puli_keka Posted August 7, 2013 Report Posted August 7, 2013 [color=#0033CC][font=Conv_NTR, sans-serif][size=5]అదంతే[/size][/font][/color][color=#000000][font=Conv_Web-Font, sans-serif][size=5] [color=#FF0000][size=4]-సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పిన సోనియా, చిదంబరం -డిమాండ్లు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పండని సూచన -సాయంత్రం సోనియాతో కేంద్ర మంత్రుల భేటీ -రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి -లేనిపక్షంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలితం -లేదా శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలి -అధినేత్రికి ప్రతిపాదించిన సీమాంధ్ర మంత్రులు -గ్రేటర్ రాయలసీమకు కోట్ల డిమాండ్ లేనిపక్షంలో రాయల తెలంగాణ కావాలి -అదీ కుదరదంటే కర్నూలునైనా కలపండి..అధినేత్రికి కర్నూలు జిల్లా నేతల విజ్ఞప్తి[/size][/color] న్యూఢిల్లీ, అగస్టు 6 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నుంచి వెనక్కు మళ్లేదిలేదని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకత్వానికి, ఆ ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులకు పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది.[img]http://img.namasthetelangaana.com/updates/2013/Aug/07/sonia.png[/img] రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలుసుకున్న సీమాంధ్ర నాయకులకు మంగళవారం నిరాశే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు మళ్లేది లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను కలిసిన కర్నూలు జిల్లా నాయకులకు తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులకు కూడా ఆమె ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చింది. ఏమైనా చెప్పాలనుకుంటే ఆంటోనీ కమిటీకి చెప్పాలని పార్టీ పెద్దలు సూచించి వారిని పంపేశారు. మంగళవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత సోనియాగాంధీ నివాసానికి పలువురు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు వెళ్లారు. దాదాపు అరగంటపాటు ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సోనియాను కోరిన కేంద్రమంవూతులు.. తప్పదనుకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కానీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా కానీ ఏర్పాటు చేయాలని మరోసారి కోరారు. అయితే.. ఆమె మాత్రం ఈ నిర్ణయంలో తిరుగులేదని చెప్పారని తెలిసింది. తమ సాధక బాధకాలు, డిమాండ్లను ఆంటోనీ కమిటీకి విన్నవించాలని సోనియా సూచించిన నేపథ్యంలో తమతో సంప్రదింపులు పూర్తయ్యేంత వరకూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని కేంద్ర మంత్రి పళ్లం రాజు అనంతరం విలేకరులతో అన్నారు. దీనికిముందు మంగళవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు మొదలైన వెంటనే కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, పురందేశ్వరి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పళ్లంరాజు, కావూరి సాంబశివరావు తదితరులు చిదంబరంతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయనను కోరారు. ఒకవేళ విభజించాల్సివస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నాం కనుక వెనుకకు వెళ్లటం కుదరదని, సోనియాగాంధీ కూడా ఇదే అభివూపాయంతో ఉన్నారని తనను కలిసిన కేంద్ర మంత్రులకు చిదంబరం స్పష్టం చేసినట్లు సమాచారం. మీకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఆంటోనీ కమిటీకి నివేదించాలని ఆయన సూచించారు. ఈ భేటీలకు ముందు కేంద్ర మంత్రి కావూరి నివాసంలో సమావేశమైన సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునే కార్యాచరణపై కసరత్తు చేసినట్లు సమాచారం. అనంతరమే వారు పలువురు కేంద్రమంవూతులు, కాంగ్రెస్ సీనియర్లతో సమావేశాలు జరిపారు. చిదంబరంతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. ఆయన కూడా పార్టీ నిర్ణయం నుంచి వెనుకంజ వేసేది లేదని తేల్చి చెప్పడంతో సీమాంధ్ర నేతలు నిరాశతో వెనుదిరిగారు. అయితే.. ఆంటోనీ కమిటీ సీమాంధ్ర నేతలతో చర్చలు జరిపేంత వరకూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని సీమాంధ్ర నాయకుల్లో చిరు ఆశ బయల్దేరింది. [b]ప్రక్రియ ఆగుతుంది.. పళ్లంరాజు :[/b] సీమాంధ్ర ప్రాంత డిమాండ్లను పరిశీలించిన అనంతరమే రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని, అప్పటిదాకా ప్రక్రియ ఆగిపోనున్నదని కేంద్ర మంత్రి పళ్లంరాజు తెలిపారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఉన్నతస్ధాయి కమిటీ పూర్తి స్థాయిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అందరి వాదనలు వింటుందని తమకు సోనియా స్పష్టం చేశారన్నారు. డిమాండ్లు ఏమైనా ఉంటే ఆంటోనీ కమిటీకి తెలియజేయాలని సోనియా సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న హైలెవల్ కమిటీ నలుగురు సభ్యులతో ఏర్పాటు కానున్నదని, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ అధ్యక్షత వహించే ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీ, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఉంటారని తెలిపారు. ఈ ఉన్నత స్ధాయి కమిటీని దిగ్విజయ్ ప్రకటిస్తారన్నారు. తమ ప్రాంతానికి న్యాయం జరగుతుందన్న విశ్వాసం కుదిరిందని, సీమాంధ్ర ఉద్యమకారులు శాంతించాలని కోరారు. హైద్రాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ, కేంద్రపాలిత ప్రాంతంగా కానీ ఏర్పాటు చేయాలని తాము సోనియాను కోరామని తెలిపారు. ఇరువూపాంతాలకు న్యాయం జరిగాకనే తుది నిర్ణయం ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. సోనియాతో భేటీలో పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, పురందేశ్వరి కూడా ఉన్నారు. కాగా, రాష్ట్ర విభజన జరిగే పక్షంలో కాపు సామాజికవర్గానికి బీసీ హోదా కల్పించాలని దిగ్విజయ్‌ను చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. [b]అన్యాయం కర్నూలు జిల్లాకే .. కోట్ల:[/b] కేంద్ర మంత్రి కోట్ల సూర్యవూపకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు మంగళవారం సోనియాను ఆమె నివాసంలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరగా.. ఈ విషయంలో ఏమైనా చెప్పుకోవాల్సింది ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పాలని సోనియా సూచించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము సోనియాను కోరామని కోట్ల సూర్యవూపకాశ్రెడ్డి తెలిపారు. విభజన అనివార్యమయితే రాయలసీమను తెలంగాణతో జతచేయాలని, అదీ కుదరకపోతే కనీసం కర్నూలు జిల్లానైనా తెలంగాణతో కలపాలని, లేదంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని పాంతాలు కలుపుకొని గ్రేటర్ రాయలసీమ ఏర్పాటును చేయాలని సోనియా దృష్టికి తెచ్చామన్నారు. తాము రాష్ట్ర విభజనపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నామని ఒక్కసారి నిర్ణయాన్ని తీసుకున్న అనంతరం వెనక్కు తీసుకోలేమని సోనియా తేల్చిచెప్పినట్లు కోట్ల చెప్పారు. సోనియాతో భేటీలో కోట్లతో పాటు మంత్రి ఏరాసు ప్రతాప్‌డ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, వీరు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. [b]సీమాంధ్ర నేతల్లో విభజన:[/b] విభజనను అడ్డుకునేందుకు పని చేస్తున్న సీమాంధ్ర నేతల్ల్లో విభజన కనపిస్తున్నది. సీమ నేతలు కోస్తా నేతల నుంచి వేరుపడి తమ ప్రయత్నాల్లో తాము ఉన్నట్లు తెలుస్తోంది. సోనియాను మంత్రి కోట్ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలువడం ఇందుకు నిదర్శనమంటున్నారు. [b]కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ :[/b] సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు మంగళవారం పొద్దుపోయిన తరువాత కేవీపీ నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు శైలజానాధ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాస్, కాసు కృష్ణాడ్డి తదితరులు పాల్గొన్నారు. అధిష్ఠానం ఏర్పాటు చేయనున్న ఉన్నత స్థాయి కమిటీకి అందజేయాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. [b]టీ కాంగ్రెస్ ఎంపీల సమావేశం : [/b] తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. సీమాంధ్ర నేతల కదలికలపై వారు చర్చించారని తెలిసింది. ఆచితూచి అడుగులు వేయాలని సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, పాల్వాయి గోవర్ధడ్డి, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.[/size][/font][/color]
puli_keka Posted August 7, 2013 Author Report Posted August 7, 2013 Kurnool ni TG kaluputhara.. naa opinion evadiki kaavali kaani , Kurnool is a good district ani naa feeling.. people are nice (pure personal opinion)
ramu Posted August 7, 2013 Report Posted August 7, 2013 Enti sonia photo mirror image vesinattunnaru...
powerstar02 Posted August 7, 2013 Report Posted August 7, 2013 bongu adi decision meda vuntanani chepi venaka nadipistdhi story ....
Recommended Posts