Jump to content

Bjp New Twist - May Not Be Supporting Tg Bill In Parliament


Recommended Posts

Posted

[b] విదర్భను చేరిస్తేనే మద్దతివ్వండి[/b]

[url="http://www.sakshi.com/topic/sakshi"]Sakshi[/url] | Updated: August 06, 2013 23:03 (IST)

[b]ముంబై[/b] : ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను మంగళవారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. విదర్భ బిల్లును చేరిస్తేనే ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని అధిష్టానానికి విన్నవించామన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలిశామన్నారు.

తమ డిమాండ్‌కు అధిష్టానం సానుకూలంగా స్పందించిందన్నారు. అధిష్టానాన్ని కలిసినవారిలో ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, నానాపటోల్ తదితరులున్నారు. ఇదిలాఉండగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ఈ వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు.

×
×
  • Create New...