Jump to content

Telugu Heros In Exam Center ..... Edo Navvu Kovadaniki


Recommended Posts

Posted

Ekkadoo online lo chadivaaa .... navvu kovadaniki bagundi ani ikkada copy chesthunaa ...

[size=5]సమావేశం అయి సినిమా ఇండస్ట్రీ మిద పేపర్ సెట్ చేసారు పరిక్ష రాయటానికి. ఇన్విజిలేటర్ గా ఆలిని సెలెక్ట్ చేసారు. తెలుగు హీరోలు అందరు వచ్చారు పోటికి. అంతే కాకుండా మార్కెట్ పెంచు కోవటానికి మన తమిళ హీరోలు రజని, కమల్, కార్తి ఇంకా సూర్య కూడ వచ్చారు. అసలే తమిళోల్లు అంటే పిచ్చి ఉన్నా మన్నోల్లు ఎగిరి గంతేసి వాళ్ళను కూడా రాయమని కూర్చో బెట్టారు. హీరో లందరూ పకడ్బందిగా రాయటానికి ఏర్పాట్లు చేసుకుని వచ్చారు.

అలీ: ఓకే కుప్లిస్ ! మీకు పేపర్ ఇస్తాను, సరిగా గంటలో పేపర్ పూర్తీ చెయ్యాలి.

మహేష్: నాకు ఒక్క నిమిషం ఇస్తే పేపర్ చదివేస్తా, రెండు నిముషాలు ఇస్తే రాసేస్తా, మూడు నిముషాలు ఇస్తే ముగించేస్తా. మరి గంట సేపు ఎం చెయ్యాలి భయ్యా ?

అలీ: అబ్బో ! డైలాగులు చెప్పటం కాదు. పేపర్ చుస్తే కాయ కచోరి అయిపోతుంది. ఇదిగో తీసుకోండి (పేపర్ లు పంచుతూ).

చిరు: ఓరి నాయనో ! ఏదో ఈజీ గా ఉంటుంది అనుకంటే మరి ఇంతా టప్ గా ఉందేంటి పేపర్. అసలు వందకు 18 మార్కులు అయిన వస్తాయా? లాభం లేదు చిట్టిలు తియ్యాల్సిందే (చిట్టిలు బయటకు తీస్తూ).

ప్రభాస్: రెబల్ టైం స్టార్ట్.

అలీ: బాబు మా వాచ్ లో టైం ఫాలో అవ్వాలి. రెబల్ టైం లేబర్ టైం కాదు. బాగా రాయి బాహుబలి.

ప్రభాస్: నువ్వు పేపర్ రాయాలంటే చదివి, ప్రిఫెర్ అయి రావాలి. నేను పెన్ను తీసుకుని వస్తే చాలు.


అలీ: అంతేలే దిద్దేవాడి ఖర్మ. నువ్వు ఎం రాసినా నీదెం పోతుంది. ఎంటండి బాలయ్య గారు. ఏమి రావటం లేదా? అలా ధ్యానం చేసుకుంటున్నారు.

బాలయ్య: నీ యాబ్బ ! నేను రాయటం మొదలు పెడితే ! ఎ ప్రశ్నకు ఎ ఆన్సర్ రాసానో తెలుసు కోవటానికి వారం పట్టుది.

అలీ: అంత టైం లేదు మనకు. మీరు రాయక పోతేనే బెటర్. ఏంటి కింగ్ నాగ్ గారు. అప్పుడే మొదలు పెట్టార రాయటం ? (నాగార్జున దగ్గరకు వస్తూ).

నాగ్: ఒక్క ఆన్సర్ కూడా తెలియటం లేదు. అందుకే అన్నమయ్య కీర్తనలు, రామదాసు పాటలు, సాయి బాబా శ్లోకాలు రాస్తున్నా. దిద్దేవాడు భక్తుడయితే పాస్ అయిపోతాం కదా !

వెంకి: మా నాన్న తీసిన సినిమా పేర్లే నాకు తెలియదు. మొదటి తెలుగు సినిమా డైరెక్టర్ ఎవరు అంటే ఎలా రాసేది. ఎవడయినా చీటి లు ఇస్తే బాగుండు.

రాజ శేఖర్: జీవిత నాకు తెలుగే సరిగా రాదు. ఇంకా తెలుగు సినిమా గురించి ఎం రాయాలి. ఆ చిరంజీవి కి పోటిగా నన్ను పంపించావు.

అలీ: మీరు మనసులో అనుకోవల్సింది భయటకు అంటున్నారు. జీవిత గారు ఇక్కడ లేరు. ఇదయినా మీ సొంతంగా చెయ్యండి డాక్టర్ గారు.

చరణ్: (చిరు ఇచ్చిన చీటి తీసుకుంటూ) థాంక్స్ డాడి. చీటి ఇచ్చి రికార్డ్స్ నిలబెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.

చిరు: థాంక్స్ చెప్పి తప్పించుకుంద మానుకుంటున్నవా? మరో ముగ్గురికి ఆ చీటి ఇచ్చి వారికీ సహాయం చెయ్యి.

అల్లు అర్జున్: ఏంటి మాయ్య నువ్వు. మన సుఖం చూసుకోవాలి గాని సహాయం, చద్దన్నం అంటావు.

చిరు: బాబు బుద్దులు బాగా వంట పట్టాయి. సరే వాడు నువ్వు రాసుకోండి.

మోహన్ బాబు: అలీ ఒక్క ఆన్సర్ చెప్పరా? నిన్ను హీరో గా పెట్టి సినిమా తీస్తాను.

అలీ: నన్ను హీరోగా పెట్టి తీస్తారా? ఎందుకండీ డబ్బులు బొక్కా !

మోహన్ బాబు: మా అబ్బాయిలు, అమ్మాయి పెట్టిన బొక్కల ముందు అదేమీ పెద్ద బొక్క కాదు రా. ప్లీజ్ ఒక్క ఆన్సర్ చెప్పు ! సర్రు సర్రు మని రాసేస్తా.

అలీ: నేను ఇన్విజిలేటర్ నండి. చెప్పకూడదు.

మోహన్ బాబు: ది రిలేషన్ షిప్ బిట్వీన్ ఇన్విజిలేటర్ అండ్ స్టూడెంట్ షుడ్ బి లైక్ బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పిస్ బట్ షుడ్ నాట్ బి లైక్ బ్లాక్ బోర్డ్ అండ్ డస్టర్. ఎప్పుడో సినిమాలో కొట్టిన డైలాగ్, సరిగ్గా గుర్తు లేదు. గ్రామర్ తప్పులుంటే క్షమించు, అసలు అర్ధమే లేదు అనుకుంటే మన్నించు.

అలీ: ఏంటమ్మా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఏమి రాయటం లేదు.

జూనియర్: రేయనక, పగలనక, నిదురనక, కునుకేయక. ఎండనక వాననక బుక్ మూయక, షూటింగులు మాని, ఇంట్లోనే ఉండి, బట్టి పట్టి, కష్టపడి చదివి పరీక్షకు వస్తే అడ్డమయిన పేపర్ ఇచ్చి ఎం రాయాలో తెలియక తికమక పడుతుంటే వచ్చి ఏమి రాయటం లేదు అని అడగటానికి నీకు ఎన్ని గుండెలు బే?

అలీ: ఎయ్ బుడ్డోడ ! మర్యాదగా మాట్లాడు.

జూనియర్: ప్రతివాడు బుడ్డోడా అంటే గుడ్డలిప్పి కొడుతా.

అలీ: ఎం ? గుడ్డలు ఉంచుకొని కొట్ట లేవా ! ముందు రాయి బాబు. డైలాగులు బట్టి పెట్టి చెప్పటం కాదు.

జూనియర్: మా బాబాయి చెప్పేవాడు. పుర చేత్తో రాస్తే పేపర్ చిరిగి పోవాలని. నేను రాయకుండానే చింపాలని చూస్తున్నా.

అలీ: అంతుందా బాబు చాటా ?

జూనియర్: మా చింపుడు గురించి ఈ తెలుగు గడ్డ మిద ఎ బిడ్డను అడిగినా చెపుతారు. మా తాత గారి ఆశిష్శులతో తప్పకుండా చింపుతాను అనే నమ్మకం నాకుంది.

మనోజ్: బాలయ్య అన్నయ్య. నా సినిమాలో ఆక్ట్ చేసి నాకు హిట్ ఇచ్చావు. అలాగే నీ పేపర్ ఇచ్చి నన్ను పాస్ చెయ్యవా?

బాలయ్య: (పేపర్ ఇస్తూ) చూడు ! ఒక్కవైపే చూడు. రెండు వైపు చూస్తే మూర్చ పోతావ్.

విష్ణు: ఏంటి అన్నయ్య రాసిందే మళ్ళి రాసావ్. మధ్య మధ్యలో అంత గ్యాప్ ఏంటి.

బాలయ్య: నేను సొంతంగా మాట్లాడినా, రాసినా అలాగే ఉంటుంది గ్యాపు. ఎందుకంటే నేను కింది నుండి వచ్చా.

వెంకి: తమ్ముడు మహేష్. ఒక్క ఆన్సర్ చెప్పు.

మహేష్: నా కన్నా ముందు పుట్టావ్. ఆ మాత్రం తెలియదా.

అలీ: అసలు తమరు రాసిందే లేదు ఆయనకు క్లాస్ పికుతున్నారా పోకిరి పండు బాబు.

మహేష్: నేను రాయటం మొదలు పెడితే నీ దగ్గర ఆన్సర్ షీట్స్ అవుట్ అఫ్ స్టాక్ అని బోర్డు పెడుతారు. ఎట్లా చెప్పిన అన్నయ్య.

వెంకి: దేనికయినా ఒక లిమిట్ ఉంటుంది. ఆన్సర్ చెప్పమంటే సొల్లు చెప్పుతావ్ ! మెల్లగా ఏదో ఒక్కటి రాసి నాకు చూపించు తమ్ముడు.

మహేష్: నేను మెల్లగా ఏదో ఒకటి రాయటానికి రాలేదు. పేపర్ దిద్దెవాణ్ణీ ఉచ్చ పోయించటానికి వచ్చాను.

పవన్: మహేష్ నువ్వు ఉచ్చ పోయించటానికి వస్తే నేను పేపర్ రాయటం లో ట్రెండ్ సెట్ చెయ్యటానికి వచ్చా. ఆఆఆఅ......ఆ.... అ.....

అలీ: ఇంతవరకు ఒక్కటి కూడా రాసినట్లు లేదు. ఏ లెక్క ప్రకారం ట్రెండ్ సెట్ చేస్తారు తమరు.

పవన్: చూడు అలీ. ఆ బుక్ నా ఆన్సర్ షీట్ రెండు ఒక్కటే. కాకపోతే అది అక్షరాలతో ఉంటుంది, నా పేపర్ తెల్లగా ఉంటుంది. ఏమయినా లాస్ట్ నెంబర్ మనదయినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరబ్బా. అదే మన ట్రెండ్.

అలీ: ఇది మాత్రం తమరు చెప్పక పోయినా రాసుకుంటాను గబ్బర్ సింగ్ గారు.

మోహన్ బాబు: ఒరేయ్ రాస్కెల్ రజని . ఎప్పుడు నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవటమే కాని ఒక్కసారయిన నన్ను స్నేహితుడు అని చెప్పలేదు. కనీసం ఒక్క ఆన్సర్ చూపించారా !

అలీ: అయన రాసిందే ఒక్కటి అనుకుంటా. ఇంకా మీకేం చెపుతారు.

రజని: నేను ఒక్క ఆన్సర్ రాస్తే వంద ఆన్సర్స్ రాసినట్లే.

అలీ: ఇలా అయితే పాస్ కరండి !

రజని: అతిగా రాసే స్టూడెంట్, అతిగా మాట్లాడే ఇన్విజిలేటర్ బాగుపడినట్లు చరిత్రలో లేదు. దక్కేది దక్కక మానదు, పాస్ అయ్యే వాడు పాస్ అవ్వక మానడు. దేవుడు శాషించాడు రజని పాస్ అవుతాడు.

అలీ: సార్ కమల్ గారు. రాసి మళ్ళి కొట్టేస్తున్నారు. ఆన్సర్ షీట్స్ అడుగుతూనే ఉన్నారు.

కమల్: ఎంత ట్రై చేసినా పర్ఫెక్ట్ గా అక్షరం కింద అక్షరం రాయలేక పోతున్నాను. ఏదో లైన్ లో తప్పి పోతుంది. అందుకే పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రాస్తున్నా.

అలీ: ఇలా అయితే ఆన్సర్ షీట్స్ అయిపోతాయి. టైం అయిపోయి కొట్టేసిన పేపర్స్ ఇచ్చి పోతారు.

కమల్: ఆన్సర్ షీట్స్, టైం ముఖ్యం కాదు. పర్ఫెక్ట్ గా రాయటం ముఖ్యం. ప్లీజ్ డోంట్ డిస్తురబ్ మీ.

సూర్య: కమల్ సార్ నాకు ఒక్క ఆన్సర్ కూడా గుర్తు రావటం లేదు. నా కయినా చెప్పండి మీ బదులు లో నేను పాస్ అయిపోతాను.

కమల్: చదివి రావాల్సింది. నన్ను ఇబ్బంది పెట్టె బదులు.

సూర్య: అది కాదు సార్. పేపర్ తెలుగులో ఉంది డబ్బింగ్ ఏదయినా చేపుతారేమో అని వచ్చాను.

కార్తి: అన్నయ్యా ! నేను డబ్బింగ్ చెపుతా నువ్వు ఆన్సర్ రాయు.

సూర్య: ఏంట్రా గజినీ ని పట్టుకొని ఆన్సర్ రాయమంటావు. నాకు అసలే షార్ట్ టర్మ్ మెమరీ కదా ?

అలీ: ఇన్ని నాటకాలు ఎందుకు. రాదు అని చెప్పకుండా. ఏదో డబ్బింగ్ సినిమాలు ఆడేసరికి రెడీ అయిపోయారు ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ ఏదో పోడిచేయ్యాలని.

అల్లు అర్జున్: ప్రభాస్ ! మా చెర్రి గాడు మా చిరు మయ్యా ఇచ్చిన చిటిలు ఇవ్వకుండా రాసేసి మింగేస్తున్నాడు. నువ్వయినా ఒక్క ఆన్సర్ చూపించావ?

ప్రభాస్: ఆన్సర్ అంటూ, చీటి అంటూ వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, నా అమ్మ మొగుడంటూ వస్తే..... పేపర్లు చినిగి పోతాయి, పెన్నులు లిక్ అయిపోతాయి.

అల్లు అర్జున్: మాటలేవ్ ! మాట్లాడు కొవటల్ లెవ్. ఇంకెప్పుడు నాతొ మాట్లాడకు.

రానా: ఏంట్రా బన్ని చిన్న విషయానికి అంత రియాక్ట్ అవుతావ్. దేనికిరా మనకు ఈ టెస్టు లు చిటిలు. మన బతుకులు ఇంకు కంపు కొడుతున్నాయి, ఇప్పుడు అంత కలెక్షన్స్ లెక్కలు, అంటే హిట్ సినిమా చేయటం. మనం టెస్టులు రాయాల్సింది సినిమాలు ఎలా హిట్ చెయ్యాలని. ఒక్క ఆవరేజ్ సినిమా చేసినందుకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అలాంటిది పెద్ద హిట్ సినిమా చేస్తే ఎంత గొప్ప ఛాన్స్ వస్తుందో చూడు.

అల్లు అర్జున్: నువ్వు KVJ డైలాగులు అపు బాబు. మీ నాన్న ప్రొడ్యూసర్ అయితే ఫ్లాప్ సినిమా చేసిన రాజ మౌళి ఛాన్స్ ఇస్తాడు.

అలీ: ఏ కట్రవల్లి ! ఏంటి అక్కడ మీటింగ్. ఇంకా టైం అయిపొయింది. పేపర్ లు ఇచ్చేయండి.


పేపర్ లు దిద్దిన తర్వాత ఎ ఒక్కరు కూడా పాస్ కాక పోవటంతో దాసరి గారినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు మన ఇండస్ట్రీ పెద్దలు.[/size]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/imagecache/144x144/dsd-o.gif[/img]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/brahmam_style10.gif?1290059449[/img]

Posted

[img]https://lh5.googleusercontent.com/--mK1hTmd9Ow/TnytE3gNL_I/AAAAAAAAEXY/28ng9BYobkY/s150/Kota-2.gif[/img]

Posted

[img]http://i.imgflip.com/2mie3.gif[/img]

×
×
  • Create New...