్య మధ్యలో జాతీయ గీతం ట్యూన్ ను ఉపయోగించుకోవడంపై ప్రవాసభారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 చానల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎన్నారైలు " భారత జాతీయ గీతాన్ని రక్షించండి" అంటూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.భారత జాతీయ పతాకాన్ని వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడం సముచితం కాదని, దీనిని తాము ఖండిస్తున్నామని ప్రవాసస భారతీయులు పేర్కొన్నారు.

దీనిపై ఎవరైనా తమ నిరసనలను [email protected] లో పోస్ట్ చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ సినిమాలను తాము ఇష్టపడతామని కానీ ఇలా జనగణమన గీతాన్ని అపవిత్రం చేయడం తగదని వారు అంటున్నారు. వర్మ అటువంటి సన్నివేశాలను తొలగించి, జాతీయ గీతంపై తన గౌరవాన్ని చాటుకోవాలని వారు కోరారు. దీనిపై భారత రాష్ట్రపతికి, ప్రధానికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతి పత్రాలను పంపుతున్నమని వారు తెలిపారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా హెడ్ లైన్స్ కెక్కే వర్మ ఇప్పుడు దానిపైనే యుద్దం ప్రకటించనున్నాడు. ఇదే విషయాన్ని వర్మ తన బ్లాగ్ లో ప్రస్తావిస్తూ...తను తర్వాత తీస్తున్న చిత్రం పేరు రణ్ అనీ ప్రకటించాడు. రణ్ అర్దాన్ని కొన్ని భారీ స్దాయిలో ఆర్గనైజ్ చేయబడుతున్న కొన్ని గ్రూపుల మధ్య యుధ్థం గా వర్ణించాడు. ఇక ఈ చిత్రంలో న్యూస్ ఛానెల్స్, పేపర్లు కలసి బ్రేకింగ్ న్యూస్ కోసం వారిలో వారు చేసే పోరాటాల్ని,చీప్ జిమ్మిక్స్ ని బయిటపెడతానంటున్నాడు. మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అంటారని,అదే పిల్లి కుక్కను కరిస్తే బ్రేకింగ్ న్యూస్ అంటారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ న్యూస్ ఛానెల్స్ టీవీ సీరియల్స్,థ్రిల్లర్స్ కన్నా మంచి ఎంటర్ టైన్ మెంట్ ని ఇస్తాయంటూ విమర్శించాడు. తమ సర్కులేషన్,టీరీపీ రేటింగ్స్ పెంచుకునేందుకు అవి ఎంతకైనా దిగజారుతున్నాయని అదే సబ్జెక్టు అనీ చెప్పుకొచ్చాడు.

×
×
  • Create New...