Jump to content

24 Hours Bandh Anta


Recommended Posts

Posted

[color=#0033CC][font=Conv_NTR, sans-serif][size=5][color="magenta"]24 గంటల బంద్‌కు టీ జేఏసీ పిలుపు[/color][/size][/font][/color][color=#000000][font=Conv_Web-Font, sans-serif][size=5]
హైదరాబాద్: సమైక్య సభకు అనుమతినిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈమేరకు ఇవాళ టీఎన్జీవో భవన్‌లో జరిగిన టీ జేఏసీ సభలో నేతలు చర్చించారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు టీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వెల్లడించారు. రేపు సాయంత్రం నుంచి రహదారుల దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొన్నారు.

[color="red"][b]రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది: కోదండరాం[/b] [/color]
రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుందని కోదండరాం అన్నారు. తాము నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సభ పెడతామంటే ముందు గ్రౌండ్ అనుమతి తెచ్చుకోండి తర్వాత చూద్దామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఏపీఎన్జీవోల సమైక్యాంధ్ర సదస్సుకు అఘమేఘాల మీద ఎందుకు అనుమతించారని విమర్శించారు. ఒక ప్రాంత ప్రజలు హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మరో ప్రాంత ప్రజలు ప్రతి ఉద్యమం చేయడం రాజ్యాంగ విరుద్దమని, అలాంటి దానికి సీఎం కిరణ్ మద్దతు ఇస్తున్నాడని విమర్శించారు.

[color="red"][b]సీఎం వైషమ్యాలను రెచ్చగొడుతున్నాడు: కోదండరాం[/b][/color]
సీఎం వైఖరికి నిరసనగానే తాము 24 గంటల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. తెలంగాణపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రెండు ప్రాంతాల మద్య సీఎం వైషమ్యానలను రెచ్చడొడుతున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపైనే తమ పోరాటమని, సామాన్య సీమాంధ్ర ప్రజలపట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు.

[color="red"][b]‘విద్యార్థి ఉద్యమకారులపై రౌడీ షీట్లా?’[/b][/color]
తెలంగాణ ఉద్యమకారులపై సీమాంధ్ర సీఎం కుట్రపూరితంగా వ్యవహిరస్తున్నాడని కోదండరాం విమర్శించారు. సంఘ వ్యతిరేక శక్తులపై పెట్టాల్సిన రౌడీషీట్లను విద్యార్థి ఉద్యమకారులపై పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సీఎం కిరణ్ కుట్రల ఫలితంగానే తెలంగాణలో మళ్లీ బలిదానాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రేపటి 24 గంటల బంద్ విజయవంతమయ్యేందుకు తెలంగాణవాదులంతా కృషి చేయాలని కోరారు.[/size][/font][/color]

Posted

[img]http://4.bp.blogspot.com/-hhaY7-iHgjw/UbCFdWJdyCI/AAAAAAAAGtM/_tAO9-Kh-0Q/s1600/gsb10.gif[/img]

×
×
  • Create New...