Jump to content

Andariki Oka Round....


Recommended Posts

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5]రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి - నంపాసా[/size][/font][/color]
[color=#000033][font=helvetica, arial, sans-serif][size=3][size=5]August 20, 2013[/size][/size][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5]కిరణ్‌కుమార్ రెడ్డి కర్రీపాయింట్ - కమ్ - టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం మంచిదని కేసీఆర్ సలహా ఇవ్వడంపై చాలామంది ఆగ్రహం వెలిబుచ్చారు గానీ, నిజానికి ఆ సలహా వెనక ఎంతో దూరదృష్టి, విశాల దృష్టి, మానవ కారుణ్య దృష్టి, రాజనీతిజ్ఞత ఉన్నాయని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. జయాపజయాలు, పదవీయోగ పదవీ భ్రష్టత్వాలు అన్నీ దైవాధీనాలు కదా! ఎన్నికల తర్వాత ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూహించగలరు? ఎంతమంది రాజకీయ నాయకులు నిరుద్యోగులవుతారో కదా! అందుకే కేసీఆర్ ఎంతో పెద్ద మనసుతో ఒక ఆప్తమిత్రుడుగా, శ్రేయోభిలాషిగా కిరణ్‌కు అటువంటి సలహా ఇచ్చారు. అంత గొప్ప సలహా ఇచ్చిన కేసీఆర్‌కు ప్రత్యుపకారంగా కిరణ్‌కుమార్ గారు తన టిఫిన్ సెంటర్ పక్కనే ఒక చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకొనే అవకాశం ఇవ్వడం అత్యంత సముచితంగా ఉంటుంది.

కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం మాట మాత్రంగానైనా కేసీఆర్‌ను సంప్రదించకుండా తానే స్వయంగా తెలంగాణ రాష్ట్రాన్ని మంజూరు చేసేసిన నేపథ్యంలో ఓటికుండలో నీరు లాగా టీఆర్ఎస్ నేతలు స్వచ్ఛందంగా బయటకు పోతున్నారు కదా! ఎన్నికల నాటికి పార్టీ ఖాళీ అయిపోతే కేసీఆర్‌కు కూడా స్వయం ఉపాధి అవుతుంది కదా! అందుచేత కిరణ్ టిఫిన్ సెంటర్ పక్కనే తన చికెన్ సెంటర్‌కు ప్లాటు ఇప్పుడే రిజర్వు చేసుకోవడం మంచిది. కిరణ్, కేసీఆర్ ఇద్దరూ అన్నదమ్ముల్లా విడిపోయి స్నేహితుల్లా కలిసి ఉండి పరస్పర అవగాహనతో, సహకారంతో స్వయం ఉపాధి వ్యాపారం చేసుకోవచ్చు. కిరణ్ కుమార్ గారు తలుచుకుంటే కేసీఆర్ చికెన్ సెంటర్‌కు ఎంతైనా నిరంతర గిరాకీ కల్పించగలరు.

వీరిద్దరే కాదు - అన్ని పార్టీల నాయకులూ ఇప్పటినుంచే ఈ తరహా స్వయం సహాయ పథకాలను తయారు చేసుకోవడం మంచిది. అందరిలోకీ బాబుగారి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయింది. రెండు కళ్ళ సిద్ధాంతం వల్ల ఆయనకు రెండు కళ్ళు లొట్టబోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైతే ఒక కన్ను కుడివైపు, ఇంకో కన్ను ఎడమ వైపు చూస్తున్నాయి. రెండు చూపుల మధ్య సమన్వయం లేక పిచ్చి చూపు పడింది. ఎన్నికల తర్వా తపూర్తిగా కళ్ళు లేని కబోది అయితే ఏం చేయాలో ఇప్పటినుంచే ఆలోచించుకొని స్వయం సహాయ పథకాన్ని సిద్ధం చేసుకోవాలి. పాపం ఆయనకి చూపే కాదు - మాట కూడా పడిపోయింది. అసలంటూ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఆయనకే అర్థం కాకపోతుంటే మనకేం అర్థమవుతుంది.
*****************
వచ్చే ఎన్నికల తర్వాత మోదీయే ప్రధాని అవుతారని చాలా సర్వేలు చెబుతున్నప్పటికీ ఆయనకి ముస్లిమ్ వ్యతిరేకి అనే పెద్ద మైనస్ పాయింట్ ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ఆయన వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలి. ఆడ్వానీ గారిని ఆదర్శంగా తీసుకుని అర్జెంటుగా పాకిస్తాన్‌కు వెళ్ళి భుట్టో సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించడం మంచిది. వచ్చేటప్పుడు ఒకసారి నవాజ్ షరీఫ్‌ను గాఢాలింగనం చేసుకోవడం అవసరం. ఎన్నికల్లో గెలిచాక మిగతా సంగతులు చూసుకోవచ్చు. త్వరలో మళ్ళీ హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు కనుక ఈసారి వచ్చినప్పుడు ఓవైసీ సోదరులను కూడా ఆలింగనం చేసుకోవడం శ్రేయస్కరం.
*****************
ఇప్పుడొక అతి ముఖ్య విషయం గురించి చెప్పుకోవాలి. మన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వెనక ఉన్న మూల సూత్రం ఏమిటి? 'తెలంగాణ మా జన్మభూమి. సీమాంధ్ర మీ జన్మభూమి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ కదా! అందుచేత మీ జన్మభూమికి - అంటే మీ స్వర్గానికి - మీరు వెళ్ళిపొండి. మా తెలంగాణ స్వర్గంలో మేముంటాం. విడిపోయి కలిసుందాం' అనే కదా తెలంగాణ వారి వాదం - భేషుగ్గా ఉంది. పనిలో పని ఈ సూత్రం ప్రకారం సోనియమ్మ మూటాముల్లె సర్దుకొని ఇటలీకి వెళ్ళి అక్కడ స్థిరపడడం మంచిది. ఆవిడకి ఇటలీ స్వర్గాదపి గరీయసి కదా! ఇటలీ వారు తమ ఆడబిడ్డను, ఆ బిడ్డలను అక్కున చేర్చుకొని ఆదరిస్తారు.

ఇండియన్ రాజకీయాలలో ఆవిడకున్న సుదీర్ఘ అనుభవాన్ని పురస్కరించుకొని వారు తమ దేశపు పరమ పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగిస్తారు. ఆవిడ అక్కడ ఐ.ఎన్.సి. (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)ని స్థాపించి, దానికి తాను అధ్యక్షురాలిగా ఉంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించుకోవచ్చు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు సూచిస్తున్న దృష్ట్యా రామ్ రాజ్యం నుంచి రోమ్ రాజ్యానికి తరలిపోవడం ఆవిడకు శ్రేయస్కరం. ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో ఇన్నాళ్ళూ మకుటం లేని మహారాణిగా వెలిగిన ఆవిడ మన సీమాంధ్ర అంత మాత్రమే ఉన్న ఇటలీని అవలీలగా ఏలగలరు.
*****************
ఇకపోతే జగన్ సంగతి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని రాజకీయ నాయకులందరి కంటే ఆయన పరిస్థితే భేషుగ్గా ఉంది. శత్రుదుర్భేద్యమైన చంచల్‌గూడ దుర్గంలో ఆయనకు లాడ్జింగ్, బోర్డింగ్ ఫ్రీ. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఫ్రీ. సకల సేవలూ ఫ్రీ. దుర్గం దాటి బైటికి వెళ్ళే పని లేకుండా అందరూ ఆయన దగ్గరకే వచ్చి దర్శనం చేసుకుంటారు. కన్వేయన్స్ ఫ్రీ. 'ఎన్ని ఉంటే మాత్రం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవు కదా' అంటారా? చంచల్‌గూడ దుర్గం బయట మాత్రం అవి ఉన్నాయా? ఈ రాష్ట్రమంతా, దేశమంతా ఒక ఆరు బైలు జైలే కదా! ఏ క్షణాన ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలీదు. ఏ వేట కొడవలి నరుకుతుందో తెలీదు. క్షణం క్షణం భయం భయం. విచారణ ఖైదీ హోదాను కాపాడుకోగలిగితే ఎంత కాలమైనా హ్యాపీగా కాలక్షేపం చేయవచ్చు. బోలెడు ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అంతేకాదు - జైల్లోనే 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' గ్రంథాన్ని రాసిన నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకుని కడప జిల్లా ముఠా రాజకీయ చరిత్ర గురించి ఉద్గ్రంథం రచించవచ్చు. ఆత్మకథ కూడా రాసుకోవచ్చు. వాటిని ప్రచురించడానికి పబ్లిషర్లు జైలు బయట క్యూలో నించుంటారు. బోలెడు సంపాదన.
*****************
రాష్ట్ర విభజనానంతరం తెలంగాణకు కేసీఆర్ కలలుగనే గత వైభవమంతా వస్తుందని ఆశించవచ్చు. మనలో చాలా మందికి గతమంతా వైభవమే. 'ఇంతకంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యమే ఎంతో బాగుండేది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అంతా దరిద్రమే' అంటుంటారు వృద్ధ తరం వారు. కేసీఆర్ అయితే నిజాం ప్రభువును తెగ మెచ్చుకుంటూ ఉంటారు - అప్పటికింకా ఆయన పుట్టక పోయినా. 'తెలంగాణలో అందరూ షేర్వాణీలు ధరించేవారు. బిర్యానీ తినేవారు. ఆంధ్రోళ్ళు మాసిపోయిన లుంగీలు కట్టుకుని, పొట్టచేత బట్టుకొని, కాళ్ళకి చెప్పుల్లేకుండా వచ్చారు' అంటారు ఆయన. నిజమే. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో బ్యాంకు క్లర్క్‌లుగా పనిచేసే వాళ్ళు కూడా బిన్నీ కాటన్ సూట్లు వేసుకుని, ఫుల్ బూట్లు టకటక లాడించుకొంటూ ఆఫీసులకి సైకిళ్ళ మీద పోతుండేవారు. ఆఫీసుల్లో వాళ్ళకి సలాంలు చేస్తూ పాన్‌లు, టీలు తెచ్చిపెట్టే చప్రాసీలు కూడా తెల్లటి మల్లెపువ్వుల్లాంటి ఇస్త్రీ షేర్వాణీలు వేసుకొని, బూట్లు తొడుక్కుని, నెత్తిమీద కుచ్చు టర్బన్‌లతో ఎంత దర్జాగా ఉండేవాళ్ళో! అంతెందుకు... బ్యాండు మేళం వాళ్ళు జిగజిగ మెరిసిపోయే చెమ్కీ డ్రెస్కులతో, కుచ్చు టర్బన్‌లతో యమా స్టైలుగా ఉండేవాళ్ళు. ఆ దర్జా, ఆ పోజూ ఆంధ్రా మోతుబరి భూస్వాములకు వస్తుందా రమ్మంటే మాత్రం! ఎప్పటి సంగతో దేనికి... ఇప్పుడు మాత్రం కేసీఆర్ దర్జా, డాబూ, దర్పం, ఆయన కారూ... ఆహా! అసలు ఆయన పార్టీ సింబలే కారు! - టీడీపీలాగా డొక్కు సైకిలు కాదు.
*****************
సరే - ఇంతకీ ఇదంతా చెప్పడం దేనికంటే - పదవీ కాలమంతా అక్రమంగా కోట్లు గడించిన రాజకీయ కబ్జాసురులు రానున్న ఎన్నికలలో 'నౌ ఆర్ నెవ్వర్' అనుకొంటూ, 'కాయ్ రాజా కాయ్' నినాదంతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి, ప్రత్యర్థులతో పోటీపడి ప్రచారం కోసం ఖర్చు పెట్టారనుకోండి. చివరికి పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరు క్షవరమై పోయారనుకోండి. అప్పుడు వాళ్ళ గతేం కాను! వాళ్ళను ఆదుకోవలసిన బాధ్యత మన సమాజానికి ఉందా, లేదా? వాళ్ళకేదో ఉపాధి కల్పించాలి కదా! కర్రీ పాయింటో, మటన్ పాయింటో, మిర్చీ బజ్జీ - పకోడీ - సమోసా పాయింటో, పాలు-పెరుగు - పేడా - పిడకా బూతులో, బెల్టు షాపులో. అలాంటివేవో పెట్టుకోవడానికి మనం శాయశక్తులా సహాయం చేయాలి కదా! అందుకే ఇప్పుడే ఎన్నికలకు బాగా ముందుగానే జెండా తీతంగా, ఎజెండా తీతంగా, కండువాతీతంగా రాజకీయ నాయకులంతా చందాలు వేసుకొని భావిభారత దివాలా నేతల సంక్షేమ- శిక్షణ - స్వయం సహాయ నిధిని ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికపై కృషి ప్రారంభించాలి. సహాయార్థులందరికీ ఆయా వృత్తులలో తగు శిక్షణనిచ్చాక బూతులు నెలకొల్పుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలి. అసలు బాబుగారు ఇదంతా ఆలోచించే కాబోలు దూరదృష్టితో, ఎందుకైనా మంచిదని ఇదివరకే తన పాదయాత్రలలో బట్టలు ఇస్త్రీ పెట్టడం, దోసెలు వేయడం మొదలైన చేతి వృత్తులలో ఉచిత ట్రైనింగ్ పొందారు. ఆయన్ని చూసి మరికొందరు రాజకీయులు కూడా అటువంటివి ట్రై చేశారు.
శుభస్య శ్రీఘ్రం![/size][/font][/color]

[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5]- నంపాసా[/size][/font][/color]
[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5]సీనియర్ పాత్రికేయులు, వ్యంగ్య రచయిత[/size][/font][/color]

Posted

say one line man....it's hard to read man [img]http://i43.tinypic.com/d9rig.gif[/img]

Posted

[quote name='Kobe_Bryant' timestamp='1377027712' post='1304140345']
say one line man....it's hard to read man [img]http://i43.tinypic.com/d9rig.gif[/img]
[/quote]
indaka [img]http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_12949_2_92562.gif[/img] annavu kada

Posted

[quote name='Speed2' timestamp='1377027778' post='1304140352']
indaka [img]http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_12949_2_92562.gif[/img] annavu kada
[/quote]
busy vunna kabate 1 one lo chepa manna :police:

Posted

[quote name='Kobe_Bryant' timestamp='1377027953' post='1304140364']
busy vunna kabate 1 one lo chepa manna :police:
[/quote]
nampasa ane kavi AP politicians andarini esukunnadu [img]https://lh5.googleusercontent.com/-J5PUBbkkj-U/Tqi2mK78hDI/AAAAAAAA-WM/L6x3hMa1p88/w426-h320/6628711bgw1dlf3ktrtgcg.gif[/img]

Posted

[quote name='Speed2' timestamp='1377028061' post='1304140372']
nampasa ane kavi AP politicians andarini esukunnadu [img]https://lh5.googleusercontent.com/-J5PUBbkkj-U/Tqi2mK78hDI/AAAAAAAA-WM/L6x3hMa1p88/w426-h320/6628711bgw1dlf3ktrtgcg.gif[/img]
[/quote]
_-_

Posted

[quote name='Kobe_Bryant' timestamp='1377028233' post='1304140391']
_-_
[/quote]
[img]http://www.gifsoup.com/view5/2170835/balsanka-o.gif[/img]

Posted

[quote name='as_it_is' timestamp='1377028249' post='1304140394']
[img]http://www.gifsoup.com/view5/2170835/balsanka-o.gif[/img]
[/quote]
nuvvendi night pelli undi kada ikkada sankallo gokkuntu nilabaddavu [img]https://lh5.googleusercontent.com/-J5PUBbkkj-U/Tqi2mK78hDI/AAAAAAAA-WM/L6x3hMa1p88/w426-h320/6628711bgw1dlf3ktrtgcg.gif[/img]

Posted

[quote name='Speed2' timestamp='1377028491' post='1304140420']
nuvvendi night pelli undi kada ikkada sankallo gokkuntu nilabaddavu [img]https://lh5.googleusercontent.com/-J5PUBbkkj-U/Tqi2mK78hDI/AAAAAAAA-WM/L6x3hMa1p88/w426-h320/6628711bgw1dlf3ktrtgcg.gif[/img]
[/quote]

thats for KOBE

×
×
  • Create New...