Jump to content

Recommended Posts

Posted

[b] [size=5]కవిత్వం రాసే మన తెలుగు హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?[/size][/b]





[center][size=5][url="http://2.bp.blogspot.com/-x8Yp4d713IU/UfFM-LaQmNI/AAAAAAAAA2E/OELrkAWfoSw/s1600/women-abstract-butterfly-grayscale-digital-art-artwork.jpg"][img]http://2.bp.blogspot.com/-x8Yp4d713IU/UfFM-LaQmNI/AAAAAAAAA2E/OELrkAWfoSw/s200/women-abstract-butterfly-grayscale-digital-art-artwork.jpg[/img][/url][/size][/center]
[b][color=#000000][size=5]నిదురిస్తున్న హృదయాన్ని
నీ వైపు లాగింది నీవేగా!

నా నీడయినా నువ్వే అయి
నన్ను నేను మరిచానే

వొద్దు వొద్దని నువ్వన్న
వలపే పుట్టింది నీ మీద

అప్పుడు పంచిన నీ మనసే
ఇవ్వనని అనవొద్దు

నాలో ఉన్న నా ప్రాణం
నువ్వయి నిలిచావు

కాదు కాదని నీవన్నా
కాదనలేకున్నా..
కన్నీటి కడలిలో నేనున్నా...

***

కొన్ని నమ్మటం కష్టం. అలాంటిదే మొన్నొకటి జరిగింది.

చాలామంది తెలుగు హీరోయిన్లు తెలుగుని ఎంత స్టయిలిష్‌గా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అసలు తెలుగు రానట్టే నటిస్తారు. లేదంటే, ఓ అయిదారు ఇంగ్లిష్ పదాల మధ్య ఒక తెలుగు పదాన్ని అలా పడేస్తూ స్టయిలిష్‌గా మాట్లాడుతున్నామనుకుంటారు.

అలాంటి మాస్కులేవీ లేకుండా తీయటి తెలుగులో మాట్లాడిందా అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్నంతసేపూ హాయిగా విన్నాను. ఆ అమ్మాయి మాటల మధ్యలో, కేవలం కవిత్వం రాయగలవాళ్లు మాత్రమే మాట్లాడే శైలిని గుర్తించాను.

అవును. నేను ఊహించింది నిజమే. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ కవిత్వం కూడా రాస్తుందట!

ఆ అమ్మాయి మన తెలుగు హీరోయిన్. ఆమె నటించిన తొలి సినిమానే పెద్ద హిట్. అయినా ఎందుకో వెనకే ఉండిపోయింది! పైన మీరు చదివిన కవిత ఆ హీరోయిన్ రాసిందే..

ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకని వెనకపడిపోయింది? ఇప్పుడు మళ్లీ ఎలా ముందుకు దూసుకొస్తోంది?
ఆసక్తికరమయిన ఎన్నో వివరాలతో - ఈ ఆదివారం, ఇదే బ్లాగ్‌లో, "షాట్ బై షాట్"లో కలుద్దాం. [/size][/color][/b]

×
×
  • Create New...