eela Posted August 25, 2013 Report Posted August 25, 2013 [quote name='Chitti_the_ROBO3' timestamp='1377460670' post='1304162511'] [img]http://24.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img] yaa aa threads choosaa baa vammoooo naa valla kaadu vayya vati gurinchi explain cheyadam... asalu aa thadu loki kooda ponu [img]http://24.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img] [/quote] aa ID nedena [b][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][/b]
idiBeZaWaDa Posted August 26, 2013 Report Posted August 26, 2013 [quote name='puthareku' timestamp='1377462135' post='1304162618'] [/quote] hi puthareeku aka erri aku...ela unav man..[img]http://www.ski-epic.com/gifs/g009_idi_amin_laughing_soldier.gif[/img]
bamchik Posted August 29, 2013 Report Posted August 29, 2013 [b] గుట్టను పగలేసినం సూసి సూసి ఇగ తెగిచ్చి గుట్టల్ల బాంబు పెట్టినం సుతిలికి అగ్గి పెట్టి గుట్ట ఇగ పేలుతదా అగ పేలుతదా అని యెదురు సూసినం *** *** *** అరవై సాలుల కింద మా ఊరు బాగానే ఉండె మా తాత చెప్పెటోడు నీళ్ళు మస్తుగుండే - పన్లు దొర్కుతాండే ఊరు ఊరంత పచ్చంగ కలకలలాడుతుండేనట గా దినాలల్ల దొరలు -దేశాయ్ లు - దేశ్ ముఖ్ ల పెత్తనాలు రజాకార్ల దోపిడీలు ఉండేనట గనీ, గవన్నీటినీ మా తాత- ఆయ్న తోటోల్లు తిర్గకొట్టి ఊరి బొడ్రాయి దంక ఉర్కిచ్చి పంపిచ్చిద్రంట తుపాకులు పట్టినోల్లు- తూర్పు దిక్కు సూర్యుళ్ళు అయినోల్లు గంత బడా బడా లడాయిలు సేసిండ్లు గనీ గప్పుడు గప్పుడే నడి ఊల్లె నెర్సిన బండ రాయిని సూడక పాయె సూసినా, నాప రాయి- నల్ల రాయే గదా పొలంలకచ్చినా- కంచెలకచ్చినా వాకిట్ల కచ్చినా - గొంగట్లకచ్చినా ఏం జేత్తదిలే, అని అనుకున్నరట గనీ, సూత్తాంటే సూత్తాంటేనే గా రాయి చిన్న కొండయింది పెద్ద గుట్టయింది సాప కింద నీళ్ళ లెక్క ఊరంతటినీ కబ్జా సేసింది *** *** *** గీ ఇచ్చంత్రాన్ని మా నాయ్న సోపతి గాల్లు గుర్తు పట్టిండ్రు వాళ్ళ చిన్న నాటికి- పెరిగి పెద్దై పెండ్లీలు సేస్కున్న నాటికి గుట్ట యెంత పెద్ద పెర్గిందో బేరీజ్ యేస్కున్నారు అగులు బుగులు అయిండ్రు గుట్ట పెరుగుడును ఆపాలనుకున్నరు అందర్నీ ఒక్కటి సేసిండ్రు గుట్టను పెకిలిద్దమని గడ్డ పారలతో తవ్వుడు షురూ జేసిండ్రు యెంత తవ్వినా గుట్ట అంతూ దరి దొర్కక పాయె గీ నడిమిట్ల తోటి సాయిత గాళ్ళు కొందరు గుట్ట బాగనే ఉండే- మన ఊరికేమన్న కీడు జేత్తాoదా అని పదం పాడబట్టిరి మన ఊరి జాడకు పాడె కట్టబట్టిరి గుట్టను తవ్వడానికని అచ్చినోల్లు గుట్టను సూసి సంబురపడబట్టిరి ఏం గుట్ట మొల్సిందిరా గే ఊళ్లనన్న గిట్లాంటి గుట్టున్నాది అసలు, గీ గుట్టతోనే మనకు మంచి అయితాంది అని పాటలు కైకట్టబట్టిరి గుట్ట సేసిన మాయ ముందట బేవోష్ అయి సోయి తప్పిన మా నాయ్న ఊరిని పొట్టన బెట్టుకున్న గుట్టను ఏం జెయ్యలేక గా రాత్రే మట్టిల కల్సిపాయె *** *** *** నేను కండ్లు తెర్సి లోకం సూసెనాటికి నాకు, మా ఊరికంటే ముందుగాల గా గుట్టే కన్పిచ్చె గిప్పుడది మబ్బుల్ని దాటి ఆస్మాన్ దాక ఎదిగిపాయె మా ఊరేమో దినదినానికి కురసగైపోయె గిన్నేండ్ల సంది సేత్తాన మాయల్నే గిప్డు కూడా గా గుట్ట సేయబట్టే మా బూమిని- జాగని - పొలాన్ని జరంత జరంత మాయం సేయబట్టె ఇసోంట రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు గా గుట్ట ఒక దినం మా గుడిసెను గుడా మింగడానికి వచ్చె గప్పుడు, మా సోపతి గాల్లందరం కలిసి అసలేం జర్గుతాందో అంజనం ఏయించినం కొన్ని దినాలల్ల మేం- మాకు గాకుంట పోతం అని మా ఊరు- మాది గాకుంట పోతది అని సమజయింది గిన్నొద్దులు గా గుట్ట చెల్కల కచ్చినా- చేనులకచ్చినా ఊల్లెకచ్చినా - వాకిట్లకచ్చినా మేం ఏమనలే గనీ, మా ఇంట్లకచ్చి మా ఇమ్మతికే ఎసరు పెడతాంటె ఎట్ల ఊకోవాలె ? ఇగ, సెయ్యి సెయ్యి కల్పినం సకల జనులం ఉర్కినం గిన్నేండ్ల అవుమానాలతో బగ బగ మండి అగ్గిని రాజేసినం మా జిందగీలను బచాయించుకునేటందుకు బాంబు తయారు జేసినం అసోంటిసోంటి బాంబు కాదిది ఉద్యమాల బాంబిది మా పజల ఉసురును పాణాలు ఇడ్సిన మా బిడ్డల త్యాగాలను మందుగా దట్టించి మూటకట్టిన బాంబిది **** *** *** గుట్టల్ల బాంబు పెట్టినం సుతిలికి అగ్గి పెట్టి గుట్ట ఎప్పుడు పేలుతదా అని యెదురు సూసినం గుట్ట పేలింది- ముక్కలు చెక్కలయింది ఇన్నొద్దులు గుట్ట ముడ్డి కింద పడి మా బూమి కన్పియ్యకుండె గిప్పుడు గా బూమి అంతా కండ్లు పెయ్యి తిర్గేటట్టు కన్పియ్య బట్టె మా బూమి మాకు దొర్కె - ఇగ మా బువ్వ గుడ మాకు దొర్కుతది నా దోస్తులారా మన గడ్డ మీన కొత్త ఊరిని పొందుబాటు సేస్కుందాం కొన్ని ఇత్తులని- ఇంకొన్ని చెట్లని నాటుకుందాం కొన్ని కలల్ని- ఇంకా కొన్ని సుక్కల్ని తెంపుకచ్చి మన బిడ్డలకిద్దాం రా అన్నా, గా దిక్కుకు పోదం పా.. ************************************ Taken from FB profile of [url="https://www.facebook.com/harikrishna.mamidi"]Harikrishna Mamidi[/url][/b]
Recommended Posts