Speed2 Posted September 4, 2013 Report Posted September 4, 2013 [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4]పార్ట్‌టైమర్లతోనే ‘మహర్దశ’![/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4][url="http://www.sakshi.com/topic/sakshi"]Sakshi[/url] | Updated: September 04, 2013 00:27 (IST)[/size][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4][img]http://img.sakshi.net/images/cms/2013-09/81378234652_625x300.jpg[/img][/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4] అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ప్రపంచం కోడై కూస్తోంది. అమెరికాలో ఉపాధి అవకాశాలు తెగ పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం కనుమరుగైపోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే గత గురువారం దేశవ్యాప్తంగా 50 ప్రధాన నగరాల లోని ‘కేఎఫ్‌ీసీ’, ‘పిజ్జాహట్’ల వంటి ఫాస్ట్‌ఫుడ్ జాయింట్స్ కార్మికులు గంటకు 15 డాలర్ల కనీస వేతనం కోసం ఆందోళన చేశారు. అమెరికా విధానకర్తలు గొంతెమ్మ కోరికగా అభివర్ణిస్తున్న ఈ డిమాండు నిజానికి 50 ఏళ్ల క్రితం నాటిది! గంటకు రెండు డాలర్ల కనీస వేతనం కోసం మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో సరిగ్గా అర్ధశతాబ్దం క్రితం, 1963లో లక్షలాది మంది అమెరికన్లు ఉద్యమించారు.[/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4] నేటి 15 డాలర్లు అంటే దాదాపు నాటి రెండు డాలర్లే. నేటి అధికారిక కనీస వేతనం 7.25 డాలర్లు. నాడు కింగ్ కోరినదానిలో సగం కంటే తక్కువ! ప్రజల అత్యల్ప ఆదాయాల కారణంగా వరుసగా మరో త్రైమాసికలో కూడా అమ్మకాలు మందగించిపోయాయని ‘వాల్‌మార్ట్’ గత నెల 20న వాపోయింది. ఫాస్ట్‌ఫుడ్ జాయింట్స్‌లాగే వాల్‌మార్ట్ కూడా అల్ప వేతనాల ఉద్యోగాలకు ప్రసిద్ధి. ఫాస్ట్‌ఫుడ్ జాయింట్స్‌లో గంటకు సగటు వేతనం 8.94 డాలర్లయితే. వాల్‌మార్ట్‌లో 9 డాలరు!్ల[/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4] 2020 వరకు అమెరికాలో కొత్తగా వృద్ధి చెందనున్న ఉద్యోగాలు ప్రతి పదింటిలో ఏడు అల్పాదాయ ఉద్యోగాలేనని ‘బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్’ తెలిపింది. అవి కూడా ప్రధానంగా రిటైలు వర్తకం, ఫాస్ట్‌ఫుడ్ జాయింట్స్ వంటి సంస్థలలోనివే. మాంద్య కాలంలో కోల్పోయిన మొత్తం ఉద్యోగాలలో అల్ప వేతన ఉద్యోగాలు 21 శాతం కాగా, నేటి ‘కోలుకునే దశ’లోని కొత్త ఉద్యోగాలలో అల్ప వేతన ఉద్యోగాలు 60 శాతం! నేటి ‘ఆర్థికవృద్ధి’, సంక్షోభానికి పూర్వం కంటే పేదరి కాన్ని, ఆదాయ వ్యత్యాసాలను పెంచుతోంది. అమెరికాలోని మొత్తం ఉద్యోగులలో కనీసం నాలుగో వంతు పేదరిక రేఖ కంటే తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఒక ఫాస్ట్‌ఫుడ్ పూర్తికాలం ఉద్యోగి ఆ కంపెనీ సీఈవో వార్షిక జీతాన్ని ఆర్జించడానికి దాదాపు వెయ్యేళ్లు పనిచేయాల్సి వస్తుంది. 25 శాతం పేదరి కంతో వర్థమాన దేశాల సరసన నిలుస్తున్న అమెరికా... ఆర్థిక అసమానతల విషయంలో అధిక ఆదాయ దేశాల కూటమి ఓఈసీడీలో కూడా అగ్రశ్రేణిలో... చిలీ, మెక్సికో, టర్కీల సరసన నిలుస్తోంది. అత్యల్ప ఆదాయాల కారణంగానే అమ్మకాలు మందగించాయని వాపోతున్న వాల్‌మార్ట్ కూడా ఆ అల్పాదాయాలకు కారణమే. కనీస వేతనాన్ని 12.50 డాలర్లుగా నిర్ణయిస్తూ వాషింగ్టన్ డీసీ నగర ప్రభుత్వం ఇటీవల ఒక ఆర్డినెన్స్‌ను తేవాలని ప్రయత్నించింది. నగరంలోని తమ స్టోర్లను మూసేస్తామని వాల్‌మార్ట్ బెదిరించింది. దీంతో ఆ ప్రతిపాదన మూలనపడింది. [/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4] అమెరికా ‘ఆర్థికవృద్ధి’లోని అసంబద్ధతకు వాల్‌మార్ట్ అద్దం పడుతుంది. కింగ్ పోరాటంలో మరో ముఖ్యమైన అంశం ‘మంచి ఉద్యోగా లు’. అంటే సమంజసమైన వేతనాలు, సం క్షేమ సదుపాయాలని అర్థం. అవేవీ లేని చెడ్డ ఉద్యోగాలే ఆమెరికా ఆర్థికంగా కోలుకోవడానికి రుజువులుగా చలామణి కావడం విశేషం. అమెరికా ఆర్థిక తిరోగమనం అధికారి కంగా నాలుగేళ్ల క్రితమే అంతమైంది. సంక్షోభంలో కోల్పోయిన 87 లక్షల ఉద్యోగాలలో 66 లక్షల ఉద్యోగాల పునరుద్ధరణ మాత్రమే జరిగింది. అవి కూడా ప్రధానంగా అల్ప వేతన ఉద్యోగాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలే. అమెరికా ఆర్థికవ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టిం దని అంటున్న 2013 జూలై మాసంలో కొత్తగా ఏర్పడ్డ ఉద్యోగాలలో 65 శాతం పార్ట్‌టైమ్ ఉద్యోగాలేనని కార్మికశాఖ తెలిపింది. విద్యార్థులకే కాదు, చిన్నా పెద్దా అందరికీ పార్ట్‌టైమ్ ఉద్యోగాలే ఇప్పుడు దిక్కు. దశాబ్దాలుగా పూర్తికాలం ఉద్యోగులుగా ఉన్నవారు సైతం వారానికి 40 గంటల కంటే తక్కువ మాత్రమే పనిచేసే పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా మారిపోతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ జాయింట్స్, వాల్‌మార్ట్, ఫ్యాషన్ సంస్థలు మాత్రమే కాదు కార్పొరేట్ సంస్థలు సైతం పూర్తికాలం ఉద్యోగులను పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా మార్చేస్తున్నాయి.[/size][/font][/color] [color=#282828][font=helvetica, arial, sans-serif] [size=4] అంగీకరించని వారికి బయటకు దారిని చూపుతున్నాయి. దీంతో గత నాలుగేళ్లుగా అమెరికా అల్పవేతనాల, పార్ట్‌టైమ్ ఉద్యోగుల దేశంగా మారిపోతోంది. రోజుకి మూడు లేదా నాలు గు పార్ట్ టైమ్ ఉద్యోగాలకు పరుగులు తీస్తే తప్ప గడవని పరిస్థితి సర్వసాధారణంగా మారుతోంది. పార్ట్‌టైమ్ ఉద్యోగుల వేతనాలు తక్కువ మాత్రమే కాదు, ఉద్యోగులకు కల్పిం చాల్సిన సదుపాయాలు, దీర్ఘకాలిక సంక్షేమ ప్రయోజనాల వ్యయం తగ్గిపోతుంది. మంచి ఉద్యోగాలు ఎక్కడికి పోవడం లేదు. అవే చెడ్డ ఉద్యోగాలుగా మారిపోతున్నాయి. ఉద్యోగు లు నిన్నటి ఫుల్‌టైమ్ పనినే నేడు పార్ట్‌టైమర్లుగా చేస్తుంటారు. యజమానులకు ‘అనవసర వ్యయాల’ భారం తగ్గి, లాభాలు పెరుగుతాయి. ఆర్థికసంక్షోభ కాలంలో కార్పొరేట్ సంస్థల లాభాలు 25 నుంచి 30 శాతం పెరగడంలోని కిటుకు అదే. అదే సమయంలో జాతీ య ఆదాయంలో వేతనాల వాటా రెండవ ప్రపంచయుద్ధం తర్పాత మొదటిసారిగా కని ష్టస్థాయికి చేరిందనేది ‘అప్రస్తుతం’ లేదా వృద్ధి మహర్దశకు చెల్లించక తప్పని మూల్యం. [/size][/font][/color]
Recommended Posts