Jump to content

(News)Ense

Recommended Posts

Posted

[size=4]అది మండేకాలం,అమావాస్య ఆదివారం, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాగొప్ప చెడ్డరోజు.(ఏంటీ!యండమూరి వారి కాష్మొరా కథలు లాంటివి ఎవైనా చెప్తున్నాఅనుకుంటున్నారా? అస్సలు కాదు.. చదివి నా బాధ ఎంటో తెలుసుకోండిక!) [/size]

[size=4]గత జన్మల, ఈ జన్మల పాపాలు ఒకే రొజు అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలియాలనియముడు శపించి, బ్రహ్మకి విన్నపాన్ని పంపించి జీవితంలో ఇలాంటి ఒకరోజును నుదిటిమీదరాయించిన రోజు. ఇక ఇంత కన్నా ఎక్కువ వర్ణిస్తే మీరు కూడా ఇలానే అనుకునే అవకాశాలుఎక్కువ.[/size]
[size=4]కావున ఇక విషయంలోకి వెళ్తే!![/size]
[size=4]ప్రతి రోజు వా రాంతం కోసం ఎదురుచూసి, అది రాగానే కాళ్ళ్ళకి చెప్పులు బదులు చక్రాలుకట్టుకుని సాధ్యమైనంతలో ఊరంతా చక్కర్లు కొట్టేసి అలసి,సొలసి ఇంటికొచ్చి ఆదమరచినిద్రలోకి జారుకునే అలవాటు.మర్నాడు ఉదయాన్నే(అంటే 10.30 and above)లేచి మళ్ళీతిరిగేయడం ఆనవాయితి. కాని ఆరోజు ఘటోత్కచుడు పెద్ద గధతో తన్ని నిద్ర లేపినట్లుఉలిక్కిపడి లేచాను.పక్కనే ఉన్న mobile లో time చూస్తే 7.00A.M.[/size]
[size=4]Curtain జరపగానే Mr. భానుడు తన వీర ప్రతాపాన్ని నా కళ్ళమీద చూపించి ఒక వెర్రి వెటకారపు నవ్వు నవ్వాడు.రాజమౌళి సినిమాలలో ఎన్ని శకునాలు చెప్పి చూపించినా మనకు నిజజీవితంలో వాటిని అంచనా వేయడమ రాలేదు సుమీ!! సరే ఆ వెర్రి నవ్వులో తీవ్రతను గ్రహించి ఇవాళ T.V చూస్తూ గడిపేద్దాం అని పప్పులో కాలేశాను.[/size]
[size=4]అలా నా బుర్రలోనుండి వచ్చిన నీచ,నికృష్టపు పనికిమాలిన ఆలోచనకు శ్రీకారం చుడుతూబూజు పట్టిన T.V ని శుభ్రంచేయడం మొదలుపెట్టాను(అంటే వాడి చాలా కాలం అయిందని మీరు గమనించాలి). ఆ శ్రీకారానికి మరి ప్రాకారం కట్టాలి కదా.[/size]
[size=4]So,T.V చూడటానికి మంచి setup కూడా సిద్దం చేసుకున్నాను. ఓ! సిద్దం చేసుకోవడం మీకు తెలుసో లేదో. క్లుప్తంగా చెప్తా![/size]
[size=4]1.T.v[/size]
[size=4]2.Remote(ఇది లేకుంటే t.v ఉన్నా,లేనట్లే!!)[/size]
[size=4]3.Bean bag/comfortable chair(అన్నిటికన్నా ఉత్తమైమైనది ఒక గోడ,చిన్న దిండు)[/size]
[size=4]4.Chips(తిన్నన్ని)[/size]
[size=4]5. శీతల పానీయములు (తాగినన్ని)[/size]
[size=4]చక్కగా స్నానాలు,జపాలు ముగించి ఆ T.V setup ని చూసి మురిసిపోతూ curtain ని మూసేసి,lights off చేసి, STAR movie release కి ముస్తాబు చేసిన theatre feeling తో T.V on చేశాను(నేను గణపతి ప్రార్ధన చేయడం మర్చిపొయాను-ఇది రెండవ తప్పు).[/size]
[size=4]అమాంతంగా Remoteలో నుండి పొగలు వచ్చాయి.అయినా నేను పట్టించుకోకుండా వరుసగా ప్రసార కేంద్రాలను మార్చడం మొదలుపెట్టా.. ఆ channels ని చూసి అవాక్కయ్యా!అన్నీ వార్తాప్రసారకేంద్రాలే(News channels). ప్రపంచంలో నాకు ఎప్పటికీ నచ్చని ఒకే ఒక్క పని వార్తలు చూడటం అని చిరంజీవిలా నాకు నేనే dialogue చెప్పేసుకుని మా cable operatorకి call చేశా. ఆ మహానుభావుడు ఒక 15calls తర్వాత ఆవలిస్తూ ఎంటీ! ప్రొద్దున్నే ఈ disturbance అంటూ answer చేశాడు. అవసరం నాది కనుక కోపాన్ని లోలోపల అణచుకుని,అతిమర్యాదని పోగు చేసుకుని[/size]
[size=4]"నాకు News channels తప్ప ఇంకేమీ రావడంలేదండీ” అని చెప్పాను.దానికి అవతలివైపు నుండి ఒక భీకర,భీభత్స వికటాట్టహాసం వినిపించింది. మీరు cable bill pay చేయక 6నెలలు అయింది. ఇదివరకులా cable పీక్కుపోవడం లేదు.only news channels కి connection ఉంచడం కొత్తపద్దతి అని వెంటనే disconnect చేశాడు. ఏంటో!!వీడి చాదస్తం ఇదేం శిక్ష అనుకుని సరే! అన్నిటిలో positives వెతికే నాకు, ఇవాళ వార్తలు చూసేసి G.K improve చేసుకోవచ్చునన్నమాట అంటూ వచ్చే ఉపద్రవాన్ని ఊహించకుండా I.A.S examsకి Prepare అయ్యే మంచి విద్యార్ధిలా ఒక పెన్ను,కాగితం, కలం తెచ్చుకుని కూర్చున్నా. కానీ ఇష్టంలేని పని చేయిస్తున్నందుకు ఆ cable వా డ్ని అన్ని జంతువుల పేర్లతో తి ట్టేసుకుని అవి అయిపొయాక కష్టపడి జంధ్యాల గారి సినిమాలో తిట్లు( గాలి వానలో విసినకర్రలు అమ్ముకునే వెధవ లాంటి తిట్లు) T.V లోకి కళ్ళు పెట్టాను.(3[sup]rd[/sup] mistake)[/size]
[size=4]Channel.1:[/size]
[size=4]Neat గా blazer వేసుకుని haircut చేసుకుని చాలా professional గా కూర్చుని ముందు ఉన్నtable మీద 4కాగితాలు ఒక కలం పెట్టుకుని ఒక news reader చదవడం మొదలు పెట్టింది. అచ్చ తెలుగుని పక్కనే ఉన్న చెత్తబుట్టలో వేసి పిచ్చ తెలుగులో(తెలుగు+ఆంగ్లము=తేల్గ్లము) షెడువుతుంది(చదువుతుంది).[/size]
[size=4]తాజావార్తలు: ఒక చిన్న గ్రుడ్డు మీద పెద్దలారీని ఎక్కించి నిండుప్రాణాన్ని బలిగొన్న కర్కోటకుడు.[/size]
[size=4]వివరాలు మరిక్రొద్దిసేపట్లో: break తర్వాత! చూస్తునే ఉండండి. 4మంచి వ్యాపర ప్రకటనల తర్వాత వాళ్ళ[/size]
[size=4]Reporter Mr.XX ఒక mike పట్టుకుని,Red tie వేసుకుని చెమటలు పట్టిన మొహంతో చూడండి!Ms.W( News reader),Camera man Mr.YY తో ఇప్పుడే ఘటనా స్తలానికి చేరుకున్నాం. ఒక అమాయకపు గ్రుడ్డు పాపం Road మీదకు ఎలా వచ్చిందో తెలియదు.కానీ ఒక పెద్ద లారిని ఒక నిర్దయుడైన driver అమాంతంగా ఎక్కించి దాని జీవితాన్ని మొగ్గలోనే తుంచివేశాడు.ఈ ఘటన జరగకపోయిఉంటే ఎన్ని కోళ్ళు ఈ భూమిమీద తిరుగుతూ ఉండేవో!! జరిగిన నష్టానికి అక్కడి ప్రజలు విలవిలలాడుతూ ఇక్కడ ధర్నాలు,రాస్తారొకోలు చేస్తున్నారు.EGGCROSS వారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ police commissioner కి దీనిపై తగు రీతిలో తమ బాధ్యతను నిర్వర్తించాలని విన్నపపత్రం సమర్పించారు. అంటూ ఆ దృశ్యాలు మొట్టమొదటిగా మా news channel ప్రసారం చేస్తుందంటూ water mark తో తమపేరుని గుద్దించి గంటన్నర program telecast చేశాడు.” గుడ్డుపగిలిందా” అంటూ బ్రహ్మి estyle లో expression పెట్టి విరక్తితో కాసేపు పడుకుందామనుకుని ప్రయత్నిస్తే "దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన అన్నట్లు" నాకు నిద్ర రాక మళ్ళీ[/size]
[size=4]T.V on చేస్తే, అదే channel లో ఒకానొక అధ్యాత్మిక గురువు ఒక దేవుడి గురించి తప్పుగా మాట్లాడి అవమానించాడు.ఆ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నయంటూ తమ ఊహాశక్తితో ఇష్టం వచ్చినట్లు వ్యర్థప్రేలాపనలతో"గురుగింజ తన మచ్చెరుగదన్న" సామెతను గుర్తుచేశారు.మళ్ళా ఈ అంశంపై చర్చా వేదికలు.ఈ చిరాకు తట్టుకోలేక వేరే channel మార్చాను.[/size]
[size=4]Channel2: వీళ్ళకి Celebrities personal life తప్ప మిగిలినవి వార్తలే కాదు.ఎవరో hero, heroine తో బయటల చక్కర్లు కొడుతూ కనిపించాడట. ఆ photos ని Zoom in&out చేస్తూ సుమారు 250సార్లు telecast చేస్తున్నారు. ఇక బాబొయ్! అనుకుంటూ channel 3 పెట్టాను.[/size]
[size=4]Channel3: ఫలానా వాళ్ళ కుక్కపిల్లకి కడుపునొప్పి.ఎందుకంటారు? poling gate openచేశాం. మీ అభిప్రాయాలను 58572కి SMS చేయండి.క్రింద right corner లో ఫలితాలు.[/size]
[size=4]a. వాతం – 49%[/size]
[size=4]b.పైత్యం – 42%[/size]
[size=4]c.అజీర్ణం – 7%[/size]
[size=4]d.నాకు తెలియదు – 2%[/size]
[size=4]తలపట్టుకుని వేరే channel మార్చాను.[/size]
[size=4]Channel.4: సామాజిక బాధ్యత అంశంపై headlines.[/size]
[size=4]దుర్గంచెరువు దగ్గర ప్రేమికుల వీరవిహారం అంటూ గుంపులుగా కుర్చున్న జంటల photosనిచూపిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న వీళ్ళ పద్దతిని చూడండి. మీ అభిప్రాయలను మాకు call చేసి చెప్పండీ.ఈ విపరీతచర్యలను ఖండించాలి అంటూ క్రింద numbers scrolling. ఈ photos అన్నీ మా[/size]
[size=4]Team ఎంతో చాకచక్యంగా secret cameras తో సంపాదించారు.వారికి ధన్యవాదాలు అంటుండగానే నాకు పొట్టలో D.C.Motor తిరగడంతో వాంతులు మొదలవుతాయేమో అనుకుని T.V off చేశాను. ఇవన్నీ చూసిన నాకు ఒక్కసారిగా మతిభ్రమించినవాళ్ళవలే/ సుత్తివీరభద్రరావు బాదుడు భరించలేని మనుష్యులలాంటి పిచ్చివాళ్ళ వలే జుట్టు పీక్కుంటూ,నేను Neptune గ్రహం మీద నివసిస్తున్నా.నా వయసు లక్షా యాభై కోట్ల డెబ్బైఆరు సంవత్సరాలు. గత కొన్ని కోట్ల సంవత్సారలనుండీ ఈ గ్రహం మీద కురుస్తున్న వజ్రాలను భూగ్రహానికి ఎగుమతి చేస్తూ బాగ డబ్బు గఢించి ఎప్పటికైన నా ఉపగ్రహల మీద ఎక్కి భూగ్రహంపై విహారయాత్రకు నేను, నా కుటుంబం వెళ్ళిరావాలి అని పెద్దగా అరుస్తున్న సమయంలో మా పక్కింటి వాళ్ళు వెంటనే 108ని పిలిచి నన్ను ఆసుపత్రిలో చేర్చి treatment చేయిస్తే ఒక వారం రొజుల తర్వాతగాని నేను భూమిమీదనే ఉన్నానన్న సత్యాన్ని ఒప్పుకోలేదు. అది గ్రహించిన వెంటనే నా ఈ స్థితికి కారణమైన news channels ని వదిలించుకోడానికి ఆ cable operator కి 6నెలలుకి బదులు 12నెలల డబ్బులు ఇచ్చి ఆ cableని నేనే స్వయంగా పీకి వాడి చెతుల్లో పెట్టి పెద్ద నమస్కారం పెట్టి దీని కన్నా దూరదర్శినిలో పాలు పితకడం ఎలా?అనే చర్చాఘోష్ఠి నయం అని చెప్తుండగానే వాడు మరలా అదే వికటాట్టహాసంతో వెళ్ళిపొతుంటే చుస్తూ నివ్వెరపోవడం నావంతయింది. [/size]

×
×
  • Create New...