Jump to content

Kalagnanam (Pothuluru Veerabrahmendra Swamy)


Recommended Posts

Posted

Aande annaru Munda Rajyam Eluthundhi Ani...Annatlu gane S*G eluthundhi...

Mari Konni Mee Kosam:

1. శ్రీ వీరభోగవసంతరాయలవారు 'విశ్వావసు'నామ సంవత్సరము (1965-66)లో జన్మించి శ్రీ పరుశురాములవారు, శ్రీ అశ్వత్థామ, శ్రీ దత్తాత్రేయులవారు, శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు, ఆచార్యా నాగార్జునులవారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివారు, తదితర సిథ్థపురుషులవద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తర్వాత పరమశివుడిని ప్రార్థించి వారిచే, తేది.22-11-2007న , దేవదత్త'మనే గుఱ్ఱమును, 'శుక'మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, 'కార్ముక'మనే విల్లును, అక్షయతూణీరములను, 'పాశుపత' అస్త్రమును, ఆశీస్సులను పొంది తేది.09-09-09 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది.(09-09-09) నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తము శ్రీ వీరభోగవసంతరాయల వారి ఆథీనంలో వుంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మ ఫలితాలు ఎప్పటికప్ప్పుడు అనుభవంలోకి వస్తాయి.
2.ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.
3. తేది.13.04.2000 నాడు శ్రీ వీరభోగవసంతరాయలవారు విజయవాడ లో ఇన్ద్రకీలాద్రిపై యున్న శ్రీ కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. ఆ సంవత్సరంలోనే వివాహము అయినది.
4. అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.
(2002 లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు నందు, ఆ తరువాత భారత్ డైనమిక్సు లిమిటెడ్, వేరే రక్షణ సంస్థలో ప్రేలుళ్ళు జరిగాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదములు తృటిలో తప్పి పోయినవి.)

కడప ఖాళీ అయ్యేను, బద్వేలు బస్తీ అయ్యేను (కాలజ్ఞానంలో వున్న మాట ప్రకారం కడప, ఆ పరిసర ప్రాంతాలు ఆణుథార్మికతకు/అణుప్రేలుడుకు లోనై ఆ ప్రాంతాలు ఖాళీ చేయవలసి వస్తుంది.

( ఆణుథార్మికతకు లోనైన ప్రజలను కాపాడటానికి సంబంథించిన వనమూలికలు, ఒంగోలు, కర్నూలు జిల్లాలలో శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారు, శ్రీ ఆచార్యా నాగార్జునాచార్యులవారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివార్లు ఆథ్వర్యంలో మే,2004 నుండి పెంచబడుతున్నాయి.
5.సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.
2004 లో వచ్చిన సునామీ వల్ల మహాబలిపురం వద్ద కొన్ని కట్టడాలు, దేవాలయాలు బైటపడ్డాయి.
6. తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. 09-09-09 కి ముందు శ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున వారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.

7.కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం, నీటికోసం, మతకల్లోలాలవల్ల).
(రజాకార్ల సమయంలోను, 1990 లోను జరిగినటువంటి రక్తపాతంకంటే ఎక్కువ స్థాయిలో తెలంగాణా ఉద్యమ సమయంలో, తెలంగాణా ఏర్పడిన తర్వాతనూ జరుగుతుంది.

బాబ్లీ ప్రోజెక్టు మొదలైన వాటివల్ల నీటికోసం కలహాలు, జన నష్టము.

ఒక పధ్ధతి ప్రకారం, హిందువులను రెచ్చగొట్టే విధంగా జరుగుతున్న హిందూ దేవాలయాల ధ్వంసం, దేవాలయాలలో చోరీలు, చివరికి భయంకరమైన మతకలహాలకు దారితీస్తాయి.)

8.తేది.26.12.2011 న శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులైనారు.
9.మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.
మాయన్ కేలండర్ వ్రాసినవారు శ్రీవిశ్వకర్మ యొక్క రెండవ కుమారుడైన మయబ్రహ్మవారసులు(విశ్వబ్రాహ్మణులు)
10.హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర (10/12 నుండి 11/2013)'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు. రాబోయే కాలంలో తిరిగి అదే నక్షత్ర శని సంచారం వల్ల కూడా.
11. కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.
కక్షకట్టి హిందూ పీఠాధిపతులు, మఠాధిపతుల మీద అన్నివిధములైన దాడులు చేస్తారు కుహనా లౌకికవాదులు, అధికార లాలసులు, హిందూయేతర సంస్థలు.
12. శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.
స్వర్ణయోగం తెలిసిన ఒక సిధ్ధపురుషుడు చాలా తరచుగా బ్రహ్మంగారిమఠం సందర్శిస్తాడు. అతని ఆధ్వర్యంలోనే కందిమల్లాయపల్లె పరిసర ప్రాంతాలు విపరీతమైన అభివృధ్ధికి నోచుకుంటాయి.
13. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.
14. నందన నామ సంవత్సరము(2012-2013) లోపల శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా (తేది.15-01-2012 నుండి 29-01-2012 మధ్యలో మొదలైనది. ఇద్దరు శివ సాయుజ్యమందినారు) ప్రజలతో మాట్లాడును. అదృష్టవంతులు శివసాయుజ్యము పొందుదురు. శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును (తేది.21-02-2012 న జరిగినది).

శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి, మేకపోతు వలె అఱచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకె వేసి కాలు దువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును. నంది కంట నీరు కారును.
15. విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.
16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.
17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.
దక్షిణభారతదేశ నాయకుల ప్రస్తుత పరిస్తితులు తెలిసిన విషయమే.

18.గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.

19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.

20) తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.
21.సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.
22) యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.
హిందూ దేవాలయ భూములు ఇతర మతస్థులకు పంచియివ్వటము, హిందూ దేవాలయ సరిహద్దులలో వేరే మత ప్రార్థనాలయాలకు అనుమతినివ్వటమువంటి ఘనకార్యములు మన లౌకిక(?)రాజకీయ నాయకుల వల్ల జరిగి, తత్ఫలితంగా ఉధ్భవించే మతకల్లోలాలవల్ల వేలమంది ప్రాణాలు కోల్పోతారు.
23) క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి ప్రళయ భీకర యుధ్ధం. ఢిల్లీ, బొంబాయిలపై అణుబాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం(2024-25) లో నెల్లూరు నీటమయమౌతుంది.
ఈ యుధ్ధం శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి సేనాధిపతి ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఈ యుధ్ధానికి ముందు, అధికధరలు భరించలేక, నిరుద్యోగం తదితర కారణాలవల్ల, ప్రజలు తిరగబడి ఈ దేశపు రాజకీయనాయకులను వారి కుటుంబాల్ని సమూలంగా ఊచకోత కోస్తారు (రష్యా విప్లవం సమయంలో జార్ చక్రవర్తి, తదితరులకు పట్టిన గతి)
24) కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హిందూ దేవాలయాలలో చోరీలు, గుప్తనిధుల(?) కోసం విగ్రహాలని పెకలించి ప్రక్కన పడవేయటంలాంటివి ఉధృతంగా జరుగుతున్నాయి. ఈ దేశంలో హిందూమతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న మతోన్మాదులు, హిందూదేవాలయాలలోని విగ్రహాల్ని ధ్వంసంచేసి, గుప్తనిధులకోసం ప్రయత్నించారనే వాతావరణాన్ని,వ్యూహాత్మకంగా సృష్టిస్తున్నారనే అనిపిస్తుంది.

తిరుమల దేవాలయం క్రింద, నేల పొఱలలో రెండవ, ఏడవ పొఱలు దెబ్బ తిన్నాయని వినికిడి. మరియూ తిరుమలపై తీవ్రవాదుల దాడి జరిగే సమయమాసన్నమైంది.
25) కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.
ఇప్పుడు మనము దర్శించుకునేది కనకదుర్గ అమ్మవారి ఱాతి విగ్రహం. ఆ ఱాతి విగ్రహం క్రింద, కొండలో 'బంగారు' కనకదుర్గ విగ్రహముంది. కృష్ణ నీరు బంగారు(కనక)దుర్గవిగ్రహము యొక్క ముక్కు పుడక అంటుకుంటుందా లేక అందరికీ కనిపించే ఱాతి కనకదుర్గ విగ్రహం యొక్క ముక్కుపుడక అంటుకుంటుందో తెలియదు.

బంగారు కనకదుర్గ విగ్రహం చూచినవారు మరుక్షణమే మరణించటమో లేక సర్వసంగ పరిత్యాగమునకు గురై ఆ అమ్మవారి విగ్రహం వెనుక వున్న సొరంగం ద్వారా శ్రీశైల సానువులకెళ్ళి ముక్తి సాధనలో మునిగిపోవటమో జరుగుతుంది.

ఆ బంగారు కనకదుర్గ విగ్రహము, ఆ ప్రక్కనే వున్న నవనిధుల కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి.

బ్రహ్మంగారు ప్రస్తావించినట్లు కృష్ణవేణి నీరు కనకదుర్గ అమ్మవారి ముక్కుపోగు అంటుకుంటుంది అంటే, ఆల్మట్టి, శ్రీశైలం, సాగర్ ఆనకట్టలు కొట్టుకుపోయినట్లే. ఆ ప్రవాహపు పరిధిలో జీవరాశి బ్రతికుండటం దాదాపు అసాధ్యం.

ఈ జల ప్రళయాన్ని దృష్టిలో ఉంచుకొని, క్రొద్దిమందినైనా కాపాడితే ఈ ప్రాంతంలో తిరిగి మానవజాతి పునర్వికాసం సాధ్యమౌతుందని, నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీ సనారి విశ్వేశ్వరులవారు,తదితరులను ప్రార్ధించగా వారు ప్రసాదించిన 'సంజీవని' మొక్కలో ఒక చిన్న భాగము శ్రీగాయత్రీవిశ్వకర్మ దేవాలయ ప్రతిష్టా సమయమున పంచముఖ గాయతీవిశ్వకర్మ ((నాలుగు దిక్కులను చూస్తూ నాలుగు ముఖములు, ఐదవ ముఖము ఆకాశమును చూస్తూ వున్న్న) విగ్రహముల క్రింద వుంచబడినది. ఈ దేవాలయములో పార్వతీపరమేశ్వరుల, లక్ష్మీనారాయణుల, సరస్వతీబ్రహ్మల, శచీంద్రుల, సంజ్ఞాభాస్కరుల విగ్రహములు కూడా ప్రతిష్ట చేయబడినవి). ఆ విపత్తు సమయంలో ఈ దేవాలయ ప్రాంగణములో వున్న వారు కాపాడబడతారు.

శంకుస్తాపన సమయము నుండి ఇప్పటివరకు, అనేక పర్యాయములు విజయవాడ మరియు పరిసర ప్రాంతములలో భూమి కంపించినప్పటికీ, ఈ దేవాలయ పరిథి(పొలిమేర)ని తాకలేదు.
26) భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.
27. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.
28. నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, ఆనెగొంది, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.
ఈ మహానిధులు, శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు లేక ఆయన సేనాధిపతి ఆధ్వర్యంలో తీయబడతాయి. ఇతరులు ప్రయత్నించటం ఆత్మహత్యాసద్రుశ్యమే.
29. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోగా వ్యతిరేకముగా జరుగును.
30. ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.
31. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.
32. భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.
33. ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)
34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.
జరుగబోయే ఈ సంఘటనకు నాందీగా, 12.01.2006 నాడు, ఇన్ద్రకీలాద్రి పై కొలువున్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోకి ఒక అడవిపంది జొరబడింది. (గర్భగుడిలోకి ప్రవేశించలేదు)
35.'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).. అమెరికా, రోమ్, బ్రిటన్ మొదలగు పశ్చిమ దేశాల సర్వనాశనానికి నాంది.
36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.
37) తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది(దాదాపు).
అమెరికాపై అణుదాడి. అమెరికా దరిద్రదేశంగా తయారవుతుంది.
38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.
39) ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.
40) కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.
41) ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.
42) తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి(ప్రకాశం జిల్లా) నేల మట్టమౌతుంది.
43) క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.
44) పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.
45) తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.
46) తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (3వ ప్రపంచయుద్దం/ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.
47. అమెరికాలో ఒక నగరం (బహుశా కాలిఫోర్నియా కావచ్చు)భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది. అమెరికా అతి బీద దేశమౌతుంది.
48. గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.
49. శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.
50) అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.
51) క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.
52) మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.
53) వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.
54)ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.
55) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.

(హనుమంతులవారిచే వ్రాయబడిన రామాయణ నిజచరిత్ర, రావణబ్రహ్మ కు సంబంధించిన వస్తువులు శ్రీలంక, మినికాయ్ ద్వీపము, రామేశ్వరము, తిరువనంతపురములకు అనుసంధానించబడ్డ యొక సముద్రగర్భ సొరంగములో వున్నవని ప్రతీతి.)
56) నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.
57) ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.
58) భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).
59) వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.
60) పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.
61) తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.
62) జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.
63) ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.
64) తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.
65) బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.
66) పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.
67) నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.
68)గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.

ఈ సంఘటన హైదరాబాదుకు జరుగబోయే చివరి అణుప్రమాదాన్ని సూచిస్తుంది.
69) బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.
70) విశ్వబ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు

(ప్రధమ సత్కారార్హత, దేవాలయ ప్రతిష్ట, ప్రధమ అర్చకార్హత మొదలగునవి విశ్వబ్రాహ్మణులకేనని కోర్టులు తీర్పునిచ్చాయి).
71) వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.
72) రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.
73) ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.
74) పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.
75) కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.
76) అంగడిలో సరస్వతిని అమ్ముతారు.
77) సముద్రములు కలుషితమై జలచరములు చాలామటుకు నశిస్తాయి.
78) అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.
79. పరుశురాములవారి, ఆచార్యా నాగార్జునులవారి, సనారీవారి, అమరలింగేశ్వరస్వామివారి మరియు క్రొందరు సిథ్థపురుషుల ప్రియశిష్యుడైన వ్యక్తి భారతదేశము యొక్క అప్పులు తీర్చి, నదీనదములను అనుసంథానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.
80) మూడవ ప్రపంచయుధ్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • rapchik

    8

  • Maximus

    6

  • dotnetrockz

    5

  • Nellore Pedda reddy

    4

Top Posters In This Topic

Posted

predicting the future... ee secret ento break cheyyali.... think_ww

Posted

34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.
జరుగబోయే ఈ సంఘటనకు నాందీగా, 12.01.2006 నాడు, ఇన్ద్రకీలాద్రి పై కొలువున్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోకి ఒక అడవిపంది జొరబడింది. (గర్భగుడిలోకి ప్రవేశించలేదు)



details please....

Posted

[size=6][b][color=#282828][font=helvetica, arial, sans-serif]అమెరికాలో ఒక నగరం (బహుశా [/font][/color][color=#ff0000][font=helvetica, arial, sans-serif]కాలిఫోర్నియా[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] కావచ్చు)భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది. అమెరికా అతి బీద దేశమౌతుంది.[/font][/color][/b][/size]

[b][color=#282828][font=helvetica, arial, sans-serif]Inka west side unna valu chusukondi @3$%[/font][/color][/b]

Posted

[quote name='Nissan' timestamp='1376492180' post='1304113997']
34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.
జరుగబోయే ఈ సంఘటనకు నాందీగా, 12.01.2006 నాడు, ఇన్ద్రకీలాద్రి పై కొలువున్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోకి ఒక అడవిపంది జొరబడింది. (గర్భగుడిలోకి ప్రవేశించలేదు)



details please....
[/quote]Ur doubt is correct. L

Posted

[size=6][b][color=#282828][font=helvetica, arial, sans-serif]గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]ఈ సంఘటన[/font][/color][color=#0000ff][font=helvetica, arial, sans-serif] హైదరాబాదుకు జరుగబోయే చివరి అణుప్రమాదా[/font][/color][color=#ffa07a][font=helvetica, arial, sans-serif]న్ని [/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif]సూచిస్తుంది.[/font][/color][/b][/size]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]55) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif]([/font][/color][color=#0000ff][font=helvetica, arial, sans-serif][size=5][b]హనుమంతులవారిచే వ్రాయబడిన రామాయణ నిజచరిత్ర, రావణబ్రహ్మ కు సంబంధించిన వస్తువులు శ్రీలంక, మినికాయ్ ద్వీపము, రామేశ్వరము, తిరువనంతపురములకు అనుసంధానించబడ్డ యొక సముద్రగర్భ సొరంగములో వున్నవని ప్రతీతి :3D_Smiles:[/b][/size][/font][/color]

Posted

[color=#ff0000]In the City of God there will be a great thunder,
two brothers torn apart by chaos,
while the fortress endures, the great leader will sucumb.
The third big war will begin when the big city is burning."[/color]

Posted

[quote name='Nissan' timestamp='1376492635' post='1304114030']
[color=#ff0000]In the City of God there will be a great thunder,
two brothers torn apart by chaos,
while the fortress endures, the great leader will sucumb.
The third big war will begin when the big city is burning."[/color]
[/quote]
City of God - [color=#ff0000]Tirupathi [/color]
Andhra -[color=#ff0000] telangana [/color]
Great leader - [color=#0000ff]??[/color]
[size=4]big city[/size][color=#FF0000][size=4] -[/size][/color][color=#ff0000]Hyderabad [/color]

Posted

[color=#ff0000]ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి[/color]

idhi epudu jaruguthadhooo :3D_Smiles: :3D_Smiles:

Posted

76) అంగడిలో సరస్వతిని అమ్ముతారు.[img]https://lh5.googleusercontent.com/--G4EAa8MTXs/UXIvgC7W8eI/AAAAAAAALDo/uu6KTXI2wog/s120/Brahmi-10.gif[/img]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif] ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif] :3D_Smiles:[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

Posted

[quote name='maheshism' timestamp='1376492957' post='1304114051']
[color=#ff0000]ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి[/color]

idhi epudu jaruguthadhooo :3D_Smiles: :3D_Smiles:
[/quote]

[quote name='Stellar' timestamp='1376493169' post='1304114065']
[color=#282828][font=helvetica, arial, sans-serif]ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.[/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif] :3D_Smiles:[/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]
[/quote]
chemmalu ante ante chemalu kadhu...

it relates to something same size and look....may be a robot which is in form of ant


[img]http://us.123rf.com/400wm/400/400/fajrimurti/fajrimurti1209/fajrimurti120900006/15464294-this-image-is-a-cartoon-of-ant-robot-this-image-is-vector-can-be-resize-any-size-and-high-resulition.jpg[/img]

×
×
  • Create New...